
రేవంత్ రెడ్డి కుటుంబంలో విషాదం
- సోదరుడు తిరుపతి రెడ్డి కూతురి మృతి
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. రేవంత్ సోదరుడైన తిరుపతి రెడ్డి కుమార్తె శనివారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె.. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మిర్చి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఇవాళ ఖమ్మం వెళ్లిన రేవంత్ రెడ్డి.. తమ్ముడి కూతురి మరణవార్త తెలియగానే హతాశులయ్యారు. హుటాహుటిన హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.