అనంతలో కదం తొక్కిన విద్యార్థులు | ysrcp student leaders protests over ap special status in sri krishnadevaraya university | Sakshi
Sakshi News home page

అనంతలో కదం తొక్కిన విద్యార్థులు

Published Wed, Jan 25 2017 12:31 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

అనంతలో కదం తొక్కిన విద్యార్థులు - Sakshi

అనంతలో కదం తొక్కిన విద్యార్థులు

అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సలాంబాబా డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో బుధవారం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ బంద్ చేపట్టారు. అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసనకు దిగారు. హైవేను దిగ్భంధించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది.  

ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట‍్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి హోదా సాధించేంత వరకు పోరాడతామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు గురువారం జిల్లాలో నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement