బడా హీరోలతో రెండు సినిమాలు తీస్తున్నా: ‘తీస్‌మార్‌ ఖాన్‌’ నిర్మాత | Tees Maar Khan Producer Tirupathi Reddy Announced Two New Films | Sakshi
Sakshi News home page

బడా హీరోలతో రెండు సినిమాలు తీస్తున్నా: ‘తీస్‌మార్‌ ఖాన్‌’ నిర్మాత

Published Sun, Dec 25 2022 4:39 PM | Last Updated on Sun, Dec 25 2022 4:39 PM

Tees Maar Khan Producer Tirupathi Reddy Announced Two New Films - Sakshi

వచ్చే ఏడాదిలో రెండు భారీ చిత్రాలు నిర్మించబోతున్నట్లు ‘తీస్‌మార్‌ ఖాన్‌’ నిర్మాత నాగం తిరుపతి రెడ్డి  ప్రకటించారు. నేడు(డిసెంబర్‌ 25) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమాల విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘మా బ్యానర్‌లో ఇది వరకు వచ్చిన నాలుగు చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. వచ్చే ఏడాది రెండు భారీ చిత్రాలను విడుదల చేస్తాం. ఆ రెండు చిత్రాల్లోనూ ప్రముఖ హీరోలు నటిస్తున్నారు. . త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాం’అన్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన నాగం తిరుపతి రెడ్డి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ ఏడాది ఆయన నిర్మాణంలో ఆది సాయికుమార్‌ హీరోగా నటించిన ‘తీస్ మార్ ఖాన్’ విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement