
వాషింగ్టన్: ఉత్తర కొరియా అణ్వాయుధాలను రహస్యంగా దాచడానికి మార్గాలను పరిశీలిస్తోందని, అణ్వాయుధాల ఉత్పత్తి రహస్యంగా సాగేలా ఏర్పాట్లు చేస్తోందని మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తమ దేశం లో అణ్వాయుధాలను ధ్వంసం చేస్తామని సింగపూర్ సదస్సులో ట్రంప్‌కు ఉ.కొరియా అధినేత కిమ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే యాంగ్‌బ్యాన్ అణు కేంద్రాన్ని ఆధునీకరిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉ.కొరియా అణ్వాయుధ సామగ్రిని సమకూర్చుకుంటోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అమెరికా సమాచారం సేకరించినట్టు మీడియా వెల్లడించింది. అలాగే దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌కు 60 మైళ్ల దూరంలో కాంగ్సాన్‌లో భూగర్భంలో యురేనియం నిల్వలు దాచినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment