Fires on TDP
-
టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
-
ఇది బలవంతపు పథకం కాదు: బొత్స సత్యనారాయణ
2000 సంవత్సరం నుంచి ఉన్న ఈ పథకంలో గతంలో వడ్డీ మాత్రమే మాఫీ అయ్యేది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు వడ్డీ మాఫీ కూడా అమలు జరగలేదు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ప్రజలు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఉన్న ఒక్క ఒన్‌టైం సెటిల్మెంట్ స్కీంను కూడా నిలిపివేశారంటూ వారి కష్టాలను ఏకరవు పెట్టారు. వడ్డీల వల్ల చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోయిందని తెలిపారు. పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప.. విక్రయ హక్కు, వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం లేదని తెలిసిన జగన్ చలించిపోయారు. ఓటీఎస్‌కంటే మరింత మెరుగైన పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టారు. – మంత్రి బొత్స సాక్షి, అమరావతి: పేదల పక్కా ఇళ్లను వారి సొంతం చేయడానికి, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆస్తి ఉపయోగపడటానికే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని (వన్ టైమ్ సెటిల్మెంట్, ఓటిఎస్) ప్రభుత్వం తీసుకొచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. నిర్ణీత రుసుము చెల్లించి, ముందుకొచ్చిన వారికే ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తారని, ఎవరిపైనా ఎటువంటి ఒత్తిళ్లు ఉండవని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు ఆపదలో ఉన్నప్పుడు ఆ ఇంటి పట్టా శాశ్వత హక్కుదారుడిగా బ్యాంకుల్లో రుణం పొందడానికి, అవసరమైతే అమ్ముకోవడానికి, చట్టపరమైన ఆస్తిగా తమ పిల్లలకు రాసి ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ, ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెచ్చారని చెప్పారు. లబ్ధిదారుల రుణం, వడ్డీతో కలిపి ఎంత మొత్తం ఉన్నా.. వారికి పూర్తి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేలుతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తం కంటే వాళ్లు కట్టవలసిన రుణం తక్కువ ఉంటే అదే మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఓటీఎస్ అన్నది ఎవరినీ బలవంతం చేయడానికో, లేక షరతులు విధించడానికో కాదని స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియోజకవర్గం పరిధిలోని సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి సత్యప్రసాద్ ఇచ్చిన సర్క్యులర్‌కు, ప్రభుత్వానికి సంబంధమే లేదని చెప్పారు. ఆయన ఎందుకు అలాంటి ఆదేశాలు ఇచ్చాడో కూడా తెలియదన్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామని, అతన్ని సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఓటీఎస్‌పై అధికారులు ఎవరైనా బలవంతం చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 50 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారని, వారందరికీ పూర్తి అవగాహన వచ్చేలా ఈ పథకం గురించి వివరించాలని కార్యదర్శులకు చెప్పామన్నారు. ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు లాభపడాలని కోరారు. మేలు చేసే పథకంపై పనిగట్టుకొని దుష్ప్రచారం ప్రజలకు మేలు చేసే ఇటువంటి మంచి పథకంపైన ప్రతిపక్షం చిల్లర విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియాలో పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదవాడిపై రాజకీయాలు చేసే పార్టీలకు, వ్యక్తులకు పుట్టగతులు ఉండవని దుయ్యబట్టారు. పేదవాడిపై టీడీపీకి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లను ఫ్రీగా ఇస్తామని, ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఓటీఎస్‌ను తిరస్కరించిన బాబు.. ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తానంటే ఎవరు నమ్ముతారని అన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఏమీ చేయలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. సోదరీమణులను ఏ విధంగా మోసం, దగా చేశారో అందరికీ తెలుసన్నారు. కాబట్టే టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఇప్పుడు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ దుష్ప్రచారాలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఈ ప్రభుత్వంలో అన్నివర్గాలవారికీ సముచిత స్థానం ఉందని తెలిపారు, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. మహిళా సాధికారతకు కృషి చేస్తోందని, లక్షా 50 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వడ్డీ మాఫీకి కూడా బాబు సర్కారుకు మనసే రాలేదు ‘వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం 2000 జనవరి 24న ప్రారంభమైంది. వడ్డీని మాత్రమే అప్పటి ప్రభుత్వాలు మాఫీ చేసేవి. తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించిన తర్వాతే తనఖా పెట్టుకున్న పత్రాన్ని లబ్ధిదారునికి ఇచ్చేవారు. మొత్తం 56,69,000 మంది లబ్ధిదారులున్నారు. 2014 మార్చి ఆఖరు వరకు.. అంటే 14 సంవత్సరాల 2 నెలల కాలంలో 2,31,284 మంది ఈ స్కీంను వినియోగించుకున్నారు. 2014 ఏప్రిల్ నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే వరకు పథకం అమలు కాలేదు. ఈ ఐదేళ్లూ చంద్రబాబు ప్రభుత్వం ఉంది. 2016 సెస్టెంబర్ 30న జరిగిన ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు మీటింగ్‌లో వన్‌టైం సెటిల్మెంట్ స్కీంను పొడిగించాలని ప్రతిపాదన పంపారు. 2016 అక్టోబర్ 27,, 2016 నవంబర్ 3న, 2018 ఏప్రిల్ 10న, 2019 ఫిబ్రవరి 13న మరో నాలుగు దఫాలు స్కీం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 5 సార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ప్రతిసారీ ఏదో ఒక నెపంతో వాటిని వెనక్కి పంపింది. ఒక్క లబ్ధిదారుడికి కూడా రుణ మాఫీ సంగతి దేవుడెరుగు.. వడ్డీ మాఫీకి కూడా మనసు రాలేదు. 14 ఏళ్లుగా అమల్లో ఉన్న పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు’ అని బొత్స చెప్పారు. -
‘కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీ వెంట ఉన్నారు’
చిత్తూరు: చంద్రబాబుకు పిచ్చి పతాకస్థాయికి చేరుకుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియడంలేదని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిపాలిటీలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.16వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుట్రలు కుతంత్రాలు చంద్రబాబుకు బాగా తెలిసిన విద్యలని దుయ్యబట్టారు. మొదటినుంచి మోసాలు చేయడం చంద్రబాబుకు అలవాటని ఫైర్ అయ్యారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు అరుదైన గౌరవం సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని హెచ్చరించారు. కుప్పం ప్రజలు వైఎస్సార్సీపీ వెంట ఉన్నారని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. 17న ఫలితాలు వస్తాయని, అప్పుడు చంద్రబాబు ఏం చెప్తారో చూస్తామని అన్నారు. ఆయనతో పాటు ప్రచారంలో ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే శ్రీనివాసులు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం ఇన్చార్జి భరత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది బాబు, యనమల
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థను అథోగతిపాలు చేసిన ఘనత చంద్రబాబు, యనమల రామకృష్ణుడులదేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ప్రజలంతా దసరా పండుగ హడావుడిలో ఉంటే.. చంద్రబాబు బ్యాచ్ కడుపుమంటతో ఇళ్లల్లో కూర్చుని అబద్దపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకొంటోందని విమర్శించారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల అప్పుతెచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. ఎప్పుడైనా ఒక్కపైసా పేద కుటుంబానికి సాయం చేశారా.. అని నిలదీశారు. తెచ్చిన అప్పు మొత్తాన్ని హారతి కర్పూరంలా చేసిన మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడతారా అని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిధులు సమకూర్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి పాత పథకమని, టీడీపీ కూడా అమలు చేసిందని యనమల చెప్పడం సిగ్గుచేటన్నారు. ‘మీ బతుకంతా నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజ్‌లు, వాళ్ల స్కూళ్లు బాగుచేయడమే తప్ప.. ప్రభుత్వ పాఠశాలల గురించి ఏనాడైనా ఆలోచించారా..’ అని ఎద్దేవా చేశారు. నేరాలు బయటపడతాయనే నలుగురు ఎంపీలను బీజేపీలో కలిపారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తమ ఆర్థిక నేరాలు ఎక్కడ బయటపడతాయోనని ఉన్న నలుగురు ఎంపీలను ఆ పార్టీలో కలిపేసిన మీరు ఆర్థిక నేరాల గురించి మాట్లాడతారా అని విమర్శించారు. తమ నాయకుడు ఇచ్చిన హామీ ప్రకారమే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారని చెప్పారు. లిక్కర్‌బాబు అయ్యన్నపాత్రుడు లిక్కర్ ధర పెరుగుతోందని మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కరెంట్ సంక్షోభం రానుందని నిపుణులు సైతం చెబుతున్నారన్నారు. మన రాష్ట్రంలోనే కరెంట్ కష్టాలు ఉన్నట్లు చంద్రబాబు ప్రజలను తప్పుదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా కరెంట్ ఎక్కడ ఇచ్చారని మాట్లాడుతున్న యనమల, అయ్యన్నపాత్రుడుల కళ్లు మూసుకుపోయాయా.. అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 1,25,791 మంది ఎస్టీ గృహ వినియోగదారులకు, 35,148 మంది ఎస్సీ గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉన్నవారికి ఉచితంగా కరెంటు ఇస్తున్నామని చెప్పారు. నీతిఆయోగ్ సైతం ఆర్బీకేలను ప్రశంసించిందన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. గతేడాది రూ.500 కోట్ల నష్టం వస్తే ప్రభుత్వం రీయింబర్స్ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు జోగినాయడు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచేశారు
ఏలూరు /పెనుగొండ: నాలుగున్నర సంవత్సరాల టీడీపీ పాలనలో కార్యకర్త స్థాయి నుంచి సీఎం వరకూ అవినీతితో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో బుధవారం జరిగిన బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో దోపిడీ చేసిన సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసి తిరిగి అధికారంలోకి రావడానికి టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో 600 మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదాను స్వలాభం కోసం తాకట్టు పెట్టి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారన్నారు. బీజేపీ, టీడీపీ రెండూ ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి రోజుకు నాలుగైదు వేల మంది సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొంటున్నారని అన్నారు. ఇదే స్ఫూర్తితో నవరత్నాలతో వారి సమస్యలు పరిష్కరించడానికి హామీ ఇచ్చారన్నారు. వీటితో ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ లబ్ధి చేకూరుతుందన్నారు. ఆచంట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు వినూత్న రీతిలో చేపట్టిన సర్వే అమోఘమని సుబ్బారెడ్డి అభినందించారు. ఆచంట సమన్వయకర్త శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. పోడూరు మండలం తూర్పుపాలెంకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సమావేశంలో నర్సాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్, విద్యావేత్త డాక్టర్ గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ పొత్తంటా.. ఇక్కడ చాలెంజంటా?
నంద్యాల: తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, ఆంధ్రాలో చాలెంజ్ అంటూ సీఎం చంద్రబాబు రాజకీయ డ్రామాలాడుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రెం డుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు సహించరని, చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నంద్యాల పద్మావతినగర్లోనిపార్టీ కార్యాలయంలో మంగళ వారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నెట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు మాయ మాటలు చెబుతూ మరోసారి జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలు నమ్మకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపుని చ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కంటితుడుపు చర్యగా నిరుద్యోగ భృతి కింద రూ.1000 ప్రకటించారన్నారు. సమస్యలు తీర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరున్నా జిల్లా అవసరాలకు వాడుకునే అవకాశం లేకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నార న్నారు. శ్రీశైలంలో కాంట్రాక్ట్ వర్కర్స్‌ను రెగ్యులర్ చేస్తానని చెప్పి చేయలేదని, నిర్వాసితులకు ఇళ్లు కూడా కట్టించలేకపోయారన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో 24 సార్లు నోటీసులిచ్చినా స్పందిం చని చంద్రబా బుకు మహారాష్ట్ర కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇచ్చిందని, అయితే ఈ పరిస్థితిని కూడా చంద్రబాబు తన రాజకీయపబ్బం గడుపుకోవడానికి వాడుకుంటున్నారని విమర్శించారు. ‘కావాలి జగన్.. రావాలి జగన్’ను దిగ్విజయంగా పూర్తి చేద్దాం : వైఎస్సార్సీపీ చేపట్టిన రావాలి జగన్... కావాలి జగన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని పార్టీ నాయకులను శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని ఊర్లలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ప్రకటించిన పథకాలతో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్‌నాయుడు, నాయకులు రమణారెడ్డి, పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘టీడీపీ హఠావో... రాష్ట్ర్ కీ బచావో’
అనంతపురం సెంట్రల్ : గాంధీ మహాత్ముడు 1934 ఆగస్టు 9న చేపట్టిన క్వింట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రస్తుతం ప్రజలు దేశం నుంచి బీజేపీని, రాష్ట్రం నుంచి టీడీపీని తరిమికొట్టాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు కోటా సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు, మైనారిటీలు, ప్రార్థనా మందిరాలు, మహనీయుల విగ్రహాలపై దాడులు చేయడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలను తరిమికొట్టాలని ఆగస్టు 9న నగరంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు వాసు, కేవీ రమణ, నాయకులు చంద్రశేఖర్‌గుప్తా, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. -
నోరు నొక్కేస్తున్నారు : రోజా
చెన్నై : సమస్యలపై ఎవరు నోరు విప్పినా వారి గొంతు నొక్కేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రౌడీల్లా తయారవుతున్నారని మండిపడ్డారు. నగరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచాలని కోరుతూ చెన్నైలోని దక్షిణ రైల్వే జీఎం అశోక్ కే అగర్వాల్, రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఎస్ అనంతరామన్‌లతో.. తిరుపతి ఎంపీ వరప్రసాద్‌తో కలిసి రోజా సోమవారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అందరితో కలసి చర్చించి, అభిప్రాయాల సేకరణతో రాజధానిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల కడుపు కొట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ నోరు మెదపలేని పరిస్థితి ఉందన్నారు. బలమైన పార్టీగా, ప్రతిపక్ష నేతగా ఉన్న తమ నేత జగన్ మోహన్ రెడ్డిని, పార్టీ వర్గాల్ని అణగదొక్కేందుకు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, శాంతి భద్రతల సమస్యలను సృష్టించడమే కాకుండా అధికార పక్షం ఎమ్మెల్యేలు, మంత్రులు రౌడీల్లా తయారవుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు.