
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగుదేశంతో సయోధ్య పార్టీకి లాభం కలుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. ఈ పొత్తును పరిమిత స్థాయిలో ఉండాలని సూచించారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డీసీసీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన రాహుల్.. మహాకూటమి, టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఆరాతీశారు. మనం బలంగా ఉన్న సెగ్మెంట్లను వారికిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని, కేడర్‌లో కూడా అసంతృప్తి పెల్లుబికే ఆస్కారముందని మల్లేష్ రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఏడు చోట్ల గెలిచిందని, అందులో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని గుర్తుచేశారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి కంకణబద్దులైన వారికే టికెట్లను కేటాయించే అంశంపై తెలుగుదేశం అధిష్టానంతో చర్చించాలని కోరారు. టీడీపీకి ముందున్న బలం ఇప్పుడు లేదని, రెండు స్థానాలు కేటాయిస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment