వాళ్లు మన కోసం పోరాడుతున్నారు : లడఖ్‌లో ప్రకాష్‌ రాజ్‌ బర్త్‌డే | Actor Prakash Raj celebrating his biirthday at ladakh why check here | Sakshi
Sakshi News home page

వాళ్లు మన కోసం పోరాడుతున్నారు : లడఖ్‌లోప్రకాష్‌ రాజ్‌ బర్త్‌డే

Published Tue, Mar 26 2024 1:13 PM | Last Updated on Tue, Mar 26 2024 2:35 PM

Actor Prakash Raj celebrating his biirthday at ladakh why check here - Sakshi

 పర్యావరణ వేత్త  వాంగ్‌చుక్‌ దీక్షకు మద్దతుగా ప్రకాష్‌ రాజ్‌

 లడఖ్‌లో  పుట్టిన రోజు 

కేంద్ర పాలిత ప్రాంతమైన లడాఖ్‌ హక్కులను, పర్యావరాణాన్ని కాపాడాలంటూ  ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ‘క్లైమేట్ ఫాస్ట్’ పేరుతో మార్చి 6న నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఉద్యమానికి పర్యావరణ వేత్తలు స్థానిక ప్రజలతో పాటు ప్రముఖులు, వివిధ ప్రాంతాలు, సంఘాల వారు మద్దతు పలుకు తున్నారు. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కూడా  స్పందించారు. 

మార్చి 26, మంగళవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌ వాంగ్‌ చుక్‌ ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు స్వయంగా ఉద్యమ ప్రదేశానికి తరలి వెళ్లారు. వారికి మద్దతు తెలపడం ద్వారా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నానని తెలిపారు.

‘‘మన దేశం .. మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం లడఖ్‌ ప్రజలు పోరాడుతున్నారు. వారికి అండగా నిలుద్దాం’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. నిరసన తెలుపుతున్న వేలాదిమంది ఉద్యమకారుల వీడియోను కూడా  షేర్‌ చేశారు.

మరోవైపు సేవ్‌ లడఖ్‌, సేవ్‌ హిమాలయాస్‌ అంటూ చేపట్టిన వాంగ్‌చుక్‌ దీక్ష 21 రోజులకు చేరింది. ఇంతవరకూ రాజకీయ నాయకులనుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వాంగ్‌ చుక్‌ ట్వీట్‌ చేశారు. తన దీక్ష, ఆరోగ్యంపై ఎప్పటికపుడు అప్‌డేట్‌ ఇస్తున్న ఆయన  ప్రజలనుంచి తనకు లభిస్తున్న మద్దతుపై సంతోషాన్ని, కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలి, వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకులు కాదంటూ వాంగ్‌చుక్‌ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా  ఇకనైనా స్పందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement