సూర్యను పరామర్శిస్తున్న ఫౌండేషన్ సభ్యులు
సాక్షి, కోరుట్ల: ‘బాబుకు.. బతుకునివ్వరూ’ శీర్షికన ఈ నెల 8వ తేదిన సాక్షిలో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గొడిసెల సూర్య(14) అనే బాలుడు బ్రెయిన్ ఫీవర్‌తో బాదపడుతున్నాడు. తల్లిదండ్రులకు వైద్యం చేయించడం భారంగా మారింది. ఈ క్రమంలో సాక్షి ఆ కుటుంబ దయనీయ స్థితిపై కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు రూ.15 వేలు విరాళం అందించారు. జగిత్యాల జిల్లా బీజేపీ కార్యదర్శి ఇందూరి సత్యం రూ.5 వేలు విరాళం అందించారు. కోరుట్ల ప్రెస్‌క్లబ్ తరపున రూ.10వేల విరాళం ప్రకటించారు.
ఆదుకున్న అర్వింద్ ఫౌండేషన్
బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతున్న సూర్య వైద్య సాయం కోసం అర్వింద్ ఫౌండేషన్ నిర్వహాకులు స్పందించారు. కోరుట్ల బీజేపీ నాయకులు ఇందూరి సత్యం సూర్య పరిస్థితిని అర్వింద్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లగా.. గురువారం ఫౌండేషన్ నిర్వహాకులు ధర్మపురి ప్రియాంక రెయిన్‌బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యను పరామర్శించారు. సూర్య వైద్యానికి ఆసుపత్రిలో అయిన ఖర్చులో దాదాపు రూ.68 వేలు ఫౌండేషన్ నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేశా రు. కుమారుని అనారోగ్యం విషయంలో మానవతా దృక్పథంతో స్పందించిన అర్వింద్ ఫౌండేషన్ నిర్వహకులు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు సూర్య తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment