సాక్షి, నెల్లూరు జిల్లా: గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆనందయ్య విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కాకాణి సూచించారు.
‘‘ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవు. సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని చెప్పి.. ఆనందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోవిడ్ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్ మందు వాడాలి. కోవిడ్ నివారణ కోసం నీలం రంగు ప్యాకెట్ మందు వాడాలి. ప్రజలకు మేలుచేసే ఉద్దేశంతోనే ఆనందయ్యకు మద్దతు ఇచ్చాం. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్‌లోనూ అండగా నిలుస్తాం. ప్రతిఒక్క ఇంటికీ ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని’’ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.
చదవండి: టీడీపీలో కలకలం: కుప్పంలో ‘జూనియర్’ జెండా!
Comments
Please login to add a commentAdd a comment