రాముండిట్లో కృష్ణుడు!
శేఖర్ వర్మ, దీప్తి జంటగా గాయత్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.ఎన్ రావు నిర్మించిన చిత్రం ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’. నరేష్ పెంట దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘పది రోజులు విలేజ్‌కి వెళ్లి గడిపి వస్తే ఎలా ఉంటుందో అలా మా సినిమా ఉంటుంది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్టోరి. చాలా తక్కువ టైమ్‌లో సినిమా పూర్తి చేశాం. మంచి టీమ్ దొరికింది. నిర్మాత కె.ఎన్.రావు బాగా సహకరించారు. నేనే మ్యాజిక్ అందించాను’’ అని అన్నారు. ‘‘టైటిల్ మంచి కాన్సెప్ట్‌తో ఉంది. నరేష్ ఫీల్‌గుడ్ మూవీగా తెరకెక్కించారు’’ అన్నారు కె.ఎన్ రావు. ఈ చిత్రానికి కెమెరా: కూనపరెడ్డి జయకృష్ణ.