Thirupathi reddy
-
తుపాకీతో.. కలకలం రేపిన ‘క్రెడాయ్’ అధ్యక్షుడు!
సాక్షి, వరంగల్: పరకాల పట్టణంలోని ఓ ఫంక్షన్ విందులో ఈ నెల 15న గాల్లోకి కాల్పులు జరిపిన బిల్డర్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు పరకాల సీఐ జె.వెంకటరత్నం తెలిపారు. ఈ ఘటనపై గురువారం సదరు ఫంక్షన్ హాల్ వద్ద విచారణ చేపట్టారు. ఫంక్షన్ హాల్ యజమాని రాజేశ్వర్‌రావుతోపాటు సిబ్బందిని విచారించారు. తనకు పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో కొందరిని బెదిరించడంతోపాటు భయపెట్టడానికే తిరుపతిరెడ్డి తన వద్ద ఉన్న రివాల్వర్‌ను ప్రదర్శించి మద్యం మత్తులో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తేలిందని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురై వెళ్లిపోయారని తెలిపారు. ఈ మేరకు తిరుపతిరెడ్డిని అరెస్ట్ చేసి పరకాల కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. కాగా, పోలీసులు అతడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత భద్రత పేరిట.. మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ వ్యక్తిగత భద్రత పేరిట గన్‌కల్చర్‌పై పలువురు ఆసక్తి చూపుతుండగా.. ఇప్పుడది భద్రత కంటే హోదా, ఫ్యాషన్‌గా మారిపోయింది. ఫలితంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౖపైవేట్ ‘గన్’లు గర్జిస్తున్నాయి. తాగిన మైకంలో మాటలు పెరిగి పట్టరాని ఆవేశంతో ‘ట్రిగ్గర్’ నొక్కుతున్న ఘటనలు వివాదాస్పదం అవుతున్నాయి. ‘క్రెడాయ్’ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, బిల్డర్ ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి (సిద్ధార్థ తిరుపతిరెడ్డి) పరకాలలో ఆర్ఆర్ గార్డెన్లో ఓ దశ దినకర్మకు హాజరై తాగిన మత్తులో రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ నెల 15న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూడగా.. గురువారం అతడిని పోలీసులు పరకాల కోర్టులో హాజరుపర్చి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కలకలం రేపుతున్న ‘తుపాకులు’.. హైదరాబాద్, ముంబై వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో అక్రమంగా తుపాకులు కలిగి ఉండటం, బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైతం పాకాయనే చర్చ కొనసాగుతోంది. ఏదో సాకు చూపి రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఎక్కువగా తుపాకీ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. కమిషనరేట్ పరిధిలో ఇలాంటివారే ఆయుధాల లైసెన్సులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మ రక్షణకు తీసుకున్న వీరిలో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేస్తేనే తప్ప తెలవడం లేదు. పరకాలలో కాల్పులు జరిపిన ఘటన కూడా ఐదు రోజుల తర్వాత వెలుగు చూసింది. ఆగని ఆగడాలు.. 2014 ఫిబ్రవరి ఆఖరు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 314 ఆయుధ లైసెన్స్‌లు ఉన్నాయి. వీటిలో బ్యాంకులు, బ్యాంకుల వద్ద పనిచేసే వారి కోసం ఇచ్చినవి 74, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినవి 240 ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల కోటాలో తీసుకున్న వారిలో రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారు. 2015 జనవరి 25న వరంగల్ అర్బన్ పోలీస్ జిల్లా... వరంగల్ పోలీస్ కమిషనరేట్‌గా మారింది. 2016 అక్టోబర్ 11న జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలో కమిషరేట్ పరిధి పెరిగింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలు కమిషనరేట్ పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుత వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 180 లైసెన్స్ తుపాకులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లైసెన్స్‌లు పొందినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం, ఇతరులను బెదిరించడం, తాను ఆయుధం కలిగిఉన్నానని ఇతరులను ఆందోళనకు గురి చేసినా ఆ లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉంది. ఆత్మరక్షణ కోసం మినహా ఏ సందర్భంలోనూ ఆయుధం ప్రదర్శించినా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు కఠినతరం చేసినా ఆగని ఆగడాలపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. తిరుపతిరెడ్డి గన్ లైసెన్స్‌పై ఆరా.. పరకాల ఆర్ఆర్ గార్డెన్స్‌లో క్రెడాయ్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత గాల్లోకి రివాల్వర్‌తో రెండు రౌండ్ల కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు పరకాల పోలీసులతోపాటు స్పెషల్ బ్రాంచ్ అఽధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రాబల్యం లేనప్పటికీ.. తిరుపతిరెడ్డికి లైసెన్స్ ఇవ్వడంలో గతంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి బంధువు కావడమేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుపాకీ లైసెన్స్ ఎప్పుడు జారీ అయ్యింది? సిఫారసు చేసిన అఽధికారి ఎవరు? నిజంగానే తిరుపతిరెడ్డి లైసెన్స్‌కు అర్హుడా? అనే అంశాలతోపాటు పలు కోణాల్లో విచారిస్తున్నట్లు స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. -
కొడంగల్ నుంచే రేవంత్ పోటీ
కొడంగల్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచే పోటీ చేస్తారని ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అంశంపై కార్యకర్తలతో చర్చించారు. వారి అభిప్రాయాలను విన్నారు. పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్ మాట్లాడుతూ.. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి కాకుండా మరెవరికి టికెట్ ఇచ్చినా రాజకీయంగా అదే తనకు చివరి రోజన్నారు. పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ మాట్లాడుతూ.. తన తాత, చిన్నాయన ఎమ్మెల్యేలుగా పని చే శారని గుర్తు చేశారు. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డిని పోటీ చేయించి, ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గురునాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. గాంధీభవన్‌కు వచ్చి కండూవా కప్పుకోవడమే మిగిలిందని తెలిపారు. 2009లో రేవంత్ గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. గ్రామాల్లో కొంత మేర సమస్యలు ఎదురైనా సర్దుకు పోవాలని శ్రేణులకు సూచించారు. రేవంత్‌రెడ్డి గెలిచిన తర్వా త కార్యకర్తలను ఆదుకుంటామని ప్రకటించారు. కొడంగల్‌ను దత్తత తీసుకున్న కేటీఆర్ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కలిసి కట్టుగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని కార్యకర్తలు, నాయకులు తీర్మానం చేశారు. తమకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇస్తే చాలన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు, మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్, ఇందనూర్ సర్పంచ్ బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ఆనంద్‌రెడ్డి, సోమ శేఖర్, దత్తు, ధాము, బాల్‌రాజ్, మైనార్టీ నాయకులు నయీం, ఆసిఫ్‌ఖాన్, ముస్తాక్ పాల్గొన్నారు. -
బడా హీరోలతో రెండు సినిమాలు తీస్తున్నా: ‘తీస్మార్ ఖాన్’ నిర్మాత
వచ్చే ఏడాదిలో రెండు భారీ చిత్రాలు నిర్మించబోతున్నట్లు ‘తీస్మార్ ఖాన్’ నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ప్రకటించారు. నేడు(డిసెంబర్ 25) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాల విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘మా బ్యానర్లో ఇది వరకు వచ్చిన నాలుగు చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. వచ్చే ఏడాది రెండు భారీ చిత్రాలను విడుదల చేస్తాం. ఆ రెండు చిత్రాల్లోనూ ప్రముఖ హీరోలు నటిస్తున్నారు. . త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాం’అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన నాగం తిరుపతి రెడ్డి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ ఏడాది ఆయన నిర్మాణంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘తీస్ మార్ ఖాన్’ విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది. -
ఆది సాయికుమార్ కొత్త సినిమా.. కీలక పాత్రలో సునీల్
వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం అవుతుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ చెప్పిన కథ నచ్చింది. ఆది సాయికుమార్‌ను మరో కొత్త డైమన్షన్‌లో ప్రెజంట్ చేసే చిత్రమిది. అలాగే హీరో సునీల్‌గారు మా చిత్రంలో ఓ కీ రోల్లో కనిపించబోతున్నారు. అదేంటనేది సినిమా చూడాల్సిందే. పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి.. సునీల్‌గారైతే బావుంటుందని ఆయన్ని కలిసి అడగ్గానే ఆయన నటించడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్. ఈ చిత్రాన్ని మా బ్యానర్‌పై ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నాం. ఎన్నో చిత్రాలకు సక్సెస్ఫుల్ మ్యూజిక్‌ను అందించిన సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మణికాంత్ ఎడిటర్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోయే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు. -
అయితే జనవరి.. లేదంటే ఏప్రిల్
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే జనవరికల్లా దేశంలో కరోనా ప్రభావం పూర్తిస్థాయిలో తగ్గిన పక్షంలో ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. అ ప్పటికీ తగ్గకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆ ర్థికరంగం క్రమంగా కోలుకునే అవకాశాలున్నా’ యని ఆర్థిక నిపుణుడు తిరుపతిరెడ్డి భీముని చె ప్పారు. కీలక రంగాలపై మరో ఆరేడు నెలల దాకా కరోనా ప్రభావం ఉంటుందని విశ్లేషించా రు. దీని నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఇప్పటి వరకు ఉన్న ‘సేవింగ్స్’ను వివిధ వర్గాల ప్రజలు జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించా రు. డిసెంబర్ చివరిదాకా వేచిచూసి, జనవరి నుంచి ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నెమ్మదిగా మొదలుపెట్టొచ్చని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ చూపిన చొరవ, స్ఫూర్తి, ఆత్మస్థైర్యం, దేశంలో ఉన్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టేం దుకు విదేశాలు ఆసక్తి చూపొచ్చన్నారు. కరోనా ప్రభావం ఏయే రంగాలపై, ఏ మేరకు పడుతుందనే దానిపై వివరాలు ఆయన మాటల్లోనే.. 18 నుంచి 22% ఉద్యోగాల్లో కోత ► దేశంలోని జాబ్ మార్కెట్లో 18 నుంచి 22 శాతం ఉద్యోగాల్లో కోత పడవచ్చు. ► చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కొన్ని మూతపడే అవకాశ ముంది. ఈ రంగాల్లో 28 –33% వరకు నిరుద్యోగం పెరగవచ్చు. ► రిటైల్ ఇండస్ట్రీలో నిత్యావసర వస్తువులు మి నహా రిటైల్ రంగాలు కోలుకునేందుకు కొం త సమయం పట్టొచ్చు. కరోనా, లాక్డౌన్ ప్రభావం ఈ రంగంపై తీవ్రంగా పడింది. ఈ రంగాలపై ప్రభావం అధికం.. ఆతిథ్య రంగం: పర్యాటకం, హోటళ్లు, అనుబం ధ రంగాలతో ముడిపడిన ఆతిథ్యరంగం 40 – 50 శాతం దాకా నష్టపోవచ్చు. దేశంలో జనవరి –జూన్ మధ్య అధికశాతం ప్రజలు ప్లెజర్ట్రిæప్లు, విదేశీయానాలు, టూర్లకు వెళుతుంటారు. పెళ్లి ళ్లు, ఇతర సోషల్ గ్యాథరింగ్స్ నిలిచిపోవడంతో ఈ రంగం తీవ్రంగా నష్టపోనుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాలు: ప్ర స్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు కొనే వారుండ రు. నగర శివారు ప్రాంతాల్లో ఓ పెన్ ప్లాట్లకి డిమాండ్ 20–30% తగ్గొచ్చు. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశా లు తక్కువే. ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఆటోమొబైల్ రంగం: కరోనాకు ముందే ఈ రం గం కొంత ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుత పరిణా మాలతో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో ముడిసరుకులు చైనా నుంచి 35 శాతం దిగుమతి అవుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయి. సినిమా, టీవీ రంగాలు: సినిమాలు విడుదల కా క, టీవీ సీరియళ్ల షూటింగ్స్ జరగక కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు ఈ రంగం నష్టాలు చ విచూసే అవకాశాలున్నాయి. వీటిపై ప్రత్యక్షం గా, పరోక్షంగా ఆధారపడిన కొన్ని లక్షల కుటుం బాలు ఆర్థికంగా ఇబ్బంది పడనున్నాయి. ‘ప్యాకేజీ’ ఫలాలు ఇప్పుడే తెలియవు.. ► కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా అది నేరుగా చిన్నతరహా పరిశ్రమలకు చేరకపోవడం వల్ల ప్యాకేజీతో వాటికి అంతగా వెసులుబాటు లభించలేదు. ఈ పరిశ్రమలు మళ్లీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలి. అందుకు బ్యాంకులు సిద్ధమేనా? అనేది తేలాలి. ► ప్రాధాన్యతారంగాలను ఎంచుకుని ఆయా రంగాల వారీగా నిర్దేశిత ప్యాకేజీలు ప్రకటించి ఉంటే బావుండేది. ► ప్రస్తుతం ఎక్కువగా నష్టపోతున్న పర్యాటక, రవాణా, ఆతిథ్య, లాజిస్టిక్స్, ఎంటర్టైన్మెంట్, వాటి అనుబంధ సహాయకరంగాలను ఆదుకోవాలి. వీటిలో పనిచేసే వారు ఉద్యోగాలు, ఉపాధి కొంతమేర కోల్పోయే అవకాశముంది. ► కేంద్ర ప్యాకేజీ వల్ల వెంటనే ఫలితాలు వచ్చే అవకాశం లేదు. పరిశ్రమలతో పాటు ఇతర ఏయే రంగాలకు ఎలాంటి సహాయం అందింది, ఏ మేరకు కోలుకున్నాయి?, ఏ మేరకు సత్ఫలితాలొచ్చాయనేది తెలుసుకునేందుకు మరికొంత సమయం పడుతుంది. కరోనాతో అనుకూలంగా మారేవి.. ► డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది ► ఆన్లైన్ కోచింగ్‌లు, ఆన్లైన్ బోధన పెరుగుతాయి ► ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి బీమా రంగం అభివృద్ధి చెందుతుంది ► విదేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా మేకిన్ ఇండియా స్ఫూర్తితో ముందుకెళ్లొచ్చు. -
పూర్వవైభవం తీసుకొస్తా
సాక్షి, మెదక్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకానికి అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఎట్టకేలకు పచ్చ జెండా ఊపింది. రాష్ట్రంలోని 31 జిల్లాలతో పాటు పట్టణ కాంగ్రెస్ కమిటీ అ«ధ్యక్షుల నియామకానికి గురువారం ఆమోదం తెలిపింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం నూతన డీసీసీ అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. తిరుపతిరెడ్డి మెదక్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతోపాటు టికెట్‌కోసం గట్టిగా ప్రయత్నించారు. అయితే అధిష్టానం అనూహ్యంగా ఉపేందర్‌రెడ్డి టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడం, మాజీ మంత్రి సునీతారెడ్డి తిరుపతిరెడ్డికి మద్దతు తెలపడంతో ఆయన వైపే పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుడి నియామకం విషయంలో మొత్తంగా మాజీ మంత్రి సునీతారెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు వివిధ పదవుల్లో పనిచేశారు. అందరిని కలుపుకొని ముందుకు వెళ్తారని పార్టీలో ఆయనకు పేరుంది. జిల్లాలో ఏడాది కాలానికిపైగా పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకంపై కాలయాపన జరుగుతూ వచ్చింది. కొత్త జిల్లాలు ఏర్పడిన సమయంలోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశా>రు. అధిష్టానం మాత్రం జాప్యం చేస్తూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ అధ్యక్షులను నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల సమయంలోనూ డీసీసీ అధ్యక్షులను నియమించలేదు. మాజీ మంత్రి సునీతారెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో డీసీసీ నియామకం చేపట్టాలని పార్టీలో నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. డీసీసీ నియామకం జరిగితేనే రాబోయే ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందుకు నడిపిస్తారన్న అభిప్రాయాన్ని జిల్లా నాయకులు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీసీసీ నియామకం దిశగా పీసీసీ చర్యలు ప్రారంభించింది. ఈ అధ్యక్ష పదవికోసం కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, చం ద్రపాల్, మామిళ్ల ఆంజనేయులు, రెడ్డిపల్లి ఆంజ నేయులు పోటీ పడ్డారు. మాజీ మంత్రి సునీతా రెడ్డి కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి లేదా రెడ్డిపల్లి ఆంజ నేయులుకు డీసీసీ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. మామిళ్ల ఆం జనేయులు, చంద్రపాల్‌లు డీసీసీ పదవి దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. గెలుపే లక్ష్యంగా.. డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదార్ రాజనర్సింహ, మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎమ్మె ల్యే జయప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డిలకు తిరుపతిరెడ్డి కృతజ్ఞతలు తెలి యజేశారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతానని తెలిపారు. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొ చ్చేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే పార్లమెం ట్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసి ఎన్నికల్లో గెలుపొందేలా ప్రయత్నిస్తానని తెలిపారు. -
రేవంత్ రెడ్డి కుటుంబంలో విషాదం
- సోదరుడు తిరుపతి రెడ్డి కూతురి మృతి హైదరాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. రేవంత్ సోదరుడైన తిరుపతి రెడ్డి కుమార్తె శనివారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె.. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మిర్చి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఇవాళ ఖమ్మం వెళ్లిన రేవంత్ రెడ్డి.. తమ్ముడి కూతురి మరణవార్త తెలియగానే హతాశులయ్యారు. హుటాహుటిన హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
మహిళపై లైంగిక దాడికి యత్నం
పెద్దపల్లి, న్యూస్‌లైన్: మహిళలపై కామాం దుల అకృత్యాలు ఆగడంలేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా వారిలో వణుకు రావడంలేదు. రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. నాలు గు రోజుల క్రితం మండలంలోని గుర్రాం పల్లిలో ఓ మహిళపై అదే గ్రామానికి చెంది న మాదిరెడ్డి రాంరెడ్డి అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించగా గ్రామ పెద్దలు నింది తుడితో బాధితురాలి కాళ్లు మొక్కించి వది లేశారు. అయితే అకృత్యాన్ని జీర్ణించుకోలేని బాధితురాలి భర్త మంగళవారం రాత్రి రాంరెడ్డిపై హత్యాయత్నం చేశాడు. కొంత మందితో కలిసి ఆయనను గ్రామం లో తరుముకుంటూ కొట్టాడు. అడ్డుకున్న తిరుపతిరెడ్డి అనే వ్యక్తిని కూడా చితకబాదారు. దెబ్బలకు తాళలేక రాంరెడ్డితో పాటు ఆయన కూడా కిందపడిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని గ్రామస్తులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో చర్చనీ యాంశం కావడంతో అవమానంగా భా వించిన లైంగిక దాడి యత్నానికి గురైన మహిళ క్రిమి సంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన బం ధువులు ఆమెను పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి చికిత్స చేయడంతో ఆమెకు ప్రాణాపా యం తప్పింది. రాంరెడ్డిపై, ఆయనను కొట్టిన బాధితురాలి భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిషోర్ తెలిపారు.