
సాక్షి, తిరుపతి: సాక్షి దినపత్రిక తిరుపతి ఎడిషన్‌లో డిప్యూటీ చీఫ్ ఆర్టిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కాట్పాడి రమేష్ (53) సోమవారం తుదిశ్వాస విడిచారు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో గత నెల18న ఆయన తిరుపతిలోని పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి కరోనా సోకినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి అక్కడే ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తీవ్రమైన అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, రమేష్ కుటుంబ సభ్యులకు రూ.లక్ష సాయం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment