Awards Function
-
ఇన్నేళ్లకు కల నిజమైంది: రష్మికా మందన్నా
చిన్ననాటి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఎనిమిదో ఎడిషన్ ‘క్రంచీ రోల్ అనిమే’ అవార్డ్స్ ఫంక్షన్‌కు అతిథిగా వెళ్లారు రష్మిక. విజేతలకు అవార్డులను అందజేశారు. జపాన్‌కు వెళ్లడం పట్ల రష్మికా మందన్నా ఈ విధంగా స్పందించారు.‘‘నా చిన్నతనంలో జపాన్‌కు వెళ్లాలనే కల ఉండేది. అయితే అది అసాధ్యం అనుకున్నాను. కానీ ఇన్నేళ్లుగా జపాన్‌కు వెళ్లాలనే కల మాత్రం అలానే ఉంది. ఇప్పుడు అది సాధ్యమైనందుకు సంతోషంగా ఉంది. కొన్నేళ్ల నా కల నిజమైంది. జపాన్‌లోని ఆహారం, వాతావరణం, ఇక్కడి ప్రజలు నాపై చూపించిన ప్రేమ, ఆదరణ నాకు ఆనందాన్నిచ్చాయి. జపాన్ నాకు ఇప్పుడు చాలా స్పెషల్’’ అని ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు రష్మిక. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ‘పుష్ప 2’, ధనుష్ ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్), హిందీ ‘ఛావా’లో హీరోయిన్గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ అనే ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు రష్మికా మందన్నా. -
అందంతో మతిపోగొడుతున్న మహిళా క్రికెటర్
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ తన అందచందాలతో కుర్రకారు గుండెళ్లో రైళ్లు పరిగెత్తించింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ లో పెర్రీ తళుక్కున మెరిసింది. ఈ కార్యక్రమానికి ఆసీస్ మెన్స్ క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి ఎల్లీస్ పెర్రీపైనే నెలకొంది. అందుకు కారణం ఆమె వేసుకొచ్చిన దుస్తులు. రెడ్ కలర్ డ్రెస్‌లో బ్లూ కార్పెట్‌పై క్లీవేజ్ షో చేస్తూ దగదగ మెరిసిపోయిన ఎల్లీస్ పెర్రీ అవార్డు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రౌండ్లో తన ఆటతో అభిమానులను మంత్రముగ్దులను చేసిన ఎలీస్ పెర్రీ.. తాజాగా అవార్డు కార్యక్రమంలో తన అందచందాలతో అలరించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 32 ఏండ్ల ఈ ఆసీస్ ఆల్ రౌండర్.. 2007 నుంచి కంగారు జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 10 టెస్టులు, 128 వన్డేలు, 131 టీ20 మ్యాచ్ లు ఆడింది. టెస్టులలో 752 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉండటం విశేషం. బౌలర్ గా 37 వికెట్లు పడగొట్టింది. వన్డేలలో పెర్రీ.. 3,369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక టీ20లలో 1,418 రన్స్ చేసి 117 వికెట్లు సాధించింది. ఇక అవార్డుల విషయానికి వస్తే.. ►స్టీవ్ స్మిత్ ఉత్తమ ఆస్ట్రేలియా క్రికెటర్(అలెన్ బోర్డర్ మెడల్) అవార్డు సొంతం చేసుకోగా.. ఉత్తమ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌గా బెత్‌మూనీ(బెలిండా క్లార్క్) అవార్డు గెలుచుకుంది. ►మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా ►ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- బెత్ మూనీ ►మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- డేవిడ్ వార్నర్ ►వుమెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- తాహిలా మెక్‌గ్రాత్ ►మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మార్కస్ స్టోయినిస్ ►వుమెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-అన్నాబెల్ సదర్లాంఢ్ ►మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మైకెల్ నాసర్ ►బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- లాన్స్ మోరిస్ ►కమ్యూనిటి ఇంపాక్ట్ అవార్డు- ఉస్మాన్ ఖవాజా -
రామ్‌కో సిమెంట్స్‌కు సీఎస్‌ఆర్‌బాక్స్ ఇంపాక్ట్ అవార్డులు
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద రెండు విభాగాల్లో సీఎస్‌ఆర్‌బాక్స్ ఇంపాక్ట్ అవార్డులు దక్కించుకుంది. అరియలూర్ ప్లాంట్‌కు వాటర్ శానిటైషన్ అండ్ హైజీన్(వాష్) అవార్డు, ఆర్ఆర్ నగర్ ప్లాంట్‌కు ఎంప్లాయి వాలంటీరింగ్ ఇనీషియేటివ్ అవార్డులు లభించాయి. సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా సమాజంలో మెరుగైన ఫలితాలను సాధించే కంపెనీలను సీఎస్‌ఆర్‌బాక్స్ ఈ అవార్డుల ద్వారా ప్రోత్సహిస్తుంటుంది. సీఎస్ఆర్ను నిర్భంధంగా కాకుండా ఓ బాధ్యతగా రామ్‌కో సిమెంట్స్ భావిస్తుందని సీఈవో ఏవీ ధర్మకృష్ణన్ తెలిపారు. గత 60 ఏళ్లుగా కంపెనీ స్థాపించిన నాటి నుంచి సీఎస్ఆర్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
రెడ్‌క్రాస్ సేవలు అమూల్యం.. కోవిడ్ సమయంలో అద్భుత సేవలు
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): సమాజ శ్రేయస్సు కోసం రెడ్‌క్రాస్ సభ్యులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రక్తం అందక ఒక్కరు కూడా ప్రాణం కోల్పోకూడదని, ఇందుకోసం మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులకు ఆయన సూచించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ శాఖ వార్షిక అవార్డుల (2019–20, 2021–22 సంవత్సరాలకు) ప్రదానోత్సవం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు మానవతా దృక్పథంతో సేవలు అందించడంలో రెడ్‌క్రాస్ ముందంజలో ఉందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రెడ్‌క్రాస్ తన పాత్రను అద్భుతంగా పోషించిందని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రక్తం, ఆక్సిజన్, మాస్కులు, మందులు వంటివి అందించడం ద్వారా వేల మంది రోగుల ప్రాణాలు కాపాడిందని కొనియాడారు. రోగులకు, తలసేమియా బాధిత పిల్లలకు సురక్షితమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంగా రెడ్‌క్రాస్ పని చేయడం ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో 26 జిల్లాల కలెక్టర్లు, మేనేజింగ్ కమిటీలు సేవలు అందించడం ద్వారా రెడ్‌క్రాస్ మరింత బలోపేతమైందని తెలిపారు. జిల్లా శాఖలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రజలకు చేరువకావడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యువత, విద్యార్థులను చైతన్యవంతం చేయడం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. నిరుపేదలకు సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన రెడ్‌క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్పీ సిసోడియా, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరంఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఎస్.ఢిల్లీరావు, పి.రంజిత్‌బాషా, శ్రీకేష్.బి.లతకర్, ఎ.సూర్యకుమారి, గుంటూరు జేసీ ఎ.దినేష్‌కుమార్, రాజమండ్రి సబ్ కలెక్టర్ డాక్టర్ పి.మహేష్‌కుమార్‌తోపాటు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా, సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ, జిల్లాస్థాయిలో విస్తృతంగా సేవలు అందించిన 94 మంది నిస్వార్థ సేవకులకు అవార్డులను, ట్రోఫీలను గవర్నర్ ప్రదానం చేశారు. ‘నాటా’కు ప్రశంశలు కోవిడ్–19 సమయంలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 150 ఆక్సిజన్ సిలిండర్లను రెడ్‌క్రాస్ ద్వారా సహాయం చేసినందుకు అప్పటి నాటా అధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి గండ్ర నారాయణరెడ్డిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ సంస్థ సేవలకు గుర్తింపుగా నాటా పీఆర్ అండ్ మీడియా కో–ఆర్డినేటర్ డీవీ కోటిరెడ్డి, ఎం.పార్థసారథిరెడ్డి, కె.సాంబశివారెడ్డికి గవర్నర్ మెడల్, అవార్డులను ప్రదానం చేశారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) అధ్యక్షుడు విశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్‌గ్రిడ్ ఈ రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్‌ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్‌గ్రిడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు. (క్లిక్ చేయండి: ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు) -
Neeraj Chopra: అల్లు అర్జున్‌తో 'తగ్గేదే లే'.. రణ్వీర్తో చిందులు
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' ఈవెంట్లో తళుక్కున మెరిశాడు. ఢిల్లీ వేదికగా సీఎన్ఎన్ న్యూస్-18 ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన ఈవెంట్లో నీరజ్ చోప్రాతో పాటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ సహా మరికొంత మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప: ది రైస్ సినిమాకు ''ఇండియన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డు అందుకోగా.. ఆ తర్వాత క్రీడా విభాగంలో నీరజ్ చోప్రా ఈ అవార్డు తీసుకున్నాడు. నీరజ్ చోప్రా, అల్లు అర్జున్‌లు ఒకే వేదికను పంచుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజిచ్చిన అనంతరం తనివీ తీరా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ 'తగ్గేదే లే' మేనరిజంను చేసి చూపించాడు. ఆ సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడే ఉండడంతో ఇద్దరు కలిసి తగ్గేదే లే అంటూ ఫోజిచ్చారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌తో కలిసి స్టేజీపై డ్యాన్స్‌తో అదరగొట్టాడు నీరజ్ చోప్రా. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ట్రోఫీని తొలిసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ట్రోఫీ కొల్లగొట్టాడు. 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినప్పటికి ట్రోఫీ కొట్టేలేకపోయాడు. ఈసారి మాత్రం ట్రోఫీ అందుకున్న నీరజ్ చోప్రా వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకున్నాడు. #NeerajChopra and #AlluArjun together doing a javelin throw and #Pushpa gesture! #IndinofTheYear @cnnbrk pic.twitter.com/JKZdLBrfvK — Griha Atul (@GrihaAtul) October 12, 2022 Grand finale #IndianOfTheYear #RanveerSingh and #NeerajChopra rock the stage @CNNnews18 pic.twitter.com/dOBATvOUwN — Griha Atul (@GrihaAtul) October 12, 2022 చదవండి: అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్ పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్! -
సింగపూర్‌లో ఘనంగా ‘నారీ-2022’
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అక్కడ నివసించే తెలుగు వనితల కోసం "నారి -2022" అనే శీర్షికతో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. స్థానిక ఆర్చర్డ్ హోటల్లో హారితేజ వ్యాఖ్యాతగా ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది వనితలు హాజరయ్యారు. ప్రముఖ నటి, ఆంధ్రప్రదేశ్ పర్యాటకం, సంస్కృతి, యువత అభివృద్ధి శాఖా మంత్రి ఆర్.కె రోజా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ యస్ టి యస్ పోటీలు, ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఆటలు, వేషభాషల అనుకరణ పోటీలు , ఇన్స్టరీలు పోటీలు, స్టెప్స్ ఛాలెంజ్, అమ్మ కూతుర్ల సరదా సందడి పోటీ, వివిధ వినోదభరితమైన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. సంప్రదాయ భద్రంగా వివిధ రకాల చీరలతో నిర్వహించిన ప్రదర్శన సింగపూర్ బుక్ ఆఫ్ రికార్ద్స్లో స్థానం సంపాదించడం విశేషం. మంత్రి రోజా మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని రూపొందించడం, ఇంత మంది మహిళలు హాజరుకావడం, దానికి తనను ముఖ్య అతిధి ఆహ్వానించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ఈ కార్యక్రమం చేయటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఆహుతులను అలరింపచేసిన హారితేజకు, సునీతకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన బిజీషెడ్యూల్ని పక్కనబెట్టి ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి రోజాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుటకు కృషిచేసిన కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. -
పురస్కారాలతో ప్రోత్సాహం: వేణుగోపాల చారి
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఉన్న వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం మంచి విషయమని కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో జరిగిన మెగా రికార్డ్స్ ఇండిపెండెన్స్ డే అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాలు అందించడం ప్రోత్సహకరంగా ఉంటుందన్నారు. మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు పి. శ్రీనివాసరావును ఆయన అభినందించారు. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రేణుకా ప్రభాకర్ శిష్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యప్రదర్శన, చిన్నారి రిత్విక్ శ్రీ డాన్స్ అలరించాయి. బండి రాములు, రుక్మిణి మాతాజీ బృందం యోగానాలు ఔరా అనిపించాయి. 70 ఏళ్ల వయసులో బండి రాములు వేసిన యోగానాలు సభికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. 15 మందికి ఈ సందర్భంగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నాగసాయి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. చిల్లా రాజశేఖర్‌రెడ్డి, జీసీ రెడ్డి, సనాతన బాలరాజు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఏఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: డాక్టర్ లాస్యసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు) -
ప్రతి విద్యార్థికీ బాల్యం నుంచే ఓ కళ నేర్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ కల్చరల్ : ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. కనీసం పదోతరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన జరగడంతో పాటు ప్రతి విద్యార్థికీ బాల్యం నుంచే ఏదైనా ఓ కళను నేర్పించి వారిలో సృజనాత్మకతకు బాటలు వేయొచ్చన్నారు. తద్వారా బాల్యం నుంచే చిన్నారుల్లో కళలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయత భావన అలవడుతాయని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో శనివారం నిర్వహించిన సంగీత, నాటక అకాడమీ అవార్డులు, లలితకళ అకాడమీ ఫెలోషిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. 2018 నుంచి 2021 వరకు మూడేళ్లకు అవార్డులు ఒకేసారి అందజేశారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. బ్రిటీషర్ల అరాచకాన్ని ఎదిరించే ప్రయత్నంలో కళలు, సాంస్కృతిక రూపాలు ప్రభావవంతమైన రాజకీయ ఆయుధాలుగా ఉపయోగపడ్డాయన్నారు. అలాంటి భారతీయ కళ, సాంస్కృతిక రూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మల్లాదికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లాది సూరిబాబు(కర్ణాటక సంగీతం), ఎస్.కాశీం, ఎస్.బాబు(నాదస్వరం), పసుమర్తి రామలింగశాస్త్రి (కూచిపూడి), కోట సచ్చిదానందశాస్త్రి(హరికథ)లు అవార్డులు అందుకున్నారు. 62వ జాతీయ ప్రదర్శన అవార్డుల్లో భాగంగా శిల్పకళల విభాగంలో జగన్మోహన్ పెనుగంటికి ఉపరాష్ట్రపతి అవార్డును అందజేశారు. కాగా, విజయవాడకు చెందిన మల్లాది సూరిబాబు తన తండ్రి శ్రీరామమూర్తి వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. వేలాది కచేరీలు నిర్వహించారు. నారాయణ తీర్థులు, రామదాసు, సదాశివబ్రహ్మేంద్రులు, అన్నమయ్య కీర్తనలకు స్వర రచన చేశారు. విజయవాడ ఆకాశవాణిలో సుదీర్ఘకాలం పనిచేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంగీత, నాటక అకాడమీ, లలితకళ అకాడమీ అధ్యక్షురాలు ఉమ నందూరి తదితరులు పాల్గొన్నారు. -
అవార్డుల వేడుకలో తారల సందడి.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
చెన్నై సినిమా: చెన్నైలో జరిగిన అవార్డుల వేడుకలో తారలు సందడి చేశారు. మహా ఆర్ట్స్ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ అనురాధ, యునైటెడ్స్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థల నిర్వాహకుడు కలైమామణి, డాక్టర్ నెల్లై సుందరరాజన్ కలిసి నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమంలో విశ్రాంత హైకోర్టు న్యాయమూ ర్తి ఎస్.కె.కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించా యి. అనంతరం పలువురు నటీనటులకు ప్రోత్సాహక అవార్డులను విశ్రాంత న్యాయమూర్తి ప్రదానం చేసి సత్కరించారు. అవార్డులను అందుకున్న వారిలో సినీ నటి జ్యోతిమీనా, మేఘన ఎలెన్, రోజా, మాలిని తదితరులు ఉన్నారు. -
ఘనంగా సినీ తారల అవార్డుల వేడుక..
చెన్నై: సినీ, బుల్లితెర తారల అవార్డుల వేడుక శనివారం స్థానిక వడపళణిలోని శిఖరం హాలులో ఘనంగా జరిగింది. మహా ఆర్ట్స్ అధినేత అనురాధ జయరాం, యునైటెడ్ ఆరి్టస్ట్ ఆఫ్ ఇండియా అధినేత నెల్లై సుందరరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ఎస్.కె.కృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయమూర్తి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను అందుకున్న వారిలో నటి జ్యోతి మీనా, ఎస్.ఎస్.ఆర్.ఆర్యన్, శృతిక, మౌనిక, గానా గాయకురాలు ఇసైవాణి తదితరులు ఉన్నారు. -
ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై దాడులా ?: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఆడపిల్లలపై అఘాయిత్యాలు తగ్గాలంటే చట్టాల అమలు సరిగా జరగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిర్భయ చట్టాలు వచ్చినా కూడా ఎక్కడ అమలు కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు 40 శాతం హింసను ఇళ్లల్లోనే ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను మనుషులుగా చూడాలని, మహిళలంతా సంఘటితమై తమ సమస్యలను ఎదుర్కోవాలని సూచించారు. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆడబిడ్డలపై దౌర్జన్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హజీపూర్ ఘటన దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, మళ్లీ అలాంటి అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించిన కమిషనర్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం జరిగిన సంఘమిత్ర అవార్డుల కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘షీ టీమ్స్’ అన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. షీ టీమ్స్‌తో పాటు సంఘమిత్ర కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. సంఘమిత్రలు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరుతానని చెప్పారు. తనను కూడా సంఘమిత్రలో చేర్చుకోవాలని సీపీని ఈ సందర్భంగా కవిత కోరారు. -
ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం.’అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. ‘సాక్షి’వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల’కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే రెండేళ్లకు (2019, 2020) ఎంట్రీలు పంపవచ్చు. అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు జనవరి 13, 2021 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఈసారి కూడా ఎంట్రీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించడం, సేవలను కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్‌ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 040–23322330 నంబర్‌పై గానీ, sakshiexcellenceawards2019@sakshi.com మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. -
అయ్యో ! రణ్వీర్ ఎంత పని జరిగే..
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఎంత మంచి డ్యాన్సరనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్యాన్స్ చేయడంలో అతని టైమింగ్, స్టైల్ మిగతా వారి కన్నా కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తాయి. ఒక అవార్డ్సు ఫంక్షన్ లో రణ్వీర్ సింగ్ రామ్ లీలా చిత్రంలోని నగడా సాంగ్ డోల్ బాజేకు డ్యాన్స్ చేశాడు.రణ్వీర్ సూపర్‌గా డ్యాన్స్ చేస్తూ షోలో ఉన్నవారిని అలరిస్తున్నాడు. ఇంతలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. అప్పటికే పాట కోసం స్టేజీపై పెద్ద డోల్స్ ఏర్పాటు చేశారు. రణ్వీర్ పాటకు స్టెప్పులేస్తూ డోల్స్ వాయిస్తుండగా..ఓ డోల్ పై ఉన్న క్లాత్ చిరిగిపోయింది. దీంతో రణ్వీర్ ఒక్కసారిగా అందులో పడిపోయాడు. అప్పటివరకు పాటను ఎంజాయ్ చేస్తోన్న ప్రేక్షకులంతా అనుకోని ఘటన జరిగే సరికి షాక్ కు లోనయ్యారు. వెంటనే స్టేజీపై ఉన్న డ్యాన్సర్లు, సహాయకులు రణ్ వీర్ ను డోల్ లోపలి నుంచి బయటకు తీశారు. రణ్ వీర్ కు ఊపిరి పీల్చుకున్నంత పనైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రణ్వీర్ నువ్వు మంచి డ్యాన్సర్ అని ఒప్పుకుంటాము.. కానీ ఓవర్ స్మార్ట్ తగ్గించుకుంటే మంచిది.. అయ్యో! పాపం రణవీర్.. తొందరగా పైకి లేపండి.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
'కలాం పేరిట అవార్డులు ఇవ్వడం గొప్ప విషయం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఫిలాన్తరోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలామ్ అవార్డ్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అటువంటి వ్యక్తి పేరు మీద అవార్డులు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేన్లు కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదేనని మంత్రి వెల్లడించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నా సామాన్య జీవితం గడిపిన అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. కలాం ఆశయాలను జగన్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజికి న్యాయానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడే ఉన్నారని పేర్కొన్నారు. -
వైఎంహెచ్ఏ అభివృద్ధికి కృషి చేస్తా: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: వైఎంహెచ్ఏ హాలు అభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ఏలూరు వైఎంహెచ్ఏ హాలులో గురువారం కేవీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు బహుకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవీఎస్ లాంటి వ్యక్తి ఏలూరులో ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. దేశ విదేశాల్లో కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పేరు ప్రఖ్యాతలను సంపాందించిన కేవీఎస్‌ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ఉష గ్రూప్ సంస్థల ఛైర్మన్ డాక్టర్ వివి బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
టీయస్సార్ మీద బయోపిక్ తీయాలి
2010 నుంచి కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి టీవీ 9తో కలసి ‘టీయస్సార్ – టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ పేరుతో అవార్డ్ ఫంక్షన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2017–2018 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను వచ్చే నెల 17న విశాఖపట్టణంలో నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా టీయస్సార్ వ్యవహరించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, కేయస్ రామారావు, నరేశ్, రఘురామ కృష్ణంరాజు, కామినేని శోభనా, జీవిత, నగ్మా, మీనా, జ్యూరీ సభ్యులు. అవార్డు వేడుక వివరాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ – ‘‘సినిమా పవర్ఫుల్ మీడియమ్. కోట్లాది మందిని ఆనందింపజేస్తుంది. కళాకారులని జనం అభిమానిస్తారు, ఆరాధిస్తారు. అలాగే మా అవార్డ్స్ ఫంక్షన్లో నిర్ణయం కూడా ప్రజలదే. వాళ్ల ఓటింగ్‌ని పరిగణించి జ్యూరీ సభ్యులు విజేతలను ప్రకటిస్తారు. కళాకారులు ఆనందం పొందితే నాకు కొత్త శక్తి వస్తుంది. విద్యాబాలన్‌కు శ్రీదేవి మెమోరియల్ అవార్డ్ అందిస్తాం’’ అన్నారు. ‘‘బ్రతికున్నంత కాలం అవార్డులు గెలవడానికి ప్రయత్నిస్తాం’ అని అక్కినేని నాగేశ్వరరావుగారు ఓసారి నాతో అన్నారు. కళాకారుల ఆకలి అలాంటిది. ఆ కళాకారుల ఆకలి తీరుస్తున్నారు సుబ్బరామిరెడ్డిగారు. శివుణ్ణి నటరాజు అంటాం. ఆయన్ను ఆరాధిస్తూ, ఆయన ఆజ్ఞాపించిందే చేస్తున్నారు టీయస్సార్‌గారు. ఈయన జీవితం ఆధారంగా బయోపిక్ తీయాలి’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘టీయస్సార్‌గారు నాకు 25 ఏళ్లుగా తెలుసు. ఆయన నిర్మించిన ‘గ్యాంగ్మాష్టార్’ సినిమాలో యాక్ట్ చేశాను. మళ్లీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నగ్మా. ‘‘చలికి దుప్పట్లు, కళాకారులకు చప్పట్లు ముఖ్యం’’ అన్నారు నరేశ్. ‘‘నాన్నగారి అడుగు జాడల్లోనే నడుస్తున్నాను. కళాకారులను అభినందించడానికి ఎంతో శ్రమపడతారు నాన్న. నాన్నగారి ఆటోబయోగ్రఫీ రాయిస్తున్నాం. ‘టీచింగ్స్ ఆఫ్ టీయస్సార్’ పేరుతో ఆ బుక్ ఈ ఏడాది తీసుకొస్తాం’’ అన్నారు పింకీ రెడ్డి. ‘‘గవర్నమెంట్లు నంది అవార్డ్స్ ఫంక్షనే వరుసగా చేయలేకపోతున్న తరుణంలో టీయస్సార్ వరుసగా ఈ అవార్డ్ పంక్షన్స్ చేయడం అభినందనీయం’’ అన్నారు నిర్మాత కేయస్ రామారావు. ‘‘హైదరాబాద్ వచ్చి చాలా రోజులైంది. సంతోషంగా ఉంది. మమ్మల్ని జ్యూరీ సభ్యులుగా నియమించినందుకు మా బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాం’’ అన్నారు మీనా. ఈ కార్యక్రమంలో కామినేని శోభన పాల్గొన్నారు. -
భారతీయ కట్టు.. భలే ఆకట్టు
హాలీవుడ్లో అవార్డ్స్ సీజన్ మొదలైంది. ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టేది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ప్రతి ఏడాది జనవరిలో ఈ వేడుక జరుగుతుంది. 76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ సోమవారం ఉదయం (భారతకాలమాన ప్రకారం) జరిగింది. ఎన్నో విశేషాలతో పాటు పలు ఆశ్చర్యాలు కూడా ఈ వేడుకలో చోటు చేసుకున్నాయి. అన్ని అవార్డ్స్ చేజిక్కించుకుంటాయనుకున్న సినిమాలు ఉత్త చేతులతో వెళ్లడం, అంచనాలు లేకుండా వచ్చినవి ఉత్తమ చిత్రాలుగా మిగలడం, నటుడిగా క్రిస్టిన్ బేల్ తొలి అవార్డు దక్కించుకోవడం, ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంటుందనుకున్న ‘స్టార్ ఈజ్ బోర్న్’ చిత్రం కేవలం ఒక్క అవార్డ్‌తో సరిపెట్టుకోవడం, అంచనాలు లేని ‘గ్రీన్ బుక్’ సినిమా అనూహ్యంగా ఎక్కువ అవార్డ్స్ సంపాదించడం, సూపర్ హీరో (బ్లాక్ పాంథర్) సినిమా గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అవ్వడం ఇదే తొలిసారి. పొడుగు గౌన్లతో రెడ్ కార్పెట్ మీద వయ్యారంగా కొందరు తారలు వాక్ చేస్తే, ఎర్ర తివాచీపై చీరగాలి కూడా తగలడం మరో విశేషం. ఆస్కార్‌కు ముందుగా జరిగే ఈ అవార్డ్ ఫంక్షన్ కేవలం సినిమాలకే కాదు టెలివిజన్‌కు కూడా అవార్డ్స్ అందిస్తుంది. మొత్తం 25 విభాగాల్లో అవార్డ్స్ అందించే ఈ షోలో 14 విభాగాలు సినిమాకు, 11 విభాగాలు టెలివిజన్‌కు అందిస్తారు.. ‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్’ అనే ట్యాగ్ ఆస్కార్ అవార్డ్ ఓటింగ్‌లో ఎంతో కొంత ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. మొదటి గ్లోబ్ అవార్డ్ పాత్రలా మారడానికి శరీరాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకుంటుంటారు నటుడు క్రిస్టిన్ బేల్. ఇప్పటికే మూడుసార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో నామినేషన్ సంపాదించినప్పటికీ నిరాశతోనే వెనుదిరిగారు. కానీ ‘వైస్’లో చేసిన అమెరికన్ వైజ్ ప్రెసిడెంట్ ఆడమ్ మెక్కే పాత్రకు ఆయన తొలి గ్లోబ్ అవార్డుని అందుకున్నారు. ఈ పాత్ర కోసం సుమారు నలభై పౌండ్ల (20 కిలోల) బరువు పెరగడంతోపాటు కనుబొమలను బ్లీచ్ చేయించుకున్నారు. 2011లో సహాయ నటుడి (ది ఫైటర్)గా ఈ అవార్డ్ అందుకున్నప్పటికీ బెస్ట్ యాక్టర్‌గా తొలి అవార్డ్ ఇది. కార్పెట్‌పై చీరగాలి రెడ్ కార్పెట్‌పై ఎక్కువగా పొడుగు గౌన్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ తొలిసారి ఈ కార్పెట్‌కు చీరగాలిని తగిలించారు బాలీవుడ్ భామ మనస్వీ మంగై. ఈ అవార్డ్స్ ఫంక్షన్స్‌కు ప్రియాంకా చోప్రా హైలైట్‌గా నిలుస్తారని ఊహించారంతా కానీ ఆమె హాజరు కాలేదు. అప్పటివరకూ వస్తున్న గౌన్ల ట్రెండ్‌ని పక్కన పెట్టి, మనస్వీ మంగై చీరలో ప్రత్యక్షం కావడం వీక్షకులను ఆశ్చర్యపరిచింది. ‘టాక్ ఆఫ్ ది ఈవినింగ్’ అయ్యారామె. ‘‘హాలీవుడ్‌కు ఇది ఫస్ట్ అవార్డ్ సీజన్, అలాగే నాకు కూడా. అందుకే ఈ ఫంక్షన్‌కు కొత్తగా మన భారతీయ స్టైల్లో డ్రెస్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే చీర కట్టుకుని హాజరయ్యాను. ఇక్కడి ప్రెస్, హాలీవుడ్ నటీనటులు చాలా మంది నేనెవర్ని, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? అని కనుక్కున్నారు’’ అంటూ తన ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ ఆనందాన్ని పంచుకున్నారు మనస్వి. అవార్డ్స్ లిస్ట్ : బెస్ట్ డైరెక్టర్: అల్ఫోన్సో కువారన్ (రోమా) ఉత్తమ చిత్రం: గ్రీన్ బుక్ ఉత్తమ నటుడు (డ్రామా): రామి మలెక్ (బోమియన్ రాప్సొడీ) ఉత్తమ నటుడు (కామెడీ, మ్యూజికల్): క్రిస్టిన్ బేల్ (వైస్) విదేశీ చిత్రం: రోమా ఒరిజినల్ సాంగ్: షాలో (స్టార్ ఈజ్ బోర్న్) ఒరిజినల్ స్కోర్: జస్టిన్ హర్విట్జ్ (ఫస్ట్ మ్యాన్) యానిమేషన్ మూవీ: స్పైడర్ మేన్–ఇన్ టు ది స్పైడర్ వెర్స్ స్క్రీన్ ప్లే: నిక్ వెల్లెలోంగ, బ్రియన్ క్యూరీ, పీటర్ ఫరేల్లీ (గ్రీన్‌బుక్) సహాయ నటుడు: మహేర్షలా అలీ (గ్రీన్ బుక్) సహాయ నటి: రెగీనా కింగ్ (ఈఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్) మనస్వీ మంగై, దీపికా పదుకోన్ -
అట్టహాసంగా సోషల్ మీడియా అవార్డ్స్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్–2018 కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలు శుక్రవారం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర న్యాయ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మెన్ గద్దె అనూరాధ, పర్యాటక శాఖ సీఈఓ హిమాన్షు శుక్లాలు పాల్గొన్నారు. మంత్రముగ్ధులను చేసిన ‘మిత్ర’ ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ‘మిత్ర’ రోబోను ఆవిష్కరించారు. ఈ రోబోను 2017 హైదరాబాద్‌లో జరిగిన జీఈఎస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌లు తొలిసారిగా ఆవిష్కరించారు. ఐదడుగులున్న ఈ రోబో తన మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పర్యాటక శాక సీఈఓ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సోషల్ మీడియా రంగంలో అవార్డులను ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తోందన్నారు. సోషల్ మీడియా ద్వారా పర్యటక రంగ అభివృద్ధికి కృషిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వీవీఎస్ లక్ష్మణ్‌తో సెల్ఫీలు దిగడానికి యువత ఎగబడ్డారు.తరలిరానున్న సినీ తారలు.. శనివారం సోషల్ మీడియా రెండో రోజు కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటున్న సినీ ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటీ కరీనా కపూర్, టాలీవుడ్ నటీ సమంతా అక్కినేని, ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌లకు అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో రాణిస్తున్న మరో 40 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. -
శోభన్‌బాబు చిరస్థాయిగా ఉంటారు
‘‘ఎన్టీ రామారావుగారు ముందుగా పరిచయమైనా హీరోగా మా ఫస్ట్ సినిమా శోభన్బాబుగారికే రాశాం. ఆ తర్వాత ఆయనతో 13 సినిమాలకు కలసి పనిచేశాం. శోభన్‌బాబుగారు సినిమాలు మానేసే దశలో మా డైరెక్షన్లో ‘సర్పయాగం’తో పాటు ‘దోషి–నిర్దోషి’ అనే చిత్రం రాశాం. రెండూ మంచి హిట్టయ్యాయి. అప్పుడు శోభన్‌బాబుగారు ఫోన్ చేసి.. ‘నేను గౌరవంగా రిటైర్ అయ్యేలా హిట్లు ఇచ్చారు.. ఫ్రీగా ఓ సినిమా చేసుకోమన్నారు. కానీ మేము చేయలేదు. మేము సినిమా చేసినా, చేయకున్నా మా మనసుల్లోనే కాదు అందరి మనసుల్లోనూ ఆయన చిరస్థాయిగా బతికే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు కూడా’’ అని రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. దివంగత శోభన్‌బాబు పేరిట ‘అఖిల భారత శోభన్ బాబు సేవాసమితి’ ఆధ్వర్యంలో డిసెంబర్ 23న ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయనున్నారు. 2017కి గానూ నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల కార్యక్రమం పోస్టర్ని రచయితలు పరుచూరి బ్రదర్స్ రిలీజ్ చేయగా, దర్శకుడు మారుతి టీజర్‌ను ఆవిష్కరించారు. ఓ సందర్భంలో ‘నేను మీకు పెద్దన్నయ్యను’ అన్నారు శోభన్‌బాబుగారు. అంత ప్రేమాభిమానాలు మాపై వర్షింపజేసిన ఆయన కోసం వారి అభిమానులతో కలసి ఎన్ని సంవత్సరాలైనా ఈ పరుచూరి బ్రదర్స్ అడుగేస్తారు’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. అఖిల భారత శోభన్‌బాబు సేవాసమితి సభ్యులు వీరప్రసాద్, నిర్మాత ఎమ్.నరసింహారావు, శోభన్‌బాబు అభిమానులు సుధాకర్ బాబు (మాజీ ఎమ్మెల్యే) జె.రామాంజనేయులు, జేష్ట రమేశ్ బాబు (మాజీ ఎమ్మెల్యే), సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
న్యూస్ రీడర్లకు భాషతో పాటు సమయస్ఫూర్తి ముఖ్యం
వివేక్‌నగర్ : టీవీలో వార్తలు చదివేవారికి స్పష్టమైన ఉచ్ఛారణతోపాటు భాష మీద పట్టు, సమయస్ఫూర్తి ముఖ్యమని వక్తలు అన్నారు. లలిత కళా స్రవంతి ఈవీ రాజయ్య అండ్ సన్స్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో టీవీ న్యూస్ రీడర్లు, యాంకర్లకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి డి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల మానసిక ప్రశాంతతతోపాటు స్నేహ సంబంధాలు బలపడతాయన్నారు. అవార్డులు ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని అవి మరింత ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. సాక్షి టీవీ న్యూస్ రీడర్ అనుశ్రీతోపాటు పలువురిని సత్కరించారు. సభలో జి.అన్నప దీక్షితులు, జి.సుజయ బాల, ఇ.విశ్వేశ్వరరావు, ఇ.శైలజ, ఎ.మహేష్‌బాబు, యం.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ఎన్.రమాదేవి విష్య బృందం భరత నాట్య ప్రదర్శన ఇచ్చింది.వరంగల్ కు చెందిన యు.లక్ష్మణాచారి శిష్య బృందం అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. -
కన్నుల పండువగా ఇండియా అవార్డ్స్
సాక్షి, హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్, భారతీ సిమెంట్స్ సౌజన్యంతో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా అవార్డ్స్–2018 కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. శుక్రవారం సాయంత్రం కొండాపూర్‌లోని సైబర్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలకు సంబంధించిన అడ్వరై్టజింగ్ ఏజెన్సీలు సృజనాత్మకంగా రూపొందించిన వాణిజ్య ప్రకటనలకు అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 23 విభాగాల్లో ఇండియా అవార్డ్స్‌ను ఇచ్చారు. తొలిసారిగా ఏపీ, తెలంగాణకు చెందిన పలు సంస్థల వాణిజ్య ప్రకటనలకు రీజినల్ ఇండియా అవార్డ్స్ ప్రదానం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ఇండియా అవార్డ్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషమన్నారు. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సాంకేతికతకు నగరంలో ఉజ్వల భవిష్యత్ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తోందన్నారు. మీడియా తప్పుడు వార్తల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అత్యున్నత ప్రమాణాలతో వాణిజ్య ప్రకటనల రంగం పురోగమించాలని ఆకాంక్షించారు. ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ నారాయణ్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక అవార్డులను తేటతెలుగు భాషలో వాణిజ్య ప్రకటనలు జారీ చేసిన సంస్థలకు అందజేయడం శుభపరిణామమన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వరై్టజింగ్ రంగాన్ని మరింత ప్రోత్సహించినట్లయిందని అభిప్రాయపడ్డారు. రీజినల్ ఇండియా అవార్డ్స్ విభాగం ప్రతినిధి శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’మీడియా, భారతీ సిమెంట్స్ అందించిన ప్రోత్సాహం ఎనలేనిదని కొనియాడారు. ఇండియా అవార్డ్స్ జ్యూరీ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. ఇండియా అవార్డ్స్–2018కి మొత్తం 23 విభాగాలలో వివిధ సంస్థలకు చెందిన 332 ఎంట్రీలు (వాణిజ్య ప్రకటనలు) టీవీ, వార్తాపత్రికలు, డిజిటల్ మీడియాకు సంబంధించినవి ఉన్నాయన్నారు. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సృజనాత్మకత, సమాచారం, వినియోగదారులను ప్రభావితం చేయడంతోపాటు ఆలోచింపజేసేలా ఉన్నవి, ఉత్తమ సందేశం ఇచ్చిన వాణిజ్య ప్రకటనలను అవార్డులకు ఎంపికచేసినట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆయా కంపెనీలకు యాడ్స్ సిద్ధం చేసిన యాడ్ ఏజెన్సీలతోపాటు కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా అందుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగరంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, అమెరికాలోని న్యూయార్క్ మహానగరంతో దాదాపు సమానంగా నగర పోలీసు వ్యవస్థ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని భద్రత కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి, ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ వైఈపీరెడ్డి, భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సవాళ్ల మధ్య పురోగమనం: శ్యాం బర్సారా దేశంలో వాణిజ్య ప్రకటనల రంగం(అడ్వర్టైజ్మెంట్) తీవ్ర పోటీ, సవాళ్ల మధ్య పురోగమిస్తోందని మాడిసన్ వరల్డ్ చైర్మన్ శ్యాం బర్సారా చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా, చానల్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాణిజ్య ప్రకటనల విషయంలో ప్రయోగాలతో అద్భుతాలు సృష్టించాలని కోరారు. దేశంలో 1972లో కేవలం రూ.100 కోట్ల మేర ఉన్న వాణిజ్య ప్రకటనల వ్యాపారం ఇప్పుడు సుమారు రూ.60 వేల కోట్లకు చేరిందన్నారు. వినియోగదారులను ప్రభావితం చేయడంతోపాటు ఆలోచింపజేసేలా వాణిజ్య ప్రకటనలు ఉండాలని సూచించారు. ఈ రంగంలో అనుసరించాల్సిన మెళకువలను ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇండియా అవార్డ్స్–2018కి ఎంపికైన సంస్థలు.. వాటి యాడ్స్ వివరాలివీ.. ఆటో ఫోర్ వీలర్స్ టాటా మోటార్స్ న్యూ ఏస్ ఎక్స్ఎల్ ఆటో టూ వీలర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆటో అదర్స్ అపోలో టైర్స్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఐసీఐసీఐ బ్యాంక్ స్మార్ట్కీస్ ఫుడ్ అండ్ బేవరేజెస్ డాబర్ హనీ స్టే ఫిట్.. ఫీల్ యంగ్ హోమ్‌కేర్ లైజాల్ మాన్సూన్ న్యూప్యాక్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా సోనిమ్యాక్స్ సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ మూవీ పర్సనల్ కేర్ కోల్గేట్ స్వర్ణ వేద్ శక్తి టూత్‌పేస్ట్ రిటైల్ లలిత జ్యూవెలరీస్.. లలిత చెక్ అండ్ బయ్ టెలికం అండ్ టెక్నాలజీ ఎయిర్టెల్– మై ప్లాన్ ఫ్యామిలీ ఫార్మా హైజిన్ అండ్ వెల్నెస్ మూవ్–సింధు డైరెక్టర్ హోమ్ డెకార్ ఫెవిక్విక్ జెల్–హెడ్‌స్టాండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కపిల్ చిట్ ఫండ్స్ యాడ్ ఫిల్మ్ బిల్డింగ్ మెటీరియల్ భారతీ సిమెంట్ ఫుల్ గ్యారంటీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మింట్ ఈ మొబైల్స్లాంచ్ ఆఫ్ మింట్ ఈ ఓపెన్బాక్స్ మొబైల్స్ రియల్ ఎస్టేట్ అపర్ణ గేటెడ్ కమ్యూనిటీస్–ది పేపర్ ప్లేన్ సర్వీసెస్ గటి–అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫ్రీడం రీఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ గవర్నమెంట్ ఏపీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్–సన్రైస్ ఏపీ ఇన్వెస్ట్మెంట్స్ రిటైల్ సెంట్రో–దసరా క్యాంపెయిన్ ట్రావెల్ అండ్ టూరిజం తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ జెండర్ సెన్సిటివ్ అడ్వరై్టజింగ్ ఫ్యూర్ అండ్ ష్యూర్–కన్యాకుమారి టు లడక్ ఇన్ 100 హవర్స్ కార్పొరేట్ జన్రైస్ అడ్వరై్టజింగ్–హ్యాపీ మదర్స్‌డే -
త్వరలో ఫేక్ న్యూస్ అవార్డ్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడి ప్రధాన మీడియాకు ‘ఫేక్ న్యూస్ అవార్డులు’ ప్రకటించే తేదీని జనవరి 17కు వాయిదా వేశారు. ‘మోసపూరిత, చెడు వార్తలు’ రాస్తున్నందుకు అక్కడి మీడియాకు అవార్డులు ఇస్తానని ట్రంప్ చాన్నాళ్లుగా అంటున్నారు. అమెరికాలోని సీఎన్ఎన్, ఏబీసీ న్యూస్, ది న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి ప్రధాన మీడియా, ట్రంప్ మధ్య కొంతకాలంగా పోరు సాగుతోంది. ఈ సంస్థలను ‘ఫేక్ మీడియా’గా ట్రంప్ అభివర్ణిస్తుంటారు. ‘అవినీతి, పక్షపాత ప్రధాన మీడియాకు అవార్డులను 17న ప్రకటిస్తాం’ అని ట్వీటర్లో చెప్పారు. -
స్టార్ హోటల్లో అదరహో అనిపించిన ఫ్యాషన్ షో
-
దుబాయ్ వెళ్లనున్న కండలవీరుడు!
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ దుబాయ్ వెళ్లనున్నాడు. వచ్చే నెల 18న దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలో జరగనున్న టైమ్స్ ఆఫ్ ఇండియా సినిమా అవార్డుల (టీఓఐఎఫ్ఎ) వేడుకకు ఆయన హాజరవనున్నాడు. ఈ వేడుకలో సల్మాన్ తన డ్యాన్సులతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ అవార్డుల వేడుకలో సల్మాన్ తన ‘భజరంగి భాయిజాన్’ చిత్రంతో ఉత్తమ నటుడి రేసులో ఉన్నాడు. టీఓఐఎఫ్ఎ నిర్వహిస్తున్న ఈ అవార్డుల ప్రధానోత్సవం రెండో ఎడిషన్ ఇది. మొదటి ఎడిషన్ 2013లో కొలంబియా వేదికగా జరిగింది. ఈ సారి జరగనున్న కార్యక్రమంలో బాలీవుడ్ తారలు వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, పాప్ స్టార్ హనీ సింగ్ త దితర ప్రముఖులు పాల్గొననున్నారు. -
ఆ తర్వాతే ‘విజయ నిర్మల’ అయ్యా : విజయనిర్మల
‘‘మరో వందేళ్లయినా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేనివి విజయా వారి చిత్రాలు. మా ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం ప్రారంభోత్సవానికి ఆ స్టూడియోలో అమ్మోరు విగ్రహం సెట్ వేయించాను. నాగిరెడ్డిగారిని కెమెరా స్విచ్చాన్ చే సి, చక్రపాణిగారిని క్లాప్ ఇవ్వమని అడిగాను. కానీ చక్రపాణిగారు మాత్రం నాగిరెడ్డి హస్తవాసి మంచిది. ఆయననే క్లాప్ ఇవ్వమన్నారు. అలాగే చేశారు. అప్పుడు నాగిరెడ్డిగారు ‘‘ ‘పాతాళభైరవి’ సినిమాలోని పెద్ద విగ్రహం సెట్ కూడా ఇక్కడే వేశాం. ఆ చిత్రంలానే ‘అల్లూరి సీతారామరాజు’ కూడా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి’’ అని హీరో కృష్ణ చెప్పారు. ప్రముఖ నిర్మాత బి. నాగిరెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏటా అందించే శ్రీ బి.నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని 2014 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రానికి ప్రకటించారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ‘రేసు గుర్రం’ చిత్ర నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, డా. వెంకటేశ్వరరావులకు సూపర్ స్టార్ కృష్ణ అవార్డు ప్రదానం చేశారు. సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల మాట్లాడుతూ- ‘‘విజయా వారి చిత్రాల్లో నటించాక విజయనిర్మల అయ్యాను. ‘షావుకారు జానకి’ చిత్రాన్ని నాగిరెడ్డిగారు తమిళంలో రీమేక్ చేశారు. అందులో జానకిగారు చేసిన పాత్రను నేనే చేశాను. ఈ సినిమాలో నేను ఎస్వీ రంగారావు పక్కన నటించాలి. కానీ, నేను చాలా పీలగా ఉన్నాననీ, ఆయనకు సరిజోడీగా ఉండనని ఎస్వీఆర్ వేరే అమ్మాయిని తీసుకోమన్నారు. కానీ నాగిరెడ్డిగారు ఎస్వీఆర్గారిని తీసేసి ఆయన పాత్రలో సుబ్బారావుగారిని ఎంపిక చేశారు. ఆయన పట్టుదలకు నిదర్శనం ఇది’’ అని చెప్పారు. నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదును విజయా సర్వీసెస్ విభాగానికి అందజేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘నాగిరెడ్డిగారు మంచి చిత్రాలు తీసి ఉండకపోతే తెలుగు సినిమాకు అంత మంచి చరిత్ర ఉండేదే కాదు. ఈ అవార్డు నాకు ఒక బూస్ట్‌లా ఉపయోగపడుతుంది’’ అని చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పారు. ఈ అవార్డు కమిటీ జ్యూరీ సభ్యుల్లో ఒకరైన నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ- ‘‘ఓ నిర్మాతకు సత్కారం చేయడం నిజంగా దేశంలో ఏ సంస్థ చేయలేదు. కానీ విజయా సంస్థ వారు చేయడం, అందులో నాకూ భాగస్వామ్యం కల్పించడం నిజంగా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ సమావేశానికి ముందు విజయా వారి చిత్రాల్లోని అలనాటి పాటలతో జరిగిన సంగీత విభావరి ఆహూతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని రావు బాలసరస్వతి, సింగీతం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.