తిరుపతిరెడ్డి
సాక్షి, మెదక్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకానికి అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఎట్టకేలకు పచ్చ జెండా ఊపింది. రాష్ట్రంలోని 31 జిల్లాలతో పాటు పట్టణ కాంగ్రెస్ కమిటీ అ«ధ్యక్షుల నియామకానికి గురువారం ఆమోదం తెలిపింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం నూతన డీసీసీ అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. తిరుపతిరెడ్డి మెదక్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతోపాటు టికెట్‌కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం అనూహ్యంగా ఉపేందర్‌రెడ్డి టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడం, మాజీ మంత్రి సునీతారెడ్డి తిరుపతిరెడ్డికి మద్దతు తెలపడంతో ఆయన వైపే పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో మొత్తంగా మాజీ మంత్రి సునీతారెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు వివిధ పదవుల్లో పనిచేశారు. అందరిని కలుపుకొని ముందుకు వెళ్తారని పార్టీలో ఆయనకు పేరుంది. జిల్లాలో ఏడాది కాలానికిపైగా పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకంపై కాలయాపన జరుగుతూ వచ్చింది. కొత్త జిల్లాలు ఏర్పడిన సమయంలోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశా>రు. అధిష్టానం మాత్రం జాప్యం చేస్తూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల సమయంలోనూ డీసీసీ అధ్యక్షులను నియమించలేదు. మాజీ మంత్రి సునీతారెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తూ వచ్చారు.
అయితే ఇటీవల కాలంలో డీసీసీ నియామకం చేపట్టాలని పార్టీలో నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. డీసీసీ నియామకం జరిగితేనే రాబోయే ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందుకు నడిపిస్తారన్న అభిప్రాయాన్ని జిల్లా నాయకులు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీసీసీ నియామకం దిశగా పీసీసీ చర్యలు ప్రారంభించింది. ఈ అధ్యక్ష పదవికోసం కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చం ద్రపాల్, మామిళ్ల ఆంజనేయులు, రెడ్డిపల్లి ఆంజ నేయులు పోటీ పడ్డారు. మాజీ మంత్రి సునీతా రెడ్డి కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి లేదా రెడ్డిపల్లి ఆంజ నేయులుకు డీసీసీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. మామిళ్ల ఆం జనేయులు, చంద్రపాల్‌లు డీసీసీ పదవి దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేశారు.
గెలుపే లక్ష్యంగా..
డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదార్ రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎమ్మె ల్యే జయప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డిలకు తిరుపతిరెడ్డి కృతజ్ఞతలు తెలి యజేశారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతానని తెలిపారు. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొ చ్చేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే పార్లమెం ట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసి ఎన్నికల్లో గెలుపొందేలా ప్రయత్నిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment