Kannada actor and director Tapori Satya passes away at 43 - Sakshi
Sakshi News home page

Kannada actor Tapori Satya: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్‌ మృతి!

Published Mon, Apr 24 2023 3:45 PM | Last Updated on Mon, Apr 24 2023 3:55 PM

Kannada actor and director Tapori Satya passes away at 43 - Sakshi

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శాండల్‌వుడ్ నటుడు, దర్శకుడు టపోరి సత్య కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కుటుంబానికి ఆధారమైన టపోరి సత్య మృతి తీరని శోకాన్ని మిగిల్చింది. 

సత్య తల్లి మాట్లాడుతూ..' సత్య ఆసుపత్రిలో వారం రోజులు ఐసీయూలో ఉన్నారు. ఆయన ఎప్పుడూ సినిమాలకే అంకితమయ్యారు. నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటానని సత్య మాటిచ్చాడు. అతని మరణం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.' అని కన్నీటి పర్యంతమయ్యారు. సత్య భౌతికకాయాన్ని బనశంకరిలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. యోగేష్, నందిత జంటగా నటించిన నంద లవ్ నందిత చిత్రంలో టపోరి సత్య విలన్‌గా నటించారు. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మేళా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనతో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే ఓ బుల్లితెర నటుడు సూసైడ్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement