ఆరువందల ఏళ్ల కథ | Angulika Movie Press Meet | Sakshi
Sakshi News home page

ఆరువందల ఏళ్ల కథ

Published Sun, Mar 15 2020 5:40 AM | Last Updated on Sun, Mar 15 2020 5:40 AM

Angulika Movie Press Meet - Sakshi

శేఖర్‌ వర్మ, వివ్య శాన్త్‌

దీపక్, శేఖర్‌వర్మ, వివ్య శాన్త్‌లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అంగుళీక’. ప్రేమ్‌ ఆర్యన్‌ దర్శకత్వంలో కోటి తూముల, ఎ.జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా విలేకరుల సమావేశంలో ప్రేమ్‌ మాట్లాడుతూ– ‘‘మొత్తం ఏడు రకాల సూర్యగ్రహణాలు ఉంటాయి. సూర్య భగవానుడి అంశలో జన్మించిన ఒక అమ్మాయికి, అంగుళీక సూర్యగ్రహణానికి ఒక లింక్‌ ఉంది. ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ కథను తీసుకొని ఈ సినిమా తీశాం’’ అన్నారు. కోటి మాట్లాడుతూ– ‘‘ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. కొన్ని కారణాల వల్ల సినిమా డిలే అయ్యింది’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో భాగం కావటం సంతోషంగా ఉంది. ఈ సినిమా రిలీజ్‌ వరకూ వచ్చిందంటే మా నిర్మాత, దర్శకుడే కారణం’’ అన్నారు హీరో శేఖర్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement