
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని నిత్యా తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నిత్యా అభిమానులు ధైర్యంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు.
(ఇది చదవండి: నాన్న బాటలోనే రాణిస్తా.. సేవలు కొనసాగిస్తా..ఘట్టమనేని సితార)
నిత్యా ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. ఇప్పటి నుంచి మరో కోణంలో చూసుకుంటా.' అంటూ ఎమోషనలైంది.
కాగా.. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది.
(ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు)
Comments
Please login to add a commentAdd a comment