సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులను(డీసీసీ) ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 31 మంది డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఆ పార్టీ అధినేత రాహుల్ ఆమోదం తెలిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
వీరిలో 12 మంది బీసీలు, రెడ్డి-9, కమ్మ -2, బ్రాహ్మణలు, ఎస్సీ, ఎస్టీలలో ఇద్దరికి.. ముస్లిం, వెలమలకు ఒక్కొక్కరికి చొప్పున చోటు కల్పించారు. వీరితో పాటు ఇద్దరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులను ఆ పార్టీ నియమించింది. ఖమ్మం పట్టణానికి చెందిన దీపక్ చౌదరిని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 33 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ గురువారం విడుదల చేసింది.
ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి కూడా డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆసిఫాబాద్- ఆత్రం సక్కు, భద్రాది- వనమ వెంకట్వేరరావులను డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. వీరితో పాటు ఎమ్మెల్యేల సతీమణులను కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించారు. ఖమ్మం నగరం- జావీద్, గ్రేటర్ హైదరాబాద్- ఎం.అంజన్‌కుమార్ యాదవ్‌లను సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించారు.
కొత్తగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వీరే..
జిల్లా పేర్లు | డీసీసీ అధ్యక్షుల పేర్లు |
మంచిర్యాల | కొక్కిరాల సురేఖ |
కొమరం భీమ్ ఆసిఫాబాద్ | ఆత్రం సక్కు |
నిర్మల్ | రామారావు పటేల్ పవార్ |
కరీంనగర్ | కె. మృతంజయం |
జగిత్యాల | లక్ష్మణ్‌కుమార్ |
పెద్దపల్లి | ఈర్ల కొమురయ్య |
రాజన్న సిరిసిల్ల | ఎన్.సత్యనారాయణగౌడ్ |
నిజామాబాద్ | మనాల మోహన్ రెడ్డి |
నిజామాబాద్ నగర కాంగ్రెస్ | కేశ వేణు |
కామారెడ్డి | కైలాస్ శ్రీనివాసరావు |
వరంగల్ రూరల్/ అర్బన్ | నాయిని రాజేందర్ రెడ్డి |
వరంగల్ నగర కాంగ్రెస్ | కేదారి శ్రీనివాసరావు |
జయశంకర్ భూపాల్‌పల్లి | గండ్ర జ్యోతి |
జనగామ | జంగా రాఘవ రెడ్డి |
సంగారెడ్డి | నిర్మలాగౌడ్ |
మెదక్ | తిరుపతి రెడ్డి |
సిద్దిపేట | టి.నరసారెడ్డి |
వికారాబాద్ | పి.రోహిత్ రెడ్డి |
మేడ్చల్ మల్కాజిగిరి | కూన శ్రీశైలం గౌడ్ |
రంగారెడ్డి | చల్లా నరసింహారెడ్డి |
మహబూబ్‌నగర్ | కొత్వాల్ ఒబెదుల్లా |
వనపర్తి | శంకర్ ప్రసాద్ |
జోగులాంబ గద్వాల్ | పటేల్ ప్రభాకర్ రెడ్డి |
నాగర్‌కర్నూల్ | సీహెచ్ వంశీకృష్ణ |
సూర్యాపేట | చెవిటి వెంకన్న యాదవ్ |
యాదాద్రి భువనగిరి | బి.బిక్ష్మయ్యగౌడ్ |
మహబూబాబాద్ | జె.భరత్ చంద్రారెడ్డి |
నల్గొండ | కె.శంకర్‌నాయక్ |
భద్రాద్రి కొత్తగూడెం | వనమా వెంకటేశ్వరరావు |
ఖమ్మం | పువ్వాడ దుర్గాప్రసాద్ |
Comments
Please login to add a commentAdd a comment