సాక్షి, నెల్లూరు: వారం రోజుల తర్వాత నిన్న కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్న ఆనందయ్య.. మళ్లీ రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిన ఆనందయ్య.. కాసేపట్లో వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లారు. ఆనందయ్యను పోలీసులే తీసుకెళ్లినట్లు సమాచారం. కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు భద్రత కల్పించినట్లు తెలిసింది.
ఆనందయ్య మందుపై నేడు తుది నివేదిక
నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందన్నారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేస్తోందన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద రాములు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం సంస్థ అధ్యయన నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు.
చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం
ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ!
Comments
Please login to add a commentAdd a comment