anandaiah
-
ఆనందయ్య వ్యాజ్యం ధర్మాసనానికి
సాక్షి, అమరావతి: కరోనా చికిత్సలో భాగంగా తాను తయారు చేసిన ఔషధాన్ని తీసుకునేందుకు తన ఇంటికి వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని, తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య దాఖలు చేసిన వ్యాజ్యం ధర్మాసనానికి బదిలీ అయింది. ఆనందయ్య ఔషధం వ్యవహారంపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపైన కూడా ధర్మాసనమే విచారణ జరపడం మేలని సింగిల్ జడ్జి జస్టిస్ దొనడి రమేశ్ అభిప్రాయపడ్డారు. ఆనందయ్య వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతకుముందు ఆనందయ్య న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందామని, ఆ తరువాత పోలీసుల జోక్యం తగ్గిందని చెప్పారు. ఇప్పుడు కూడా పోలీసులు ఔషధం పంపిణీ విషయంలో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. ఔషధం కోసం వస్తున్న ప్రజలను అడ్డుకుంటున్నారని వివరించారు. ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ తోసిపుచ్చారు. ఔషధం కోసం వచ్చే వారి వల్ల గ్రామంలో కోవిడ్ వ్యాప్తి చెందుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఆనందయ్య మందు పంపిణీ చేయవద్దంటూ గ్రామస్తులందరూ తీర్మానం చేశారని తెలిపారు. పోలీసులకు సైతం గ్రామ ప్రజల నుంచి వినతి వచ్చిందన్నారు. ఆనందయ్య రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదని చెప్పారు. ఆనందయ్య మందుపై గతంలో ధర్మాసనం విచారణ జరిపిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం ముందుంచేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు
సాక్షి, ముత్తుకూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ నివారణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద నిపుణుడు బొనిగి ఆనందయ్య ప్రత్యేకంగా మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. ఒమిక్రాన్ సోకకుండా ముందు జాగ్రత్తగా బూస్టర్ మందు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ సుమారు 22 రకాల దినుసులతో ఐదు రకాల మందులు తయారు చేసినట్టు చెప్పారు. ఒమిక్రాన్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందు కూడా తయారు చేశామని, ఒకే రోజు రెండు పూటలా తీసుకుంటే చాలన్నారు. ఈ మందుల తయారీకి కోర్టు అనుమతి కూడా ఉందని తెలిపారు. చదవండి: (ఒమిక్రాన్ అప్డేట్స్: 57 కొత్త కేసులు.. 415 కు చేరిన మొత్తం సంఖ్య) ఒమిక్రాన్ మందు తీసుకునే వారు 15 రోజుల పాటు మాంసాహారం, మద్యం తీసుకోకూడదన్నారు. ఒమిక్రాన్‌కు గురైన వారు మందు కోసం నేరుగా సంప్రదించొచ్చని, లేదా ఎవరినైనా పంపించవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ మందును బంధువులు, మిత్రుల ద్వారా ఒమిక్రాన్ ప్రభావం అధికంగా ఉన్న యూకే, యూఎస్ఏ తదితర దేశాలకు ఎక్కువగా పంపిస్తున్నట్టు తెలిపారు. ఈ మందును ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చని, త్వరలోనే బాటిల్స్ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆనందయ్య వివరించారు. మరోవైపు రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ను నివారించే ఆయుర్వేద మందు ఉచిత సరఫరా, అమ్మకానికి అనుమతి కోరుతూ ఆయుష్ శాఖను ఇంత వరకూ ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. -
ఐ డ్రాప్స్ అనుమతులకు దరఖాస్తు చేసుకోండి
సాక్షి, అమరావతి: ఐ డ్రాప్స్ తయారీ, పంపిణీకి అనుమతుల కోసం డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తదుపరి ఎలాంటి ఆదేశాలు, విచారణ అవసరం లేదని పేర్కొంటూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని, ఆనందయ్య మందు పంపిణీకి తక్షణమే అనుమతులు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. -
ఆనందయ్య మందుకు ‘ఆయుష్’ అంగీకారం
సాక్షి, అమరావతి: ఆనందయ్య తయారు చేసిన మందును కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు రాష్ట్ర ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఈ మందుకు పేరు ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఆక్సిజన్ స్థాయిలు పెరిగేందుకు కరోనా రోగుల కంట్లో వేసే ఐ డ్రాప్స్‌కు ఆమోదం తెలిపే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో కొంత పురోగతి ఉందని వివరించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బొనిగె ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
ఐ డ్రాప్స్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు
సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఐ డ్రాప్స్(కంటి చుక్కల మందు) ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ 15 ల్యాబ్‌లు నివేదిక ఇచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఐ డ్రాప్స్‌లో పీహెచ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వివరించారు. ఆ మందు వినియోగానికి అనుగుణంగా లేదన్నారు. దీనిపై ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందిస్తూ.. కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఇందుకు హైకోర్టు అనుమతినిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆనందయ్య గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, ఐ డ్రాప్స్ గురించి పలు ల్యాబ్‌లు ఇచ్చిన నివేదికను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆనందయ్య న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ, కరోనా వల్ల ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన వారికి ఈ కంటి చుక్కల మందు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ మందు విషయంలో ఆయుష్ శాఖ ఆనందయ్యతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. సీజే స్పందిస్తూ.. సంప్రదాయ మందులను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదన్నారు. వేటి విలువ వాటికి ఉంటుందని వ్యాఖ్యానించారు. తనకు రెండు రోజుల పాటు తలనొప్పి వల్ల కలిగిన ఇబ్బంది.. ఓ ప్రాంత సాంప్రదాయ మందు ద్వారా తొలగిందని చెప్పారు. అనంతరం కౌంటర్ దాఖలుకు అనుమతిస్తూ.. ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
Photo Feature: ఓ వైపు ఆనందయ్య మందు.. మరోవైపు వ్యాక్సిన్..
సాక్షి, నల్లగొండ: అటు ఆనందయ్య మందు కోసం (ఎడమ).. ఇటు వ్యాక్సిన్ కోసం (కుడి ఫొటో) ప్రజలు బారులుతీరిన చిత్రమిది. శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ వివేకానందనగర్‌లో కరోనా నివారణకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. మరోపక్క అదే జిల్లా పాన్‌గల్ అర్బన్ హెల్త్ సెంటర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ రెండుచోట్లకు జనం పోటెత్తారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ చదవండి: మరియమ్మ కుటుంబానికి రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలి -
ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ
-
ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ
అమరావతి: ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా బుధవారం ఆనందయ్య మందు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి సహకారంతో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: కోడలిని వేధించిన పాపం..! -
ఆనందయ్య ఐ డ్రాప్స్‌తో కళ్లకు హాని
సాక్షి, అమరావతి: ఆనందయ్య ఐ డ్రాప్స్ (కంటి మందు)లో హానికర పదార్థాలున్నట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. దీని వినియోగం వల్ల కళ్లకు హాని కలుగుతుందంటూ నివేదికలు వచ్చాయని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ పరీక్షలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. వివరాలు.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన బి.ఆనందయ్య కరోనా చికిత్సకు నాలుగు రకాల మందులు, ఐ డ్రాప్స్ తయారు చేశారు. ఈ మందుల వినియోగానికి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆనందయ్యతో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఐ డ్రాప్స్ మినహా మిగిలిన 4 రకాల మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పరీక్షల్లో తేలడంతో.. ప్రభుత్వం వాటి వినియోగానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఐ డ్రాప్స్‌పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రముఖ సంస్థల నివేదికల ఆధారంగానే.. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, ఐ డ్రాప్స్ శాంపిళ్లను ఐదు సంస్థలకు పంపించామని చెప్పారు. కంటి చికిత్స రంగంలో ఎంతో పేరున్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, శంకర నేత్రాలయ సంస్థలు నివేదికలిచ్చాయని తెలిపారు. ఆనందయ్య ఐ డ్రాప్స్‌లో హానికర పదార్థాలున్నట్లు ఆ నివేదికల్లో పేర్కొన్నాయని వెల్లడించారు. వాటి వినియోగం వల్ల కళ్లకు ప్రమాదం కలుగుతుందని చెప్పాయన్నారు. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ జోక్యం చేసుకుంటూ.. ఐ డ్రాప్స్ వల్ల దుష్ప్రభావాలు ఉండవని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ చెప్పిందన్నారు. ఈ మందు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని హామీ కూడా ఇస్తామన్నారు. ముందు ఐ డ్రాప్స్ విషయంలో ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. పరీక్ష ఫలితాల నివేదికలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది. -
ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి : ఆనందయ్య మందు పంపిణీపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ప్రధానంగా ఆనందయ్య పంపిణీ చేసే చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరగ్గా, చుక్కల మందులో కంటికి హాని కలిగించే పదార్థముందని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆనందయ్య పంపిణీ చేసే చుక్కల మందును 5 ల్యాబ్‌లలో పరీక్షించినట్లు తెలిపారు. కాగా, ల్యాబ్‌ల నివేదిక తమ మందు ఉంచాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను జులై 1కి వాయిదా వేసింది. -
టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ
తిరుమల: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు శనివారం కృష్ణపట్నం ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల చాలా మంది టీటీడీ ఉద్యోగులు మరణించినట్లు తెలిపారు. ఇక టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకుడు చీర్ల కిరణ్ మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులు ఆనందయ్య మందు కాలాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆనందయ్య మందును టీటీడీ ఉద్యోగులకు, రిటైర్డ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. టీటీడీ ఉద్యోగుల తరపున ఆనందయ్యకు చీర్ల కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: రైతుకు జరిమానా.. కట్టకపోతే బహిష్కరణ.. ఏం జరిగిందంటే? -
ఆనందయ్య మందు పేరుతో అమ్మకాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
తాడికొండ: ఆనందయ్య కరోనా మందు పేరుతో అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.1.50 లక్షలు, 150 ప్యాకెట్ల మందును స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ ఎస్ఐ బి.వెంకటాద్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో కరోనా మందు పేరిట అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం గ్రామంలో సోదాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన అన్నే కాంతారావు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకుని సోదా చేయగా అతని వద్ద ఉన్న సంచిలో కరోనా మందు పేరిట అమ్ముతున్న 150 ప్యాకెట్లు కనిపించాయి. విచారణలో గత 10 రోజులుగా గ్రామస్తులకు 750 ప్యాకెట్లను.. ఒక్కో ప్యాకెట్ రూ.200కు అమ్మినట్టు చెప్పాడు. అమ్మిన ప్యాకెట్ల తాలూకు రూ.1.50 లక్షలతో పాటు మిగతా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆ వార్తల్లో వాస్తవం లేదు: ఎమ్మెల్యే కాకాణి
సాక్షి, నెల్లూరు: ఆనందయ్యకు ప్రభుత్వ సహకారం ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందరికీ మందు పంపిణీకి సిద్ధమేనని ఆనందయ్య ప్రకటించారని.. సామాన్యులకు అందడం లేదని వచ్చే వార్తల్లో వాస్తవం లేదని కాకాణి అన్నారు. ఆనందయ్య ఎలాంటి సహకారం కోరుతున్నారో జిల్లా కలెక్టర్‌కి నివేదిస్తే కార్యాచరణ సిద్ధమవుతుందని ఆయన సూచించారు. గ్రామ సచివాలయాలతో పాలనలో కొత్త ఒరవడి మొదలైందని కాకాణి అన్నారు. మ్యానిఫెస్టోలో అన్ని అంశాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం జగన్ మ్యానిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేస్తున్నారన్నారు. టీడీపీ అనవసర రాద్ధాంతం తప్ప.. నిర్మాణాత్మక పాత్ర పోషించడంలేదని ఆయన దుయ్యబట్టారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైందన్నారు. చదవండి: సాంప్రదాయబద్ధంగా పీఠాధిపతి ఎంపిక: వెల్లంపల్లి చంద్రబాబు హయాంలో భారీగా భూకబ్జాలు: అవంతి -
ఆనందయ్య మందు: జగపతి బాబుపై బాబు గోగినేని సెటైర్లు
ఒకపక్క కరోనాకు విరుగుడుగా, సంజీవనిగా ఆనందయ్య మందును లక్షలమంది భావిస్తుంటే.. మరోవైపు హేతువాది బాబు గోగినేని మొదటి నుంచి మందు శాస్త్రీయతపై వెటకారం ప్రదర్శిస్తూ వస్తున్నాడు. అయితే ఆనందయ్య మందుకు టాలీవుడ్ నటుడు జగపతి బాబు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశాడు. ‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్ పెట్టారు బాబు గోగినేని. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ, జూబ్లిహిల్స్‌లో ఆస్పత్రి తెరవబోతున్నారంటూ ఓ లోకల్ ఇంగ్లీష్ వెబ్ సైట్లో వార్త వచ్చింది. ఆ వార్తను ఆధారంగా చేసుకుని ఇలా జగపతిబాబుపై సెటైర్లు వేశారు బాబు గోగినేని. మరి దీనిపై జగపతి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా అంటూ గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ ఈ సీనియర్ నటుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చదవండి: గుర్తుపెట్టుకోండి ఇది వార్నింగ్ మాత్రమే! Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS — Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021 -
ఐ డ్రాప్స్ శాంపిల్స్‌ను పరీక్షకు పంపండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన బొణిగె ఆనందయ్య తయారుచేసిన ఐ డ్రాప్స్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను క్రిమిరహిత (స్టెరిలిటీ) పరీక్షకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా.. గరిష్టంగా రెండు వారాల్లో ఆ పరీక్ష నివేదిక ఇచ్చేటట్లు చూడాలని స్పష్టం చేసింది. ఆనందయ్య తయారు చేసిన మందుల్లో ఒకటైన ‘కె’ రకం మందు.. వినియోగానికి యోగ్యమైనదేనని నిపుణుల కమిటీ తేల్చిన నేపథ్యంలో ఆ మందు పంపిణీ విషయంలో ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దంది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా చికిత్స నిమిత్తం తాను తయారు చేసిన మందు పంపిణీని అడ్డుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో మరో రెండు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై కొద్ది రోజులుగా హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతూ వస్తోంది. ధర్మాసనం ఆదేశాల మేరకు ఆనందయ్య మందు విషయంలో నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. కంటిలో వేసే ఐ డ్రాప్స్ మినహా మిగిలిన మందుల పంపిణీకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఐ డ్రాప్స్ విషయంలో నిపుణుల కమిటీ అభ్యంతరాలు తెలిపిందని, అందువల్ల తుది పరీక్షల అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామంది. -
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ముక్కోటి ఆలయం పక్కన గల నారాయణి గార్డెన్లో మందు పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా దాదాపు 10 వేల కుటుంబాలకు మందు అందిస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 1.6 లక్షల కుటుంబాలకు ఉచితంగా మందు పంపిణీ చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ మందు అందిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే చెవిరెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కరోనా సమయంలో ప్రజలకు మాసు్కలు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకుంటున్నారు. -
సర్వేపల్లిలో ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభం
వెంకటాచలం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభమైంది. వెంకటాచలం మండలం గొలగమూడిలో భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో సోమవారం ఈ మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 1.80 లక్షల కుటుంబాల్లో 3.50 లక్షల మందికి గ్రామ సచివాలయాల ద్వారా మందు పంపిణీ చేయిస్తామన్నారు. పదిమందికి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తనను బలహీనపరచాలని కుట్రలు చేయడం బాధాకరమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజకవర్గంలో మందు పంపిణీ ఆగదని స్పష్టం చేశారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లోనూ పంపిణీ చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ మందు ద్వారా సంపాదించాలనే ఆలోచన చేసి ఉంటే.. తన కుటుంబం సర్వనాశనం అవుతుందని భగవాన్ శ్రీవెంకయ్యస్వామి ఆశ్రమ సన్నిధిలో చెబుతున్నానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో మందు పంపిణీ చేసేందుకు తీవ్రంగా కృషిచేసిన ఆనందయ్య, ఆయన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మందు తయారీకి సంబంధించి కృష్ణపట్నంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు ఎమ్మెల్యే కాకాణి వెల్లడించారు. కార్యక్రమంలో భగవాన్ వెంకయ్యస్వామి ఆశ్రమ ఈవో పి.బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్‌రెడ్డి, ఆనందయ్య సోదరుడు రాజా, కుమారుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
వాలంటీర్ల ద్వార మందు పంపిణీ చేస్తామన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
ఏపీ: ఆనందయ్య K మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఆనందయ్య K మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆనందయ్య కె మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య కె మందును నిపుణుల బృందం పరిశీలించిందని.. కె మందును పంపిణీ చేయొచ్చని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 21కి కోర్టు వాయిదా వేసింది. కాగా, నెల్లూరు జిల్లా గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాణి తెలిపారు. చదవండి: ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు -
ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆనందయ్య విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కాకాణి సూచించారు. ‘‘ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవు. సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని చెప్పి.. ఆనందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోవిడ్ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్ మందు వాడాలి. కోవిడ్ నివారణ కోసం నీలం రంగు ప్యాకెట్ మందు వాడాలి. ప్రజలకు మేలుచేసే ఉద్దేశంతోనే ఆనందయ్యకు మద్దతు ఇచ్చాం. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్‌లోనూ అండగా నిలుస్తాం. ప్రతిఒక్క ఇంటికీ ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని’’ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. చదవండి: టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్’ జెండా! -
కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆదివారం కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. గతంలో తయారీ, పంపిణీ జరిగిన ఆనందయ్య భూముల్లోనే ఈ దఫా కూడా పంపిణీ చేపట్టారు. ఓ వైపు సీవీఆర్ కాంప్లెక్స్‌లో ఆనందయ్య మందు తయారు చేస్తుండగా, మరో వైపు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఆయన సోదరుడు దానిని పంపిణీ చేశారు. ఎప్పటిలానే జనం క్యూలో కిక్కిరిసి పోయారు. పోలీసులు 144 సెక్షన్ ఉందని ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ రద్దీని నియంత్రించారు. ఇదిలా ఉండగా కరోనా నివారణ మందు కోసం ఎవరూ కృష్ణపట్నం గ్రామానికి రావద్దని ఆయుర్వేద నిపుణుడు బొనిగి ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ద్వారా ఆయుర్వేద మందు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన జిల్లాల వారికి అందజేస్తామన్నారు. -
చంద్రగిరిలో ఆనందయ్య మందు తయారీ
చంద్రగిరి: కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపటా్ననికి చెందిన ఆనందయ్య మందును చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తయారు చేస్తున్నారు. ఈ సంప్రదాయ మందును చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని తలపెట్టిన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇందుకు చొరవ తీసుకున్నారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్, శిష్యుల సహకారం తీసుకున్నారు. ఈ మందు తయారీని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్ (పి) మందు మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 1.6 లక్షల కుటుంబాల్లో 5.20 లక్షలమంది ప్రజలకు ఈ మందును ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, మారేడు, బుడ్డ బుడవ ఆకులు, కొండపల్లేరు కాయలు, తెల్లజిల్లేడు పూలు తీసుకొచ్చారని తెలిపారు. మరో 11 రకాల ముడి సరుకులను సమకూర్చామన్నారు. రెండు రోజుల్లో నియోజకవర్గంలోని 142 పంచాయతీలు, దాదాపు 1,600 గ్రామాల్లో ఈ మందును పంపిణీ చేస్తామని చెప్పారు. ఆనందయ్య తనయుడు శ్రీధర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ఉపయుక్తమైన సంప్రదాయ మందు తయారీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మందు తయారీలో ఆనందయ్య కుమారుడితోపాటు శిష్యులు చంద్రకుమార్, సురేష్, వంశీకృష్ణ పాల్గొంటున్నారు. -
తిరుపతి నారాయణ గార్డెన్స్‌లో ఆనందయ్య మందు తయారీ
సాక్షి,చిత్తూరు: తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో ఆనందయ్య మందు తయారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య మందు తయారీ జరగనుంది. కాగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఆనందయ్య మందును సిద్ధం చేయిస్తున్నట్లు చెవిరెడ్డి స్పష్టం చేశారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ ఆధ్వర్యంలో మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆనందయ్య కరోనా మందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చదవండి: Krishnapatnam Medicine: ప్రతి జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ -
కృష్ణపట్నం: ఆనందయ్య బృందం అత్యుత్సాహం
సాక్షి, నెల్లూరు: కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మందు పంపిణీ చేస్తూ ఆనందయ్య బృందం అత్యుత్యాహం ప్రదర్శించింది. కృష్ణపట్నంలో ఆనందయ్య బృందం ఆదివారం ప్రజలకు మందు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి మందు కోసం జనం భారీగా తరలివచ్చారు. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఆనందయ్య బృందం మందు పంపిణీ చేస్తుండడంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి మందు పంపిణీని నిలిపి వేయించారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పలు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తూనే ఉన్నారు. చదవండి: Covid-19: కరోనా మిగిల్చిన కన్నీటి కథలు -
Krishnapatnam Medicine: ప్రతి జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ
ముత్తుకూరు: ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య చెప్పారు. శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీగోవిందానంద సరస్వతి నేతృత్వంలో ఆనందయ్య శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివుడి ముందు కరోనా మందు ఉంచి పూజలు చేయించారు. ఆనందయ్య మాట్లాడుతూ..సోమవారం (ఈ నెల 7న) 3 రకాల మందు ఉన్న కిట్‌ను ఆయా జిల్లా కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. మందు పేరు ‘ఔషధ చక్రం’ తమ గురువుల సహకారంతో 30 ఏళ్లుగా అనారోగ్యానికి గురైన వారికి ఆయుర్వేద మందు అందజేస్తున్నామని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన మందు పేరు ‘ఔషధ చక్రం’ అని తెలిపారు. మందుకు ఈ పేరునే పరిగణించాలని కోరారు. కాగా, కృష్ణపట్నం శివారులోని తన సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ కుటీరం నిర్మాణానికి ఆనందయ్య శనివారం భూమి పూజ చేశారు. సోమిరెడ్డి విమర్శలు సరికాదు: ఆనందయ్య నెల్లూరు(సెంట్రల్): కరోనాకు తాను తయారు చేసిన మందుపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని ఆయుర్వేద మందు తయారీ నిపుణుడు ఆనందయ్య అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ఏదో వెబ్సైట్ అంటూ విమర్శలు చేస్తున్నారని, సోమిరెడ్డి తనను రాజకీయాల్లోకి లాగడం మాని, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇస్తే మంచిదని శనివారం ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. తనను కలవడానికి వచ్చిన కొందరిపై లాఠీ చార్జీ చేశారని సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమన్నారు. తాను కరోనాకు మందు తయారుచేయడం మొదలుపెట్టి 40 రోజులకు పైగా అయిందని, కొద్ది రోజులపాటు నిలిచిపోయినా.. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంతో మందు తయారీలో నిమగ్నమయ్యానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా తనకు సహకరించిందన్నారు. అనుమతులు రావడంతో మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ చేసి, తరువాత మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేద్దామనే నిబంధన పెట్టుకున్నామని, అంతేతప్ప వెబ్‌సైట్‌కు కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. సోమవారం నాటికి మందు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
ఎమ్మెల్యే కాకాణికి, మా వెబ్‌సైట్‌కు సంబంధం లేదు
నెల్లూరు: తమ వెబ్సైట్ గురించి సోమిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి. సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఎండీ స్పందించారు. ‘‘ఈ వెబ్సైట్ వెనుక ఎలాంటీ దోపిడీ ఉండదు, అంతా పారదర్శకం. టెస్టింగ్ చేసే క్రమంలోనే వెబ్సైట్లో రేట్లు పెట్టుకున్నాం.. అవి ఫైనల్ కాదు. ఈ అంశాన్ని సోమిరెడ్డి ఇలా రాజకీయం చేయడం దుర్మార్గం. ఎమ్మెల్యే కాకాణికి, మా వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు’’ అని స్పష్టం చేశారు. మందు పంపిణీ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదు: కాకాణి ఆనందయ్య మందు విషయంలో వ్యక్తిగత విమర్శలు చేసి.. ప్రతిపక్షాలు రాజకీయ రగడ సృష్టించాలని చూస్తున్నాయి అన్నారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆనందయ్య మందుకు అనుమతులు వచ్చేవరకే ప్రయత్నం చేశా. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో.. పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని కాకాణి స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. ‘‘సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దిగజారి విమర్శలు చేస్తున్నారు. సోమిరెడ్డి ఒక్క రూపాయైనా అవినీతి జరిగిందని నిరూపించలగలవా. వ్యక్తిగత విమర్శలతో సోమిరెడ్డి బురదజల్లాలని చూస్తున్నాడు. సోమిరెడ్డికి నన్ను విమర్శించే హక్కు లేదు. ఎక్కువగా మాట్లాడితే సోమిరెడ్డి అప్పుల చిట్టా విప్పుతా. సోమిరెడ్డి పేకాటలో ఎంతమందికి అప్పులు ఉన్నాడో చెప్పాలి’’ అని కాకాణి డిమాండ్ చేశారు. ‘‘సోమిరెడ్డికి ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో బయటపెట్టాలి. సోమిరెడ్డి ఆధారాలతో వస్తే విచారణకు సిద్ధం. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలి. ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. సోమిరెడ్డి నీతి మాటలు కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలి’’ అంటూ కాకాణి తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: ఆనందయ్య మందు: ఆరోపణలొద్దు.. అనుమానాలు రేపొద్దు -
ఆనందయ్య మందు వాడాను, కరోనా రాలేదు: జగపతిబాబు
ఒకవైపు కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే, మరోవైపు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మందు కరోనాకు పని చేయదని కొందరు అంటుంటే మరి కొందరు ఆనందయ్య ఆయుర్వేద మందు ఎలాంటి హానీ కలిగించదని చెప్పుకొచ్చారు. ఎన్నో పరిణామాల అనంతరం.. మళ్లీ ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జనాలు ఆనందయ్య మందు కోసం క్యూ కడుతున్నారు. సామాన్యులే కాదు కొందరు సెలబ్రిటీలు కూడా ఈ మందును విశ్వసిస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు జగపతిబాబు తాను ఆనందయ్య మందును ఎప్పుడో వాడానని, ఆయుర్వేదం హానీ చేయదని తాను బలంగా నమ్ముతానన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వారిలో తాను ఒకడినని. తనకు కరోనా రాలేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఆయుర్వేదం మందులను పకృతి సహాజమైన ఔషధాలతో తయరు చేస్తారు. అలాంటి మందు ఎలాంటి హానీ చేయదని నేను విశ్వసిస్తున్నాను. నేచర్, భూదేవి తప్పు చేయదు. ఆనందయ్య మందు విషయంలో చాలామంది అభిప్రాయాలు చూశాను.. రకరకాల వీడియోలు చూసిన తరువాత ఓ అభిప్రాయానికి వచ్చాను’’ అన్నారు జగపతిబాబు. ‘‘ఎవరేమన్నా సరే.. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కచ్చితంగా మంచే జరుగుతుందని నేను ఆనందయ్య మందుని వాడాను. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు నాకు కోవిడ్ రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటు చెప్పుకొచ్చారు. ‘ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ మందు శాస్త్రీయంగా అనుమతులు పొంది ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా. అతన్ని దేవుడు ఆశీర్వదించాలి’ అంటూ ఇంతకుముందు జగపతిబాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
Krishnapatnam Medicine: ఆనందయ్య మందు.. ‘ఔషధచక్ర’?
ముత్తుకూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా నివారణకు ఇస్తున్న మందు పేరును ‘ఔషధచక్ర’గా నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి ఆయుర్వేద మందు పంపిణీకి అవసరమైన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్ కాంప్లెక్స్‌లో మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సిద్ధం చేసుకోవడంలో ఆనందయ్య బృందం నిమగ్నమై ఉంది. సేకరణ పూర్తయిన తర్వాత రెండురోజుల్లో మందు తయారీ ప్రారంభమవుతుందని ఆనందయ్య సన్నిహితులు వెల్లడించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి సూచన మేరకు మొదటి ప్రాధాన్యతగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి ‘పి’ రకం మందు (కరోనా రానివారు వాడేది) అందచేయాలని నిర్ణయించారు. తర్వాత కరోనా రోగులకు అవసరమైన ‘పి, ఎల్, ఎఫ్’ రకాల మందు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అనంతరం ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయాలని సంకల్పించారు. మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పలు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తూనే ఉన్నారు. చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ -
ఆనందయ్య ఐ డ్రాప్స్‌కు అనుమతినివ్వలేం
సాక్షి, అమరావతి: కరోనా చికిత్సకోసం ఆనందయ్య అందిస్తున్న మూలికా వైద్యంలోని నాలుగు రకాల మందుల పంపిణీకి అభ్యంతరం లేదని, అయితే కళ్లల్లో వేసే చుక్కల(ఐ డ్రాప్స్) పంపిణీకి మాత్రం ప్రస్తుతానికి అనుమతినివ్వలేమని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య ఐ డ్రాప్స్ పరిశుభ్ర వాతావరణంలో తయారు కావట్లేదని నిపుణుల కమిటీ తేల్చిందని వివరించింది. ఈ డ్రాప్స్‌ను వేసుకునేవారి కళ్లు దెబ్బతినే వీలుందని కూడా చెప్పిందని, అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్ పంపిణీకి అనుమతినివ్వలేమంది. ఐ డ్రాప్స్‌పై తదుపరి పరీక్షలు అవసరమని, ఇందుకు నెలకుపైగా సమయం పట్టే వీలుందని తెలిపింది. మీరు అనుమతిని ఇవ్వొద్దని, అయితే తమకు అవసరముందంటూ తమంతట తాముగా వచ్చేవారికి ఐ డ్రాప్స్ ఇచ్చేందుకు అడ్డుచెప్పవద్దని హైకోర్టు సూచించగా, ఆ పని తాము చేయలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ దిశగా ఐ డ్రాప్స్ పంపిణీకి హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలివ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని తెలిపింది. దీంతో ఐ డ్రాప్స్ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని ఆదేశించాలని, అలాగే ఆనందయ్య మందు పంపిణీకి తక్షణమే అనుమతులిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వర నాయుడులు వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. అలాగే తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు తగిన భద్రత కల్పించేలా కూడా ఆదేశాలివ్వాలంటూ ఆనందయ్య పిటిషన్ వేశారు. వీటిపై జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఐ డ్రాప్స్‌పై పూర్తిస్థాయి పరీక్షలు అవసరం... ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. మందు తయారీకి ఐదు రోజుల సమయం పడుతుందని ఆనందయ్య చెప్పారని, వెబ్సైట్ ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు అందించే విషయంలో ఆనందయ్యకు అటవీశాఖ సాయం చేస్తుందని, గిరిజన కార్పొరేషన్ ద్వారా తేనె అందిస్తామని వివరించారు. కృష్ణపట్నం పోర్టులో ఖాళీగా ఉన్న ఓ గోదాములో మందు తయారు చేసుకోవచ్చునన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఐ డ్రాప్స్ సంగతేంటని ప్రశ్నించింది. నిపుణుల కమిటీ ఆనందయ్య ఇచ్చిన కే రకం మందు శాంపిల్స్‌ను పరీక్షించిందని, దీన్ని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని సుమన్ తెలిపారు. అయితే ఐ డ్రాప్స్‌పై కమిటీ అభ్యంతరాలు లేవనెత్తిందని, ప్రమాణాలకనుగుణంగా తయారీ లేదని తెలిపిందన్నారు. పూర్తిస్థాయి పరీక్షల నిమిత్తం 1–3 నెలల సమయం పట్టే వీలుందన్నారు. అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్ పంపిణీకి అనుమతినివ్వలేమన్నారు. నెల రోజులంటే ఎక్కువ సమయమని, ఎలాంటి వాతావరణంలో చేయాలో చెబితే దానిప్రకారం ఆనందయ్య తయారు చేస్తారని ధర్మాసనం చెప్పగా.. అలా చేస్తున్నారో లేదో మళ్లీ నిపుణుల కమిటీ పరిశీలించాల్సి ఉంటుందని సుమన్ తెలిపారు. కోర్టును నిందించే పరిస్థితి రాకూడదు... ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ స్పందిస్తూ, ఐ డ్రాప్స్ అప్పటికప్పుడు తయారుచేసి వినియోగిస్తున్నారని, అందువల్ల ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) హరినాథ్ జోక్యం చేసుకుంటూ.. ఐ డ్రాప్స్ భద్రత, సమర్థత చాలా ముఖ్యమని, గుజరాత్లో ఇలాంటి మందే తయారు చేస్తే సమర్థత, భద్రత కారణాలతో హైకోర్టు దాని పంపిణీని ఆపేసిందన్నారు. రేపు జరగరానిది జరిగితే అందుకు కోర్టును నిందించే పరిస్థితి ఉండకూడదన్నారు. తుది పరీక్షలు వేగవంతం చేయలేరా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. పలు సంస్థల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, ఒక్కో సంస్థ నుంచి అనుమతి వచ్చేందుకు వారంపైగా పడుతుందని ఎస్‌జీపీ సుమన్ తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని అక్కడకొచ్చి వేసుకోనివ్వాలని, అలాంటి వారిని ఆపొద్దని ధర్మాసనం సూచించగా.. కరోనా తీవ్రంగా ఉన్నవారు అక్కడికి వస్తే కరోనా వ్యాప్తి ప్రమాదం ఉంటుందని సుమన్ తెలిపారు. తయారుచేసిన ఐ డ్రాప్స్‌ను ఎంతకాలం వరకు భద్రపరచవచ్చునని ధర్మాసనం అడుగగా.. కొద్ది నిమిషాల వరకేనని అశ్వనీకుమార్ చెప్పారు. కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఐ డ్రాప్స్కోసం 15–20 మంది వరకు వచ్చారని, ఇప్పుడు అంతకన్నా తక్కువమంది వచ్చే అవకాశముంటుందని ధర్మాసనం అడిగిన మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అలాగైతే ఐ డ్రాప్స్ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. -
Krishnapatnam Medicine: ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం!
కరోనాకు మా పతంజలి మందు తయారు చేసిందని రామ్‌దేవ్ బాబా అట్టహాసంగా కొరోనిల్ మాత్రలను కేంద్ర ఆరోగ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశాడు. ఎంత పని చేస్తుందో తెలియని మందు కరోనాను నిల్ ఎట్లా చేస్తుందని కోర్టుకెక్కితే అల్లోపతి మీద, ఆధునిక డాక్టర్ల మీద అడ్డగోలు కామెంట్లు చేశాడు. ఈ దుర్మార్గ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెయ్యి కోట్ల జరిమానా కట్టమని ఆందోళన చేస్తున్నారు డాక్టర్లు. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వందల మంది డాక్టర్లు చనిపోతుంటే వాళ్ళనే కాపాడుకోలేని దద్దమ్మ అల్లోపతి అదో హంతకపతి అన్నాడు రామ్‌దేవ్. ఉత్తర భారతాన పెద్ద దుమారం రేగుతున్నా ఉలుకూ పలుకూ లేని కొన్ని తెలుగు మాధ్యమాలు... పెరటి మొక్కల్ని, సాధారణ మూలికల్ని మందుగా నూరి, కరోనాకు చెక్ పెట్టే అవకాశం ఉందని కృష్ణపట్నంలో ఆనందయ్య చెబుతుంటే మాత్రం ఏవేవో ప్రచారాలు, ఫిర్యాదులు, నానా రభస. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నీ ఏదో ఓ నిర్ణయం తీసుకో వాల్సిన ఒత్తిడి. వేలమంది మందు కోసం బారులు కట్టి ఎదురు చూస్తుండగా బలవంతంగా ఆపి వేయాల్సిన పరిస్థితి. ఒక నిర్ణయం కోసం ఆయుష్ డైరెక్టర్ రాములు కృష్ణపట్నం వెళ్ళి మందులో మూలికలు, పరిమాణం, తయారీ విధానం తెలుసుకుని, రోగుల నుండి అభిప్రాయాలు తీసుకుని, ఆయుర్వేద పరిశోధన కేంద్ర సంస్థలో మూలికల శాస్త్రీయ విశ్లేషణ జరిగి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వడం చకచకా జరిగింది. కోర్టు తీర్పులకు ముందే తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపి ఏ మందులు అనుమతి ఇవ్వాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టం చేస్తూ, ఆనందయ్య చెప్పిన పి.ఎల్.ఎఫ్. అనే మూడు మందులకు అనుమతి ఇచ్చారు. ఆయుష్ రాములు మాట్లాడుతూ దీన్ని ఆయుర్వేదంగా గుర్తించడం లేదు, నాటుమందుగానే పరిగణించాలన్నారు. సన్నాయినొక్కు మెరుగైన సమాజాలు నిన్న చనిపోయిన కోటయ్య హెడ్మాస్టర్ను ఎన్నోసార్లు చంపేశారు. ఇప్పుడు కూడా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది కనుక ఎంత ఆనందమయ్యా ఈ నిర్ణయం అని చాలామంది అనుకుంటు న్నారు. ప్రభుత్వం ప్రజల్ని భ్రమల్లో ముంచడం కోసం, తమ వైఫ ల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం అనుమతి ఇచ్చిందని అనేవాళ్లూ ఉన్నారు. చికిత్స ఇంత చవకగా దొరికితే ఎట్లా? రెండు రాళ్ళు వేద్దామని కొందరు ఏవేవో విషయాలు ముందుకు తెస్తారు. ఆయుర్వేద వాత, కఫ, పిత్త సిద్ధాంతం, శుద్ధీకరణకు ముందే దేశవాళి మూలవాసు లది మూలికా వైద్యం. గ్రంథస్తం కాకున్నా కంఠస్తంగా, అనువం శికంగా కొనసాగుతున్నది. కరోనాకు అడ్డుకట్ట వేసిన చైనా ఆధునిక వైద్యంతో పాటు మూలికా వైద్యానికి కూడా పెద్దపీట వేసింది. హోమియోలోనూ మెటీరియా మెడికాకు మూలికలే సృజన. మూలికల నుండి చురుకైన మందును అల్లోపతికి ముందే సంగ్రహిం చడం మొదలుపెట్టారు. చెట్ల ఆల్కలాయిడ్స్‌ను ఇప్పటికీ సంగ్రహి స్తూనే ఉన్నారు. ఇన్ని తెలిసి మూలికా వైద్యాన్ని ఆయుర్వేదం కంటే, అల్లోపతి కంటే తక్కువ చేయడం హేతుబద్ధత ఎట్లవుతుంది? అన్ని శాస్త్రాల కంటే ముందు ఈ నాటువైద్యమే మేటి వైద్యమై మనుషుల్ని, జంతువుల్ని అనేక రోగాల నుండి కాపాడుకున్నది. కరోనా కష్టకాలంలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన ఆనందయ్య మందు తప్పకుండా అన్ని కరోనా కేసులకు పని చేస్తుందని చెప్పలేకపోయినా, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఇమ్యూనిటీ బూస్టర్ల కంటే బాగా పని చేస్తుందేమో. ఇప్పటికీ కామెర్లకు ఇచ్చే మూలికా వైద్యం, గాయాలు మాన్పడానికి ఇచ్చే పూత మందు అద్భుతంగా పనిచేస్తాయి. శరీర ప్రకృతిలో రోగ వికృతిని సృష్టిలో భాగమైన ఆకులు, అలములు సరి చేసినంత ప్రభావశీలంగా ఇతర పదార్థాలు చేయవని మనకు అర్థమ వ్వాలి. ఒక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, దేశవాళీ వైద్యానికి ఆధునిక పరిశోధన తోడై గొప్ప ఫలితాలు సాధించాలి. చండీగడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్లో బెటాడిన్ బదులుగా వేపరసం వాడి అద్భుత ఫలితాలు రాబట్టినారు. లక్షల సంవత్సరాల మనిషి నాగరిక క్రమంలో తినే పంట చెట్లు, శరీర ధర్మాన్ని వ్యాధిని ఎదుర్కోవడానికి సిద్ధం చేసే మందుచెట్లను గుర్తించడంతో ఆధునికయుగం సారవంతం అయింది. నడమంత్రపు పెట్టుబడి శాస్త్రాలు తిమ్మిని బమ్మి చేయాలని చూసినా, ప్రతి దేశంలో తమకు అందుబాటులోని మూలికా వైద్యాన్ని ఆధునీకరించడం, వందల ఆనందయ్యలకు ప్రభుత్వాలే ప్రోత్సాహాన్నివ్వడం ఇప్పుడు అవసరం. హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం దాక, చెట్లలో, పుట్లలో, నదీజలాల్లో, దూసర క్షేత్రాల్లో సంజీవనీ పర్వతాలు అడుగడుగునా ఉంటాయి. అందుకే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందమయ్యా! పక్క రాష్ట్రాలకైనా తన మందు సరఫరా చేస్తానంటున్నాడు ఆనందయ్య. తెలంగాణలోనూ కృష్ణపట్నం మందుతో కుదుట పడినవాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. నిన్నటి జగన్ నిర్ణయం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం కావాలి. - డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు. 9848472329 -
కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ముత్తుకూరు/నెల్లూరు (సెంట్రల్): కరోనా నియంత్రణకు ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మందును భారీగా తయారుచేసి 13 జిల్లాలకు పంపి కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. మందు తయారీ, పంపిణీ క్యాంపును కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. పోర్టులోని సీవీఆర్ సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీ కోసం ఒక బ్లాక్ కేటాయించారు. భారీ గ్రైండర్, వంటపాత్రలు, మందు తయారీకి దినుసులను సమకూరుస్తున్నారు. 60 వేలమందికి సరిపడా మందును ఆదివారం రాత్రి తయారు చేసి, 13 జిల్లాలకు సోమవారానికి పంపాలని యోచిస్తున్నారు. అవసరమైతే గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి తేనె సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మందుకోసం ఇతర జిల్లాల వారెవరూ కృష్ణపట్నం రావద్దని ఆనందయ్య కోరారు. మందును అవసరమైన వారి చిరునామాకుగానీ, లేదా ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ద్వారాగానీ అందించేలా చూస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో 4 ప్రాంతాల్లో మందును పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సోమవారం నాటికి మందు పంపిణీని ప్రారంభించి రానున్న రోజుల్లో మరింతగా నిల్వలను సిద్ధం చేసి అన్ని జిల్లాలతో పాటు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా పంపాలని నిర్ణయించారు. మందు తయారీ కోసం సొంత భవన నిర్మాణానికి ఆనందయ్య భూమిపూజ ఆయుర్వేద మందు తయారీకి కావాల్సిన భవన నిర్మాణానికి ఆనందయ్య కృష్ణపట్నంలోని తన స్థలంలో బుధవారం భూమిపూజ చేశారు. భగవాన్ వెంకయ్యస్వామి అనుచరుడైన సైదాపురం మండలం తలుపూరు ఆశ్రమానికి చెందిన నారాయణదాసు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తులో రోగులకు వైద్యసేవలు అందించడం, సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడం కోసం ‘ఆనందయ్య సేవా ట్రస్టు’కూ శ్రీకారం చుట్టారు. దుష్ప్రచారాలొద్దు: నారాయణ ఆనందయ్య మందుపై దుష్ప్రచారం చేయవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం కృష్ణపట్నంలో ఆనందయ్యను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పార్టీలు ఆనందయ్య ఆయుర్వేద మందును రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. పుత్తూరు ఎముకల కట్లు, హైదరాబాద్‌లో చేపమందు వలే ఆనందయ్య మందు ప్రజల ఆదరణ పొందిందని చెప్పారు. -
Krishnapatnam Anandaiah: దేశీయ వైద్యానికి అసలు వారసుడు
మేకలు తినని మొక్కల్లో ఔషధ గుణాలున్నాయని గుర్తించిన గొల్లకులం వారసుడు ఆనందయ్య. తరతరాలుగా ఆయన కుటుంబం మూలికా వైద్యం చేస్తోంది. ఆనందయ్యకు వారసత్వంగా వస్తున్న జ్ఞానాన్ని ఏ ఆయుర్వేద పండితుడూ పరిశీలించలేదు. దానిపై పరిశోధనలు జరపలేదు. ఇట్లా దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక్కడ ఉన్న దేశీయ వైద్య విధానాన్నంతటినీ సమగ్రంగా అధ్యయనం చేసి, ఆధునిక అల్లోపతి వైద్య విధానాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొని ఈ దేశ అవసరాలకు అనుగుణ మైన ఒక నూతన వైద్య విధానాన్ని రూపొందించే అవకాశం మనకు వచ్చింది. ఇప్పటికైనా పాత పాపాలను కడుగుకొని, కొత్త సమాజానికి పునాదులు వేస్తే చరిత్ర మనల్ని కొంతైనా క్షమిస్తుందేమో. కృష్ణపట్నం ఆనందయ్య అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య కరోనా కోసం తయారుచేసి, పంపిణీ చేసిన మందు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయుర్వేదం ఔషధాలు, అల్లోపతి వైద్యంపైన కూడా వాదాలూ, వివాదాలూ తలెత్తాయి. కొంత మంది ఆయుర్వేదం మాత్రమే గొప్ప దంటే, మరికొందరు అది పూర్తిగా అశాస్త్రీయమైనదని కొట్టిపారేశారు. నిజానికి ఏదేశానికైనా తమ దేశ కాలమాన పరిస్థితుల్లో ఆవిర్భవించి, అభివృద్ధి పరుచుకున్న వైద్య విధానం ఒకటుంటుంది. భారతదేశంలో అటువంటి వైద్య విధానం ఉండేది. అదే ఆయుర్వేద సిద్ధ వైద్యం, మూలికా వైద్యం, దీనికి ఇంకా ఎన్నో పేర్లున్నాయి. అయితే వాటి గతి ఎటువంటి పురోగతి లేని నిరర్ధకంగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆనందయ్యలు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడే భారత వైద్యం స్తంభించిపోయింది. భారత్‌లోనే కాదు, ప్రపంచమంతటా విస్తరించిన అల్లోపతి లేదా ఆధునిక లేదా, పాశ్చాత్య వైద్యం అనే పేర్లతో పిలుస్తోన్న ఇంగ్లిష్ వైద్యం రోజురోజుకీ నూతన ఆవిష్కరణ లతో మనిషిని చిరాయువు చేసేవైపు పురోగమిస్తోంది. ఎవరికి ఏ అభిప్రాయాలున్నా శాస్త్ర రీత్యా అల్లోపతి అత్యాధునిక విధానాలతో మానవుణ్ణి ఎంతో ఉన్నతస్థాయిలో నిలబెట్టింది. అయితే ఇప్పుడు మన దేశంలో ఉన్న ఆయుర్వేదం, సిద్ధ, మూలికా వైద్యాలు అశాస్త్రీయమైనవని నేను అనదలుచుకోలేదు. కానీ వాటి ఉన్నతిని, పురోభివృద్ధినీ మన సమాజమే అడ్డుకున్నది. మన తల్లిని మనమే హతమార్చినట్టుగా మన వైద్యాన్ని మనమే మట్టు బెట్టాం. చరిత్రను తవ్వితీస్తే అథఃపాతాళంలోకి తొక్కివేసిన మనకిప్ప టికీ ఎంతో విలువైన, ఉపయోగకరమైన వైద్యం బయటపడుతుంది. ఈనాటి ఆధునిక వైద్యమని చెప్పుకుంటున్న అల్లోపతికి, గ్రీకు వైద్య తాత్వికవేత్త గ్రీస్‌కి చెందిన హిప్పోక్రిటస్, ఆయన గురువు డెమొక్రిటస్ ఆద్యులు. హిప్పోక్రిటస్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినవాడు. అప్పటివరకు మనిషి కేవలం దైవ ప్రార్థన మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడు. ఎటువంటి శాస్త్రీయమైన ఔషధాలు గానీ, వైద్య విధానంగానీ లేవు. అయితే దానిని పూర్తిగా మార్చివేసి, మానవుడు తనను తాను కాపాడుకోగలడని, అందుకు వైద్యం అవసర మని, రోగాలను, రోగకారకాలను, రోగనివారణకు, రోగనిర్మూలన కోసం ఎంతో శ్రమించి ఒక విధానాన్ని రూపొందించారు. దాని పునాదుల మీదనే నేటి అల్లోపతి వైద్య విధానం వృద్ధి చెందింది. ఎన్నో వ్యాధులకు మందులు కనిపెట్టడం మాత్రమే కాదు, మరెన్నో మహ మ్మారులకు వ్యాక్సినేషన్లను కనుగొని మానవాళిని రక్షించింది. అయితే అది వ్యాపారంగా మారి, కంపెనీలు, కార్పొరేట్లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రజలను దోచుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. ఇది వైద్యం తప్పు కాదు, దానిని వ్యాపారంగా మార్చిన కార్పొరేట్లదే ఆ తప్పిదం అని చెప్పక తప్పదు. వాటికి అండగా నిలబడుతున్న ప్రభుత్వాలది కూడా అంతకు మించిన తప్పు. అయితే అల్లోపతి ప్రగతి గురించి అందరికీ తెలుసు. అయితే మన దేశంలో మన దేశీయ వైద్యం ఎందుకు శతాబ్దాల క్రితమే ఆగిపోయింది? ఎందుకు అది ప్రజల వైద్యావసరాలను తీర్చ లేకపోతున్నది? ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరమున్నది. సరిగ్గా గ్రీస్‌లో ఆధునిక వైద్యం పురుడుపోసుకున్న కాలంలోనే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో చరకుడు అనే భారత వైద్య పితా మహుడు చరకసంహిత రాశాడు. దీనిని ఎనిమిది పుస్తకాలుగా, 120 అధ్యాయాలుగా విభజించారు. ఇందులో ఆహారం, పరిశుభ్రత, రోగ నిరోధం, వైద్యం, ఔషధాలు, వైద్యుడు, నర్సు, రోగి అనుసంధానం గురించి వివరంగా రాశారు. ఇది పూర్తిగా ఎంతో అధ్యయనం చేసి, రాసిన పుస్తకం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే, అది బౌద్ధం అనంతరం రాసిన పుస్తకం. అయితే బౌద్ధం సమయంలో వైద్యం ఆచరణలో ఉంది. జీవకుడు అనే వైద్యుడి గురించి బౌద్ధ సాహిత్యం ప్రస్తావించింది. అంతేకాకుండా స్వయంగా బుద్ధుడు వైద్యుడనే ప్రస్తావన కూడా ఉంది. బౌద్ధారామాలు అన్నీ మిగతా విష యాలతో పాటు, ఆరోగ్య కేంద్రాలుగా పనిచేశాయి. బౌద్ధ బిక్కులు వైద్యాన్ని కూడా అనుసరించారు. అప్పటివరకు వేదాలు, మహిమలు తప్ప వైదిక మతాన్ని ఆచరిస్తున్న పురోహిత, బ్రాహ్మణ వర్గం వైద్యంపై దృష్టిపెట్టలేదు. పైగా వైద్యం చేస్తున్న వాళ్ళను సామాజిక వెలివేతకు గురిచేశారు. ఎందుకంటే, రోగాలను, వారి రుగ్మతలను రూపుమాప డానికి వాళ్లందరినీ అంటుకొని వైద్యం చేయాలి. వారిని అంటుకో వడం ద్వారా వాళ్ళు మలినమైపోయారని వైదిక పెద్దలు భావించారు. అయితే బౌద్ధం ప్రభావం ఉన్నంత వరకు వాళ్ళు ఏమీ చేయలేక పోయారు. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడి మనవడు బృహద్రధుణ్ణి బ్రాహ్మణ వర్గానికి చెందిన పుష్యమిత్ర శుంగుడు హత్య చేసి, బ్రాహ్మణ ఆధిపత్యంతో కూడిన శుంగ వంశ స్థాపన చేశాడు. ఆ తర్వాత మరో బ్రాహ్మణవంశమైన కణ్వ రాజ్యం వచ్చింది. ఈ రెండు రాజ్యాలు బౌద్ధాన్ని దెబ్బతీసి, దాని ప్రగతిశీల విధానాలను తిరగదోడాయి. అందులో భాగంగానే మనుధర్మం వచ్చింది. అందులో వైద్యులను నీచమైన వాళ్ళుగా నిర్ధారించారు. మనుధర్మంలోని మూడవ అధ్యాయంలోని 152వ, 180వ నిబం ధనల్లో వైద్యుడు ఎలాంటి పవిత్ర కార్యక్రమాల్లో, ప్రత్యేకించి యాగాల్లో పాల్గొనకూడదని, అతనికి ఆహారం అందిస్తే అది చీము, నెత్తురుతో సమానమని తీర్మానించారు. అదేవిధంగా 4వ అధ్యాయం లోని 212, 220 నిబంధనల్లో వైద్యునికి తిండి పెట్టకపోవడం మాత్రమే కాదు, ఆయన చేతి తిండిని తినకూడదని కూడా మను« ధర్మం శాసించింది. భారత వైద్యం నేలకరవడానికి ఇది తొలి దెబ్బ. తర్వాత వైదిక మతం బ్రాహ్మణ మతంగా మారి ముందుకు వెళుతున్న సమయంలో అదే ఆయుర్వేదాన్ని తమ సొంతం చేసుకు న్నారు. అయితే వాళ్ళు ఈ వైద్యాన్ని మిగిలిన కులాలకు నేర్పించ కుండా జాగ్రత్తపడ్డారు. దీంతో వైద్యం పూర్తిగా బ్రాహ్మణుల సొంత మైపోయింది. అయితే మిగతా ప్రజలు బౌద్ధుల నుంచి నేర్చుకున్న విజ్ఞానం, తమ అనుభవంతో సంపాదించుకున్న జ్ఞానంతో వైద్యాన్ని అలవర్చుకున్నారు. అందుకే శూద్రులలో మంగలి(నాయీబ్రాహ్మణ) కులం వారు గొప్ప వైద్యులుగా ఆరోజు సేవలందించారు. మంగలి కులానికి చెందిన మహిళలు మంత్రసానులుగా వేల సంవత్సరాలు కోట్లాది మంది నూతన శిశువులకు జన్మనిచ్చారు. అయితే వీళ్ళు కూడా అప్పుడు అంటరాని కులాలుగా పిలుచుకునే మాల, మాదిగల లాంటి వారికి వైద్యం అందించడంలో చొరవచూపడం లేదు. దానితో అనివార్యంగా పంబాల, బైండ్ల వృత్తి ఉనికిలోనికి వచ్చింది. ఆనందయ్య కుటుంబం కూడా తరతరాలుగా మూలికా వైద్యం చేస్తున్నది. ఈయన గొల్లకులానికి చెందినవాడు. గొల్లకులం వారు మేకలు, గొర్రెలు మేపడానికి అడవుల్లోకి వెళ్ళేవారు. అక్కడ మేకలు తినని చెట్లు చిన్న చిన్న మొక్కలు ఉండేవి. వాటిని గమనించడం మొదలుపెట్టారు. వాటిని తమ అనుభవం ద్వారా ఔషధ మొక్కలుగా గుర్తించారు. ఆ వారసత్వమే ఆనందయ్య. అయితే ఆనందయ్యకు వారసత్వంగా వస్తున్న జ్ఞానాన్ని ఏ ఆయుర్వేద పండితుడూ పరిశీలిం చలేదు. దానిపై పరిశోధనలు జరపలేదు. ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఉన్నారు. ఇక్కడ ఏర్పడిన కుల వ్యవస్థ, బ్రాహ్మణ ఆధి పత్య భావజాలం మన దేశ వైద్యవిధానానికి గొడ్డలిపెట్టుగా మారింది. ఆ విధంగా మన దేశంలో మన వైద్యం తెరమరుగైంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక్కడ ఉన్న దేశీయ వైద్య విధానాన్నంతటినీ సమగ్రంగా అధ్యయనం చేసి, ఆధునిక అల్లోపతి వైద్య విధానాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొని ఈ దేశ అవసరాలకు అనుగుణ మైన ఒక నూతన వైద్య విధానాన్ని రూపొందించే అవకాశం మనకు వచ్చింది. ఇప్పటికైనా పాత పాపాలను కడుగు కొని, కొత్త సమాజానికి పునాదులు వేస్తే చరిత్ర మనల్ని కొంతైనా క్షమిస్తుందేమో. వ్యాసకర్త :మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు 81063 22077 -
రేపటి నుంచి మందును తయారు చేయనున్న ఆనందయ్య
-
ఆనందయ్య మందు: తయారీ కేంద్రం మార్పు
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకి మార్చారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ సెక్యూరిటీ అకాడమీకి మందు తయారీ కేంద్రాన్ని తరలించారు. ఇప్పటివరకు పంపిణీ జరిగిన ప్రాంతంలోనే మందు తయారీ చేయాలని ఆనందయ్య భావించారు. అయితే జిల్లా యంత్రాంగంతో కలిసి ఆనందయ్య చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పటికే మందు తయారీకి కావల్సిన ముడి సరుకులు, ఇతర వంట సామాగ్రిని సీవీఆర్‌కు తరలించారు. కృష్ణపట్నంలో తయారు చేస్తే అక్కడకు కూడా ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో తయారీ కేంద్రాన్ని మార్చినట్లు అధికారులు తెలిపారు. మందు తయారీ సమయంలో భద్రత తదితర విషయాల్లో సహకరించాలని జిల్లా కలెక్టర్‌కు ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. తయారీకి కావలసిన మూలికలు ఔషధాలు సమకూర్చుకునే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని ఆనందయ్య కోరారు. అవసరమైతే గిరిజన కార్పొరేషన్ సొసైటీ నుంచి తేనే సప్లై చేస్తామని కలెక్టర్ చక్రధర బాబు తెలిపారు. నేటి నుంచి childeal.in పేరుతో ఆనందయ్య మందుకు సంబంధించిన వెబ్సైట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెబ్సైట్లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆనందయ్య బృందం తెలిపింది. సోమవారం నుండి ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా -
ఆనందయ్య మందు తయారీకి చకచకా ఏర్పాట్లు
-
7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ!
నెల్లూరు (అర్బన్): నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందును సోమవారం (ఈనెల 7వ తేదీ) నుంచి పంపిణీ చేసే అవకాశం ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. మందు తయారీ, పంపిణీ గురించి మంగళవారం నెల్లూరులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్, జేసీలు హరేందిరప్రసాద్, గణేష్‌కుమార్, మందు తయారీదారు ఆనందయ్య తదితరులతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వనమూలికలు సమకూర్చుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లో మందు తయారు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారన్నారు. కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకేచోట కాకుండా డీ సెంట్రలైజ్డ్ పద్ధతిలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మందును ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, పోస్టల్, కొరియర్ ద్వారా కూడా పంపిస్తామని తెలిపారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి కూడా ఇదే విధానంలో పంపిణీ చేస్తామన్నారు. కోవిడ్ సోకిన వారికి నయం చేసేందుకు మాత్రమే తొలిదశలో మందు పంపిణీ చేస్తామని తెలిపారు. తర్వాత దశలో కరోనా రాకుండా ఉండేందుకు మందు ఇస్తామన్నారు. ఎవరూ మందు కోసం కృష్ణపట్నం, నెల్లూరు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల మనోభావాలను అనుసరించి మందును పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. కంట్లో చుక్కల మందు పంపిణీకి సంబంధించి కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరూ కృష్ణపట్నం రావద్దు కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు ఇతర ప్రాంతాల్లో లాగానే కృష్ణపట్నంలోనూ అమలవుతాయని తెలిపారు. ఇతర ప్రాంతాల వారు రాకుండా పోలీసు, రెవెన్యూ శాఖలు పని చేస్తాయన్నారు. ప్రజల కోసం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డీ సెంట్రలైజ్డ్ పద్ధతిలో మందును పంపిణీ చేస్తామన్నారు. సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దన్నారు. మరో ఐదురోజుల్లో మందు పంపిణీ మొదలవుతుందన్నారు. వ్యక్తిగతంగా ఆన్లైన్లో మందు కోసం బుక్ చేసుకోవచ్చన్నారు. కోర్టు తుది తీర్పునకు అనుగుణంగా మందు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆనందయ్యను సత్కరించిన ఎంపీ మాగుంట ముత్తుకూరు: కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన మందుకు ప్రపంచ అగ్రదేశాల గుర్తింపు లభించిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశంసించారు. ఆయన మంగళవారం కృష్ణపట్నం గ్రామానికి వచ్చి ఆనందయ్యను సత్కరించారు. ఎంపీ మాట్లాడుతూ ఆనందయ్య మందు తయారీకి మాగుంట కుటుంబం అండగా ఉంటుందన్నారు. ఆనందయ్య ప్రకాశం జిల్లాకు కూడా వచ్చి ప్రజలకు కరోనా మందు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆనందయ్య మాట్లాడుతూ కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారీ మాత్రమే జరుగుతుందని, పంపిణీ ఉండదు కనుక ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ద్వారా ఆయుర్వేద మందుకు అనుమతులు లభించే విషయంలో సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, జిల్లాకు చెందిన మంత్రులకు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
శాస్త్రీయ పరీక్షల్లోనూ ఎలాంటి దుష్పలితాలు కనిపించలేదు: రాములు
-
ఆనందయ్య మందు పంపిణీకి 5రోజుల సమయం: కలెక్టర్
-
నమ్మకం ఉన్నవారు ఆనందయ్య మందు తీసుకోవచ్చు: వైవీ సుబ్బారెడ్డి
-
ఆనందయ్యను కలిసిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి
-
తాము చెప్పేవరకూ కృష్ణపట్నం ఎవ్వరూ రావద్దని విజ్ఞప్తి: ఆనందయ్య
-
ఆనందయ్య మందు: ‘ప్రజలు నమ్మకంతో తీసుకుంటున్నారు’
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య మందును ఆయుర్వేదిక్ మందుగా కేంద్ర, రాష్ట్ర ఆయుష్ సంస్థలు గుర్తించలేదని తెలిపారు. ఒకవేళ ఆయా సంస్థలు గుర్తింపు ఇస్తే టీటీడీ తరఫున పంపిణీ చేద్దామనుకున్న విషయం వాస్తవమే అని చెప్పారు. కానీ.. గుర్తింపు లేని కారణంగా టీటీడీ పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో తీసుకుంటున్నారు కనుకే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని వివరించారు. ఇప్పుడు అది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని, నమ్మకం ఉన్నవారు ఆనందయ్య మందు తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని, ఈ విషయంలో మేం కల్పించుకోమని చెప్పారు. ఆనందయ్య మందు తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని అన్నారు. చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా -
కరోనా మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న ఆనందయ్య
-
ఆనందయ్య మందుల తయారీ ఇలా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణకు 5 రకాల మందులు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. 1. పి: ఈ మందు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్ వచ్చిన వారు రోజుకు రెండుసార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్ లేనివారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కో సం ఒక్కరోజు రెండుసార్లు వినియోగించాలి. తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్ దంగిలే 5 బకెట్లు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోకమిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగిచెక్క పొడి ఒక బకెట్ మిక్సీవేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి 4 గం టలు ఉడికించి మందును తయారు చేస్తున్నారు. 2. ఎఫ్: ఈ మందును పాజిటివ్ ఉన్న వారికి ఇస్తున్నారు. భోజనం తర్వాత రెండుసార్లు చొప్పున మూడురోజులు తీసుకోవాలి. పుప్పిం టి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోల వరకు సిద్ధం చేసి అన్నింటిని కలిపి మిక్సీవేసిన తరువాత చూర్ణంగా ఈ మందు తయారు చేస్తున్నారు. 3. ఎల్: ఇది కూడా పాజిటివ్ ఉన్న వారికే. పి, ఎఫ్ రకాల మందుతోపాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. నేల ఉసిరి, గుంటగలగర ఆకులు ఒక బకెట్, మిరి యాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కిలోలు తీసుకుని దీన్ని తయారు చేస్తున్నారు. 4. కె: ఇది కూడా పాజిటివ్ ఉన్న వారికే. రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కిలోలు తీసుకుని కలిపి తయారు చేస్తున్నారు. 5. ఐ: ఇది ఆక్సిజన్ తగ్గిన వారికి కంటి డ్రాప్స్. పల్స్‌ను బట్టి ఒక్కో కంట్లో ఒక్క డ్రాప్ వేయాలి. దీన్లో తేనె, ముళ్లవంకాయ గుజ్జు, తోకమిరియాలు,కిలో తేనెతో ఈ డ్రాప్స్‌ను తయారు చేస్తున్నారు. -
సంప్రదాయ మందుగా వాడవచ్చు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందును సంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడంలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు.మందు వాడకం వల్ల లాభం గురించి కాకుండా, ఎలాంటి నష్టాలు జరగలేదని భావించి ఆమోదం ఇచ్చామన్నారు. సోమవారం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములుతో కలిసి మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. మందులో వాడుతున్న పదార్థాల్లో హానికారకాలు లేవని తేలిందని చెప్పారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు పనిచేస్తుందన్న ఆధారాలు కూడా ఏమీ లేవని, ఎవరి నమ్మకాన్ని బట్టి వారు వాడుకోవచ్చని పేర్కొన్నా రు. ఇతర మందులు వాడుతున్న వారు వాటిని వాడుతూనే ఈ మందును కేవలం సప్లిమెంట్‌గా వాడాలని సూచించారు. పాజిటివ్ పేషెంట్లెవరూ క్యూలలో లేకుండా వారి సహాయకులు వచ్చి మందు తీసుకెళ్లడం మంచి దని,కంట్లో వేసే మందుకు అనుమతి లేదన్నారు. కర్ఫ్యూతో కేసులు తగ్గుముఖం కర్ఫ్యూ కారణంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గతంలో కొన్ని పత్రికలు 144 సెక్షన్ అమలు, కర్ఫ్యూపై మీడియాలో విమర్శలు చేశాయని, కానీ ఇప్పుడు ఈ విధానమే మంచి ఫలితాలనిచ్చిందని చెప్పారు. అందుకే జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగించామన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ఇదే మొదటిసారి అని తెలిపారు. రూ.7,880 కోట్లతో నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో 14 కాలేజీలకు సోమవారం శంకుస్థాపన చేశారని, రెండు కాలేజీలకు ఇంతకుముందే శంకుస్థాపన చేశారని చెప్పారు. రాష్ట్రంలో 1,179 మంది బ్లాక్‌ఫంగస్ బాధితులున్నారని, వీరిలో 97 మంది పూర్తిగా కోలుకోగా, 14 మంది మృతిచెందారని తెలిపారు. 1,179 మందిలో 40 మంది మినహా మిగతావారు కరోనా సోకినవారేనని చెప్పారు. బ్లాక్‌ఫంగస్ కేసుల్లో 370 మంది ఆక్సిజన్ సపోర్టు తీసుకున్న వారు, 687 మంది స్టెరాయిడ్స్ వాడిన వారు ఉన్నారని తెలిపారు. మధుమేహ బాధితులు 743 మంది ఉన్నారన్నారు. కోవిడ్ కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు బాగా డిమాండు తగ్గిందన్నారు. ఆక్సిజన్ స్టోరేజీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో రోజుకు 590 మెట్రిక్ టన్నులు మాత్రమే తెస్తున్నామని, ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గిందని తెలిపారు. 10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేశాం ఆయుష్ కమిషనర్ కల్నల్ రాములు మాట్లాడుతూ కృష్ణపట్నం మందుపై తమశాఖ ఈనెల 21, 22 తేదీల్లో పరిశీలన మొదలుపెట్టిందని చెప్పారు. చెప్పినట్లుగానే అన్ని పరిశీలనలు పూర్తిచేసి 10 రోజుల్లో ఫలితాలు ఇచ్చామన్నారు. దీన్నిబట్టి ఈ మందుపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చట్టం, శాస్త్రం ప్రకారం దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేదని, స్థానిక, సంప్రదాయ మందుగానే ఇవ్వాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ మందును పంపిణీ చేయాలన్నారు. ఆనందయ్యతో మాట్లాడిన తరువాత మందు పంపిణీపై తేదీలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. -
ఆనందయ్య మందుపై ప్రజలకు విశ్వాసం
ముత్తుకూరు: కరోనా నివారణకు ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు. మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతులివ్వడంతో సోమవారం ఆయ న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి వచ్చి ఆనందయ్యను అభినందించారు. సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెవిరెడ్డి చెప్పారు. -
మందు తయారీకి కసరత్తు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీకి కసరత్తు ప్రారంభమైంది. భద్రత కారణాల రీత్యా ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టులోని అతిథి గృహంలో ఉన్న ఆనందయ్య.. సోమవారం సాయంత్రం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కాకాణి మందు తయారీ, పంపిణీపై ఆనందయ్యతో చర్చించారు. మందుకు కావాల్సిన వనమూలికలు, దినుసులు సమకూర్చుకునేందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేచోట కాకుండా మూడు, నాలుగు కేంద్రాల ద్వారా మందు పంపిణీ చేయాలని యోచిస్తున్నారు. దినుసులు సేకరించాలి ఆనందయ్య మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సేకరించాల్సి ఉందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. జిల్లా యంత్రాంగంతో చర్చించి మందు ఎక్కడ తయారు చేయాలి, ఏ ప్రాంతంలో పంపిణీ చేయాలనే అంశాల్ని నిర్ణయిస్తామన్నారు. ఇదంతా పూర్తికావడానికి మూడు, నాలుగు రోజులు పడుతుందని చెప్పారు. మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని విజ్ఞప్తి చేశారు. పంపిణీకి అన్ని అనుమతులు వచ్చాక ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తన మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పరిశోధన ద్వారా నిరూపితమైందని ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తెలిపారు. మందు పంపిణీకి అనుమతి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చాం
సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు బి.ఆనందయ్య కోవిడ్ మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోవడంతో పంపిణీని తాత్కాలికంగా ఆపామని, భవిష్యత్తులో ఇబ్బందులు ఉం డకూడదని మందు శాస్త్రీయతను నిపుణులతో పరిశీలింప చేశామని పేర్కొన్నారు. కంట్లో వేసే ఐ డ్రాప్స్‌తో సహా పి, ఎఫ్, ఎల్, కె పేరుతో ఆనంద య్య మొత్తం 5 రకాల మందులు తయారు చేస్తున్నారని తెలిపారు. ఇందులో ఐ డ్రాప్స్, కె రకం మందు మినహా మిగిలిన 3 రకాల మందుల పంపిణీకి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. పి, ఎఫ్, ఎల్ మందుల వల్ల దుష్ప్రభావాలు కలగడం లేదని ఆయుష్ విభాగం నివేదిక ఇచ్చిందన్నారు. ఐ డ్రాప్స్‌పై తుది పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. కె రకం మందు శాంపిల్స్‌ను ఆనందయ్య ఇవ్వలేదని, అందువల్ల ఆ మందును పరీక్షించలేదని చెప్పారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఐ డ్రాప్స్‌తో పాటు కె మందు పంపిణీకి అనుమతులిచ్చే విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఐ డ్రాప్స్, కె రకం మందుపై పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. మందు పంపిణీ చేసే చోట కోవిడ్ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని, ఆ మందు పంపిణీకి తక్షణమే అనుమతులిచ్చేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా, తనకు భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలంటూ ఆనందయ్య పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ విజయలక్ష్మి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ మందు తయారీకి లైసెన్స్ అవసరం లేదు ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ ఆనందయ్య మందు తయారీకి లైసెన్స్ అవసరం లేదన్నారు. ఫార్ములా చెప్పాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పా రు. శాంతిభద్రతల పేరుతో మందు పంపిణీని అధికారులు అడ్డుకుంటున్నారని, మందు పంపిణీకి అనుమతినిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్ వాదనలు వినిపిస్తూ ఆనందయ్య మందు తీసుకున్న వారిలో దాదాపు 130 మంది నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆనందయ్య ఐ డ్రాప్స్ తీసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు కోటయ్య తరువాత ప్రభుత్వాస్పత్రిలో చేరి సోమవారం మరణించారని చెప్పారు. ఆనందయ్య వద్ద పనిచేస్తున్న వారిలో కూడా కొందరు కోవిడ్ బారిన పడ్డారన్నారు. ఔషధాన్ని చాలా జాగ్రత్తగా తయారు చేయాలని, లేకపోతే బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన పీవీ కృష్ణయ్య స్పందిస్తూ.. కోటయ్య మృతిపై సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. మరో పిటిషనర్ న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. కోవిడ్‌కు నిర్దిష్టంగా మందు లేదని, అందువల్ల ఆనందయ్య తయారుచేసే సంప్రదాయ మందు పంపిణీకి అనుమతించాలని కోరారు. ఐ డ్రాప్స్ విషయంలోనే సమస్య కె రకం మందు, ఐ డ్రాప్స్ విషయంలో నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందని ధర్మాసనం ప్రశ్నిం చింది. కె రకం మందు శాంపిల్స్ ఆనందయ్య ఇచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని సుమన్ తెలిపారు. ఐ డ్రాప్స్ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం చెబుతామన్నారు. ఐ డ్రాప్స్ నేరుగా కంటి నరాల్లోకి వెళతాయని, అందువల్ల అత్యంత శుభ్రమైన వాతావరణంలో తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆనందయ్య న్యాయవాది అశ్వనీకుమార్.. ఐ డ్రాప్స్ వల్ల ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని, అందువల్ల వాటికి అనుమతి ఇవ్వాలని కోరారు. తుది పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతున్నప్పుడు అంత తొందర ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు మూడు వారాలు వేచి చూడటంలో తప్పేమీ లేదంది. ఐ డ్రాప్స్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తదుపరి విచారణలో చెప్పాలని ధర్మాసనం సుమన్‌కు సూచించింది. ఐ డ్రాప్స్, కె రకం మందు విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అడ్డుకోవడం లేదు.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పం దిస్తూ.. ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకోవ డం లేదన్నారు. పంపిణీ సమయంలో కోవిడ్ మార్గదర్శకాలు అమలు కాకపోవడంతో తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆనందయ్యను కోరామని చెప్పారు. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి విషయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం కొనసాగుతోందని, ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేయాలని కోరారు. దర్మాసనం అంగీకరిస్తూ విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణలో.. ఆనందయ్య మందు పంపిణీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సుమన్ తెలిపారు. 688 మందితో ఆయుర్వేద నిపుణులు మాట్లాడారని, ఆనందయ్య మందు వల్ల దుష్ప్రభావాలు కలగలేదని వారు చెప్పారని పేర్కొన్నారు. మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీకి తగిన మార్గదర్శకాలు జారీచేస్తారని తెలిపారు. -
రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి
కోట/నెల్లూరు (అర్బన్): కృష్ణపట్నంలోని ఆనందయ్య మందు తీసుకుని కరోనా నుంచి కోలుకున్నానని చెప్పిన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడికి చెందిన విశ్రాంత హెచ్ఎం బైనా కోటయ్య(62) సోమవారం మృతి చెందారు. ఆ మందు కరోనాకు బాగా పని చేస్తుందంటూ కోటయ్య మాటల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఈ నెల 22న ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్ల సూచనల మేరకు కుటుంబ సభ్యులు నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ‘ఊపిరితిత్తులు క్షీణించడంతోనే.. ’ కోటయ్యకు ఆస్పత్రికి వచ్చేటప్పటికే ఊపిరితిత్తులు 80 శాతం వరకు దెబ్బతిన్నాయని పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ సోమవారం చెప్పారు. ఆనందయ్య మందు తీసుకున్న తరువాత నాలుగు రోజులకు కోటయ్య ఆరోగ్యం బాగలేదంటూ పెద్దాస్పత్రిలో చేరాడని చెప్పారు. అప్పటికే కోటయ్య మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా ఉండటంతో తాము మరింత కేర్ తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో తాము చేసిన వైద్యం వల్ల కొంత మెరుగైనప్పటికీ మళ్లీ ఆరోగ్యం విషమించి మృతి చెందాడని తెలిపారు. -
నెల్లూరు: మళ్లీ రహస్య ప్రాంతానికి ఆనందయ్య
-
మళ్లీ రహస్య ప్రాంతానికి ఆనందయ్య
సాక్షి, నెల్లూరు: వారం రోజుల తర్వాత నిన్న కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్న ఆనందయ్య.. మళ్లీ రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిన ఆనందయ్య.. కాసేపట్లో వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లారు. ఆనందయ్యను పోలీసులే తీసుకెళ్లినట్లు సమాచారం. కృష్ణపట్నం నుంచి ఆనందయ్యను రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు భద్రత కల్పించినట్లు తెలిసింది. ఆనందయ్య మందుపై నేడు తుది నివేదిక నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందన్నారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేస్తోందన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద రాములు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం సంస్థ అధ్యయన నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు. చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! -
అనుమతులొచ్చిన అనంతరమే మందు పంపిణీ
ముత్తుకూరు: కరోనా నివారణకు తాను తయారు చేసిన ఆయుర్వేద మందుపై అధ్యయనం జరుగుతుందని, ప్రభుత్వ అనుమతి రాగానే మందు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి ఆనందయ్య తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం మందు పంపిణీ జరుగుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతానికి తమ వద్ద మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు లేవని చెప్పారు. ప్రభుత్వం ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేసిన తర్వాత సీవీఆర్ కాంప్లెక్స్‌లో ఉంటున్న బొనిగి ఆనందయ్య శుక్రవారం కృష్ణపట్నంలోని తన ఇంటికి చేరాడు. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. దీంతో పోలీసులు ఆయనకు రక్షణగా నిలిచారు. -
ఆనందయ్య మందుపై నేడు తుది నివేదిక
సాక్షి, అమరావతి: నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందన్నారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేస్తోందన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద రాములు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం సంస్థ అధ్యయన నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక మందు పంపిణీపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందుల్లేని విధంగా మందు పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారన్నారు. ఇప్పటి వరకు వచి్చన విచారణ నివేదికలు అన్నీ పాజిటివ్‌గా వచ్చాయని పేర్కొన్నారు. మందుపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించలేదని చెప్పారు. ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకుంటే త్వరగా ప్రాసెస్ చేస్తామని చెప్పారు. -
‘నాటు మందుపై అన్నింటిని పరిగణలోకి తీసుకున్నాకే నిర్ణయం’
సాక్షి, తాడేపల్లి: ఆనందయ్య కరోనా మందు పంపిణీ విషయంలో దాఖలైన పిటిషన్ సోమవారానికి వాయిదా పడినట్లు ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఈ లోగా ఆ మందులో చివరి రిపోర్టు రేపు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేసిందని, కేంద్ర బృందాల నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం ఉన్నందున, అన్నింటిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ అంశంకు సంబంధించి చట్టం, ప్రజల మనోభావాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించినట్లు రాములు తెలిపారు. వారం తర్వాత కృష్ణపట్నంలోని నివాసానికి వారం తర్వాత కృష్ణపట్నంలోని తన నివాసానికి ఆనందయ్య చేరుకున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. గత వారంగా కృష్ణపట్నంలోని సీవీఆర్ ఫౌండేషన్‌లో ఉన్న ఆనందయ్య ఉన్నారు. ఆనందయ్యకు మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆలోచనతో మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్ -
ఆనందయ్య మందు నేనూ ఇస్తా.. యువకుడి పోస్ట్
సాక్షి, మిర్యాలగూడ : కరోనాకు ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు తాను ఇస్తానని ఓ ఆకతాయి సోషల్ మీడియా గ్రూప్‌ల్లో చేసిన ప్రచారం హల్చల్ చేసింది. గురువారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని బాల్నెపల్లికి చెందిన ఆకతాయి కుర్ర రమేష్ తాను కరోనాకు ఆనందయ్య తరహా ఆయుర్వేద మందు ఇస్తానని వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టు వైరల్ అయ్యింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి కరోనా బాధితులు, వారి బంధువులు రమేష్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వారు సైతం రమేష్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నించేందుకు రమేష్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామి ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు. చదవండి: నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్ -
ఆనందయ్య మందుపై త్వరలో ప్రయోగాలు ప్రారంభం
-
ఆనందయ్య కరోనామందుపై కీలక దశకు చేరుకున్న ప్రయోగాలు
-
ఆనందయ్య మందు: కీలక దశకు ప్రయోగాలు
సాక్షి, తిరుపతి/ న్యూఢిల్లీ: కరోనా నివారణకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన మందు తీసుకున్న వారిపై ఆయుర్వేద వైద్య బృందం విచారణ పూర్తి చేసింది. నివేదికను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)కు పంపింది. నివేదికను పరిశీలించాక వారు ఇచ్చే ఆదేశాల కోసం ఆయుర్వేద వైద్య బృందం ఎదురుచూస్తోంది. ఆనందయ్య మందు తీసుకున్న వారికి ప్రతికూల ప్రభావం ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌తో పాటు ఆయుర్వేద వైద్య నిపుణులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. దీనిపై తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరి శోధన సంస్థ సంయుక్తంగా కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సభ్యులు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న 570 మంది వివరాలను సేకరించారు. వీరిలో అందుబాటులోకి వచ్చిన 380 మందితో మాట్లాడారు. కరోనా రాకుండా ఉండేందుకు, పాజిటివ్ వచ్చాక మందు తీసుకున్న వారు, ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన తరువాత మందు తీసుకున్న వారితో వివరంగా మాట్లాడారు. మందు తీసుకున్న తరువాత పాజిటివ్ ఎవరికైనా వచ్చిందా? లేదా?, అనా రోగ్య సమస్యలు తలెత్తాయా? వంటి వివరాలను సేకరించారు. కమిటీ విచారణలో దాదాపు అందరూ ఆనందయ్య మందుకు అనుకూలంగానే అభిప్రాయం తెలియజేసినటు సమాచారం. కాగా, ఆనందయ్య మందు జంతువులపైనా ప్రయోగించేందుకు తిరుపతి సమీపంలోని సృజన లైఫ్ ల్యాబ్ ఎదురుచూస్తోంది. జంతువులపై ప్రయోగాలకు అర్హతపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిపుణులతో చర్చించారు. సీసీఆర్ఏఎస్ నుంచి అనుమతి వస్తే ప్రయోగాలు చేస్తామని ఇక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఎలుకలు, చుంచులపై కరోనా వైరస్ ఎక్కించి, ఆ తరువాత ఆనందయ్య మందును ప్రయోగించనున్నట్లు వివరించారు. ఇందుకుగాను సృజన లైఫ్ ల్యాబ్‌లో పరీక్షలకు అవసరమైన ఎలుకలు, చుంచులను సిద్ధం చేశారు. ఉప రాష్ట్రపతి ఆరా.. ఆనందయ్య మందు పరిశోధన పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ.బలరాం భార్గవ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. మందును వాడిన 570 మంది నుంచి వివరాలు సేకరించి, పరి శోధన జరుపుతున్నామని కేంద్ర మంత్రి వివరించారు. వీలైనంత త్వరలోనే పరిశోధన పూర్తి చేసి నివేదికను సిద్ధం చేస్తామన్నారు. ఈ మందు ఆయుష్ విభాగ పరిధిలోనిది గనుక, ఇప్పటికే ఆయుష్ వారి పరిశోధన ప్రారంభమై, కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ అదనంగా ఐసీఎంఆర్ విచారణ అవసరం లేదని బలరాం భార్గవ్ ఉపరాష్ట్రపతికి చెప్పారు. చదవండి: అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానం కరోనా చికిత్సలో ఈ మెడిసిన్ వాడేటప్పుడు జాగ్రత్త..! -
ఆనందయ్య మందుపై త్వరగా నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధం పంపిణీ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆనందయ్య ఔషధంపై పరీక్షలు చేస్తున్నామంటూ జాప్యం చేయడం సరికాదంది. ఆనందయ్య ఔషధం తయారీ, దానికి అనుమతులు, పంపిణీ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేశ్, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణ పట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కోవి డ్ మందు పంపిణీలో జోక్యం చేసుకోకుండా అధికా రుల ను ఆదేశించాలని, ఆ మందు పంపిణీకి తక్షణమే అనుమ తులిచ్చేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పి.మల్లి కార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గురువారం జస్టిస్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ జోక్యం చేసుకుంటూ.. ఆనందయ్య మందు నమూనాలను ఆయుష్ విభాగం ల్యాబ్‌కు పంపిందని, ఈ నెల 29న నివేదిక అందుతుందని చెప్పారు. ఈ మందు ప్రజా వినియోగానికి అనువైనదని తేలితే పంపిణీకి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం తయారీదారు దరఖాస్తు చేసుకుంటే ఆ ఔషధాన్ని పరీక్షించి, ప్రజా వినియోగానికి యోగ్యమైనదిగా భావిస్తే పంపిణీకి అనుమతినిస్తామని చెప్పారు. ఆనందయ్య మందువల్ల దుష్ప్రభావాలు లేవని మీడియాలో ప్రచారమే తప్ప అధికారిక నివేదిక ఏదీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. సాంకేతిక అంశాల జోలికి వెళ్లొదని స్పష్టం చేసింది. ఆనందయ్య ఔషధానికి ఎవరు అనుమతులు ఇవ్వాలి? ఆ మందును ప్రజలకు ఇవ్వొచ్చా? లేదా? అన్న విషయాలను తదుపరి విచారణలో తమముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫార్ములా చెప్పాలని అధికారులు బెదిరిస్తున్నారు మరోవైపు.. తన ఔషధంలో ఉపయోగించే పదార్థాలు, ఫార్ములా చెప్పాలని నెల్లూరు జిల్లా అధికారులు బెదిరిస్తున్నారని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు భద్రత కూడా కల్పించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను కూడా ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది. -
ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయం ఏంటో?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ఆనందయ్య మందు పంపిణీపై ఏపీ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం.. హైకోర్టుకు తెలిపింది. ల్యాబ్‌ల నుంచి ఈనెల 29న రిపోర్టులు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఆనందయ్య మందు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని.. వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు పేర్కొంది. ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవని తేలితే సెంట్రల్ ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్రం తెలిపిందని, ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి? మందుపై అభిప్రాయం ఏంటో? కోర్టుకు తెలపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. చదవండి: ఏపీలో టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ అర్చకులపై ఏపీ సర్కార్ వరాల జల్లు.. -
నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్
ముత్తుకూరు: కరోనా నివారణకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన మందును ఆయుష్ అధ్యయనం నేపథ్యంలో నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అదునుగా ఆనందయ్య శిష్యులుగా చెప్పుకునే కొందరు నకిలీ మందు తయారు చేసి వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నారు. తోటపల్లిగూడూరు మండలం కుమ్మరమిట్టకు చెందిన యడవల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నకిలీ ఆయుర్వేద మందు తయారు చేస్తున్నట్టు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథరెడ్డి, కృష్ణపట్నం సీఐ షేక్‌ఖాజావలి చెప్పారు. ముత్తుకూరులోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. నిందితుడు గతంలో ఆనందయ్య వద్ద మందు తెచ్చుకున్నాడని, సరిగ్గా అలాంటి మందు తయారు చేసి పంపిణీ చేయడం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. నిందితుడితో పాటు నకిలీ మందును స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. -
ఆనందయ్య మందు: నివేదిక సమర్పించిన టీటీడీ
సాక్షి, తిరుపతి: ఆనందయ్య మందుపై టీటీడీ కమిటీ సర్వే పూర్తి అయ్యింది. 570 మందిపై కమిటీ సర్వే చేసింది. 80 శాతం మంది ఆనందయ్య మందుపై సానుకూల స్పందన వచ్చింది. సీసీఆర్ఏఎస్కు టీటీడీ కమిటీ నివేదిక సమర్పించింది. కమిటీ సభ్యులు డా.రేణుదీక్షిత్ ఆధ్వర్యంలో సర్వే జరిపారు. తిరుపతి సుజన్ లైఫ్ ల్యాబ్‌లో ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. సుజన్ లైఫ్ సైన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. రేపటి నుంచి సుజన్ ల్యాబ్‌లో జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. సుజన్ లైఫ్ ల్యాబ్ నుంచి 15 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. చదవండి: ఏపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాలి -
ఆనందయ్య మందు: కృష్ణపట్నంలో టీడీపీ హడావుడి
సాక్షి, ముత్తుకూరు: కృష్ణపట్నంలో మంగళవారం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ నేతలు ఆనందయ్య మందు తయారీ ప్రాంతంలో హడావుడి చేశారు. సోమిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు తొలుత ఆనందయ్య ఇంటికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో సతీమణి ఇంద్రావతితో మాట్లాడారు. ఆనందయ్య వెన్నంటి ఉన్న యువకులను సత్కరించారు. మందు తయారీ ప్రాంతంలో కలయదిరిగి హడావుడి చేశారు. మందు పంపిణీ నిలిపి వేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. చుక్కల మందు డ్రామా కరోనా నియంత్రణకు ఆనందయ్య మందు పేరుతో టీడీపీ నేతలు డ్రామా నిర్వహించారు. కృష్ణపట్నంలో మందు తయారీ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోపాలపురం వద్ద స్థానికేతరులను ఎవరినీ కృష్ణపట్నంలోకి వెళ్లనీయకుండా పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణకు చెందిన ప్రకాష్ అనే కరోనా పేషెంట్ తల్లి మల్లీశ్వరితో గ్రామంలోకి నడుచుకుని వస్తుండగా చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేశారు. మరో మార్గంలో తల్లితో కలిసి కృష్ణపట్నంలోకి వచ్చేశాడు. సమీపంలోని ఒక చెట్టు కింద సేద దీరుతున్నాడు. అదే సమయంలో సోమిరెడ్డి నేతృత్వంలోని టీడీపీ బృందం అక్కడికి చేరుకుంది. ఆ పేషెంట్‌తో మాట్లాడారు. డ్రామాను రక్తికట్టించే విధంగా తల్లితో పాటు నడుచుకుంటూ వచ్చిన యువకుడి పరిస్థితిని విషమంగా ఉన్నట్లు చూపిస్తూ, కంట్లో రెండు చుక్కలు మందు వేయించారు. నిమిషాల్లో ఆ యువకుడు లేచి కూర్చొని, ఒళ్లు విరుచుకుంటూ నిలబడి సాధారణంగా మాట్లాడడం చూస్తే సినిమా ట్రిక్‌లా అనిపించింది. అయితే అక్కడ జరుగుతున్న తంతును చూసి స్థానికులు సైతం ఒకింత ఆశ్చర్యపోయారు. నాలుగు రోజులుగా గ్రామంలో మందు తయారీ లేకపోవడం గమనార్హం. అయితే ఎక్కడి నుంచి కంటి మందు తెచ్చారో తెలియదు. ఆనందయ్య మందుపై ప్రజల్లో మరింత ఆసక్తి పెంచేలా డ్రామా వెనుక రాజకీయ కోణం కనిపిస్తోంది. ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై ఆయుష్ శాఖ చేపట్టిన పరిశోధనలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే దశలో టీడీపీ ప్రజలను మరింత రెచ్చగొట్టే విధంగా ఉందని స్థానికులు సైతం విమర్శించడం కనిపించింది. చదవండి: కృష్ణపట్నంలో ఐసీఎంఆర్ బృందం -
నేడు సీసీఆర్ఏఎస్కు ఆనందయ్య మందు నివేదిక
తిరుపతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ 500 మంది నుంచి నివేదిక తయారు చేసింది. ఈ కమిటీ నేడు( బుధవారం) సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్ఏఎస్)కు నివేదిక సమర్పించనుంది. మరో రెండ్రోజుల్లో సీసీఆర్ఏఎస్ నుంచి నిర్ణయం వెలువడనుంది. ఆనందయ్య మందు కోసం దేశ వ్యాప్తంగా ప్రజల ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అన్ని అనుకూలిస్తే ఈ నెలాఖరుకు ఆయుర్వేద మందును టీటీడీ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఆ మందు ఎటువంటి హానికర పదార్థం కాదని స్పష్టత వచ్చింది. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్‌శాఖల పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధన -
ఆనందయ్య మందుపై రేపు హైకోర్టు విచారణ
సాక్షి, అమరావతి: కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు బొణిగి ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ఈనెల 27న (రేపు) విచారణ జరపనుంది. న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే అవకాశం ఉంది. కరోనా మందు పంపిణీకి తక్షణమే ఆనందయ్యకు అనుమతినిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ గుంటూరు జిల్లా, పిడుగురాళ్లకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లికార్జునరావు, కోవిడ్ రోగుల కోసం ఆనందయ్య మందును ఆయుర్వేద ముందుగా గుర్తించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ అనంతపురము జిల్లా, కళ్యాణదుర్గంకు చెందిన ఎం.ఉమామహేశ్వర నాయుడు సోమవారం హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఈనెల 27న వెకేషన్ కోర్టులో ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరపనుంది. -
ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధన
సాక్షి, తిరుపతి: నెల్లూరు ఆనందయ్య మందు తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిశోధనను ముమ్మరం చేసింది. అందులో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల హెచ్వోడీలు, పీజీ విద్యార్థులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ శాస్త్రీయ అధ్యయనం చేసిన అనంతరం కరోనా నివారణకు మందును తయారు చేసేందుకు టీటీడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఆ మందు ఎటువంటి హానికర పదార్థం కాదని స్పష్టత వచ్చింది. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్‌శాఖల పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయుర్వేద నిపుణులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి కృష్ణపట్నం వెళ్లి ఈ ఔషధాన్ని పరిశీలించారు. ఈ మందు ద్వారా కరోనా నివారణ అయితే ప్రజలందరికీ ప్రభుత్వ సహకారంతో టీటీడీతో ఉత్పత్తి చేయించి పంచే ఏర్పాట్లు చేస్తామని చెవిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో రంగం సిద్దం చేస్తున్నారు. శాస్త్రీయ అధ్యయనంలో టీటీడీ కమిటీ ఆనందయ్య తయారు చేసిన మందును అనేకమంది కరోనా బాధితులకు పంపిణీ చేశారు. వారి నుంచి వివరాలు సేకరించి, ఆ మందులో కరోనాను నివారించే గుణాలు ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు టీటీడీ చైర్మన్, ఈవోల ఆదేశాల మేరకు టీటీడీ ఆయుర్వేద వైద్యకళాశాల హెచ్‌వోడీలతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ రేణుదీక్షిత్ పర్యవేక్షణలో ఆయుర్వేద వైద్యులు శ్రీదుర్గ, లక్ష్మణప్రసాద్, శ్రీనివాస్‌కుమార్, ఇన్చార్జ్ హెచ్వోడీలు రాగమాల, గోపాలకృష్ణలను కమిటీలో నియమించారు. వీరితోపాటు పీజీ విద్యార్థులు సుమారు 50 మంది ఈ అధ్యయనంలో పాల్గొంటున్నారు. విజయవాడకు చెందిన కొందరు ఆయుర్వేద వైద్యులు కూడా ఈ పరిశోధనలో భాగస్వాములయ్యారు. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారికి ఈ మందు పనిచేసిందా? లేదా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈ మందు తీసుకున్నాక రానున్న రోజుల్లో ఎలా పనిచేయనుంది? అనే వివరాలు సేకరిస్తున్నారు. వివరాలన్నీ సేకరించాక.. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)కు నివేదిక పంపనున్నారు. కంట్లో డ్రాప్స్ వేయడం ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ ఆయుష్ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాం. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్న వారి రిపోర్ట్ తయారు చేస్తున్నాం. కంట్లో డ్రాప్స్ వేయడం ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ. కంటి ద్వారా వేసిన మందు త్వరగా శరీరంలోకి చేరుతుంది. ఐసీఎంఆర్‌కు, ఆయుర్వేదానికి సంబంధం లేదు. కేంద్రంలో సీసీఆర్ఏఎస్ ఉంది. వారి అనుమతి తీసుకోవాలి. – డాక్టర్ రేణుదీక్షిత్, టీటీడీ కమిటీ పర్యవేక్షకురాలు -
ఆనందయ్య మందుపై ఫలితాలు రాగానే నిర్ణయం
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందులకు సంబంధించి ‘సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్’ (సీసీఆర్ఏఎస్)కు పంపిన శాంపిళ్ల ఫలితాలు రాగానే నిర్ణయం తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కోవిడ్–19 నియంత్రణ, చికిత్సపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం ఆనందయ్య మందులో వినియోగిస్తున్న పదార్థాల గురించి రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు ముఖ్యమంత్రికి వివరించారు. ఆనందయ్య మందుల్లో కంట్లో వేసే డ్రాప్స్‌పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కంట్లో డ్రాప్స్‌పై పరిశీలన ఫలితాలు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఆనందయ్య మందుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపామని, కొన్ని రకాల పరీక్షల ఫలితాలు వచ్చాయని, కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని కమిషనర్ వివరించారు. ఈ మందు శాంపిళ్లను సీసీఆర్ఏఎస్కు పంపామని, వాళ్లు 500 మందికి ఇచ్చి పూర్తిస్థాయి పరిశీలన చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మందు వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో నివేదిక వస్తుందని అధికారులు చెప్పారు. 30–35 ఏళ్లగా మందులు ఇస్తున్నారు కృష్ణపట్నంలో ఆనందయ్య 30–35 సంవత్సరాలుగా మందులు ఇస్తున్నారని ఆయుష్ కమిషనర్ రాములు సమావేశంలో తెలిపారు. కరోనాకు నోటి ద్వారా 4 రకాల మందులు, కళ్లలో డ్రాప్స్.. ఇలా 5 రకాల మందులు ఇస్తున్నారని తెలిపారు. ఈ మందుల్లో ఆనందయ్య 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారని చెప్పారు. పసుపు, జీలకర్ర, జాజికాయ, కర్పూరం, మిరియాలు, తేనె.. ఇలా 18 రకాలను ఆనందయ్య 5 రకాల మందుల్లో వాడుతున్నారని వివరించారు. అన్నీ సహజంగా దొరికే పదార్థాలేనని, వేరే ఏ ఇతర పదార్థాలను ఆయన వాడడం లేదని చెప్పారు. మందుల తయారీ విధానాన్ని తమకు చూపించారని, ఫార్ములా కూడా చెప్పారని తెలిపారు. -
‘కృష్ణపట్నం’ తగాదా తేలిగ్గా తేలేదా?!
చాలా కాలంగా సాగుతున్న ‘ఆయుర్వేదం’ ‘అలోపతి’ వైద్య విధానాల మధ్య వివాదానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కేంద్రం కావడం విశేషం. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ప్రజాబాహుళ్యంలో ఏర్పడిన భయాందోళనలను సంబాళించే ధైర్యసై్థ్యర్యాలను కలిగించడం కోసం పక్కవాటుగా ఆ మాత్రం పాత్రను పోషించడంలో ‘‘ఆయుర్ వేదం’’ తోడ్పడితే సంతోషించాల్సిందే! నిజానికి ఆయుర్వేదం పేరుకే గానీ, ప్రకృతి ప్రసాదించిన సొంఠి, పసుపు, మిరప, బెల్లం, జొన్న వగైరా పంట లన్నీ శరీర కల్మషాలకు విరుగుళ్లే సుమా! శ్వాస ఉండే వరకూ మనిషిలో ఆశ చావదు. ఆ ఆశను బతికి బట్టకట్టనివ్వాలన్న ఆశ వొడిగట్టిపోకుండా ఉంచే లక్షణం ఆయుర్వేదాన్ని నమ్ముకున్న వారిలో సహితం ఉండటం సర్వసాధారణం! ‘‘కోవిడ్–19 (కరోనా) పెను వైరస్ వ్యాధి వ్యాప్తి వల్ల భారత్‌లో ప్రజల మరణాల సంఖ్య పెరిగిపోతున్నందున వారికి ప్రజారోగ్య సిబ్బంది నెలల తరబడిగా సేవలందిస్తూ ఆసుపత్రుల్లో లెక్కలేనన్ని గంటలు గడుపుతున్నారు. పైగా వైద్య సేవలందించడానికి సరిపడా వనరులు లేనందున రోగులతో పాటు సిబ్బందికి కూడా కోవిడ్ అంటువ్యాధి సోకిపోతోంది. ఈ దుస్థితిలో వైద్యసేవలందించే దేశ ఆరోగ్య రక్షణ సిబ్బంది మానసికమైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవలసిన దుస్థితి ఏర్పడింది’’ ‘‘ది హిందూ’’ (23–5–21) ఈ అత్యంత ప్రమాదకర దుస్థితిలో గొడ్డు వాడు గొడ్డు కోసం ఏడిస్తే, దాని తోలు కోసం మరొకరు ఏడ్చినట్టుగా నేటి దేశ వైద్య వృత్తిలో వింత తగాదాలు మరోసారి తలెత్తాయి. చాలా కాలంగా దేశ వ్యాప్తంగా సాగుతున్న ‘ఆయుర్వేదం’ ‘అలోపతి’ వైద్య విధానాల మధ్య వివాదానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కేంద్రం కావడం విశేషం. పైగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ జిల్లా నాయకుడైనందున ‘‘ఆయుష్మాన్ భారత’’ సంస్థకు కేంద్రప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నందున ఆ సంస్థ పాలసీని అమలు జరిపే భారం లేదా బాధ్యతను కేంద్ర ‘ఆయుష్’ శాఖామంత్రి కిరణ్ రిజ్జూ మీద పెట్టారు. దీనితో పాటు కేంద్రం ఆధీనంలో పనిచేయాల్సిన భారత వైద్య పరిశోధనా మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పైన పడింది. బీజేíపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత అత్యాధునిక వైద్యశాస్త్ర పరిశోధనలపై ఆధారపడి ప్రశంసార్హమైన శాస్త్ర, పరిశోధనా పలితాల్ని ప్రపంచానికి అందించి, కోట్లాదిమంది ప్రజలకు జయప్రదంగా సేవలందించిన అలోపతి వైద్యానికి పోటీగా కేంద్రస్థాయిలో ఆయుర్వేద వైద్యాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించింది. ఈ పథకాన్ని అమలు జరపడానికి రెండేళ్ల క్రితమే పెద్ద ప్రయత్నం జరగగా వివాదం మధ్యలో ‘ఆయుష్మాన్ భారత్’ సంస్థలో పనిచేస్తున్న నిపుణులొకరు సంస్థ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయారన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి! ఆ తరువాత ‘ఆయుష్మాన్ భారత్’ ముందుకు సాగలేదు. కారణం, రోగాలకు ‘అంటురోగ మహమ్మారులకు, వందల సంత్సరాలుగా వైద్యశాలల్లో, పరిశోధనాగారాల్లో శాస్త్రీయ ప్రాతిపదికపై జరిపిన వేల ప్రయోగాల ఆధారంగా మందులు మాకులు ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. ఆ మాటకొస్తే అరుదుగా లభించే వనమూలి కలు ఆధారంగా రోగాలకు ‘చిట్కా’ వైద్యాలు కూడా ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. అవి శాస్త్రీయ పరిశోధనలకు కొన్ని మాత్రమే తప్ప మిగతావి నిలబడలేదన్నది అలోపతి వైద్య శాస్త్రవేత్తలే కాదు ‘కొందరు ఆయుర్వేద’ వైద్యులు కూడా ఒప్పుకుంటారు. దీనికి కారణాన్ని– ఆయుర్వేద వైద్యశాస్త్రంలో నిపుణుడిగా తెలుగునాట ప్రసిద్ధికెక్కిన బాలరాజు మహర్షి పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్య మూలికల సేకరణ వాటి లభ్యత సాధ్యాసాధ్యాలపైన ఆధారపడింది కాబట్టి వాటి సేకరణ ఇతర ముడిపదార్థాల సేకరణపై కూడా ఆధార పడి ఉంది కాబట్టి ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదని బాలరాజు మహర్షి అభిప్రాయం. ఈ ప్రాతిపదిక మీద ఆయన దాన్ని తాత్కాలిక ‘చిట్కా వైద్యం’ గా మాత్రమే పరిగణిస్తూ వచ్చారు! ఆమాటకొస్తే ‘‘కోవిడ్–19’’ వైరస్‌పైన కేంద్రీకరించి తాజా పరిశోధనలు నిర్వహించిన ప్రసిద్ధ అమెరికన్ జీవ, గణిత శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రెడ్ ఆడ్లర్ ఇకపై మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గణనీయమైన మార్పులు ఏమేమి రాబోతున్నాయనే అంశంపై ఒక ఆశాజనకమైన విశ్వాసాన్ని ప్రకటించాడు! ఈ విశిష్ట ప్రకటనకు సంబంధించిన తన పరిశోధనా ఫలితాన్ని ‘‘వైరసెస్’’ అన్న పరిశోధనా పత్రికలో వెల్లడించారు! ఇక మీదట కోవిడ్–19 లాంటి హానికరమైన వైరస్‌కు కారణమైన ప్రమాదకరమైన కరోనా విషక్రిమి రానున్న పదేళ్లలోగానే జలుబు, దగ్గు లాంటి సాధారణ రుగ్మతలకు మించి దరిచేరబోవని అడ్లర్ భరోసా! ఈ పరిణామ క్రమంలో సామూహికంగా జనాభాలో రోగనిరోధక శక్తి పెరిగే కొలది కోవిడ్–19 క్రమంగా తోక ముడుస్తుందని చెప్పాడు! వైరస్‌లో వచ్చే మార్పుల కన్నా మన శరీరం రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులకు సర్దుబాటై పోతుందన్నాడు! పరిణామ క్రమంలో స్వల్పంగా సోకే ఇన్ఫెక్షన్లు– రాబోయే తీవ్రమైన అంటురోగాలను కూడా ఎదుర్కొనగల శక్తిని మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు తరిఫీదు ఇస్తాయన్నాడు ప్రొఫెసర్ అలెగ్జాండర్ బీమ్స్ (ఉటా యూనివర్శిటీ– అమెరికా)! అయితే ఇంతకూ ఆయుర్వేద వైద్యులు ఒక కీలకమైన ప్రశ్నకు తడబడకుండా విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంతవరకూ ప్రపంచదేశాలను పలకరించి ఎంతో వినాశాన్ని మిగిల్చిన సుమారు 300 వైరస్ వ్యాధులలో ‘‘ఆయుర్వేద వైద్యం’’ ఎన్నింటిని పరిష్కరించగల్గిందో వివరించగల్గాలి! అన్నీ వేదాల్లోనే ఉన్నాయి. అని సర్దుకుంటే చాలదు. ఎందుకంటే అసలు సృష్టి రహ స్యాన్నే రుగ్వేదం (నాసదీయ సూక్తం 129 పదవ మండలం) హేతు వాదనతో ప్రశ్నించి విడమర్చింది! ఈ సృష్టి ఎలా జరిగింది’’ అని, అందుకు భగవంతుడు సృష్టి కారకుడా? అనీ, (2) కనీసం భగవంతు డికి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా, అని! అందుకు ‘‘నా సదీయ సూక్తం’’ చెప్పిన సమాధానం సృష్టి జరిగిన తరువాత వచ్చిన వాడు భగవంతుడు కాబట్టి, సృష్టికర్త కాజాలడు. అంచేత ఈ సృష్టి ఎలా జరిగిందో కూడా భగవంతుడికి తెలియదు’’ అని చెబుతుంది! కాబట్టి సృష్టికీ, భగవంతుడికీ ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది రుగ్వేదం! అంటే రుగ్వేద కాలం నాటికే భారతదేశంలో భౌతిక వాదం,హేతువాదం ఆవిర్భవించాయనుకోవాలా?! కాబట్టి మాన వుడి ‘‘ఆయుష్షు’’కి వేదానికీ సంబంధం లేకపోయినా ‘‘దైవాధీనం మోటారు సర్వీసు’’ అన్నట్టుగా వేదం నుంచి ఆయుర్వేదాన్ని లాగ సాగారు.! నిజానికి చైనాలో కూడా ‘‘ఆక్యుపంక్చర్’’ లాంటి నిరూపితమైన కేవలం కొన్ని ప్రాచీన వైద్య పద్ధతుల పునరుద్ధరణను అనుమతిం చారు గాని, శాస్త్రీయ పద్ధతులకు, ఆచరణలో నిరూపణలకు సరిపో లిన వాటినే అనుమతించారని మరవరాదు. మనకు చిన్నతనంలో ప్రకృతి సిద్ధమైన పిడుగులు వినిపిస్తే ‘‘అర్జునా! ఫల్గుణా అని వల్లిస్తుంటే పిడుగులు పోతాయని అంటూండేవారు. అంటే భయాన్ని తొలగించి మనస్సును కుదుట పరచడంలో అలా అనేవాళ్లు. ప్రస్తుతం కోవిడ్–19 వల్ల ప్రజాబాహుళ్యంలో ఏర్పడిన భయాందోళనలను సంబాళించే ధైర్యసై్థ్యర్యాలను కలిగించడం కోసం పక్కవాటుగా ఆ మాత్రం పాత్రను పోషించడంలో ‘‘ఆయుర్ వేదం’’ తోడ్పడితే సంతోషించాల్సిందే! ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో వడపోతల మధ్య కాశీనాథుని ‘‘అమృతాంజనం’’ ఆధునీకరణ తర్వాతనే కమర్షియల్ ప్రాజెక్టుగా బయటకొచ్చింది! నిజానికి ఆయుర్వేదం పేరుకే గానీ, ప్రకృతి ప్రసాదించిన సొంఠి, పసుపు, మిరప, బెల్లం, జొన్న వగైరా పంట లన్నీ శరీర కల్మషాలకు విరుగుళ్లే సుమా! పొట్టకిచ్చినా, బట్టకిచ్చినా నేలతల్లే గాని వేదాలు, ఆయుర్వేదాలు కావు! శొంఠి సోధిస్తేనే కడుపు శుభ్రమవుతుంది! దీన్ని ఆయుర్వేదం కూడా కాదనలేదు అందుకే శ్వాస ఉండే వరకూ మనిషిలో ఆశ చావదు. ఆ ఆశను బతికి బట్టకట్టనివ్వాలన్న ఆశ వొడిగట్టిపోకుండా ఉంచే లక్షణం ఆయుర్వే దాన్ని నమ్ముకున్న వారిలో సహితం ఉండటం సర్వ సాధారణం! మృత్యువు పంచాంగం చూసి పనిచేయదు! మందులు కూడా శరీర పరిస్థితులకు అతీతం గావు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నేడు కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ బృందం
-
కృష్ణపట్నంకు నేడు ఐసీఎంఆర్ బృందం
ముత్తుకూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన ఆయుర్వేద మందును క్షుణ్ణంగా పరీక్షించే నిమిత్తం సోమవారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బృందం రానుంది. ఈ మందులో శాస్త్రీయత నిర్ధారించి, మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయుష్ కమిషనర్, ఆయుర్వేద వైద్య నిపుణులు మందు నమూనాలు సేకరించారు. ఈ మందు వల్ల ఎటువంటి నష్టం ఉండదని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ బృందం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానికంగా, కరోనా బాధిత కుటుంబాల్లో ఆసక్తి అధికమైంది. -
ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధనలు
చంద్రగిరి: కరోనా నియంత్రణలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. టీటీడీ పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఆయుర్వేద నిపుణుల కమిటీ భేటీ అయ్యింది. ఆదివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని నరసింగాపురం టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బదిరి నారాయణ, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ బాబు, టెక్నికల్ సూపర్వైజర్ నారప రెడ్డితో కలసి సమీక్షించారు. ఈ మందు తయారీకి అవసరమైన పరికరాలు, స్థల పరిశీలన, వన మూలికల నిల్వల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆనందయ్య మందుకు ఆయుష్, ఐసీఎంఆర్‌తో పాటు ఇతర పరిశోధన సంస్థల నుంచి ఆమోద ముద్ర లభిస్తే ఆ మందు తయారీ విధానంలో టీటీడీ సైతం భాగస్వామ్యం అవుతుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఆనందయ్య మందులో సైడ్ ఎఫెక్టŠస్ లేవని నిర్ధారణ అయ్యిందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ మందును స్వయంగా 60 రోజుల్లో తయారు చేసి యావత్తు రాష్ట్రానికి అందించే సామర్థ్యం ఉందన్నారు. అత్యాధునిక ఆయుర్వేద ఫార్మా టీటీడీ పరిధిలో ఉందన్నారు. ఈ మందు తయారీకి వినియోగించే వన మూలికలు శేషాచలం అడవిలో సమృద్ధిగా ఉన్నాయని, ఈ మందుపై నాలుగు దశల్లో లోతైన పరిశోధన జరగాల్సి ఉందన్నారు. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు కరోనాకు శాశ్వత విరుగుడు కాదని, ఇమ్యూనిటీని అధికం చేయగల సత్తా ఉందని తెలిసినా.. ఇమ్యూనిటీ బూస్టర్ కింద తయారీ చేపడతామన్నారు. మందు తయారీ, పంపిణీ సీఎం సూచనల మేరకు చేపడతామని స్పష్టం చేశారు. ప్రతి మూలికా ఉపయోగపడేదే ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీలో వాడిన 18 రకాల వన మూలికల వినియోగం శతాబ్దాల కాలంగా సాగుతోందని ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ అన్నారు. ఇందులోని ప్రతి మూలిక ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేదేనని చెప్పారు. ఆనందయ్య మందుపై ఆధ్యయనంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాలను భాగస్వామ్యం చేశారని తెలిపారు. ముళ్ల వంకాయ గుజ్జు, జీలకర్ర, తేనెతో కలగిలిపిన మిశ్రమంతో ఆనందయ్య తయారు చేసిన డ్రాప్స్ వల్ల కంటికి ఎటువంటి హాని కలగదని ఆయన చెప్పారు. -
కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీపై కీలక ప్రకటన
నెల్లూరు (సెంట్రల్): కరోనా నివారణకు వన మూలికలతో తాను తయారు చేసే మందును ప్రభుత్వ అనుమతులు వచ్చాకే పంపిణీ చేస్తామని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు చెందిన బొణిగి ఆనందయ్య తెలిపారు. ప్రజల మద్దతు, ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నెల్లూరులో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను తయారు చేసిన మందుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను తయారు చేసిన మందు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని ఇప్పటికే ఆయుష్ బృందం నిర్ధారించిందని చెప్పారు. ఐసీఎంఆర్ వాళ్లు కూడా వచ్చి మందును పరిశీలిస్తారని అధికారులు చెప్పారన్నారు. ఆ తర్వాత అనుమతులు వచ్చాకే మందును ఎలా పంపిణీ చేయాలనే విషయమై ప్రభుత్వ సూచన, సహకారం మేరకు ఎమ్మెల్యే కాకాణి, ఇతర పెద్దలందరితో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. అనుమానాలొద్దు.. ఆయుర్వేద మందుపై ఎటువంటి ఆరోపణలు తగవని, అనుమానాలు కూడా సరికాదని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ మందుపై ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో వ్యాధి ప్రబలుతుందనే ఆలోచనతో లోకాయుక్త ప్రశంసించడం, తాత్కాలికంగా పంపిణీని నిలిపి వేశారన్నారు. ఆనందయ్యను పోలీసులు అరెస్ట్ చేశారని, నిర్బంధించారని కొందరు ప్రచారం చేస్తుండటం సరికాదన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలోగా మందుకు సంబంధించిన మూలికల సేకరణలో ఆనందయ్య ఉన్నారని తెలిపారు. చదవండి: ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధనలు ఆపత్కాలంలో టీటీడీ ఔదార్యం.. ఆపన్నులకు అభయ హస్తం -
ఆనందయ్య మందు: ఆరోపణలొద్దు.. అనుమానాలు రేపొద్దు
సాక్షి, నెల్లూరు: ప్రభుత్వ అనుమతి వచ్చాకే ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామని.. లేనిపోని ఆరోపణలు చేసి, అనుమానాలు రేపొద్దని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య మందుపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారన్నారు. త్వరలోనే అనుమానాలు నివృత్తి అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు రాద్దాంతం చేయొద్దని ఆయన హితవు పలికారు. నివేదిక వచ్చాక ప్రభుత్వం ఏది చెప్తే.. అది చేస్తాం: ఆనందయ్య తమ మందుపై నిన్న అధ్యయనం చేశారని ఆనందయ్య తెలిపారు. ఐసీఎంఆర్ బృందం కూడా అధ్యయనం చేయడానికి వస్తుందన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారు చేశామని ఆయన పేర్కొన్నారు. నివేదిక వచ్చాక ప్రభుత్వం ఏది చెప్తే.. అది చేస్తామని ఆనందయ్య తెలిపారు. ఆయుర్వేద ఫార్మసీ నిపుణులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భేటీ చిత్తూరు: శ్రీనివాస మంగాపురం ఆయుర్వేద ఫార్మసీ నిపుణులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య మందును ఆయుర్వేద ఫార్మసీ నిపుణులు పరిశీలించారని.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే మందు తయారీకి సిద్ధమవుతామని తెలిపారు. ఆనందయ్య వాడే వనమూలికలు శేషాచల అడవుల్లో సంవృద్ధిగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాకే విస్తృతంగా మందు తయారీకి చర్యలు చేపడతామని చెవిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: కరోనా ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం ‘ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తాం’ -
కరోనా ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి తిరుపతి/ముత్తుకూరు/సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయ అధ్యయనం కోసం ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఆయుష్ కమిషనర్ రాములు, ఆయన బృందం కృష్ణపట్నంలో పర్యటించింది. మందు తయారీకి వినియోగించే దినుసులను పరిశీలించడంతోపాటు మందు విని యోగించిన వారి వివరాలు తెలుసుకుంది. మందు ను వాడిన 500 మందితో మాట్లాడి వారిచ్చిన వివరాలను నివేదికలో పొందుపర్చనుంది. శనివారం తెలుసుకున్న వివరాలతో ప్రభుత్వానికి వెంటనే నివేదిక ఇస్తామని.. వారం నుంచి పది రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పిస్తామని రాములు తెలి పారు. తర్వాత ప్రభుత్వ అనుమతి మేరకు ఆయుర్వేద మందు పంపిణీ ఉంటుందని చెప్పారు. అప్పటివరకు పంపిణీని నిలిపివేస్తున్నామన్నారు. ఆనందయ్య తయారుచేసిన మందు నమూనాలను ఉత్తరప్రదేశ్‌లోని సీసీఆర్ఏఎస్ (సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్) ల్యాబ్‌కు పంపుతున్నామని తెలిపారు. అంతకుముందు నెల్లూరు పట్ట ణంలో రాములుకు.. ఆనందయ్య మందు తయారీని వివరించి.. చేసి చూపించారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో మందు తయారీకి వినియోగించే వస్తువులు అన్నీ శాస్త్రబద్ధమైనవేనని, వాటివల్ల ఎలాంటి చెడు ప్రభావం లేదని ఆయుష్ నిర్ధారించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. కాగా, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బృందం ఆయుర్వేద మందు శాస్త్రీయతపై అధ్యయనం కోసం ఈ నెల 24న కృష్ణపట్నానికి రానుంది. ఇదిలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మందు పంపిణీ నిలిపివేయడంతోపాటు పోలీసులు పహారా కాస్తుండడంతో కృష్ణపట్నం నిర్మానుష్యంగా మారింది. కరోనా కట్టడిపై టీటీడీ దృష్టి కరోనా నియంత్రణకు ఆయుర్వేద మందును తయారుచేయడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆనందయ్య తయారుచేస్తున్న మందుపై ఆసక్తి చూపుతోంది. ఐసీఎంఆర్ నివేదిక అనుకూలంగా వస్తే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఆయుర్వేద మం దును ప్రపంచానికి అందించాలని భావిస్తోంది. శేషాచలం అడవుల్లో అపార ఔషధ గుణాలు కలిగిన 1,300 మొక్కల జాతులు ఉన్నాయి. వీటిలో అపార ఔషధ గుణాలున్న పెర్రూత, తంబ జాలరీ, కొండ సామ్రాణి, అడవి నీలిమందు, ఎరచ్రందనం, అడవి కంది, అడవి బిల్లు, తెల్ల కరక, మోగి, అడవి కొత్తివీుర, చిన్న పూలతుమ్మి లాంటి 11 రకాల మొక్కలకు శేషాచలం ప్రత్యేకం. ఈ నేపథ్యంలో ఆనందయ్య తయారుచేస్తున్న మందు ముడిసరుకును పరిశీలించేందుకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల వైద్య బృందం శనివారం కృష్ణపట్నంలో పర్యటించింది. అక్కడ మందు మందు తయారీ విధానం, ముడిసరుకును పరిశీలించారు. మందు పనితీరుపై స్థానికులతో మాట్లాడారు. ఈ మందుకు ప్రభుత్వ అనుమతి వస్తే టీటీడీ వద్ద ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆయుర్వేద మందును తయారు చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. టీటీడీ పరిధిలో అధునాతన ఫార్మా విభాగంతోపాటు సీనియర్ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఉన్నారన్నారు. ఈ మందుపై టీటీడీ పాలకమండలి ఆసక్తిగా ఉందని చెప్పారు. ఔషధ మొక్కలకు నెలవు శేషాచలం అనేక ఔషధ మొక్కలకు శేషాచలం నిలయం. అన్ని మొక్కలు పెంచేందుకు శేషాచలం అనువైన ప్రాంతం కూడా. ఐసీఎంఆర్ నివేదిక అనుకూలంగా వస్తే టీటీడీ ఆధ్వర్యంలో మందు తయారీ మొదలుపెడతాం. ఇందుకు వారం పట్టొచ్చు. మందు తయారీకి ఔషధ మొక్కలు భారీ మొత్తంలో సేకరించాల్సి ఉంటుంది. – డాక్టర్ రమేష్‌బాబు, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, తిరుపతి -
‘ఆనందయ్య మందును నాటు మందుగా పరిగణిస్తాం’
సాక్షి, నెల్లూరు: ఆనందయ్య చేస్తున్న కరోనా మందు తయారీలో ఆయుర్వేద ప్రోటోకాల్స్ లేవని అధ్యయనం చేస్తున్న ఆయుష్ కమిషనర్ రాములు బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా కాకుండా నాటు మందుగా పరిగణిస్తామని రాములు తెలిపారు. మందు తయారీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆనందయ్య కరోనా మందు తయారీ విధానాన్ని నిశితంగా పరిశీలించాం. మందు తయారీలో ఆయుర్వేద మందు ప్రోటోకాల్స్ లేవని పేర్కొన్నారు. అలాగే ఆనందయ్య తయారు చేసిన మందు హానికరం కాదని కూడా తెలిపారు. ఈ మందు కోసం వాడే పదార్ధాలన్నీ వంటింటి ఔషధాలు, ప్రకృతి వనమూలికలేని, కోవిడ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తోందని అన్నారు. కాకపోతే ఈ మందును అనేక ఆరోగ్య సమస్యల కోసం తయారు చేశానని ఆనందయ్య చెప్పారు. కరోనా కోసం తయారు చేశానని చెప్పలేదని' వెల్లడించారు. త్వరలోనే ఆనందయ్య మందుపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రాములు తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్‌పై ప్రధానికి మరోసారి సీఎం జగన్ లేఖ -
ఆనందయ్య మందు శాస్త్రీయతపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. రాములు బృందం ఎదుట ఆయుర్వేద మందు తయారీని ఆనందయ్య చేసి చూపించారు. ఈ మందుపై వివిధ కోణాల్లో ఆయుష్ కమిషనర్ రాములు బృందం అధ్యయనం చేస్తునున్నారు. అయితే మీడియాకు దూరంగా అజ్ఞాత ప్రదేశంలో ఇదంతా జరిగింది. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. 24న కృష్ణపట్నంకు వెళ్లనున్న ఐసీఎంఆర్ బృందం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) బృందం ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి వెళ్లనుంది. కరోనాకు ఇక్కడి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందును పరీక్షించనుంది. అధ్యయన సంస్థల నివేదిక తర్వాత మందు పంపీణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా కృష్ణపట్నంలో వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ బృందం పర్యటన పూర్తయ్యింది. చదవండి: కరోనా మందు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం -
ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. ఆనందయ్య.. రాములు ఎదుట ఆయుర్వేద మందు తయారీని చూపించనున్నారు. ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడుతూ, నిన్న(శుక్రవారం) ముత్తుకూరులో కొంతమందితో, ఆనందయ్య వద్ద పనిచేసేవారితో మాట్లాడామని తెలిపారు. ఆనందయ్య మందును ఎలా తయారు చేస్తారో పరిశీలిస్తామని రాములు పేర్కొన్నారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని.. మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్టే వచ్చిందని రాములు వెల్లడించారు. ఆనందయ్య మందును తీసుకున్నవారి అభిప్రాయాలనూ సేకరిస్తామన్నారు. ఐసీఎంఆర్ బృందం పరిశీలిన తర్వాత వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటామని ఆయన తెలిపారు. మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారం పైనే పడుతుందని రాములు వెల్లడించారు. కృష్ణపట్నానికి టీటీడీ బృందం.. తిరుమల: ఈవో ఆదేశంతో టీటీడీ బృందం కృష్ణపట్నానికి వెళ్లింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ఆయుర్వేద డాక్టర్‌తో కూడిన బృందం కృష్ణపట్నం చేరుకున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న టీటీడీ ఉద్యోగులకు ఆయుర్వేద మందు ఇవ్వాలనే ఆలోచనలో టీటీడీ ఉంది. అప్పటివరకు కృష్ణపట్నం రావొద్దు: జేసీ ఆనందయ్య ఆయుర్వేద మందుపై సీఎంఆర్, ఆయూష్ బృందాలు అధ్యయనం చేస్తున్నాయని జేసీ హరేంద్రప్రసాద్ తెలిపారు. నివేదిక వచ్చేందుకు వారం, 10 రోజులు పట్టొచ్చని.. ఫైనల్‌గా ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాతే మందు పంపిణీ చేపడతామని ఆయన వివరించారు. అప్పటి వరకు ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని జేసీ స్పష్టం చేశారు. చదవండి: ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్ కరోనాకు ఆనందయ్య మందు! -
ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్
సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్ పడింది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నేడో రేపో కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం రానుంది. ఇప్పటికే ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. నేడు రాములు ఎదుట ఆనందయ్య.. ఆయుర్వేద మందు తయారుచేసి చూపించనున్నారు అధ్యయనం పూర్తైతే ఆనందయ్యకు మందు పంపిణీకి అనుమతి వచ్చే అవకాశం ఉంది. కాగా, కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు కోసం ప్రజలు కృష్ణ పట్నం బాటపట్టారు. ఒక వైపు కరోనా వచ్చిన రోగులు, మరో వైపు కరోనా రాకుండా ఉండేందుకు మందు తీసుకునేందుకు వచ్చిన వేలాది మందితో కృష్ణపట్నం శుక్రవారం కిక్కిరిసింది. కృష్ణపట్నం ఆయుర్వేదం మందుకు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో దేశ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ఆనందయ్య ఇస్తున్న మందుతో కరోనా తగ్గిపోతుందనే నమ్మకంతో జనం కిలో మీటర్ల వరకు క్యూ కట్టారు. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి ప్రజలు కృష్టపట్నంకు చేరుకున్నారు. జనాల రద్దీతో కిటకిటలాడింది. ఒక్కసారిగా జనాలు రావడంతో కృష్ణపట్నంకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మందు కోసం సీరియస్ కండీషన్లో ఉన్న కరోనా బాధితులను అంబులెన్స్‌ల్లో సైతం తీసుకువచ్చారు. మందు కోసం గురువారం రాత్రి నుంచే జనం అక్కడికి చేరుకుని గంటల కొద్దీ నిరీక్షించారు. అయితే తగినంత స్థాయిలో వనమూలికలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. కొన్ని రహదారుల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల్లో జనాలను రాకను కొంత వరకు నియంత్రించారు. అయితే ఆనందయ్య తయారు చేసే మందుకు ఇంత ప్రాధాన్యత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఉపయోగం జరుగుతుందా అనే ఉద్దేశంతో ఆయుష్ శాఖను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి విదితమే. కరోనా మందు కోసం ఎవరూ రావొద్దు: ఎస్పీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మందు తయారీ, పంపిణీ ఆలస్యం అవుతుందని, ఇతర ప్రాంతాల నుంచి ప్రజల ఎవరూ కృష్ణపట్నంకు రావొద్దని నెల్లూరు రూరల్ డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మందు పంపిణీకి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లా అధికారులు తెలియజేస్తారన్నారు. ఈ మధ్యలో మందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నంకు వచ్చి కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పెద్దాస్పత్రి క్యాజువాలిటీ ఖాళీ ప్రతి రోజు కరోనా రోగులు పెద్ద సంఖ్యలో పెద్దాస్పత్రికి చేరుకుని అయ్యా ఒక బెడ్ ఇప్పించడంటూ కనిపించిన వారందరిని కాళ్లావేళ్లా పడి వేడుకునే వారు. పెద్దాస్పత్రికి ప్రతి రోజూ సుమారు 200 వరకు అడ్మిషన్లు వస్తాయి. వాస్తవానికి పెద్దాస్పత్రిలో 864 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. వచ్చే వారిని కాదనలేక 1,000 నుంచి 1,100 మందిని అడ్మిషన్ చేర్చుకుని ఎక్కడో ఒక చోట మంచాలు వేసి సర్దుబాటు చేస్తూ వైద్యం చేసేవారు. బెడ్లు చాలక జర్మన్ షెడ్లు కూడా వేసి వైద్యం చేస్తున్నారు. అయితే కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు కరోనా జబ్బుకు బాగా పని చేస్తోందని ప్రచారం రావడంతో ప్రజలతో పాటు బాధితులు నమ్మడంతో పెద్దాస్పత్రికి శుక్రవారం ఒక్క సారిగా అడ్మిషన్ల సంఖ్య పడిపోయింది. కిక్కిరిసి ఉండే క్యాజువాలిటీ ఖాళీ అయింది. ఖాళీ మంచాలు దర్శన మిచ్చాయి. పలువురు బాధితులు ప్రత్యేక వాహనాల్లో కృష్ణపట్నం మందుకు ఉరుకులు, పరుగులు తీశారు. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు కేవలం 40 అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఈ 40 అడ్మిషన్లలో కూడా ఆక్సిజన్ పడిపోయిన వారు, ఐసీయూలో ఉండాల్సి వారే అధికం. వార్డుల్లో ఆక్సిజన్ బెడ్స్‌పై ఉన్న రోగుల బంధువులు పలువురు కృష్ణపట్నం నుంచి మందు తెచ్చి రోగులకు వినియోగించినట్టు సమాచారం. అయితే కృష్ణపట్నం పోయిన రోగులు మందులు తీసుకుని సాయంత్రానికి మళ్లీ కొంతమంది తిరిగి క్యాజువాలిటీకి రావడంతో కొంత హడావుడి కనిపించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆయుర్వేద మందు అధ్యయనానికి సీఎం జగన్ ఆదేశం వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.50 కోట్లు -
కరోనాకు ఆనందయ్య మందు!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు, ముత్తుకూరు, నెల్లూరు (సెంట్రల్): ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు ఆయుర్వేద ఔషధం దివ్యంగా పనిచేస్తోందన్న ప్రచారంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. వ్యాక్సిన్లు, మందులు, ఆక్సిజన్, చికిత్స కోసం డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నా కట్టడి కాని వైరస్‌ను కేవలం ఆకులు, వివిధ రకాల వంటింటి దినుసులతో రూపొందించిన ఆయుర్వేద మందులతో నియంత్రిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆయుర్వేద ఔషధం కావడం, సైడ్ ఎఫెక్ట్లు లేకపోవడం, ఉచితంగా ఇస్తుండటంతో శాస్త్రీయంగా నిర్దారణ కాకున్నా కృష్ణపట్నానికి క్యూలు కడుతున్నారు. ఆనందయ్య కరోనా మందుగా దీన్ని వ్యవహరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే... మూడు రోజుల విరామం తర్వాత శుక్రవారం ఉదయం కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారితో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఆస్పత్రుల నుంచి సైతం ఆక్సిజన్ సిలిండర్లతో వచ్చిన వారున్నారు. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించింది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మందు పంపిణీని ప్రారంభించారు. మొదలు పెట్టిన రెండున్నర గంటల వ్యవధిలోనే మందు అయిపోవడంతో చాలామంది నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు వాహనాలు వస్తూనే ఉన్నాయి. రద్దీని ఒక దశలో పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఎదురైంది. ఆయుర్వేద మందు కోసం కృష్ణపట్నం గ్రామంలో పోటెత్తిన జనం రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు, అంబులెన్స్‌లు బారులు తీరాయి. మందు తయారీలో కీలకమైన ఆకులు, దినుసులు తగిన మేరకు లేకపోవడంతో కేవలం కరోనా వైరస్ సోకిన కొందరికి మాత్రమే మందు పంపిణీ చేశారు. క్యూలో కరోనా బారిన పడిన వారు ఉండడంతో మందు కోసం వచ్చిన ఇతరుల్లో ఆందోళన నెలకొంది. శనివారం మందు పంపిణీ నిలిపి వేస్తున్నట్లు ఆనందయ్య ప్రకటించారు. కరోనా బాధితులు పెద్ద ఎత్తున తరలిస్తుండటంతో గ్రామస్తులు వాహనాలను నిలిపివేశారు. మందు పంపిణీ సమాచారంతో జాతీయ మీడియా చానళ్లు ఉదయం నుంచే ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. కాగా ఆనందయ్యను పోలీసులు అరెస్ట్ చేశారంటూ శుక్రవారం సాయంత్రం కొన్ని చానళ్లు, సోషల్ మీడియా పుకార్లు సృష్టించడంతో ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి ఆయుష్ బృందం ఆనందయ్య ఆయుర్వేద ఔషధంలో శాస్త్రీయతను నిర్దారించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయుష్ కమిషనర్ రాములు శుక్రవారం సాయంత్రం కృష్ణపట్నంలో పర్యటించారు. మందు తయారీలో వినియోగిస్తున్న ఆకులు, వివిధ దినుసులను పరిశీలించి ఆనందయ్య బృందంతో మాట్లాడారు. ఆయన వెంట లైసెన్సింగ్ అథార్టీ అధికారి పీవీఎన్ ప్రసాద్, విజయవాడ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ సాయి సుధాకర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ (ఆయుర్వేదం) డాక్టర్ సాయికుమార్, డీపీఓ ధనలక్ష్మి, జేసీ హరేందిర ప్రసాద్, ఇన్చార్జి ఆర్డీఓ సువర్ణమ్మ తదితరులున్నారు. ప్రాథమికంగా బాగానే పని చేస్తున్నట్లు వెల్లడైందని, వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇస్తామని, అప్పటిదాకా పంపిణీ వద్దని ఆయుష్ డైరెక్టర్ సూచించారు. నివేదిక కోరిన ఉప రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కేంద్ర ఆయుష్ ఇన్చార్జి మంత్రి కిరణ్ రిజ్జూ, ఐసీఎమ్మార్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవతో ఫోన్లో మాట్లాడారు. ఆయుర్వేద మందుపై అధ్యయనం జరిపి వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వంటింటి మందులే... –బొనిగే ఆనందయ్య, ఆయుర్వేద వైద్య నిపుణుడు ఆయుర్వేద వైద్యాన్ని భగవాన్ వెంకయ్యస్వామి శిష్యుడు గురవయ్య వద్ద నేర్చుకున్నా. తమిళనాడు రెడ్ హిల్స్ ప్రాంతానికి చెందిన వివేకానంద వద్ద మరికొంత నేర్చుకున్నా. మా అమ్మకు ఆయుర్వేదంలో కొంత ప్రవేశం ఉంది. కరోనా మందును గ్రామంలో అనేక మందికి ఇచ్చా. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. నేను వాడే వస్తువులు అన్ని వంటింట్లోనే ఉంటాయి. మందు వాడిన తర్వాత 48 గంటల్లో నెగెటివ్ వస్తుంది. మా అన్నకు కరోనా పాజిటివ్ రావడంతో దినుసులతో మందు ఇవ్వడంతో వెంటనే తగ్గింది. అనుమతులు రాగానే పునఃప్రారంభం: ఎమ్మెల్యే కాకాణి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాక మందు పంపిణీ పునఃప్రారంభమవుతుందని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాల వాసులు వ్యయ ప్రయాసలకు ఓర్చి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి కొరియర్ ద్వారా పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కొన్నేళ్లుగా పలు వ్యాధులకు ఆయర్వేద మందులను ఆనందయ్య కుటుంబం ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. ఎలాంటి ఇబ్బంది కలగలేదు.. – ఉడతా మురళీకృష్ణ, ఈపూరు ప్రజల్లోకి ఈ మందు అనూహ్యంగా చొచ్చుకుపోయింది. ముందు జాగ్రత్తగా మందు తీసుకున్నా. ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. చాలా బాగా పనిచేసింది... – వెంపులూరు శ్రీనివాసులు, కృష్ణపట్నం బొణిగి ఆనందయ్య ఆయుర్వేద మందు చాలా బాగా పని చేసింది. ఇటీవల నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మందును మూడు పూటలా మూడు రోజులు వాడా. త్వరగా తగ్గిపోయింది. సైడ్ ఎఫెక్ట్ లేవు. ఆకలి బాగా వేస్తోంది. కరోనా తగ్గించే శక్తి ఉంది – డాక్టర్ చక్రధర్‌రావు రాష్ట్రీయ, ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి, నరుకూరు ఆనందయ్య మందులో కరోనా వ్యాధిని తగ్గించే శక్తి ఉంది. ఐసీఎంఆర్, అల్లోపతి వైద్యులు కాకుండా ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ ద్వారా పరీక్షలు నిర్వహించాలి. పలు రాష్ట్రాల్లో ఆయుష్ మందుల ద్వారా కరోనా కట్టడికి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. వైరస్ సోకిన వారికే ఇవ్వాలి.. – డాక్టర్ టీపీ నాయుడు, శ్రీకృష్ణ ఆయుర్వేద స్పెషాలిటీ ఆస్పత్రి, పొగతోట నెల్లూరు కృష్ణపట్నంలో ఇస్తున్న ఆయుర్వేద మందుల్లో 16 సహజ వనమూలికలు వాడుతున్నారు. మేం కూడా తొలిదశ కరోనా వచ్చినప్పుడు వీటితో తయారు చేసిన కషాయాన్ని తాగమని చెప్పాం. గుంపులుగా ఉండడం వల్ల కరోనా పెరిగే అవకాశం ఉంది. వైరస్ సోకని వారికి మందు అవసరం లేదు. వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాలి. జిల్లేడుతో జాగ్రత్త.. – ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జీ.శ్రీనివాసరావు ఆనందయ్య ఉపయోగించే పదార్థాల్లో ఔషధ గుణం కలిగిన ‘పర్సిటిన్’ ఉల్లిపాయలు, జామకాయలు, ద్రాక్ష విత్తనాల్లో కూడా ఉంటుంది. తెల్లజిల్లేడుతో తయారు చేసిన మందును కంటిలో పోయడం మాత్రం దుష్ఫరిణామాలకు తీసే ప్రమాదం ఉంది. ఆనందయ్య మందు ఐదు రకాలు కరోనాకు ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులను పంపిణీ చేస్తున్నారు. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, పాజిటివ్ వచ్చిన వారికి నాలుగు రకాల మందులను ఇస్తున్నారు. కరోనా రాకుండా ‘పీ’ రకం మందును, కోవిడ్ వచ్చిన వారికి పీ, ఎఫ్, ఎల్, కే రకాలను ఇస్తున్నారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన వారికి నాలుగు రకాలతో పాటు పసరు డ్రాప్స్ ఇస్తున్నారు. 1. పీ: ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్ వచ్చిన వారు రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్ లేని వారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఒక్క రోజు రెండు సార్లు వినియోగించాలి. ఇందులో తెల్ల జిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్ దంగిలే ఐదు బకెట్లు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి అన్ని కలిపి ఒక బకెట్లో సిద్ధం చేసి మిక్సీ వేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి నాలుగు గంటల పాటు ఉడికించి మిశ్రమంగా తయారు చేసి ఇస్తున్నారు. 2. ఎఫ్: పాజిటివ్ ఉన్న వారికి ఇస్తున్నారు. ఇందులో పుప్పింటి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల వరకు సిద్ధం చేసి ఆన్నింటిని కలిపి మిక్సీ వేసి చూర్ణంగా ఇస్తున్నారు. ఇది రోజు భోజనం తర్వాత రెండు సార్లు చొప్పున మూడు రోజులు తీసుకోవాలి. 3. ఎల్: ఇది కూడా పాజిటివ్ ఉన్న వారికే. ఇందులో నేల ఉసిరి, గుంట గలగర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కేజీలు తీసుకొని సిద్ధం చేస్తున్నారు. దీనిని ఫీ,ఎఫ్ రకాల మందుతో పాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. 4. కే: ఇది కూడా పాజిటివ్ ఉన్న వారికే. ఇందులో పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల తీసుకుని కలిపి దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది పాజిటివ్ రోగులకు రోజుకు ఒక్క సారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. 5. ఐ: ఆక్సిజన్ తగ్గిన వారికి కంటి డ్రాప్స్. తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలను వినియోగిస్తారు. ఇందులో కిలో తేనె, వంద గ్రాముల తోక మిరియాలు, కొద్దిగా వంకాయ గుజ్జుతో సిద్ధం చేసి పల్స్ తీవ్రను బట్టి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క డ్రాప్ వేయాలి.