ఉత్తరాదిన కర్వా చౌత్ పండుగ నాడు స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఆచరిస్తారు. ఇదేవిధంగా దక్షిణాదిన కూడా భర్త దీర్ఘాయుష్షు కోసం భార్యలు పలు వత్రాలు ఆచరిస్తుంటారు. అయితే కొందరు ముస్లిం స్త్రీలు తమ భర్త క్షేమం కోసం కర్వాచౌత్ ఉపవాసం పాటించినట్లు పలు ఫొటోలు వైరల్ అవుతుంటాయి. నిజానికి ముస్లిం మహిళలు తమ భర్త క్షేమం కోరుతూ ఉపవాసం పాటిస్తారా? ఇటువంటి నియమమేమైనా ఇస్లాంలో ఉందా? ఇంతకీ ఇస్లాంలో ఉపవాసానికి సంబంధించిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇస్లాంలో సాధారణంగా మూడు రకాల ఉపవాసాలు ఉంటాయి. వీటిలో పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాసాలు చాలా ముఖ్యమైనవి. పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఇందుకు చాలా నియమాలు ఉన్నాయి. కొంతమంది ముస్లింలు రంజాన్ ఉపవాసానికి భిన్నమైన రీతిలో మొహర్రం సమయంలో కూడా ఉపవాసం ఉంటారు. వీటితో పాటు కొందరు ముస్లింలు నఫిల్ ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఈ ఉపవాసాలు పాటించేందుకు వేర్వేరు నియమాలు ఉన్నాయి.
నఫిల్ ఉపవాసం రంజాన్ లేదా ముహర్రం కాకుండా ఇతర సమయాల్లో పాటించే ఉపవాసం. దీనిని ఏ సాధారణ రోజున అయినా పాటిస్తారు. అయితే ముస్లిం మహిళలు ఉపవాసాన్ని ఆచరించాలంటే భర్త నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ముస్లిం మహిళలకు ప్రత్యేకంగా వ్రతాలు, ఉపవాసాలు లాంటివి లేవు. ముస్లిం మహిళలు తమ భర్త లేదా పిల్లల కోసం ఎటువంటి ఉపవాసాలు పాటించరు.
ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు? తెలంగాణ సంగతేంటి?
Comments
Please login to add a commentAdd a comment