శేఖర్ వర్మ, వివియా
‘‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ చిత్రం ఫేమ్ శేఖర్ వర్మ హీరోగా, వివియా, విద్య హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నివాసి’. సతీష్ రేగళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గాయత్రి ప్రొడక్షన్స్ పతాకంపై కె.ఎన్.రావు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది. శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ అనే చిత్రాన్ని ఇటీవల అమేజాన్ ప్రైమ్‌లో చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలు నాలోని ఉత్సాహాన్ని రెట్టింపుచేశాయి. ఒక మంచి ట్రావెల్ స్టోరీ ఇది.
ప్రతి మనిషి ఒకసారి ఆలోచించుకునేలా ఈ చిత్రకథ ఉంటుంది. నా కెరీర్‌లో ‘నివాసి’ మరో మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మంచి భావోద్వేగాలతో ప్రతి ఒక్కరి మనసు గెలుచుకునేలా ఉంటుంది. ఈ సినిమా తర్వాత శేఖర్ మంచి నటుడిగానే కాకుండా సక్సెస్‌ఫుల్ హీరోగా నిలబడతాడు. నిర్మాతలు కె.ఎన్.రావు, వర్మగార్లు కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని సతీష్‌రేగళ్ళ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: చరణ్–అర్జున్, కెమెరా: కె.చిట్టిబాబు.
Comments
Please login to add a commentAdd a comment