
సాక్షి, తాడేపల్లి: ఆనందయ్య కరోనా మందు పంపిణీ విషయంలో దాఖలైన పిటిషన్ సోమవారానికి వాయిదా పడినట్లు ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఈ లోగా ఆ మందులో చివరి రిపోర్టు రేపు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేసిందని, కేంద్ర బృందాల నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం ఉన్నందున, అన్నింటిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ అంశంకు సంబంధించి చట్టం, ప్రజల మనోభావాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించినట్లు రాములు తెలిపారు.
వారం తర్వాత కృష్ణపట్నంలోని నివాసానికి
వారం తర్వాత కృష్ణపట్నంలోని తన నివాసానికి ఆనందయ్య చేరుకున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. గత వారంగా కృష్ణపట్నంలోని సీవీఆర్ ఫౌండేషన్‌లో ఉన్న ఆనందయ్య ఉన్నారు. ఆనందయ్యకు మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆలోచనతో మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment