నకిలీ వార్తల వడపోత సాధనాన్ని వాడను | President Trump beat Clinton. Now he's running against the media. | Sakshi
Sakshi News home page

నకిలీ వార్తల వడపోత సాధనాన్ని వాడను

Published Mon, Feb 20 2017 12:54 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

నకిలీ వార్తల వడపోత సాధనాన్ని వాడను - Sakshi

నకిలీ వార్తల వడపోత సాధనాన్ని వాడను

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియాపై మరోసారి నిప్పులు చెరిగారు. ‘నకిలీ వార్తలు’అనే వడపోత సాధనం(ట్రంప్‌ ఉద్దేశంలో మీడియా)ను వాడకుండానే తాను తన మద్దతుదారులకు సందేశమివ్వాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఫ్లోరిడాలోని మెల్‌బోర్న్‌లో శనివారం ట్రంప్‌ ఓ ర్యాలీలో పాల్గొన్నారు.

అక్కడ మాట్లాడుతూ తన ప్రభుత్వం ఇప్పటిదాకా చేపట్టిన కార్యక్రమాలను సమర్థించారు. అమెరికాలో ఆశావాదం నెలకొంటోందని ఆయన అన్నారు. మీడియాను అబద్ధాలు చెప్పనివ్వనని ఆయన వాగ్దానం చేశారు. ‘మీడియాకు సొంత ఎజెండా ఉంది. వాళ్ల ఎజెండా మన ఎజెండా కాదు’అని ట్రంప్‌ తన మద్దతుదారులతో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement