
సాక్షి, తిరుపతి: ఆనందయ్య మందుపై టీటీడీ కమిటీ సర్వే పూర్తి అయ్యింది. 570 మందిపై కమిటీ సర్వే చేసింది. 80 శాతం మంది ఆనందయ్య మందుపై సానుకూల స్పందన వచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌కు టీటీడీ కమిటీ నివేదిక సమర్పించింది. కమిటీ సభ్యులు డా.రేణుదీక్షిత్ ఆధ్వర్యంలో సర్వే జరిపారు. తిరుపతి సుజన్ లైఫ్ ల్యాబ్‌లో ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. సుజన్ లైఫ్ సైన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. రేపటి నుంచి సుజన్ ల్యాబ్‌లో జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. సుజన్ లైఫ్ ల్యాబ్ నుంచి 15 రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment