Shekhar Verma
-
ఆరువందల ఏళ్ల కథ
దీపక్, శేఖర్‌వర్మ, వివ్య శాన్త్లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అంగుళీక’. ప్రేమ్ ఆర్యన్ దర్శకత్వంలో కోటి తూముల, ఎ.జగన్మోహన్రెడ్డి నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా విలేకరుల సమావేశంలో ప్రేమ్ మాట్లాడుతూ– ‘‘మొత్తం ఏడు రకాల సూర్యగ్రహణాలు ఉంటాయి. సూర్య భగవానుడి అంశలో జన్మించిన ఒక అమ్మాయికి, అంగుళీక సూర్యగ్రహణానికి ఒక లింక్ ఉంది. ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ కథను తీసుకొని ఈ సినిమా తీశాం’’ అన్నారు. కోటి మాట్లాడుతూ– ‘‘ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రమిది. కొన్ని కారణాల వల్ల సినిమా డిలే అయ్యింది’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో భాగం కావటం సంతోషంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ వరకూ వచ్చిందంటే మా నిర్మాత, దర్శకుడే కారణం’’ అన్నారు హీరో శేఖర్. -
అందరూ ఆలోచించేలా...
‘‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ చిత్రం ఫేమ్ శేఖర్ వర్మ హీరోగా, వివియా, విద్య హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నివాసి’. సతీష్ రేగళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గాయత్రి ప్రొడక్షన్స్ పతాకంపై కె.ఎన్.రావు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది. శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ అనే చిత్రాన్ని ఇటీవల అమేజాన్ ప్రైమ్‌లో చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలు నాలోని ఉత్సాహాన్ని రెట్టింపుచేశాయి. ఒక మంచి ట్రావెల్ స్టోరీ ఇది. ప్రతి మనిషి ఒకసారి ఆలోచించుకునేలా ఈ చిత్రకథ ఉంటుంది. నా కెరీర్లో ‘నివాసి’ మరో మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మంచి భావోద్వేగాలతో ప్రతి ఒక్కరి మనసు గెలుచుకునేలా ఉంటుంది. ఈ సినిమా తర్వాత శేఖర్ మంచి నటుడిగానే కాకుండా సక్సెస్ఫుల్ హీరోగా నిలబడతాడు. నిర్మాతలు కె.ఎన్.రావు, వర్మగార్లు కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని సతీష్రేగళ్ళ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: చరణ్–అర్జున్, కెమెరా: కె.చిట్టిబాబు. -
‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ మూవీ స్టిల్స్
-
రాముండిట్లో కృష్ణుడు!
శేఖర్ వర్మ, దీప్తి జంటగా గాయత్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.ఎన్ రావు నిర్మించిన చిత్రం ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’. నరేష్ పెంట దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘పది రోజులు విలేజ్‌కి వెళ్లి గడిపి వస్తే ఎలా ఉంటుందో అలా మా సినిమా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్టోరి. చాలా తక్కువ టైమ్‌లో సినిమా పూర్తి చేశాం. మంచి టీమ్ దొరికింది. నిర్మాత కె.ఎన్.రావు బాగా సహకరించారు. నేనే మ్యాజిక్ అందించాను’’ అని అన్నారు. ‘‘టైటిల్ మంచి కాన్సెప్ట్‌తో ఉంది. నరేష్ ఫీల్‌గుడ్ మూవీగా తెరకెక్కించారు’’ అన్నారు కె.ఎన్ రావు. ఈ చిత్రానికి కెమెరా: కూనపరెడ్డి జయకృష్ణ.