
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడి ప్రధాన మీడియాకు ‘ఫేక్ న్యూస్ అవార్డులు’ ప్రకటించే తేదీని జనవరి 17కు వాయిదా వేశారు. ‘మోసపూరిత, చెడు వార్తలు’ రాస్తున్నందుకు అక్కడి మీడియాకు అవార్డులు ఇస్తానని ట్రంప్ చాన్నాళ్లుగా అంటున్నారు. అమెరికాలోని సీఎన్‌ఎన్, ఏబీసీ న్యూస్, ది న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి ప్రధాన మీడియా, ట్రంప్ మధ్య కొంతకాలంగా పోరు సాగుతోంది. ఈ సంస్థలను ‘ఫేక్ మీడియా’గా ట్రంప్ అభివర్ణిస్తుంటారు. ‘అవినీతి, పక్షపాత ప్రధాన మీడియాకు అవార్డులను 17న ప్రకటిస్తాం’ అని ట్వీటర్‌లో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment