మహిళపై లైంగిక దాడికి యత్నం | Woman sexually assaulted Project | Sakshi
Sakshi News home page

మహిళపై లైంగిక దాడికి యత్నం

Published Thu, Nov 21 2013 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

Woman sexually assaulted Project

 పెద్దపల్లి, న్యూస్‌లైన్: మహిళలపై కామాం దుల అకృత్యాలు ఆగడంలేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా వారిలో వణుకు రావడంలేదు. రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. నాలు గు రోజుల క్రితం మండలంలోని గుర్రాం పల్లిలో ఓ మహిళపై అదే గ్రామానికి చెంది న మాదిరెడ్డి రాంరెడ్డి అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించగా గ్రామ పెద్దలు నింది తుడితో బాధితురాలి కాళ్లు మొక్కించి వది లేశారు. అయితే అకృత్యాన్ని జీర్ణించుకోలేని బాధితురాలి భర్త మంగళవారం రాత్రి రాంరెడ్డిపై హత్యాయత్నం చేశాడు.
 
 కొంత మందితో కలిసి ఆయనను గ్రామం లో తరుముకుంటూ కొట్టాడు. అడ్డుకున్న తిరుపతిరెడ్డి అనే వ్యక్తిని కూడా చితకబాదారు. దెబ్బలకు తాళలేక రాంరెడ్డితో పాటు ఆయన కూడా కిందపడిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని గ్రామస్తులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో చర్చనీ యాంశం కావడంతో అవమానంగా భా వించిన లైంగిక దాడి యత్నానికి గురైన మహిళ క్రిమి సంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన బం ధువులు ఆమెను పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి చికిత్స చేయడంతో ఆమెకు ప్రాణాపా యం తప్పింది. రాంరెడ్డిపై, ఆయనను కొట్టిన బాధితురాలి భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిషోర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement