secret area
-
మళ్లీ రహస్య ప్రాంతానికి ఆనందయ్య
సాక్షి, నెల్లూరు: వారం రోజుల తర్వాత నిన్న కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్న ఆనందయ్య.. మళ్లీ రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిన ఆనందయ్య.. కాసేపట్లో వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లారు. ఆనందయ్యను పోలీసులే తీసుకెళ్లినట్లు సమాచారం. కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు భద్రత కల్పించినట్లు తెలిసింది. ఆనందయ్య మందుపై నేడు తుది నివేదిక నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందన్నారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేస్తోందన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద రాములు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం సంస్థ అధ్యయన నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు. చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! -
ఉ. కొరియాలో రహస్య అణు ఉత్పత్తి?
వాషింగ్టన్: ఉత్తర కొరియా అణ్వాయుధాలను రహస్యంగా దాచడానికి మార్గాలను పరిశీలిస్తోందని, అణ్వాయుధాల ఉత్పత్తి రహస్యంగా సాగేలా ఏర్పాట్లు చేస్తోందని మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. తమ దేశం లో అణ్వాయుధాలను ధ్వంసం చేస్తామని సింగపూర్ సదస్సులో ట్రంప్‌కు ఉ.కొరియా అధినేత కిమ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే యాంగ్‌బ్యాన్ అణు కేంద్రాన్ని ఆధునీకరిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉ.కొరియా అణ్వాయుధ సామగ్రిని సమకూర్చుకుంటోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అమెరికా సమాచారం సేకరించినట్టు మీడియా వెల్లడించింది. అలాగే దేశ రాజధాని ప్యాంగ్యాంగ్కు 60 మైళ్ల దూరంలో కాంగ్సాన్లో భూగర్భంలో యురేనియం నిల్వలు దాచినట్టు సమాచారం. -
రహస్య ప్రాంతంలో టీటీడీపీ ఎమ్మెల్యేలు?
-
రహస్య ప్రాంతంలో టీటీడీపీ ఎమ్మెల్యేలు?
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. కూకట్పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం గులాబీ కండువా కప్పుకోవడంతో తమ ఎమ్మెల్యేలని కాపాడుకొనే ప్రయత్నాలను టీడీపీ ముమ్మరం చేసింది. మాధవరం బాటలోనే మరికొందరు పార్టీని చేజారకుండా చూసుకునేందుకు ఎమ్మెల్యేలను టీటీడీపీ నాయకత్వం రహస్య ప్రాంతంలో ఉంచింది. ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం జరుగనుండటంతో రహస్య ప్రాంతంలో ఉంచిన టీడీపీ ఎమ్మెల్యేలను నేరుగా అసెంబ్లీకి తీసుకురానున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కృష్ణారావు టీడీపీని వీడటం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ఐదో అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలన్న కేసీఆర్ పట్టు కారణంగానే కృష్ణారావు చేరినట్లు తెలుస్తోంది. ఇంతకుముందే తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో క్రమంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీ తన పట్టును కోల్పోతున్నట్లు అవుతోంది. ఇదిలాఉండగా మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం మాధవరం బాటలోనే ఉన్నారని తెలుస్తోంది. టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేయించే వ్యూహంలో భాగంగా.. ఆత్మప్రబోధంతో ఓటేయాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక ఎమ్మెల్యే చేరిపోవడం, మరో ఇద్దరు చేరికకు సిద్ధంగా ఉండటం తమకు ఓటింగ్‌లో కలిసొచ్చే అంశమని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.