
సాక్షి, అమరావతి: ఐ డ్రాప్స్ తయారీ, పంపిణీకి అనుమతుల కోసం డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో తదుపరి ఎలాంటి ఆదేశాలు, విచారణ అవసరం లేదని పేర్కొంటూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని, ఆనందయ్య మందు పంపిణీకి తక్షణమే అనుమతులు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వరనాయుడు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment