‘టీడీపీ హఠావో... రాష్ట్ర్‌ కీ బచావో’ | dcc kota fires on tdp | Sakshi
Sakshi News home page

‘టీడీపీ హఠావో... రాష్ట్ర్‌ కీ బచావో’

Published Sun, Aug 7 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

dcc kota fires on tdp

అనంతపురం సెంట్రల్‌ :  గాంధీ మహాత్ముడు  1934 ఆగస్టు 9న చేపట్టిన క్వింట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రస్తుతం ప్రజలు దేశం నుంచి బీజేపీని, రాష్ట్రం నుంచి టీడీపీని తరిమికొట్టాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు కోటా సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు, మైనారిటీలు, ప్రార్థనా మందిరాలు, మహనీయుల విగ్రహాలపై దాడులు చేయడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. 


టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను తరిమికొట్టాలని ఆగస్టు 9న నగరంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు వాసు, కేవీ రమణ, నాయకులు  చంద్రశేఖర్‌గుప్తా, బాబ్జాన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement