నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న తిరుపతిరెడ్డి
కొడంగల్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచే పోటీ చేస్తారని ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అంశంపై కార్యకర్తలతో చర్చించారు. వారి అభిప్రాయాలను విన్నారు. పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్ మాట్లాడుతూ.. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి కాకుండా మరెవరికి టికెట్ ఇచ్చినా రాజకీయంగా అదే తనకు చివరి రోజన్నారు. పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ మాట్లాడుతూ..
తన తాత, చిన్నాయన ఎమ్మెల్యేలుగా పని చే శారని గుర్తు చేశారు. కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డిని పోటీ చేయించి, ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గురునాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. గాంధీభవన్‌కు వచ్చి కండూవా కప్పుకోవడమే మిగిలిందని తెలిపారు. 2009లో రేవంత్ గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. గ్రామాల్లో కొంత మేర సమస్యలు ఎదురైనా సర్దుకు పోవాలని శ్రేణులకు సూచించారు. రేవంత్‌రెడ్డి గెలిచిన తర్వా త కార్యకర్తలను ఆదుకుంటామని ప్రకటించారు.
కొడంగల్‌ను దత్తత తీసుకున్న కేటీఆర్ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా కలిసి కట్టుగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని కార్యకర్తలు, నాయకులు తీర్మానం చేశారు. తమకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇస్తే చాలన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు, మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్, ఇందనూర్ సర్పంచ్ బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, ఆనంద్‌రెడ్డి, సోమ శేఖర్, దత్తు, ధాము, బాల్‌రాజ్, మైనార్టీ నాయకులు నయీం, ఆసిఫ్‌ఖాన్, ముస్తాక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment