ఇండియా అవార్డ్స్–2018 ప్రదానోత్సవంలో సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, అవార్డ్స్ జ్యూరీ కమిటీ అధ్యక్షుడు శివకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఇండియా అవార్డ్స్ రీజినల్ విభాగం ప్రతినిధి శ్రీనివాసన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, మాడిసన్ వరల్డ్ చైర్మన్ శ్యాం బర్సారా
సాక్షి, హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్, భారతీ సిమెంట్స్ సౌజన్యంతో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా అవార్డ్స్–2018 కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. శుక్రవారం సాయంత్రం కొండాపూర్‌లోని సైబర్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలకు సంబంధించిన అడ్వరై్టజింగ్ ఏజెన్సీలు సృజనాత్మకంగా రూపొందించిన వాణిజ్య ప్రకటనలకు అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 23 విభాగాల్లో ఇండియా అవార్డ్స్‌ను ఇచ్చారు.
తొలిసారిగా ఏపీ, తెలంగాణకు చెందిన పలు సంస్థల వాణిజ్య ప్రకటనలకు రీజినల్ ఇండియా అవార్డ్స్ ప్రదానం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ఇండియా అవార్డ్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషమన్నారు. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సాంకేతికతకు నగరంలో ఉజ్వల భవిష్యత్ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తోందన్నారు. మీడియా తప్పుడు వార్తల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అత్యున్నత ప్రమాణాలతో వాణిజ్య ప్రకటనల రంగం పురోగమించాలని ఆకాంక్షించారు.
ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ నారాయణ్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక అవార్డులను తేటతెలుగు భాషలో వాణిజ్య ప్రకటనలు జారీ చేసిన సంస్థలకు అందజేయడం శుభపరిణామమన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వరై్టజింగ్ రంగాన్ని మరింత ప్రోత్సహించినట్లయిందని అభిప్రాయపడ్డారు. రీజినల్ ఇండియా అవార్డ్స్ విభాగం ప్రతినిధి శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’మీడియా, భారతీ సిమెంట్స్ అందించిన ప్రోత్సాహం ఎనలేనిదని కొనియాడారు.
ఇండియా అవార్డ్స్ జ్యూరీ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. ఇండియా అవార్డ్స్–2018కి మొత్తం 23 విభాగాలలో వివిధ సంస్థలకు చెందిన 332 ఎంట్రీలు (వాణిజ్య ప్రకటనలు) టీవీ, వార్తాపత్రికలు, డిజిటల్ మీడియాకు సంబంధించినవి ఉన్నాయన్నారు. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సృజనాత్మకత, సమాచారం, వినియోగదారులను ప్రభావితం చేయడంతోపాటు ఆలోచింపజేసేలా ఉన్నవి, ఉత్తమ సందేశం ఇచ్చిన వాణిజ్య ప్రకటనలను అవార్డులకు ఎంపికచేసినట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆయా కంపెనీలకు యాడ్స్ సిద్ధం చేసిన యాడ్ ఏజెన్సీలతోపాటు కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా అందుకున్నారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగరంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, అమెరికాలోని న్యూయార్క్ మహానగరంతో దాదాపు సమానంగా నగర పోలీసు వ్యవస్థ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని భద్రత కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్‌పీ రెడ్డి, ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ వైఈపీరెడ్డి, భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సవాళ్ల మధ్య పురోగమనం: శ్యాం బర్సారా
దేశంలో వాణిజ్య ప్రకటనల రంగం(అడ్వర్టైజ్‌మెంట్) తీవ్ర పోటీ, సవాళ్ల మధ్య పురోగమిస్తోందని మాడిసన్ వరల్డ్ చైర్మన్ శ్యాం బర్సారా చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా, చానల్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాణిజ్య ప్రకటనల విషయంలో ప్రయోగాలతో అద్భుతాలు సృష్టించాలని కోరారు. దేశంలో 1972లో కేవలం రూ.100 కోట్ల మేర ఉన్న వాణిజ్య ప్రకటనల వ్యాపారం ఇప్పుడు సుమారు రూ.60 వేల కోట్లకు చేరిందన్నారు. వినియోగదారులను ప్రభావితం చేయడంతోపాటు ఆలోచింపజేసేలా వాణిజ్య ప్రకటనలు ఉండాలని సూచించారు. ఈ రంగంలో అనుసరించాల్సిన మెళకువలను ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఇండియా అవార్డ్స్–2018కి ఎంపికైన సంస్థలు.. వాటి యాడ్స్ వివరాలివీ..
ఆటో ఫోర్ వీలర్స్ టాటా మోటార్స్ న్యూ ఏస్ ఎక్స్‌ఎల్
ఆటో టూ వీలర్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్
ఆటో అదర్స్ అపోలో టైర్స్
బ్యాంకింగ్ ఫైనాన్స్ ఐసీఐసీఐ బ్యాంక్ స్మార్ట్‌కీస్
ఫుడ్ అండ్ బేవరేజెస్ డాబర్ హనీ స్టే ఫిట్.. ఫీల్ యంగ్
హోమ్‌కేర్ లైజాల్ మాన్‌సూన్ న్యూప్యాక్
ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మీడియా సోనిమ్యాక్స్ సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ మూవీ
పర్సనల్ కేర్ కోల్గేట్ స్వర్ణ వేద్ శక్తి టూత్‌పేస్ట్
రిటైల్ లలిత జ్యూవెలరీస్.. లలిత చెక్ అండ్ బయ్
టెలికం అండ్ టెక్నాలజీ ఎయిర్‌టెల్– మై ప్లాన్ ఫ్యామిలీ
ఫార్మా హైజిన్ అండ్ వెల్‌నెస్ మూవ్–సింధు డైరెక్టర్
హోమ్ డెకార్ ఫెవిక్విక్ జెల్–హెడ్‌స్టాండ్
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కపిల్ చిట్ ఫండ్స్ యాడ్ ఫిల్మ్
బిల్డింగ్ మెటీరియల్ భారతీ సిమెంట్ ఫుల్ గ్యారంటీ
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మింట్ ఈ మొబైల్స్‌లాంచ్ ఆఫ్ మింట్ ఈ ఓపెన్‌బాక్స్ మొబైల్స్
రియల్ ఎస్టేట్ అపర్ణ గేటెడ్ కమ్యూనిటీస్–ది పేపర్ ప్లేన్
సర్వీసెస్ గటి–అవుట్ ఆఫ్ ద బాక్స్
ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫ్రీడం రీఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్
గవర్నమెంట్ ఏపీ ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్–సన్‌రైస్ ఏపీ ఇన్వెస్ట్‌మెంట్స్
రిటైల్ సెంట్రో–దసరా క్యాంపెయిన్
ట్రావెల్ అండ్ టూరిజం తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్
జెండర్ సెన్సిటివ్ అడ్వరై్టజింగ్ ఫ్యూర్ అండ్ ష్యూర్–కన్యాకుమారి టు లడక్ ఇన్
100 హవర్స్ కార్పొరేట్ జన్‌రైస్ అడ్వరై్టజింగ్–హ్యాపీ మదర్స్‌డే
Comments
Please login to add a commentAdd a comment