![Patidar Leader Hardik Patel Ends Fast - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/12/patel.jpg.webp?itok=_iBqJHAG)
పటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ (ఫైల్‌ఫోటో)
అహ్మదాబాద్ : పటేళ్లకు రిజర్వేషన్లు, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లతో 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పటేల్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ బుధవారం తన ఆందోళన విరమించారు. భవిష్యత్ పోరాటాల కోసం బతికిఉండాలని అనుచరులు నచ్చచెప్పడంతో ఆయన దీక్ష విరమించారు. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నేత హార్థిక్ పటేల్ ఆగస్ట్ 25 నుంచి తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.
పటేళ్లకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, రైతులకు రుణమాఫీ డిమాండ్లను నెరవేర్చేవరకూ తన ఆందోళన కొనసాగుతుందని హార్థిక్ అంతకుముందు ప్రకటించారు. కాగా పటేల్ దీక్షకు కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వం తక్షణమే కోటా సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది
Comments
Please login to add a commentAdd a comment