Reports
-
అప్పుల్లోనూ ఆమెదే పైచేయి
ముంబై: ఇంటి బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు.. కుటుంబం, వృత్తిపరమైన అవసరాలకు రుణాలను తీసుకోవడానికీ వెనుకాడడం లేదు. గతేడాది యాక్టివ్ రుణ గ్రహీతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్టు క్రెడిట్ బ్యూరో సంస్థ ‘క్రిఫ్ హైమార్క్’ తెలిపింది.రుణాలు తీసుకోవడమే కాదు, వాటిని సకాలంలో తిరిగి చెల్లించడంలోనూ పురుషులతో పోల్చితే మహిళలే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి యాక్టివ్ మహిళా రుణగ్రహీతలు 10.8 శాతం పెరిగి 8.3 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో పురుష రుణ గ్రహీతల్లో వృద్ధి 6.5 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘రుణాల విషయంలో పురుషుల కంటే స్త్రీలే మెరుగైన ప్రవర్తన చూపిస్తున్నారు. బంగారం రుణాలు మినహా మిగిలిన రుణాల్లో 91 నుంచి 180 రోజుల వరకు చెల్లింపులు నిలిపివేసిన రుణ గ్రహీతల్లో మహిళలు తక్కువగా ఉన్నారు’’అని ఈ నివేదిక తెలిపింది.గృహ రుణాలు, వ్యాపార రుణాలు, వ్యవసాయం, ట్రాక్టర్ల రుణాలు, ప్రాపర్టీ రుణాలు, విద్యా రుణాల్లో మహిళల తీరు మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగ రుణాల్లోనూ (కన్జ్యూమర్) మగవారి కంటే చెల్లింపుల పరంగా మహిళల ప్రవర్తనే మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. 2024 చివరికి మొత్తం మహిళా రుణ గ్రహీతలు 18 శాతం పెరిగి 36.5 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. రుణాల్లో 35 ఏళ్లలోపు వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. మహిళలకు సంబంధించి గృహ రుణాలు, వ్యాపార రుణాలు, ప్రాపర్టీ రుణాలు, ఆటో రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా రుణాల్లో మహారాష్ట్ర ముందున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్నా
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, అందుకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుంటున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం జరిగిన టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని పట్టించుకోవడంలేదని, అలా నిర్లక్ష్యం చేస్తున్న వారి జాబితా తన వద్ద ఉందన్నారు.ఎమ్మెల్యేలకు, కేడర్ మధ్య సమన్వయం లేకుండాపోయిందని తెలిపారు. త్వరలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని వారికి చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల గురించి ఆలోచించి వారికి మంచి చేయాలని.. అందరినీ కలుపుకుని వెళ్లకపోతే ఇబ్బందులు పడతారని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తిచేయాలి..ఇక నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు వారిని ఆదేశించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చి ఇబ్బందిపడాల్సి వస్తోందన్నారు. ఏప్రిల్‌లోపు నామినేటెడ్ పదవులను భర్తీచేస్తామన్నారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అధికారులు తమ మాట వినడంలేదని, పోస్టింగ్‌ల విషయంలోనూ ఇబ్బందులున్నాయని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. మరికొందరు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులివ్వాలని, ఏ చిన్న పనిచేయడానికి అవకాశం లేకుండాపోయిందని చెప్పారు. అవకాశాన్ని బట్టి నిధుల గురించి ఆలోచిస్తానని చంద్రబాబు చెప్పారు. -
ఔరా! అంజీరా! ఇది మాంసాహారమా?
సాధారణంగా ఎవరైనా పండ్లను చూపించి.. ‘ఇవి శాకాహారమా? మాంసాహారమా?’ అని అడిగితే చిత్రంగా అనిపిస్తుంది. ‘ఏమిటా పిచ్చి ప్రశ్న.. పండ్లలో ఎక్కడైనా మాంసం ఉంటుందా?’ అంటూ కోపం తన్నుకొస్తుంది. అయితే చాలామంది ‘అంజీరా పండ్లు శాకాహారమా? మాంసాహారమా?’ అనే ప్రశ్నే వేస్తున్నారు. ఎందుకంటే ‘పండులందు అంజీరా పండు వేరయా’ అంటున్నారు నిపుణులు. సైంటిఫిక్ రీజన్స్ చూపిస్తూ ‘ఈ పండు ముమ్మాటికీ మాంసాహారమే!’ అని తేల్చేస్తున్నారు.అసలెందుకు అంజీరాను మాంసాహారం అంటున్నారంటే.. ఆ పండులో జరిగే పరాగ సంపర్క క్రియనే దానికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు. పరాగ సంపర్కం కోసం కందిరీగలు.. అంజీర్ పండ్లను ఆశ్రయిస్తుంటాయి. ఆ పండ్ల సూక్ష్మ రంధ్రాల్లోనికి వెళ్లిన కందిరీగలు పరాగ సంపర్కం చేస్తాయి, అనంతరం బయటకి రాలేక కొన్ని అందులోనే చనిపోతాయి. దాంతో వాటి అవశేషాలు అంజీర్ పండులోనే విలీనమవుతాయి. అందువల్ల అది పరోక్షంగా మాంసాహారమవుతుంది కాబట్టి అంజీర్ పండ్లు మాంసాహారమే నంటున్నారు నిపుణులు. (శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!)అలాగని శాకాహారులు అంజీరాని తినడం మానేస్తే చాలా నష్టపోతారు. ఎందుకంటే అంజీరాతో ఎన్నో ఆరోగ్య ఫలితాలు అందుతాయి. వీటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లు ఇలా అన్నీ పుష్కలంగా లభిస్తాయి. రోజూ తింటే శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. వీటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టుకుని, ఉదయం నిద్ర లేచిన వెంటనే తింటే చాలా మంచిది. మలబద్ధకం, మూలశంక వంటి సమస్యలను ఈ పండ్లు నయం చేస్తాయి. చెడు కొవ్వును వేగంగా కరిగిస్తాయి. బరువు, హైబీపీ, షుగర్ వంటి సమస్యలను అదుపులోకి తెస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, నెలసరి సమస్యలున్నవారు, కిడ్నీ సమస్యలున్నవారు వీటిని తింటే మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యానిచ్చే ఈ పండును శాకాహారులూ నిరభ్యంతరంగా తినచ్చు. (కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!) -
లోపాలు తేలినా.. నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో లోపాలపై 2021 అక్టోబర్, నవంబర్లలో తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇచ్చినా.. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేంద్రరావు ఆరోపించారు. బరాజ్‌ల ఎగువన, దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపో యాయని, దిగువన వేరింగ్ కోట్ దెబ్బతిన్నదని నివేదికలలో తెలిపామని వివరించారు. ప్రాజెక్టుల ఈఈలు, ఎస్ఈలు, సీఈలు దీనికి బాధ్యులని.. బరాజ్‌లలో లోపాలున్నట్టు ఎన్నడూ నల్లా వెంకటేశ్వర్లు తమకు నివేదిక సమర్పించలేదని పేర్కొ న్నారు.కాళేశ్వరం బరాజ్‌లపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం బి.నాగేంద్రరావును మూడున్నర గంటలకుపైగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 120కిపైగా ప్రశ్నలు వేసింది. నిర్వహణ, పర్యవేక్షణ (ఓఅండ్ఎం) విభా గానికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ లేదని.. క్షేత్ర స్థాయి అధికారులకు ప్రాజెక్టుల నిర్వహణపై ఎప్ప టికప్పుడు ఆదేశాలిస్తామని ఈ సందర్భంగా కమి షన్‌కు నాగేంద్రరావు వివరించారు. తమ తనిఖీల నివేదికలను కమిషన్‌కు అందజేశారు. డిఫెక్ట్ లయ బిలిటీ పీరియడ్‌లో బరాజ్‌లకు రక్షణ చర్యలు తీసు కోవాలని.. వర్షాకాలానికి ముందు, తర్వాత, మధ్య లో పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించాలని తాము కోరినా రామగుండం ఈఎన్సీ చేయలేదని వివరించారు. ఐఎస్ కోడ్, కేంద్ర జలసంఘం మా న్యువల్స్ను కూడా పాటించలేదని ఆరోపించారు. బరాజ్‌ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసినట్టు నల్లా వెంకటేశ్వర్లు నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. గేట్ల నిర్వహణలో ఆపరేషన్ ప్రోటోకాల్ పాటించినట్టు సమాచారం లేదని.. వరద ఉధృతితో దిగువన రక్షణ పనులు దెబ్బతినడానికి అది ఒక కారణం కావొచ్చని తెలిపారు. మరమ్మతులు చేయడం కోసం బరాజ్ లలో నీటి నిల్వలను తగ్గించాలని నిర్మాణ సంస్థలు కోరినా పట్టించుకోలేదా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఈ దిశగా తమ కార్యాలయం ఆదేశాలేమీ ఇవ్వలేదని, అయితే నిల్వలను పెంచాలని నల్లా వెంకటేశ్వర్లు మౌఖిక ఆదేశాలిచ్చారని నాగేంద్రరావు వివరించారు.ఈఎన్సీ పోస్టు అలంకారానికా?‘బరాజ్‌ల వైఫల్యానికి నిర్వహణ వైఫల్యం ఓ కారణం కాదా? ఈఎన్సీ (ఓఅండ్ఎం) పోస్టు ఎందుకు ఉంది? అలంకారానికా?’ అని కమిషన్ నిలదీయగా.. నిర్వహణ బాధ్యత క్షేత్రస్థాయి సీఈలదేనని నాగేంద్రరావు బదులిచ్చారు. నిర్వహ ణ మాన్యువల్స్, సర్క్యులర్లు జారీచేసి వాటిని పాటించాలని కోరడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. నిరంతర నిల్వలతో బరాజ్‌ల ఎగువ భాగంలో మరమ్మతులు సాధ్యం కాలేదని, దిగువన అవకాశమున్నా మరమ్మతులు చేయలేదని వివరించారు. అయితే ‘నీటి నిల్వ అవసరాలకు బరాజ్‌లు పనికిరావని ఐఎస్ కోడ్‌లో ఉన్న విషయం మీకు తెలియదా? నిల్వ చేయాలని ఆదేశించినది ఎవరు? నిల్వలతోనే పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి బరాజ్‌లు దెబ్బతిన్నాయా?’ అని కమిషన్ ప్రశ్నించగా.. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే నీళ్లు నిల్వ చేశా రని నాగేంద్రరావు వివరించారు. నిల్వలతో ఇసుక కొట్టుకుపోయి దెబ్బతినే అవకాశాలుంటాయని అంగీకరించారు. మూడు బరాజ్‌ల పనులు సంపూర్ణంగా పూర్తయ్యాయా? అని కమిషన్ ప్రశ్నించగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పనులు పూర్తయ్యా యని, మేడిగడ్డ బరాజ్‌లో నిబంధనల ప్రకారం పనులు జరగలేదని నాగేంద్రరావు తెలిపారు.నాణ్యతా పరీక్షలకు మనస్సాక్షి అంగీకరించలేదా?‘వరదల అనంతరం బరాజ్‌ల పరిస్థితి ఏమిటి? ఏమైనా దెబ్బతిన్నాయా? నిర్మాణం సరిగ్గా జరిగిందా? లేదా? అని పరిశీలించాలని మీ మనస్సాక్షి అంగీకరించలేదా?’ అని క్వాలిటీ కంట్రోల్ రిటైర్డ్ సీఈ అజయ్‌కుమార్‌ను పీసీ ఘోష్ కమిషన్ నిలదీసింది. అయితే నిర్మాణ దశలో, బిల్లుల చెల్లింపుల సమయంలోనే నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తామని, నిర్మాణం పూర్తయిన తర్వాత అవసరం ఉండదని అజయ్‌కుమార్ బదులిచ్చారు. ఇక అసంపూర్తి పనులను పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు నోటీసులిచ్చామని కమిషన్‌కు మాజీ ఈఈ సర్దార్ వివరించారు. గురువారం కమిషన్ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుకు రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. -
నాని గాయాలన్నీ ‘కట్టు’ కథలే
తిరుపతి రూరల్ (తిరుపతి జిల్లా) : చేతులకు కట్లు, కాళ్లకు బ్యాండేజీలు, మూతికి మాస్్కతో తాను తీవ్రంగా గాయపడ్డానని పులివర్తి నాని చేసిన హడావుడి అంతా ఒట్టి నాటకమని తేలిపోయింది. నాని తల, శరీరం, చేయి, కాలు.. ఇతరత్రా ఆయన శరీరంలో ఎక్కడా చిన్న దెబ్బ కూడా లేదని తేటతెల్లమైంది. స్విమ్స్ వేదికగా ఆయన సాగించిన హంగామా అంతా ఉత్తుత్తి నటనేనని అదే స్విమ్స్‌లో ఆయనకు తీసిన ఎక్స్‌రే, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్.. తదితర వైద్య పరీక్షలు స్పష్టం చేస్తున్నాయి. నాని ‘కట్టు’ కథలతో 37 మంది జైలు పాలయ్యారు. పలువురు ఉద్యోగులు బదిలీకి గురయ్యారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. పోలింగ్ అనంతరం మే 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ వద్ద గొడవ జరిగింది. టీడీపీ అభ్యర్థి అయిన నాని ఆ తర్వాత రెండు గంటలపాటు వర్సిటీ పరిసరాల్లోనే హుషారుగా తిరిగారు. అనుచరులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. స్వయంగా ధర్నాలో నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు. నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. అనంతరం గొడవ సద్దుమణిగాక ఇంటికి వెళ్లిపోయారు. ఇంట్లో కాసేపు సేద తీరాక ఒక వ్యూహం రూపొందించుకుని హుటాహుటిన స్విమ్స్‌కు బయలుదేరారు. అక్కడ వాహనం నుంచి దిగగానే.. నడవ లేనట్లు.. శరీరం అంతా నొప్పులున్నట్లు అక్కడి వైద్యులకు చెప్పారు. వారు ఆయన తలకు, శరీరానికి, చేతికి, భుజాలకు, పొట్టకు, కాలికి.. ఇలా అన్ని రకాల వైద్య పరీక్షలు, ఎక్స్‌రేలు, సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ సైతం చేశారు. ఆ గొడవలో తాను తీవ్రంగా గాయపడినట్టు పబ్లిసిటి ఇచ్చుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత నానిపై దాడి జరిగిందని, ఆయనకు ఏమో అయిపోయిందని ఎన్నికల కమిషన్ అనేక మంది పోలీసులు, ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అమాయకులైన 37 మందిపై పోలీసులు కేసులు పెట్టి, జైలుపాలు చేశారు. వారు ఇప్పటికీ జైలులో మగ్గుతున్నారు. ఒక్క గాయం లేదని వైద్య నివేదికలు వెల్లడి పులివర్తి నాని స్విమ్స్‌లో చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఇటీవల వెలుగు చూశాయి. నాని తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకు, కాలికి ఎక్కడా ఎలాంటి గాయాలు లేవని ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్.. ఇతరత్రా వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో నాని స్వార్థంతో ఆడిన నాటకం వల్ల ఇబ్బంది పడిన వారంతా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య నివేదికలను ముఖ్యమంత్రికి, హైకోర్టు, గవర్నర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి పంపించేందుకు సిద్ధం అవుతున్నారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన వారు అనవసరంగా నెలల తరబడి జైలులో మగ్గుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. సస్పెండ్ అయి జీతాలు రాక, ఎన్నికల కమిషన్ చేసిన సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియక పలువురు ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. నాని నాటకం బట్టబయలు రాజకీయ స్వార్థంతోనే నాని గాయపడినట్లు నాటకాలు ఆడారు. గాయం కాని ఘటనలో అమాయకులు 37 మందిపై కేసులు నమోదు చేయించి వేధించారు. దాడి చేయడానికి 37 మంది వస్తే ఏ చిన్న గాయం కాకుండా బయటకు వస్తారా? సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారా? ప్రజలు, ప్రభుత్వం, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచించాలి. నాని అద్భుత నటనతో ఉద్యోగులు, పోలీసులను బలిపశువులు చేశాడు. 37 మందిని జైలుకు పంపించాడు. ఆ కుటుంబాల శాపం ఆయనకు తగిలి తీరుతుంది. దేవుడు, ప్రకృతి చాలా గొప్పవి. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి -
భో'జనం' @ ఆన్లైన్
దేశంలో ఆహార సేవల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఇంటికంటే హోటళ్లు, రెస్టారెంట్లలో తినే వారి సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదవుతోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు వచ్చాక వినియోగదారులు తమకు నచి్చన ఆహారాన్ని ఒక్క క్లిక్‌లో ఆర్డర్ చేసి హాయిగా లాగించేస్తున్నారు. మార్కెట్లో విస్తరిస్తున్న వినియోగదారులు, కొత్తరకాల తినుబండారాల సంఖ్య పెరగడంతో ఈ తరహా వృద్ధి నమోదవుతోందని ఆహార సరఫరాల సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. –సాక్షి, అమరావతిరూ.9 లక్షల కోట్లకు వృద్ధి ఆదాయంలో పెరుగుదల, డిజిటలైజేషన్, మెరుగైన కస్టమర్ సేవలు, కొత్త ధోరణిలో ఆహారపు అలవాట్లు మార్కెట్లను పెంచుతున్నాయి. ప్రస్తుతం రూ.5.50 లక్షల కోట్లుగా ఉన్న ఆహార మార్కెట్ విలువ 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల గరిష్ట వృద్ధిని నమోదు చేస్తుందని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 32–34 కోట్ల వినియోగదారుల నుంచి 43–45 కోట్లకు వృద్ధి చెందనున్నారు. ఫాస్ట్‌ఫుడ్ చైన్ల పెరుగుదల, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ప్రవేశంతో దేశంలో ఆహార సేవల మార్కెట్లో గత దశాబ్దంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. తద్వారా ప్రజలు బయటి నుంచి ఆహార పదార్థాలను ఇంటికే రప్పించుకుని తినే ఫ్రీక్వెన్సీ మరింత పెరగనుంది. వాస్తవానికి దేశంలోని మొత్తం ఆహార సేవల వినియోగంలో దాదాపు 70 శాతం టాప్ 50 నగరాల్లోనే ఉంది. ఈ క్రమంలోనే క్లౌడ్ కిచెన్‌తో కూడిన క్విక్ సరీ్వస్ రెస్టారెంట్లు 40 శాతం వేగంగా వృద్ధి చెందుతాయని అంచనా. నెలకు ఏడెనిమిదిసార్లు బయట భోజనమే వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, ఆదాయం పెరుగుదల బయట ఆహారాన్ని తీసుకునే విధానంలో స్పష్టమైన మార్పులు తీసుకొస్తుందని ఓ ప్రముఖ సంస్థ తాజా నివేదిక తేల్చింది. అంటే భారతీయ వినియోగదారులు నెలకు 5 సార్లు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్లైన్ డెలివరీల్లో ప్రత్యేక భోజనం చేస్తుంటే ఇది 7–8 రెట్లు పెరుగుతుందని స్పష్టం చేస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు, ఫైన్‌డైన్ రెస్టారెంట్ల చెయిన్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని తెలిపింది. ప్రతి వినియోగదారుడు సగటున ఆరు కంటే ఎక్కువ సార్లు ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు చేస్తే.. ఇందులో ఏడాదిలో మూడు కంటే ఎక్కువ విభిన్న రకాల వంటకాలను ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ భారతీయ వినియోగదారులు ప్రతిసారీ వైవిధ్యమైన ఆహారాన్ని కోరుకుంటున్నట్టు నివేదికలో తేలింది. ముంబైలో మొదటి రెండు వంటకాలు దాల్ కిచిడీ, మార్గెరిటా పిజ్జా, ఢిల్లీలో మెక్ ఆలూ టిక్కీ బర్గర్, పిజ్జా మెక్‌పఫ్ ఉన్నాయి. బెంగళూరులో మసాలా దోశ, చికెన్ బిర్యానీ ఎక్కువగా ఆర్డర్ చేయగా.. కోల్‌కతాలో చికెన్, మటన్ బిర్యానీలను ఎక్కువగా ఇష్టపడినట్టు ఆ నివేదిక తెలిపింది. ఆయా నగరాల్లో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న ఆహార పదార్థాలు నగరం ఆహార పదార్థాలు ముంబై దాల్ కిచిడీ, మార్గెరిటా పిజ్జా ఢిల్లీ మెక్ ఆలూ టిక్కీ బర్గర్, పిజ్జా మెక్‌పఫ్ బెంగళూరు మసాలా దోశ, చికెన్ బిర్యానీ కోల్‌కతా చికెన్, మటన్ బిర్యానీ -
ఇక పక్కాగా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందుకోసం వాహనాల ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించే దిశగా కార్యాచరణకు ఉపక్రమించింది. రోడ్డు ప్రమాదాలకు కారణాల్లో వాహనాలు తగిన ఫిట్నెస్తో లేకపోవడం ఒకటని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు రవాణా శాఖ అధికారులు వాహనాలను స్వయంగా పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేకపోయినా సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 26 ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు (ఏటీసీ)లు ఏర్పాటుకు ఉపక్రమించింది. పుణెలోని ఆటో మోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) ప్రమాణాల మేరకు ఈ ఏటీసీలను డిజైన్ చేశారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్: రాష్ట్రంలో మొదటి ఏటీసీని విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేశారు. రూ. 18.50 కోట్లతో అక్కడ ఏటీసీ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి రవాణా శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. మొదటి దశలో 15 ఏటీసీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. వాటిలో శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఏటీసీల నిర్మాణానికి త్వరలోనే బిడ్లను ఖరారు చేయనున్నారు. మిగిలిన జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి ఫిబ్రవరి మొదటివారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ఏటీసీల టెండర్లు ఖరారు అయిన తరువాత ఏడాదిలోగా వాటిని ప్రారంభించాలన్నది రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఏటీసీలను ప్రభుత్వం నెలకొల్పుతోంది. తద్వారా వాహనాల ఫిట్నెస్ను శాస్త్రీయంగా పరీక్షించి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఏడాదిలోగా ఈ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. – ఎంకే సిన్హా, రవాణా శాఖ కమిషనర్ ఏటీసీల స్వరూపం ఇలా.. జిల్లా కేంద్రానికి గరిష్టంగా 30 కి.మీ. దూరంలో ఏటీసీలను నెలకొల్పుతారు. కనీసం 3 వేల చ.గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. అధునాతన సెన్సార్లు, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవింగ్ ట్రాకులను ని ర్మిస్తారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఏటీసీలో నాలుగు లేన్లతో కూడిన డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు రెండు ట్రాక్‌లు, లైట్ వెహికిల్స్‌ను రెండు డ్రైవింగ్ ట్రాక్‌లను కేటాయించారు. కాగా మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఏటీసీలలో రెండేసి చొప్పున డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. హెవీ వెహికిల్స్‌కు ఒక ట్రాక్, లైట్ వెహికిల్స్‌కు ఒక ట్రాక్‌ను కేటాయిస్తారు. ఫిట్‌నెస్‌కు వచ్చే వాహనాలు ఆ డ్రైవింగ్ ట్రాక్‌లలో ప్రయాణిస్తే... సెన్సార్ల ద్వారా వాటి ఫిట్నెస్ను పరీక్షిస్తారు. బ్రేకుల పనితీరు, ఇంజిన్ కండిషన్, ఇతర ప్రమాణాలను ఆటోమేటెడ్ విధానంలో నిర్ధారిస్తారు. దాంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ విధానాన్ని అమలులోకి తీసుకువస్తారు. -
డాక్టర్ల చేతికి ‘ఏఐ’స్కోప్!
సాక్షి, హైదరాబాద్: మనను పరీక్షించి, ఆరోగ్య సమస్య ఏమిటో గుర్తించే డాక్టర్లకు స్టెతస్కోప్ ఎలాంటిదో.. ఇకపై కృత్రిమ మేధ (ఏఐ) కూడా అలా అరచేతిలో ఉపకరణం కాబోతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్సల దాకా వీలైనంత తోడ్పాటు అందించనుంది. భవిష్యత్తులో వైద్యరంగంలో ఏఐ అత్యంత కీలకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ఇప్పటికే రేడియాలజీ, టీబీ, కేన్సర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సల కోసం ఏఐని వినియోగిస్తున్నట్టు గుర్తు చేసింది. ఈ మేరకు ‘వైద్యారోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం, నిర్వహణ, నైతికతపై డాక్యుమెంట్–2024’ను ఇటీవల విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ, క్రిటికల్ కేర్, క్లిష్టమైన కేసుల్లో వైద్యం చేయడంలో, వైద్య నిర్ధారణ పరీక్షలను సమీక్షించుకోవడంలో కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. వెంటిలేటర్‌పై ఉన్న రోగులతో కూడా వారి కుటుంబ సభ్యులు ఏఐ సాయంతో మాట్లాడవచ్చని.. వారికి సంబంధించిన వైద్య నిర్ధారణ పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు అందుకోవచ్చని తెలిపింది. వైద్యులు కేస్‌షీట్‌లో అన్ని వివరాలు రాసినా, వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించినా.. వాటన్నింటినీ క్రోడీకరించి, అనుసంధానం చేసి చూడటం ఒకింత కష్టమని స్పష్టం చేసింది. అదే ఏఐ ద్వారా డేటా మొత్తాన్ని అనుసంధానం చేస్తే.. సరైన, కచ్చితమైన నిర్ధారణకు రావొచ్చని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ♦ రోగుల వివరాలు అన్నింటి నమోదులో ఏఐ ఉపయోగపడుతుంది. ♦ డాక్టర్లు, రోగులు వేర్వేరు భాషల్లో మాట్లాడితే.. ఇతర భాషల్లోకి తర్జుమా చేస్తుంది. దీంతో ప్రపంచంలో ఏ వైద్యులతోనైనా మాట్లాడవచ్చు, చికిత్స పొందవచ్చు. రోగులు వాడిన మందులు, ప్రిస్కిప్షన్లు, వచ్చిన జబ్బులు, లక్షణాలు, ఇతర వివరాలను ఏఐ సాయంతో నమోదు చేసి పెట్టవచ్చు. భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. సులువుగా వైద్యం చేయడానికి వీలవుతుంది. ♦ వైద్య, నర్సింగ్ విద్యలో విద్యార్థుల స్థాయిని బట్టి బోధనను అందించవచ్చు. వివిధ రోగాలకు సంబంధించిన లక్షణాలను, వైద్య పరీక్షల నివేదికలను ఏఐ సాయంతో వేర్వేరుగా సృష్టించి.. ఎలాంటి పరిస్థితిలో ఏ తరహా చికిత్స ఇవ్వాలన్న శిక్షణ ఇవ్వవచ్చు. ♦ వైద్య పరిశోధన, మందుల తయారీ కోసం చాలా డేటా అవసరం. దానికోసం తీవ్రంగా శోధించాల్సి ఉంటుంది. అదే ఏఐ ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. ♦ వేల మంది రోగుల డేటా, వైద్య రిపోర్టులను ఏఐలో పొందుపర్చితే వాటన్నింటినీ విశ్లేషించి, రోగ నిర్ధారణలో సాయం చేయగలదు. ♦ ఒకేసారి లక్ష మంది చెస్ట్ ఎక్స్‌రేలను పొందుపర్చినా ఏఐ వాటన్నింటినీ విశ్లేíÙంచగలదు. డాక్టర్లకు సమయం కలసి వస్తుంది. చికిత్స సులువు అవుతుంది. స్పెషలిస్టుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం తగ్గుతుంది. ♦ వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2030 నాటికి కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కొరత ఏర్పడుతుందని అంచనా. కృత్రిమ మేధను వాడటం వల్ల ఉన్న సిబ్బందితోనే సమస్యను అధిగమించొచ్చు. ♦ యాక్సెంచర్ కంపెనీ నివేదిక ప్రకారం.. ఏఐని సరిగా వాడితే డాక్టర్లకు 40శాతం సమయం ఆదా చేస్తుంది. రోగులకు మరింత నాణ్యమైన సమయం కేటాయించే అవకాశం వస్తుంది. ♦ 2023లో యాక్స్డ్ అనే కంపెనీ కృత్రిమ మేధ సాయంతో ప్రొటీన్‌లో ఉండే సమాచారాన్ని నిక్షిప్తం చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 60కోట్ల ప్రొటీన్ల సమాచారాన్ని సేకరించింది. ఎన్నో పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది. ♦ యూఎస్‌కు చెందిన ఒక కంపెనీ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక భాషపై మోడల్‌ను తీసుకొచ్చింది. జనవరి 2023లో అది ప్రారంభం కాగా.. రెండు నెలల్లో 10 కోట్ల మంది దాన్ని వాడారు. క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ సులువు అరుదైన, క్లిష్టమైన కేసుల్లో రోగ నిర్ధారణ కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. కృత్రిమ మేధ దాన్ని సులువు చేస్తుంది. వైద్య ఆవిష్కరణల వేగం గత 75 ఏళ్లలో 200 రెట్లు పెరిగింది. ఆ వేగాన్ని అందుకోవాలంటే వైద్యులకు సాయం అవసరం. కృత్రిమ మేధ ఆ లోటును పూడ్చగలదు. దీనిని సమర్థవంతంగా వాడితే వైద్యంలో కచ్చితత్వం పెరుగుతుంది. అయితే ఏఐలో కొన్ని అంశాలపై అసమగ్ర సమాచారాన్ని మనం పొందుపరిస్తే.. అది తనకుతాను ఊహించుకొని 3 నుంచి 27శాతం వరకు సొంత నిర్ణయాలు ఇచ్చే అవకాశముంది. ఈ మేరకు కొంత నష్టం వాటిల్లే ప్రమాదమూ ఉంది. ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడితే డాక్టర్లలో నైపుణ్యాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వినర్, ఐఎంఏ, తెలంగాణ -
అధికారం కోసం అడ్డదారులు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుపొందడానికి రాజకీయపార్టీలు ప్రయత్నించడం సాధారణం. కానీ.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రం ఇందుకు భిన్నం. అడ్డదారుల్లో గెలుపొందటానికి ప్రయత్నించడం ఆ పార్టీ నైజం. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ద్వారా ఎన్నికల్లో గెలుపొందడానికి కుట్రలు చేయడం టీడీపీ రివాజుగా మార్చుకుంది. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు చేర్పించి.. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చాక సేవా మిత్ర యాప్‌తో 2015–17 మధ్య 50.23 లక్షల మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేలా చంద్రబాబు చక్రం తిప్పారు... ఇపుడు ప్రతిపక్షంలోకి మారినా అదే కుట్రను అమలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధ్య చట్టం–1950లో సెక్షన్–123(3)కి విరుద్ధంగా మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్ ఆనే వెబ్ సైట్ ఏర్పాటుచేశారు. ఈ వెబ్సైట్ ద్వారా ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలుకుతారో వివరాలు సేకరిస్తోంది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉంటామని చెప్పిన వారిని లక్ష్యంగా చేసుకుంటోంది.. బతికున్నప్పటికీ చనిపోయినట్లు చిత్రీకరించి, నకిలీ అంటూ వక్రీకరించి, శాశ్వతంగా వలస వెళ్లారంటూ మాయచేసి, రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ బొంకి.. సుమారు పది లక్షలకుపైగా ఓట్లను తొలగించాలంటూ టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ గంపగుత్తగా ఎన్నికల సంఘానికి ఫారం–7లను అందజేశారు. వాటిపై ఆయా జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. కొనేరు సురేష్ గంపగుత్తగా దరఖాస్తు చేసిన ఫారం–7లపై విచారణ చేసిన బీఎల్వోలు.. అందులో 80 శాతానికిపైగా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేశారని తేల్చారు. ఆ మేరకు జిల్లాల కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించారు. ఓట్లను తొలగించేందుకు తప్పుడు సమాచారంతో ఫారం–7లు దరఖాస్తు చేయడం ఐపీసీలో సెక్షన్–182, ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లో సెక్షన్–31 ప్రకారం నేరం. ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా.. లేదంటే ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాంటిది లక్షలాది మంది ప్రజల ఓటు హక్కును హరిస్తూ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా లక్షలాది ఫారం–7లు దరఖాస్తు చేసి, అధికారుల సమయాన్ని వృథా చేసిన టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కొనేరు సురే‹Ùపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం అమెరికాలో నిక్షిప్తం.. ఎన్నికల్లో ఇచ్చి న హామీల్లో 99.5 శాతం సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రూ.4.17 లక్షల కోట్ల ప్రయోజనాన్ని ప్రజలకు చేకూర్చారు. సంక్షేమ పథకాల ఫలాలు 87 శాతం కుటుంబాలకు చేరాయి. వికేంద్రీకరణ, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికల కంటే ఘోర పరాజయం తప్పదని నిర్ధారణకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉనికి కాపాడుకోవడం కోసం ఎప్పటిలానే ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరతీశారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్నప్పుడు తస్కరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్‌కు అనుసంధానం చేసి.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి బూత్‌లో ఇంటింటికీ కార్యకర్తలను పంపి.. ఓటరు పేరు, ఓటరు కార్డు నెంబరు దగ్గర నుంచి కులం, మొబైల్ నెంబరు, ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతారు వంటి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించడం ద్వారా వారి స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇది ప్రజాప్రతినిధ్య చట్టం–1950 ప్రకారం నేరం. ఇలా అక్రమంగా సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అమెరికాలో వర్జీనియాలోని యాష్బర్న్లో అమెజాన్ డేటా సర్వీసెస్‌లో నిక్షిప్తం చేస్తుండటం గమనార్హం. గంపగుత్తగా పది లక్షలకుపైగా ఫారం–7 దరఖాస్తులు.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని.. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే.. వాటిని తొలగించేందుకు రోజుకు గరిష్ఠంగా 5 వరకు ఫారం–7లను ఆన్లైన్లో దరఖాస్తు చేసే వెసులుబాటు ఉంది. తప్పుడు సమాచారంతో ఫారం–7లను దరఖాస్తు చేస్తే.. అలా దరఖాస్తు చేసిన వారిపై బీఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్లు) చట్ట ప్రకారం కేసులు పెడతారు. గంపగుత్తగా ఫారం–7లు అందజేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ.. మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్ ద్వారా సేకరించిన సమాచారంతో తొలి దఫాలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సుమారు పది లక్షల మంది ఓట్లను జాబితాను తొలగించాలంటూ ఫారం–7లను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేయడం గమనార్హం. బతికున్నా చనిపోయినట్లు.. నివాసం ఉన్నా వలస వెళ్లినట్లు.. వైఎస్సార్సీపీ మద్దతుదారులు బతికున్నా సరే చనిపోయినట్లు.. నివాసం ఉన్నా సరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు.. చిరునామా పక్కాగా ఉన్నా నకిలీ చిరునామాతో ఓట్లు ఉన్నట్లు.. ఒకే వ్యక్తికి ఒక చోట ఓటు ఉన్పప్పటికీ రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు చిత్రీకరిస్తూ.. పది లక్షలకుపైగా ఓట్లను తొలగించాలని ఫారం–7లను గంపగుత్తగా టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశారు. వాటిపై విచారణకు ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దాంతో.. టీడీపీ అందజేసిన ఫారం–7లను బీఎల్వోలకు పంపి క్షేత్ర స్థాయిలో విచారణ చేసింది. అందులో 80 శాతం వరకూ తప్పుడు సమాచారంతో ఫారం–7లను దరఖాస్తు చేసినట్లు బీఎల్వోలు తేల్చారు. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో బతికి ఉన్న 8,355 మందిని చంపేసిన టీడీపీ.. ♦ అన్నమయ్య జిల్లాలో రాజంపేట, కోడురు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో 18,936 మంది చనిపోయినట్లు, 5071 మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు, 910 నకిలీ ఓట్లు ఉన్నట్లు, 3,799 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 11,642 మంది నివాసం ఉంటున్న ఇళ్లు లేనట్లు చూపి మొత్తం 40,358 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించాలంటూ ఫారం–7లను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి గంపగుత్తగా దరఖాస్తులు అందజేశారు. వాటిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ♦ టీడీపీ దరఖాస్తు చేసిన 40,358 ఫారం–7లపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సమగ్రంగా విచారణ చేయించారు. 10,581 మంది చనిపోయినట్లు, 933 మంది శాశ్వతంగా వలసపోయినట్లు, 1397 మందికి రెండు చోట్ల ఓటు ఉన్నట్లు, 2350 ఓట్లను ఇప్పటికే తొలగించినట్లు విచారణలో వెల్లడైంది. అంటే.. టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7లలో 25,097 నకిలీవని స్పష్టమవుతోంది. అంటే.. 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లు టీడీపీ చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. తప్పుడు సమాచారం ఇచ్చి 25,097 మందికి ఓటు హక్కు లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ పంపారు. విశాఖ జిల్లాలో 4,632 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు.. ♦ విశాఖపట్నం జిల్లాలో భీమిలి, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో 8,914 మంది చనిపోయినట్లు, 4,862 మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు, 391 నకిలీ ఓట్లు ఉన్నట్లు, 11,279 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 13,426 మంది చిరునామాలు లేనట్లు చిత్రీకరిస్తూ 38,872 ఓట్లు తొలగించాలని టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి ఫారం–7లను గంపగుత్తగా అందజేశారు. వాటిపై విశాఖపట్నం కలెక్టర్‌ను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ♦ కొనేరు సురేష్ దరఖాస్తు చేసిన 38,872 ఫారం–7లపై విశాఖపట్నం జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సమగ్రంగా విచారణ చేయించారు. ఇందులో 26,123 ఫారం–7లు తప్పుడు సమాచారంతో దరఖాస్తు తేల్చారని తేల్చారు. టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7ల మేరకు 5,027 మంది చనిపోయినట్లు, 6,647 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు, 841 మందికి రెండు ఓట్ల ఓట్లు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే 254 ఓట్లు తొలంచినట్లు తేల్చారు. వీటిని పరిశీలిస్తే.. విశాఖ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 3,887 మంది బతికే ఉన్నా చనిపోయినట్లు, 4,632 మంది స్థానికంగా నివాసం ఉన్నా శాశ్వతంగా వలస పోయినట్లు టీడీపీ తప్పుడు సమాచారం ఇచ్చి నట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు విచారణ నివేదికను విశాఖ కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదించారు. గుంతకల్లు నియోజకవర్గంలో 4,666 ఓట్ల తొలగింపునకు కుట్ర ♦ అనంతపురం జిల్లాలో గుంతకల్లు నియోజవకర్గంలో 9,582, రాయదుర్గం నియోజకవర్గంలో 6,130, శింగనమల నియోజకవర్గంలో 1904, అనంతపురం నియోజకవర్గంలో 1803, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 6,416 ఓట్లను తొలగించాలంటూ ఫారం–7లను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ గంపగుత్తగా ఎన్నికల సంఘానికి అందజేశారు. వాటిపై అనంతపురం జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ♦ టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7లపై అనంతపురం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో విచారణ చేయించారు. గుంతకల్లు నియోజవకర్గంలో 4,666, రాయదుర్గంలో 1,630, శింగనమలలో 1137, అనంతపురంలో 406, కళ్యాణదుర్గంలో 2,640 ఓట్లు అర్హమైనవిగా తేల్చారు. అంటే.. టీడీపీ ఎంత భారీ ఎత్తున తప్పుడు ఫారం–7లను దరఖాస్తు చేసిందో విశదం చేసుకోవచ్చు. కుప్పంలో 2,435 మందిని చంపేశారు.. ♦ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కుప్పం, నగరి, జీడినెల్లూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో 27,008 ఓట్ల తొలగింపు కోసం ఫారం–7లను ఆపార్టీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేష్ దరఖాస్తు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాటిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారణ చేయించారు. ఎన్టీఆర్ దెబ్బకు 1983 ఎన్నికల్లో సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయి 1989 ఎన్నికలకు కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు వలస వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఆరు సార్లు వరుసగా గెలిపించిన పాపానికి కుప్పం నియోజకవర్గంలో 2,435 మంది బతికి ఉన్నప్పటికీ చనిపోయినట్లుగా తేల్చేసిన టీడీపీ వారి ఓట్లు తొలగించాలని ఫారం–7లు దరఖాస్తు చేసినట్లు కలెక్టర్ విచారణలో వెల్లడైంది. ఇక చిత్తూరు జిల్లాలో పుంగనూరు, నగరి, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో బతికి ఉన్న 4,780 మందిని కొనేరు సురేష్ చనిపోయినట్లుగా చిత్రీకరించి.. వారి ఓట్లను తొలగించాలని కోరడం గమనార్హం. కలెక్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు టీడీపీ దరఖాస్తు చేసిన ఫారం–7లపై విచారణ చేసిన కలెక్టర్లు.. అందులో 80 శాతానికిపైగా తప్పుడు సమాచారంతో కూడుకున్నవని తేల్చారు. అర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించేది లేదని స్పష్టం చేశారు. దాంతో ఆ ఓట్లను తొలగించాలంటూ కలెక్టర్లను టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, అనంతపురం, కర్నూల్, చిత్తూరు, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే అందుకు తార్కాణం. 2019 ఎన్నికలకు ముందు 50.23 లక్షల ఓట్లు తొలగింపు విభజన నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చి న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆధార్తోసహా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ–ప్రగతి నుంచి ప్రైవేటు సంస్థలు ఐటీ గ్రిడ్స్, బ్లూప్రాగ్ సంస్థలకు చేరవేశారు. అదే సంస్థలతో టీడీపీ సేవా మిత్ర యాప్‌ను తయారుచేయించి.. తస్కరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దానితో అనుసంధానం చేశారు. దీనిపై హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. 2015–17 మధ్య ఇంటింటికీ వెళ్లిన టీడీపీ కార్యకర్తలు సేవా మిత్ర యాప్‌లలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతామని చెప్పిన వారి ఓట్లను తొలగించేలా ఫారం–7లను దరఖాస్తు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఓట్లను తొలగించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్రంలో 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన ఈ కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేల్చిన ఎన్నికల అధికారులు 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో చేర్చారు. దీంతో గత ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. -
దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం?
పలు రిపోర్టుల ప్రకారం దేశంలో కోటికిపైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. వీధి కుక్కల జనాభా దాదాపు 3.5 కోట్లు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2019లో దేశంలో కుక్కకాటు కేసులు 4,146 నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 27.52 లక్షల కేసులు నమోదయ్యాయి, తమిళనాడు (20.7 లక్షలు), మహారాష్ట్ర (15.75 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీధికుక్కలు కొన్ని సందర్భాల్లో మనుషులను కరుస్తుంటాయి. ఇది రేబిస్ వ్యాధికి దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వీధికుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. చట్టం ప్రకారం 2001 నుండి భారతదేశంలో కుక్కలను చంపడాన్ని నిషేధించారు. అయితే 2008లో ముంబయి హైకోర్టు నిర్ణయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. మునిసిపాలిటీలకు వీధి కుక్కలను చంపడానికి అనుమతినిచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ (జీ) వన్యప్రాణులను రక్షించడం, అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్థానికులు తమ నివాస ప్రాంతాల్లోని వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు గత ఏడాది సమర్థించింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత -
ఆకలి సూచీలో అధోగతి!
ఎన్నో విజయాలు సాధిస్తున్నాం... అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎంతో దూరంలో లేదని చెప్పుకొంటూనే ఉన్నాం. కానీ ఆకలి భూతాన్ని అంతం చేయటంలో వెనకబడే ఉన్నామని ఏటా వెలువడుతున్న అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలోని ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్ సిండీ మెకెయిన్ మాటలు విన్నా, తాజాగా ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)ని గమనించినా మన పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదని అర్థమవుతుంది. జీహెచ్ఐ జాబితాలో మొత్తం 125 దేశాలు వుంటే, అందులో మన స్థానం 111. నిరుటికన్నా నాలుగు స్థానాలు కిందకు దిగజారామని ఆ నివేదిక చెబుతోంది. 2015 వరకూ ఎంతో పురోగతి సాధించిన భారత్ ఆ తర్వాత వరసగా నేల చూపులు చూస్తుందన్నది దాని సారాంశం. భారత్‌కు సంబంధించి నంతవరకూ ఇది వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. అసలు జీహెచ్ఐ కోసం నిర్దేశించిన ప్రమాణాలు, తీసుకుంటున్న నమూనాలు, మొత్తంగా ఆ ప్రక్రియ సక్రమంగా లేదని కేంద్రం ఆరోపణ. ప్రపంచంలో 2030 నాటికి ఆకలన్నదే ఉండరాదన్నది ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. కేవలం ఆహారం లభించటం ఒక్కటే ఆకలి లేదన టానికి గీటురాయి అనుకోవటానికి లేదనీ, ఆ లభిస్తున్న ఆహారంలో మనిషికి అవసరమైన కేలరీలు వుండాలనీ సమితి వివరించింది. మరో ఏడేళ్లకల్లా ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాన్ని అందుకోవలసి వుండగా అనేక దేశాలు ఇంకా వెనకబడే ఉన్నాయని జీహెచ్ఐ అంటున్నది. జాబితా గమనిస్తే పాకిస్తాన్ 102తో మనకన్నా మెరుగ్గా వుండగా, బంగ్లాదేశ్ (81), నేపాల్ (69), శ్రీలంక (60) దాన్ని మించిన మెరుగుదలను చూపించాయి. 28.7 స్కోర్‌తో ఆకలి తీవ్రత భారత్‌లో చాలా ఎక్కువగా ఉందన్నది జీహెచ్ఐ అభియోగం. పౌష్టికాహార లోపంలోనూ 16.6 స్కోర్‌తో మనం చాలా కింది స్థాయిలో వున్నాం. అయిదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1గా ఉందని నివేదిక వివరిస్తోంది. మొన్న ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ఆహారధాన్యాలు అందించామనీ, కానీ 2022–23లో ఆహార సబ్సిడీల బిల్లు రూ.2.87 లక్షల కోట్లకు చేరుకున్నందున అదనంగా ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ నిలిపేశామనీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పౌష్టికాహారలోపం కేవలం ఆహారధాన్యాలు ఉచితంగా అందించటం వల్ల మాత్రమే తీరేది కాదు. అవసరమైన పోషకాహారాన్ని అందించటంతో పాటు మహిళా విద్య, శిశు సంరక్షణ, మెరుగైన పారిశుద్ధ్యం, సురక్షితమైన మంచినీరు లభించేలా చూడటం వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఈ రంగాలన్నిటా నిరుటితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఏపాటి? సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) పేరు మారి సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 అయింది. కానీ గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఒక శాతం తగ్గి 20,554 కోట్లకు పరిమితమైంది. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మధ్యాహ్న భోజన పథకం)కు నిరుడు రూ. 12,800 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో అది రూ. 11,600 కోట్లకు తగ్గింది. బాలికల విద్యకు నిరుటితో పోలిస్తే కేవలం 0.2 శాతం పెంచి రూ. 37,453 కోట్లకు సరిపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో బేటీ బచావో, బేటీ పఢావో, వన్ స్టాప్ సెంటర్ (ఓఎస్సీ) తదితర పథకాలతో కూడిన సంబాల్ స్కీమ్‌కైతే కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. మహిళలకు అందించే ఇలాంటి పథకాలైనా, శిశువులకు ఉద్దేశించిన పథకాలైనా పరిస్థితిని మెరుగుపరచగలవు. జీహెచ్ఐ సూచీ ప్రాతిపదికలు, మొత్తంగా అది రూపొందించే ప్రక్రియ లోపరహితమైనదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయనవసరం లేదు. ఎందుకంటే ఇంత జనాభా గల దేశంలో పౌష్టికాహార లోపాన్ని గణించటానికి కేవలం 3,000 మంది వివరాలు మాత్రమే తీసుకుంటే అది సంపూర్ణ చిత్రాన్ని ఆవిష్కరించగలుగుతుందా? తీవ్రమైన పోషకాహారంతో పిల్లలు అతి బలహీనంగా వుండటం జీహెచ్ఐ సూచీ ప్రకారం 18.7 శాతం వుండగా, మన పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ప్రతి నెలా సాగిస్తున్న పర్యవేక్షణలో అది కేవలం 7.2 శాతానికి పరిమి తమైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే 80 కోట్లమందికి పైగా ప్రజానీకానికి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 11 లక్షల 80 వేల టన్నుల ఆహారధాన్యాలను 28 నెలలపాటు అందించామని కూడా వివరించింది. అలాగే పోషకాహార లోప సవాల్‌ను ఎదుర్కొనడానికి వివిధ పథకాల కింద ఎంతో చేస్తున్నామంటున్నది. జీహెచ్ఐ సూచీకి తీసుకున్న నమూనాలు సక్రమంగా లేవనడం వరకూ ఏకీభ వించొచ్చు. అయితే నివేదికే పక్షపాతంతో వున్నదనీ, భారత్ ప్రతిష్టను దెబ్బతీయడమే దీని లక్ష్యమనీ అనడం సరికాదు. ఎందుకంటే ఇదే ప్రక్రియ సూచీలోని 125 దేశాల్లోనూ అమలు పరిచివుంటారు. దేశ జనాభాలో నిర్దిష్టంగా ఫలానా శాతం అని పెట్టుకుని దాని ప్రకారం నమూనాలు తీసుకుంటే ఈ సూచీ వెల్లడిస్తున్న అంశాలు వాస్తవానికి మరింత చేరువగా ఉండేవనటంలో సందేహం లేదు. ఒకపక్క బడ్జెట్ కేటాయింపుల్లో, కేటాయించిన నిధులు వ్యయం చేయటంలో మనం సక్రమంగా లేమని అర్థమవుతున్నప్పుడు ఆకలి సూచీ వంటివాటిపై ఆరోపణలు చేయటంవల్ల ఉపయోగం లేదు. పోషకాహారం విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం వుంది. రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కూడా తేడాలున్నాయి. ఇవన్నీ సరిచేసుకుంటే నిస్సందేహంగా మెరుగుపడతాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు చేరవవుతాం. ఆ దిశగా ప్రభుత్వాలన్నీ దృష్టి పెట్టాలి. -
కేంద్ర నిధులపై ప్రజలకు నివేదికలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద తెలంగాణకు కేటాయించిన, విడుదల చేసిన నిధుల వివరాలతో నివేదికలు విడుదల చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వీటిని వెలువరించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రూపాల్లో పెద్దెత్తున నిధులు కేటాయిస్తూ విడుదల చేస్తున్నా.. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వం, అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇది దోహదపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, సెప్టెంబర్ రెండో వారంలోగా అన్ని జిల్లా, అసెంబ్లీ కేంద్రాల్లో ‘పవర్‌పాయింట్ ప్రజెంటేషన్’ ద్వారా మోదీ ప్రభుత్వం వివిధ శాఖలు, రంగాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఆయా వివరాలతో బుక్లెట్లు, కరపత్రాలు కూడా పంపిణీ చేయాలని తీర్మానించారు. గతంలోనే కిషన్‌రెడ్డి రిపోర్ట్ కార్డ్ హైదరాబాద్‌లో గత జూన్ 17న కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ప్రజలకు మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల రిపోర్ట్ కార్డ్–తెలంగాణ అభివృద్ధికి అందించిన సహకారం’ పేరిట పవర్‌పాయింట్, డిజిటల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్రం నుంచి అందిన సాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, రంగాల వారీగా తెలంగాణకు అందిన నిధులు, గ్రాంట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ సీనియర్ నేత డా.ఎస్.మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్, తొమ్మిదేళ్ల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. 17లోగా అవగాహన కల్పించాలి కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధిలో కేంద్రం పాత్రకు సంబంధించిన వివరాలు గడపగడపకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి సమావేశాల్లో వివిధ రంగాల ప్రముఖులు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, రిటైర్డ్ అధికారులను భాగస్వామ్యం చేసుకుంటూ సెప్టెంబర్ 17లోగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్‌షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్‌షాపు తెలంగాణ ఇన్చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్‌షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్‌రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు నిర్వాకం ఫలితం.. ముంపు ముంగిట్లో రాజధాని అమరావతి
తాడికొండ : ప్రపంచ ప్రఖ్యాత రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పిన గొప్పలు చిన్నపాటి వర్షానికే వెక్కిరిస్తున్నాయి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని, శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్ రావు వంటి నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలను తొక్కిపెట్టిన చంద్రబాబు నారాయణ కమిటీ వేసి తనకు అనుకూలంగా రాజధాని నిర్మించుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా రాజధాని ప్రాంతానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొండవీటి వాగు, కోటేళ్ల వాగు, చీకటి వాగుకు వచ్చే భారీ వరద నీటిని మళ్ళించేందుకు గత ప్రభుత్వ హయాంలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సచివాలయం, హైకోర్టును వరద నీరు భారీగా చుట్టుముట్టింది. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు వెళ్లే రహదారులు సైతం పూర్తిగా నీట మునగడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొండవీటి వాగుకు భారీగా వచ్చిన వరదతో పెదపరిమి, నీరుకొండ, ఐనవోలు, నేలపాడు ప్రాంతాల్లో పొలాలు, రోడ్లు ముంపునకు గురయ్యాయి. కోటేళ్ల వాగుకు బు«ధ, గురువారాలు ఉప్పొంగడంతో సచివాలయ, హైకోర్టు ఉద్యోగులు మంగళగిరి మీదుగా తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ముందుచూపు లేకుండా ముంపు ప్రాంతంలో రాజధాని నిర్మించిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిరుపేదలకు భూమి
సాక్షి, అమరావతి: సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ భూములు పంపిణీ చేయనుంది. 23 జిల్లాల్లో 54 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో అర్హులైన సుమారు 47 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసింది. ఆయా జిల్లాల అసైన్మెంట్ కమిటీల ఆమోదం కూడా దాదాపు పూర్తయింది. భూమి లభ్యతను బట్టి ఒక్కో లబ్ధిదారునికి ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరం వరకు భూమి ఇవ్వనున్నారు. గ్రామాల్లో నిరుపేదలకు వ్యవసాయ భూములు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఏడాది కిందటే కసరత్తు మొదలుపెట్టారు. అన్ని జిల్లాల్లో పేదలకు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న భూమి, అర్హులైన లబ్దిదారుల వివరాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల పరిశీలన తర్వాత 23 జిల్లాల్లోనే భూమి అందుబాటులో ఉన్నట్లు తేలింది. వైఎస్సార్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆశాజనకంగా భూమి అందుబాటులో ఉండగా, మరో 8 జిల్లాల్లో వెయ్యి నుంచి 4 వేల ఎకరాల లోపు భూమి లభ్యత ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరో 9 జిల్లాల్లో వెయ్యి నుంచి 2 వేల ఎకరాల భూమి ఉండగా, 4 జిల్లాల్లో వెయ్యి ఎకరాల లోపు భూమి అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. విశాఖ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో భూమి అందుబాటులో లేదు. దీంతో భూమి లభ్యత ఉన్న 23 జిల్లాల్లో గుర్తించిన భూమిని సర్వే చేసి, డిమార్కేషన్ చేయించారు. అసైన్మెంట్ కమిటీల అనుమతులు కూడా లభించాయి. త్వరలో మంత్రివర్గం భూ పంపిణీకి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వైఎస్సార్ జిల్లాలో 8,916 ఎకరాలు అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 8,916 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో 7,476, కర్నూలు 4,092, నంద్యాల 3,678, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 3,711, కాకినాడ 2,935, చిత్తూరు 2,866, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2,565 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. భూ పంపిణీలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసేందుకు ఇళ్ల పట్టాల పంపిణీ మాదిరిగా ఆన్లైన్ సేవా యాప్‌ను వినియోగించనున్నారు. ఈ యాప్ ద్వారానే అర్హులకు పట్టాలు జెనరేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలుత లబ్దిదారుల పేర్లను వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్ చేస్తారు. భూ పంపిణీ కోసం ప్రత్యేకంగా మ్యుటేషన్ చేసే అధికారాన్ని ఆర్డీఓలకు ఇచ్చారు. మామూలుగా అయితే ఈ లాగిన్ జేసీల వద్ద ఉంటుంది. ఆర్డీఓలు మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేశాక, ఆ వివరాల ఆధారంగా వీఆర్ఓలు తమ గ్రామాల పరిధిలోని లబ్దిదారుల వ్యక్తిగత వివరాలను యాప్‌లో అప్లోడ్ చేస్తారు. చివరిగా అవి తహశీల్దార్ లాగిన్లోకి వెళ్లాక ఆయన పరిశీలించి అనుమతిస్తారు. అప్పుడు లబ్ధిదారుని పేరుపై వ్యవసాయ భూమి పట్టా జెనరేట్ అవుతుంది. దీంతో లబ్దిదారుల వివరాలన్నీ వెబ్‌ల్యాండ్‌లో, ఆన్లైన్ యాప్‌లోనూ ఉంటాయి. వాటిని మార్చడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. 2013లో చివరి సారిగా భూ పంపిణీ రాష్ట్రంలో చివరిసారిగా 2013లో భూ పంపిణీ జరిగింది. తక్కువ భూమి అయినా పేదలకివ్వడం అదే చివరిసారి. ఆ తర్వాత భూ పంపిణీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. పేదలు మాత్రం తమ జీవనోపాధికి కొంత భూమి ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతూనే ఉన్నారు. అలాంటి దరఖాస్తులు తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్లలో ఎప్పటి నుంచో మూలనపడి ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరూ అడగకుండానే నిరుపేదలకు మేలు చేయాలనే సంకల్పంతో భూ పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. పేదల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. కూలినాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారిని, కౌలుకు తీసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న వారిని భూ యజమానులుగా చేయనుంది. తద్వారా ‘ఈ భూమి మాదే’ అని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు గర్వంగా చెప్పుకునేలా చేయాలని తాపత్రయ పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 54 వేల ఎకరాల భూ పంపిణీకి వేగంగా చర్యలు తీసుకుంటోంది. పట్టాపైనే పూర్తి వివరాల నమోదు పట్టాలపై గతంలో మాదిరి కాకుండా లబ్దిదారుని పూర్తి వివరాలు నమోదు చేయనున్నారు. వీటితోపాటు భూమికి సంబంధించిన సర్వే నంబర్ (లేదా ఎల్పీఎం నంబర్), విస్తీర్ణం, ఖాతా నంబర్, భూమి స్వభావాన్ని కూడా ముద్రించనున్నారు. సర్వే నంబరు వారీగా భూమిని గుణించి మొత్తం విస్తీర్ణాన్ని పట్టాపై కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. పట్టాపై లబ్దిదారుడు, భూమికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయడం వల్ల ఆ భూమిని భవిష్యత్తులో మరొకరికి బదలాయించే అవకాశం ఉండదని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ఆధార్ నంబర్ కూడా పట్టాపై నమోదు చేయడం ద్వారా మరోసారి భూమి కోసం సంబంధిత లబ్ధిదారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. -
మనిషి మృతితో యాక్టివ్‌గా మారే హార్మోన్.. ఏం చేస్తుందంటే...
ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. అయితే ఏ మనిషికైనా మృత్యువు సమీపించినప్పుడు అతను ఎటువంటి అనుభూతికి గురవుతాడనేదానిపై లెక్కలేనన్ని పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాగా ఒక నిపుణుడు దీనిపై పలు వివరాలు వెల్లడించారు. లివర్ పూల్ యూనివర్శిటీకి పరిశోధకుడు సీమస్ కోయల్ అందించిన ఒక ఆర్టికల్‌లోని వివరాల ప్రకారం.. మనిషి మరణించే ప్రక్రియ అతనిలో రెండు వారాల ముందే మొదలవుతుంది. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. నిద్రించడం కూడా ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. జీవితపు చివరి రోజుల్లో మనిషి ఔషధాలు తీసుకోవడంలో, భోజనం చేయడంలో, ఏదైనా తాగడంలోనూ తగిన సామర్థ్యాన్ని కోల్పోతాడు. మరికొందరు పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం మెదడు నుంచి పలు రసాయనాలు విడుదలవుతాయి. వాటిలో ఒకటి ఎండోఫ్రిన్. ఈ రసాయనం మనిషి భావాలను అమితంగా ప్రభావితం చేస్తుంది. మనిషి తాను మరణించే సమయాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. అయితే ఇప్పటివరకూ అందిన పలు పరిశోధనల వివరాల ప్రకారం మనిషి మృత్యువుకు సమీపిస్తున్న కొద్దీ అతని శరీరంలో స్ట్రెస్ కెమికల్ వృద్ధి చెందుతూ ఉంటుంది. క్యాన్సర్ బాధితులకు మరణ సమయంలో శరీరం వాపునకు గురవుతుంది. మరణించే సమయంలో మనిషిలో శారీరక నొప్పులు తక్కువకావడం విశేషం. ఇలా ఎందుకు జరుగుతుందో పరిశోధకులకు కూడా ఇంతవరకూ అంతుచిక్కలేదు. అయితే ఇది ఎండోఫ్రిన్ కారణంగానే జరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కాగా ప్రతీ మనిషి మృతి ఒక్కో విధంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మృత్యువుకు సంబంధించిన పలు విషయాలు పరిశోధకులకు సైతం అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! -
త్రైమాసిక నివేదికలివ్వండి
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి త్రైమాసిక నివేదికలు సమర్పించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇస్తున్న రాయితీ విద్యుత్‌కు సంబంధించిన ఆడిట్ వివరాలు, బిల్లుల లెక్కలను ఏపీఈఆర్సీకి ఇవ్వాల్సిందిగా మన రాష్ట్ర డిస్కంలకు సూచించింది. అక్కడి నుంచి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) సేకరిస్తుందని తెలిపింది. ఒకవేళ డిస్కంలు చెబుతున్న లెక్కల్లో తేడాలున్నట్టు తేలితే కేంద్రం నుంచి ప్రస్తుతం డిస్కంలకు అందుతున్న రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) ప్రోత్సాహకాలను నిలిపివేస్తామని, జరిమానాలు కూడా విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 2005కి సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ నిబంధనల ప్రకారం.. విద్యుత్ సబ్సిడీ, దాని అకౌంటింగ్‌ను క్రమబద్ధీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. విద్యుత్ సబ్సిడీ పంపిణీ వివరాలను డిస్కంల నుంచి తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ సబ్సిడీకి సబ్సిడీ కేటగిరీ, వినియోగదారుల కేటగిరీ వారీగా వినియోగించే విద్యుత్‌కు సంబంధించిన కచ్చితమైన లెక్కల ఆధారంగా డిస్కం సబ్సిడీ డిమాండ్‌ను పెంచారా లేదా అనే వివరాలు నివేదికలో ఉండాలని పేర్కొంది. విద్యుత్ చట్టంలోని సెక్షన్–65 ప్రకారం సబ్సిడీకి సంబంధించిన వాస్తవ చెల్లింపు వివరాలు, ఇతర సంబంధిత వివరాల్లాగే చెల్లించాల్సిన సబ్సిడీ, చెల్లింపులో అంతరం వివరాలు కూడా నివేదికలో ఉండాలని చెప్పింది. దీనిపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘టైమ్ ఆఫ్ డే’ విధానానికీ సవరణ రోజులో గంటల లెక్కన విద్యుత్ ధరల ప్రకారం బిల్లులు విధించే ‘టైమ్ ఆఫ్ డే’ విధానంలోనూ సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని పరిశ్రమలకే పరిమితమైన ఈ పద్ధతిని అన్ని పరిశ్రమలు, వాణిజ్య సర్విసులకు వర్తింపజేసేలా ముసాయిదా విద్యుత్ (వినియోగదారుల హక్కులు) సవరణ నిబంధనలు–2023 పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి.. రాష్ట్రాలు, విద్యుత్ సంస్థల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే విద్యుత్ డిమాండ్ గరిష్టంగా (పీక్) ఉండే వేళల్లో వాడిన విద్యుత్‌కు అధిక చార్జీలు విధించే అవకాశం ఉంది. అదే సమయంలో డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో వినియోగించిన విద్యుత్ చార్జీల్లో 20 శాతం వరకూ రాయితీ లభించనుంది. అయితే, ఇందుకోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. -
డేంజర్ ‘లైఫ్‌స్టైల్’.. 63 శాతం మరణాలకు ఇదే కారణం! షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణతో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. పోటీ ప్రపంచంలో అందరి కంటే ముందుండటానికి ఉరుకులపరుగుల జీవితం ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యమైపోయింది. ఈ ప్రపంచీకరణతో మనిషి ఆలోచనలు, అలవాట్లు, ఆహారం అన్నీ మారిపోయాయి. మారిన జీవనశైలి తనతోపాటు కొన్ని వ్యాధులను కూడా మోసుకొస్తోంది. దీంతో ఊబకాయం, క్యాన్సర్, గుండెపోటు, శ్వాసకోశ వ్యాధులు అధికమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మరణిస్తున్న ప్రతి వంద మందిలో 63 శాతం మంది జీవనశైలి వ్యాధులతోనే మృతి చెందుతున్నారు. పొగ తాగడం, మద్యపానం, పోషకాహారలోపం, శారీరక వ్యాయామం లేకపోవడం, మానసిక, పని ఒత్తిళ్లు అనారోగ్యానికి ప్రధాన కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. 2030లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తారని బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగిస్తోంది. టారీ సర్వేలో ఆందోళనకర అంశాలు అలాగే థాట్ ఆర్బిటరేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టారీ) దేశంలోని 21 రాష్ట్రాల్లో 2,33,672 మంది వ్యక్తులను, అలాగే 673 ప్రజారోగ్య కార్యాలయాలను పరిశీలించింది. ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. 18 ఏళ్లు దాటిన వారు కూడా జీవనశైలి వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–ఎన్సీడీ) జాబితాలో ఉన్నారు. 35 ఏళ్లు దాటిన వారికి హైపర్‌టెన్షన్, జీర్ణ సమస్యలు, షుగర్ ఎక్కువగా వస్తున్నాయి. వీటి తర్వాత స్థానంలో క్యాన్సర్ నిలుస్తోంది. దేశంలో 26–59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఎన్సీడీ జబ్బులతో బాధపడుతున్నారు. ఇది దేశానికి చాలా ఆందోళన కలిగించే అంశమని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. వీరు అనారోగ్యానికి గురైతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ దేశవ్యాప్తంగా వైద్య సంఘాలకు తాజాగా లేఖ రాశారు. జీవనశైలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాలు, మెట్రో నగరాల్లో మరింత ప్రమాదం.. జీవనశైలి వ్యాధులకు గురవుతున్నవారిలో పట్టణాలు, మెట్రో ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరుకు చెందిన మాక్స్ హెల్త్‌కేర్ చైర్మన్, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంబరీస్ మిట్టల్ పరిశీలనలో 1970లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 శాతం మందికి షుగర్ ఉండేది. 2020లో ఇది 15–20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం అది 27 శాతానికి చేరింది. అలాగే మెట్రో నగరాల్లో 35–40 శాతం మందికి షుగర్ జబ్బు ఉంది. ఇదే క్రమంలో నరాల సంబంధిత వ్యాధులు గత 30 ఏళ్లతో పోలి్చతే నాలుగురెట్లు పెరిగాయని న్యూఢిల్లీలోని లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ రాజీందర్కే ధనుంజయ పరిశీలనలో తేలింది. అధిక బరువు (ఒబేసిటీ) 2005తో పోలి్చతే 2015లో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రెట్టింపయింది. ఇందులో 20.7 శాతం మంది పురుషులు, 18.6 శాతం మంది స్త్రీలు ఉన్నారు. అయితే 2023కు ఈ సంఖ్య మళ్లీ రెట్టింపయింది. శారీరక శ్రమ లేకపోవడమే అధిక బరువుకు ప్రధాన కారణం. మానసిక సమస్యలు దేశం మొత్తం జనాభాలో 10 శాతం మంది పలు రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 18 ఏళ్ల యువకులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య ఏటా 13 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో కనీసం 15 కోట్ల మంది పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. తమకు మానసిక సమస్య ఉంది అని గుర్తించలేని స్థితిలో మరో 5 కోట్లమంది దాకా ఉన్నారు. వీరందరికీ సైకియాట్రిస్టుల అవసరం ఉంది. క్యాన్సర్ ప్రమాదకర రసాయనాలు ఉన్న కాస్మోటిక్స్, రసాయనాలతో మిళితమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వాయు, వాతావరణ కాలుష్యం, మద్యం, పొగాకు, మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 5–8 శాతం పెరుగుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒక్కసారైనా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీవన విధానంలోని మార్పులు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడంతో 26 శాతం మంది గుండెజబ్బులకు గురవుతున్నారని ‘టారీ’ సర్వే తేల్చింది. పాశ్చాత్య సంస్కృతితో ముప్పు.. మనదేశంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి రాత్రిళ్లు మరీ ఎక్కువసేపు మెలకువతో ఉంటున్నారు. ఆహార అలవాట్లు, జీవన విధానం కూడా మారిపోయాయి. దీంతో రోగాలు చుట్టుముడుతున్నాయి. ఉదయమే నిద్రలేస్తే ‘కార్టీజాల్’ హార్మోన్ ఉత్పత్తితో బాడీ రిథమ్‌లో పనిచేస్తుంది. ఆలస్యంగా నిద్రలేస్తే దీని ఉత్పత్తి తగ్గిపోతుంది. రాత్రిళ్లు పనిచేసేవారు పగలు నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామానికి సమయం కేటాయించాలి. దీంతో ఎండార్ఫిన్ ఉత్పత్తి అయి మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, హెచ్‌వోడీ, ఎండోక్రైనాలజీ, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
భారతీయుల సంతోషాన్ని లాకున్న కోవిడ్.. సర్వేలో కీలక విషయాలు
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి భారతీయుల భావోద్వేగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఒత్తిడి, కోపం, విచారం, ఆందోళనలతో ఇటీవల కాలంలో నిరాశ, నిస్పృహలను పెంచుతోంది. ఫలితంగా కోవిడ్ సోకిన భారతీయుల్లో సంతోషాల శాతం క్షీణిస్తోంది. కన్సల్టింగ్ సంస్థ హ్యాపీప్లస్ ‘ది స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ 2023’ నివేదిక ప్రకారం.. 35 శాతం మంది ‘నెగిటివ్ ఎమోషన్స్’ అనుభవిస్తున్నారు. ఇది గత సర్వేతో పోలిస్తే రెండుశాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు భారతీయుల్లో సానుకూల భావోద్వేగాలు 70 నుంచి 67 శాతానికి పడిపోయాయి. జీవన మూల్యాంకన రేటు 6.84 పాయింట్ల నుంచి 6.08 పాయింట్లకు తగ్గిపోయింది. ఆర్థిక సమస్యలు, పనిప్రదేశాల్లో ఒత్తిడి, సామాజిక నిబంధనలు, ఒంటరితనం, కుటుంబంలో అనిశ్చి తులు వంటి కారణాలు అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని సర్వే అభిప్రాయపడింది. యువత, వృద్ధుల్లో పెరుగుతున్న కోపం హ్యాపిప్లస్ దేశవ్యాప్తంగా 14 వేల మంది ప్రతిస్పందనల ఆధారంగా నివేదిక రూపొందించింది. ఇందులో విద్యార్థుల్లో అత్యధికంగా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని తెలిపింది. 18 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇతర వయసుల వారి కంటే ఎక్కువగా కోపం, విచారం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పదిమందికి ఇద్దరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటే.. ఇప్పుడు వారిసంఖ్య ఐదుకు పెరగడం గమనార్హం. తగ్గిన జీవన వృద్ధి మరోవైపు తాజా అధ్యయనంలో 20 శాతం మంది వివిధ కారణాలతో బాధపడుతున్నట్టు తేలిందని నివేదిక చెబుతోంది. ఇది 2021లో 12 శాతంగా ఉండేది. అలాగే నిత్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు 63 శాతం ఉండగా.. ఇది కూడా గతేడాది కంటే (49 శాతం) పెరిగింది. ఇదిలా ఉంటే గతేడాది 39 శాతం మంది భారతీయులు తాము వృద్ధి సాధించామని చెబితే.. ఇప్పుడు 17 శాతం మంది మాత్రమే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నివేదిక పేర్కొంది. -
నిర్మలమ్మకు 2023–24 వార్షిక బడ్జెట్ వినతులు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పలు విశ్లేషణా సంస్థలు, ఆర్థికవేత్తలు పలు సూచనలు, నివేదికలు, సిఫారసులు కేంద్రానికి సమర్పిస్తున్నారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... ఐదేళ్లు కస్టమ్స్ సుంకాలను మార్చవదు: జీటీఆర్ఐ దేశీయ తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కనీసం ఐదేళ్లపాటు కస్టమ్స్ సుంకాలలో ఎలాంటి మార్పులు చేయరాదని ఆర్థిక విశ్లేషణా సంస్థ– జీటీఆర్ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్) తన ప్రీ–బడ్జెట్ సిఫార్సుల్లో పేర్కొంది. ఈ విధానం దేశీయ తయారీ పరిశ్రమ పురోభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. విధాన స్థిరత్వాన్ని ఇది సూచిస్తుందని కూడా విశ్లేషించింది. సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. కంపోనెంట్స్పై దిగుమతి సుంకాన్ని కొనసాగించాలి. గందరగోళాన్ని నివారించడానికి, వ్యాజ్య పరిస్థితులను తగ్గించడానికి కస్టమ్స్ సుంకం స్లాబ్‌లను ప్రస్తుత 25 నుండి 5కి తగ్గించాలి. పలు విధాలుగా ఉన్న అధిక స్లాబ్‌లు ఒకే విధమైన వస్తువులకు వేర్వేరు సుంకాల విధింపునకు దారితీస్తుంది. ఇది వర్గీకరణ వివాదాలకు, ఖరీదైన వ్యాజ్యాలకు దారితీస్తుంది. ఇది పత్రాల ఆటోమేటెడ్ ప్రాసెసింగ్‌ను కూడా ఇది కష్టతరం చేస్తుంది. డ్యూటీ స్లాబ్‌ల సంఖ్య తగ్గింపు వ్యవస్థ పారదర్శకతను తక్షణమే మెరుగుపరుస్తుంది. వర్గీకరణ వివాదాలను తగ్గిస్తుంది.డాక్యుమెంట్ల మెషీన్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తుంది. ఇక సుంకాలను త్వరగా వాపసు చేయడం, పోస్ట్, కొరియర్ ద్వారా ఎగుమతుల విధాన ఆవిష్కరణ వంటి చర్యల ద్వారా ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకోవాలి. మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అజయ్ శ్రీవాస్తవ జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు. గత ఏడాదే ఆయన పదవీ విరమణ చేశారు. వాణిజ్య విధాన రూపకల్పన, డబ్ల్యూటీఓ (ప్రపంచ వాణిజ్య సంస్థ), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన సమస్యలలో ఆయనకు అపార అనుభవం ఉంది. ఫోన్ విడిభాగాలపై సుంకాల భారం తగ్గించాలి సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ మొబైల్ ఫోన్ విడిభాగాలు, ఉపకరణాలు, సబ్ అసెంబ్లీలపై సుంకాలను క్రమబద్ధీకరించాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలకు చోటివ్వాలని వినతిపత్రం ఇచ్చింది. అధిక రేటు గల ఫోన్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ నుంచి తాము ఏమి కోరుకుంటున్నామో ఆర్థిక మంత్రికి పరిశ్రమ తెలియజేసింది. 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఒక్కో ఫోన్‌పై గరిష్టంగా రూ.4,000కే పరిమితం చేయాలని కోరింది. ఉపకరణాలు, విడిభాగాలపై అధిక సుంకం దేశీ తయారీని (మేడ్ ఇన్ ఇండియా) పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి విఘాతమంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 2.75 శాతం టారిఫ్, ఇతర చిన్న సుంకాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు కానీ, నిజమైన తయారీదారులకు ప్రతిబంధకమని పేర్కొంది. మెకనిక్స్పై డ్యూటీ చాలా అధికంగా ఉందని, మెకనిక్స్ తయారీలో వాడే అన్ని విడిభాగాలపై సుంకాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టాలి : ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్) ప్రభుత్వాన్ని అ భ్యర్థించింది. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు ప్రీ బడ్జెట్ మెమోరాండంలో పేర్కొంది. సిగరెట్ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 18.45 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఫోన్ల స్మగ్లింగ్ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు రూ.2,859 కోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం రూ.13,331 కోట్లు ఉందని అసోసియేషన్ ప్రెసిడెంట్ జావారీ గౌడ పేర్కొన్నారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2021–22లో రూ. 93 కోట్ల విలువైన 11 కోట్ల సిగరెట్ స్టిక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పీఎల్ఐ పథక విస్తరణ!: వివిధ వర్గాల అంచనా రాబోయే బడ్జెట్లో బొమ్మలు, సైకిళ్లు, తోలు, పాదరక్షల ఉత్పత్తికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలను పొడిగించే అవకాశం ఉందని పలు వర్గాలు భావిస్తున్నాయి. అధిక ఉపాధి రంగాల పురోగతికి ఉద్దేశించి ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న విషయాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్, ఫార్మా, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్‌తో సహా 14 రంగాల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 2 లక్షల కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది. అంతర్జాతీయంగా తయారీ రంగం పోటీ పడగలగడం పీఐఎల్ ప్రధాన లక్ష్యం కావడం గమనార్హం. లాజిస్టిక్స్ పురోగతి: ఆపరేటర్ల విజ్ఞప్తి రాబోయే కేంద్ర బడ్జెట్ లాజిస్టిక్స్ రంగంలో స్థిరమైన వృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడమే కాకుండా స్థిరమైన విధానాలను అనుసరించాలని ఆపరేటర్లు విజ్ఞప్తి చేశారు. ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్ (మిడిల్ ఈస్ట్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ అండ్ ఆఫ్రి కా– ఎంఈఐఎస్ఏ) కమీ విశ్వనాథన్ ఒక ప్రకటన చేస్తూ, అన్ని అంతర్జాతీయ రవాణా సేవలకు వస్తు, సేవల పన్నును తొలగించాలని సిఫారసు చేశారు. అంతర్జాతీయ జీఎస్టీ, వీఏటీ చట్టాలలో అంతర్జాతీయ సరుకు రవాణా సేవలు చాలా వరకు ’జీరో–రేట్’లో ఉన్నాయని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించాలని మహీంద్రా లాజిస్టిక్స్ సీఎఫ్ఓ యోగేష్ పటేల్ కోరారు. ఆర్అండ్డీ వ్యయాలపై పన్ను మినహాయింపు: క్రాప్‌లైఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) కోసం చేసే వ్యయాలపై వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాలని 16 వ్యవసాయ రసాయన కంపెనీల పరిశ్రమల సంస్థ– క్రాప్‌లైఫ్ ఇండియా డిమాండ్ చేసింది. టెక్నికల్ రా మెటీరియల్, ఫార్ములేషన్స్ రెండింటికీ 10 శాతం ఏకరీతి ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగ్రోకెమికల్ కంపెనీల ఆర్ అండ్ డీ వ్యయాలపై ప్రభుత్వం 200 శాతం వెయిటెడ్ డిడక్షన్‌ను అందించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నట్లు క్రాప్‌లైఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ దుర్గేశ్ చంద్ర పేర్కొన్నారు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన పేర్కొంటూ, బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ఉండాలని కోరారు. ఉపాధి కల్పనపై దృష్టి: హెచ్ఆర్ ఇండస్ట్రీ సిఫార్సు మానవ వనరుల (హెచ్ఆర్) పరిశ్రమ రాబోయే బడ్జెట్లో వివిధ చర్యలను అంచనా వేస్తోంది. ఇది ఉద్యోగులకు, ఉపాధి కల్పనకు ప్రయోజనకరంగా ఉంటుందని, దేశంలోని నైపుణ్యం సవాళ్లను పరిష్కరిస్తుందని అంచనా వేస్తోంది. కార్మిక చట్ట సంస్కరణలు, అధికారిక ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం, స్టాఫింగ్ పరిశ్రమకు పారిశ్రామిక హోదా, యువతకు నైపుణ్యం కల్పించే కార్యక్రమాలను పెంచడం వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి పెడుతుందని భావిస్తున్నట్లు ప్రముఖ హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా తెలిపింది. పీఎల్ఐ స్కీమ్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు ఊతాన్ని అందిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పన దేశంలో ఇంకా సవాల్‌గా మిగిలిపోయిందని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ సీఈఓ పీఎస్ విశ్వనాథ్ పేర్కొన్నారు. -
సోనాలిక ట్రాక్టర్స్ బంపర్ సేల్స్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో మొత్తం లక్ష ట్రాకర్లను అమ్మినట్లు సోనాలిక ట్రాక్టర్స్ ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలంలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 11.2 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపింది. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) కాగా, ఇదే కాలంలో పరిశ్రమ కేవలం 8.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2017-18 నుంచి ప్రతీ ఏడాది ఒక లక్ష పైగా ట్రాక్టర్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ అత్యంత వేగంగా లక్ష ట్రాక్టర్ల అమ్మకాలను 8 నెలల్లోనే నమోదు చేయడం పట్ల కంపెనీ జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు. (టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్) -
బలహీనంగానే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు
న్యూఢిల్లీ: పెద్ద స్థాయిలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇంకా బలహీనంగానే ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. బలహీన అసెట్లు, అధిక రుణ వ్యయాలు, అంతంత మాత్రం ఆదాయాలతో ఆయా పీఎస్‌బీల పరిస్థితి భారంగా ఉందని 2023 అంతర్జాతీయ బ్యాంకింగ్ అంచనాల నివేదికలో పేర్కొంది. ఆర్థిక సంస్థల పనితీరు మిశ్రమంగానే ఉండవచ్చని ఇందులో వివరించింది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దిగ్గజ ప్రైవేట్ బ్యాంకులు తమ తమ మొండి బాకీల సవాళ్లను చాలా మటుకు పరిష్కరించుకున్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థను మించి వాటి లాభదాయకత మెరుగుపడుతోందని నివేదిక పేర్కొంది. ఆర్థిక రికవరీ నేపథ్యంలో రుణ వ్యయాలు కనిష్ట స్థాయులకు తగ్గాయని తెలిపింది. బ్యాంకుల దగ్గర నిధులు పుష్కలంగా ఉండటం.. డిమాండ్ అధికంగా ఉండటం వంటి అంశాల కారణంగా రుణాల వృద్ధికి ఊతం లభించవచ్చని, కానీ డిపాజిట్ల వృద్ధి మాత్రం మందగించవచ్చని నివేదిక వివరించింది. అటు పరపతి విధానాలు కఠినతరం చేస్తుండటం, అధిక ద్రవ్యోల్బణంతో వినియోగదారులు సతమతమవుతుండటం వంటి కారణాలతో జీడీపీ వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. అయినప్పటికీ మధ్యకాలికంగా భారత ఆర్థిక వృద్ధి అవకాశాలు పటిష్టంగానే ఉంటాయని, 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5–7 శాతం వృద్ధి నమోదు కావచ్చని వివరించింది. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
తెలంగాణలో కమల వికాసం ఎలా ఉంది?.. అమిత్ షాకు నేరుగా రిపోర్ట్లు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ చేస్తున్న కృషి, సన్నద్ధతపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం తెలంగాణలో వాస్తవ పరిస్థితులేంటీ అన్న దానిపై క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు రహస్య నివేదికలు తెప్పించుకుంటోంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నేరుగా నివేదికలు పంపేలా ఎలక్షన్స్ ప్రొఫెషనల్స్ బృందం ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’ గత ఏడాదికి పైగా ఇక్కడి నుంచే పనిచేస్తోంది. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల ద్వారా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఇక్కడి నుంచి విడిగా రిపోర్ట్లు పంపే ఏర్పాటు ఉంది. వీటితో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరుపై పార్టీతో సంబంధం లేని స్వతంత్ర పరిశోధన, అధ్యయన సంస్థల ద్వారా జాతీయ నాయకత్వానికి ‘క్షేత్ర నివేదిక’లు అందుతున్నాయి. రాష్ట్ర పార్టీలో వివిధ స్థాయిల నాయకుల పనితీరు, నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజల్లోకి ప్రభావం చూపేలా పార్టీ ప్రచారం వెళుతోందా..? లేదా అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ ఎలా జరుగుతోంది, సాధారణ కార్యకర్త మొదలు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు, జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు వారికి అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వహిస్తున్నారా లేదా వారి పనితీరు ఎలా ఉంది? రాష్ట్ర పార్టీ పదాధికారులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఎలా పని చేస్తున్నారన్న అంశాలపై ఫోకస్ పెట్టింది. ఈ సంస్థల అధ్యయనం, పరిశీలనలతో సిద్ధం చేసిన తటస్థ రిపోర్ట్‌ల ఆధారంగా తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణను అధినాయకత్వం సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు సంకేతాలు అందాయి. పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువగా.. అంతా బాగుంది అధికారంలోకి రావడమే తరువాయన్న ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ తో రాష్ట్ర నాయకులు అలసత్వం ప్రదర్శించకుండా ఉండేలా జాతీయ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీలో కొత్త– పాత నేతలు, సీనియర్– జూనియర్ల మధ్య సమన్వయ లోపాలు, కొందరు ముఖ్య నేతలతోపాటు ఇతర స్థాయిల నాయకులు వ్యవహారశైలిని మార్చుకోవా లనే సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్యనేతల్లో అధిక శాతం వ్యక్తిగత ప్రతిష్టతో పాటు సొంతంగా ప్రమోట్ చేసుకునేందుకే ఎక్కువగా ప్రాధాన్యత నివ్వడం, పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువగా మొగ్గుచూపుతు న్నట్టు జాతీయ నాయక త్వానికి అందిన నివేదికల్లో స్పష్టమైంది. రాష్ట్ర పార్టీలోని వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఒక సంఘటిత, ఉమ్మడి శక్తిగా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో పార్టీ ఆశించిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సాధించలేదని ఈ రిపోర్ట్ల్లో వెల్లడైనట్టు ముఖ్య నేతలు చెబు తున్నారు. ఈ నివేదికల ఆధారంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొద లుకుని జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యర్శులు, రాష్ట్ర పదాధికా రులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలు, ఇలా యావత్ పార్టీకి నూత న దిశానిర్దే శనం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన స్పష్టమైన కార్యా చరణను రాష్ట్ర పార్టీకి నాయకత్వం ఇవ్వ బోతున్నట్టు ‘సాక్షి’కి ఓ ముఖ్యనేత వెల్లడించారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
దేశంలో కరోనా మహ్మమారి కారణంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం (Work from Home) వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని పక్కన పెట్టి కార్యాలయాలకు తిరిగి రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సంస్థలు ఉద్యోగులకు మెయిల్స్ పంపాయి. అయితే యాజమాన్యాలు పంపిన మెయిల్స్‌కు ఉద్యోగులు ఉహించని విధంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ (CIEL HR) జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే ప్రకారం.. దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని ఒత్తిడి చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం వాళ్లు చేస్తున్న ఉద్యోగాల్ని పక్కనపెట్టి .. వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్న ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారట. కాగా, వీరిలో ఎక్కువ శాతం వర్కింగ్ మదర్స్ ఉన్నారు. ఇటీవల మూన్‌లైటింగ్ తెరపైకి వచ్చి సంచలనంగా మారింది. దీంతో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు వచ్చి పని చేయాలని సంస్థలు పట్టుబడుతున్నాయి.హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి ఐటి సంస్థలు సైతం వారానికి కనీసం మూడు రోజులు ఉద్యోగులను కార్యాలయానికి పిలుస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
యూఎస్‌లో తొలి ఒమిక్రాన్ మరణం.. భయాందోళనలో ప్రజలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి రెండు వేవ్‌ల ప్రతాపానికి ప్రపంచదేశాలు అల్లాడిపోయాయి. ఈ జాబితాలో సంపన్న దేశాలు కూడా ఆర్థికం, ఆరోగ్యంగానూ పతనమైన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా ఈ వైరస్ పీడ నుంచి కాస్త ఉపశమనం లభించింది అనుకునేలోపే అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి మొదలైంది. తాజాగా అక్కడ తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. టెక్సాస్‌లో 50 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఒమిక్రాన్ సోకడంతో మరణించాడు. అయితే మృతుడు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని, దాని ప్రభావంతోనే వైరస్ దాడిని తట్టుకోలేక మృతి చందినట్లు తెలుస్తోందని హారిస్ కౌంటీ ఆరోగ్య విభాగం తెలిపింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన శాంపిల్స్‌లో 73 శాతం ఒమిక్రాన్ కేసులున్నట్లు నిర్థారణ అయినట్లు సీడీసీ తెలిపింది. వారం వ్యవధిలో 3 శాతం నుంచి వైరస్ వ్యాప్తి అమాంతం పెరిగి ఈ స్థాయికి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ప్రధాన వేరియంట్‌గా ఉన్న డెల్టా రకం కేసులు తగ్గుముఖం పట్టాయని అయితే ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడం అక్కడి ప్రజలను వణికిస్తోంది. కేసులు కట్టడి చేయలేకపోతే వైద్య సేవలపై తీవ్ర భారం పడనుందని ఆరోగ్య శాఖ అవేదన వ్యక్తం చేసింది. అంతకుముందు డిసెంబరులో, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే బ్రిటన్‌లో మొదటి ఒమిక్రాన్ మరణం సంభవించింది. కాగా ప్రస్తుతం బ్రిటన్‌లో 12 మరణాలు నమోదయ్యాయి. చదవండి: Flower Hair Style: కొప్పున పువ్వులు పెట్టుకోవడం కాదండి..కొప్పునే పువ్వులా దిద్దుకోవడం నయా స్టైల్.. -
RBI Report: శ్రమజీవికి సంతోషం.. ఏపీలో కూలీల వేతనాలు పెరుగుదల..
సాక్షి, అమరావతి: గత రెండేళ్లలో రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర, నిర్మాణ రంగ కూలీల వేతనాలు పెరిగాయి. ఉద్యాన కూలీల వేతనాల్లోనూ ఈ పెంపు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. అయితే, దేశంలో గ్రామీణ వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కూలీల వేతనాలు కేరళలో అత్యధికంగా ఉంటే అత్యల్పంగా గుజరాత్లో ఉండటం గమనార్హం. చదవండి: ఎగసిన ఎగుమతులు.. ఏపీ నుంచి భారీగా ఆహార, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు ఇక రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.300లోపే ఉంటే 2019–20 నుంచి ఇది రూ.300 దాటింది. అలాగే, వ్యవసాయేతర కూలీల రోజు వారీ వేతనం కూడా చంద్రబాబు హయాంలో రూ.300లోపే ఉంటే 2020–21లో ఆ మొత్తం దాటింది. జాతీయ స్థాయి కూలీల సగటు వేతనం కన్నా రాష్ట్రంలోని కూలీల వేతనం ఎక్కువగా ఉంది. అలాగే, జాతీయ స్థాయి విషయానికొస్తే 2019–20లో వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.287.1లు ఉంటే రాష్ట్రంలో అది రూ.302.6గా ఉంది. అలాగే, 2020–21లో జాతీయ స్థాయిలో కూలీల రోజువారీ సగటు వేతనం రూ.309.9 ఉంటే.. రాష్ట్రంలో రూ.318.6లు గా ఉంది. -
పైలట్ ప్రాజెక్టుగా డిగ్రీలో క్లస్టర్ విధానం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల అనుసంధానం చేసే క్లస్టర్ విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్లస్టర్ విధానం డిగ్రీ విద్యకు బూస్టర్‌లా పనిచేసే అవకాశముంది. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు ఈ విధానం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి దశలవారీగా రాష్ట్రమంతటా విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఈ అంశంపై వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్సహా తొమ్మిది కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. క్లస్టర్ విధానం అమలు కోసం మొత్తం మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. కోఠి మహిళా కళాశాల, నిజాం, సిటీ, బేగంపేట మహిళా, రెడ్డి మహిళా, సెయింట్ ఆన్స్ మెహిదీపట్నం, సెయింట్ ఫ్రాన్సిస్ బేగంపేట, భవన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సైనిక్‌పురి, లయోలా అకాడమీ అల్వాల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. విద్యాసంబంధిత అంశాలపై ఒక కమిటీ, మౌలిక వసతులు, వనరులపై మరో కమిటీ, మార్గదర్శకాల తయారీకి ఇంకో కమిటీని ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో నివేదికలు పరీక్షలు, క్రెడిట్లు, వాటి బదలాయింపు, కోర్సులు, వనరులు తదితర అంశాలను పరిశీలించి 10 రోజుల్లో నివేదికలను అందజేయాలని ఈ కమిటీలను పాపిరెడ్డి ఆదేశించారు. క్లస్టర్‌గా ఏర్పాటయ్యే కాలేజీలు పరస్పరం ఒప్పందం(ఎంవోయూ) చేసుకోవాలి. క్లస్టర్‌లోని కాలేజీలే కాకుండా, సంబంధిత యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలి ఈ ఒప్పందంలో భాగస్వామ్యమవుతాయి. కాలేజీలు విద్యార్థుల సమయాన్ని బట్టి టైం టేబుల్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. సెకండియర్‌లో రెగ్యులర్ డిగ్రీయే కాకుండా, సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లోని విద్యార్థులు సైతం క్లస్టర్ ఫలాలను పొందవచ్చు. ప్రయోగశాలల పరస్పర వినియోగం ఒకే క్లస్టర్‌లోని ప్రభుత్వ కాలేజీలోని విద్యార్థి ప్రైవేట్ కాలేజీలో చదవాల్సి వస్తే.. ఇందుకయ్యే ఫీజులను ఉన్నత విద్యామండలి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్లస్టర్ విధానంలో తొలుత డిగ్రీ స్థాయిలో ఒక కాలేజీలో చేరి మరో కాలేజీలో క్లాసులు వినేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించనుంది. క్లస్టర్ పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ఎక్కడైనా క్లాసులు వినేలా ఏర్పాట్లు చేస్తారు. బోధనా సిబ్బంది, అధ్యాపకుల మార్పిడితో ఒక కాలేజీలో పనిచేస్తున్నవారు అదే క్లస్టర్‌లోని మరో కాలేజీలో బోధించేలా ఏర్పాట్లు చేయడం ఇందులో కీలకాంశం. లైబ్రరీలను, ప్రయోగశాలలను కూడా పరస్పరం వినియోగించుకునే అవకాశముంది. -
ఆనందయ్య ఐ డ్రాప్స్‌తో కళ్లకు హాని
సాక్షి, అమరావతి: ఆనందయ్య ఐ డ్రాప్స్ (కంటి మందు)లో హానికర పదార్థాలున్నట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. దీని వినియోగం వల్ల కళ్లకు హాని కలుగుతుందంటూ నివేదికలు వచ్చాయని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ పరీక్షలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. వివరాలు.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన బి.ఆనందయ్య కరోనా చికిత్సకు నాలుగు రకాల మందులు, ఐ డ్రాప్స్ తయారు చేశారు. ఈ మందుల వినియోగానికి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆనందయ్యతో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఐ డ్రాప్స్ మినహా మిగిలిన 4 రకాల మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పరీక్షల్లో తేలడంతో.. ప్రభుత్వం వాటి వినియోగానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఐ డ్రాప్స్‌పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రముఖ సంస్థల నివేదికల ఆధారంగానే.. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, ఐ డ్రాప్స్ శాంపిళ్లను ఐదు సంస్థలకు పంపించామని చెప్పారు. కంటి చికిత్స రంగంలో ఎంతో పేరున్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, శంకర నేత్రాలయ సంస్థలు నివేదికలిచ్చాయని తెలిపారు. ఆనందయ్య ఐ డ్రాప్స్‌లో హానికర పదార్థాలున్నట్లు ఆ నివేదికల్లో పేర్కొన్నాయని వెల్లడించారు. వాటి వినియోగం వల్ల కళ్లకు ప్రమాదం కలుగుతుందని చెప్పాయన్నారు. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ జోక్యం చేసుకుంటూ.. ఐ డ్రాప్స్ వల్ల దుష్ప్రభావాలు ఉండవని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ చెప్పిందన్నారు. ఈ మందు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని హామీ కూడా ఇస్తామన్నారు. ముందు ఐ డ్రాప్స్ విషయంలో ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. పరీక్ష ఫలితాల నివేదికలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది. -
‘నాటు మందుపై అన్నింటిని పరిగణలోకి తీసుకున్నాకే నిర్ణయం’
సాక్షి, తాడేపల్లి: ఆనందయ్య కరోనా మందు పంపిణీ విషయంలో దాఖలైన పిటిషన్ సోమవారానికి వాయిదా పడినట్లు ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఈ లోగా ఆ మందులో చివరి రిపోర్టు రేపు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ లైసెన్స్ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేసిందని, కేంద్ర బృందాల నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం ఉన్నందున, అన్నింటిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ అంశంకు సంబంధించి చట్టం, ప్రజల మనోభావాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించినట్లు రాములు తెలిపారు. వారం తర్వాత కృష్ణపట్నంలోని నివాసానికి వారం తర్వాత కృష్ణపట్నంలోని తన నివాసానికి ఆనందయ్య చేరుకున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో కృష్ణపట్నంలో పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. గత వారంగా కృష్ణపట్నంలోని సీవీఆర్ ఫౌండేషన్‌లో ఉన్న ఆనందయ్య ఉన్నారు. ఆనందయ్యకు మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆలోచనతో మరో ప్రాంతానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్ -
కోవిడ్ మరణాల లెక్కలు: ఐహెచ్ఎంఈ షాకింగ్ స్టడీ
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరణాల లెక్కలకు సంబంధించి తాజా అధ్యయనం షాకింగ్ అంచనాలను వెలువరించింది. అనేక దేశాలు వాస్తవ గణాంకాల కంటే తక్కువ మరణాలను చూపించాయని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా భారతదేశంలో 4.3 లక్షల మేర కరోనా మరణాలను తగ్గించినట్లు యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) పరిశోధకులు తెలిపారు 'కోవిడ్-19 కారణంగా మొత్తం మరణాల అంచనా' అనే శీర్షికతో ఐహెచ్ఎంఈ ఈ డేటాను విశ్లేషించి ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించిన సంఖ్యల కంటే మొత్తం మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది. అమెరికా మరణాల సంఖ్యను 3.4 లక్షలు తగ్గించిందని అధ్యయనం చెబుతోంది. ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మాదిరిగానే ఇండియా కూడా కోవిడ్ మరణాలను తక్కువ చేసి చూపించిందని ఐహెచ్ఎంఈ తేల్చింది. భారతదేశం 4.3 లక్షల మరణాలను తక్కువగా చూపించండమో లేదా లెక్కించకపోవడమో చేసింది. అలాగే రష్యా దాదాపు 5.93 లక్షలు తగ్గించిందని అధ్యయనం కనుగొంది. మార్చి 2020- మే, 2021 వరకు సంభవించిన కోవిడ్ మరణాలపై 20 దేశాల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. కరోనా మరణాలపై రిపోర్టింగ్‌పై గుజరాత్, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల అనేక మీడియా పలు నివేదికలు వచ్చాయని గుర్తు చేసింది. అలాగే ఏప్రిల్‌లో, గుజరాత్ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొంది. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒడిశా, కర్ణాటక, బిహార్, హర్యానా, ఛత్తీస్గడ్ కూడా కోవిడ్-19 మరణాలను తక్కువగా నివేదించినట్లు పలు మీడియా నివేదికలు తెలిపాయని వెల్లడించింది. మరణాల నమోదు విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను చాలా రాష్ట్రాలు పాటించడం లేదని తెలిపింది. ముఖ్యంగా ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం కోవిడ్ సోకిన వ్యక్తి మరణిస్తే, కోవిడ్ మరణం కింద లెక్కించాల్సి ఉంటుంది. అయితే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ కోడ్ ప్రకారం మరణించే సమయానికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కోలుకుని తరువాత మరణిస్తే, కోవిడ్ లక్షణాలు లేనప్పటికీ కూడా దాన్ని కరోనా మరణంగానే నమోదు చేయాలి. తమ విశ్లేషణ ప్రకారం, మే 3, 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 6.93 మిలియన్లని తేల్చి చెప్పింది. ఇది అధికారంగా ప్రకటించిన 3.24 మిలియన్ల మరణాల కంటే మరింత ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు కోవిడ్ ఆసుపత్రులు దాదాపు అన్ని ప్రదేశాలకు అధికారికంగా నివేదించిన అంశాలను పరిశీలించామని, ఇకపై కొత్తపద్దతిని అవలంబించబోతున్నామని తెలిపింది. ఇందుకు అనేక కారణాలున్నాయని పేర్కొంది. చదవండి: కరోనా: జియో ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్లు దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే? -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్, చెన్నై నగరాలు మినహా దేశంలోని ఇతర మెట్రోలన్నింట్లోనూ గృహాల ధరలు క్షీణించాయి. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే 2021 జనవరి–మార్చి (క్యూ1)లో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 5 శాతం, చెన్నైలో 8 శాతం మేర వృద్ధి చెందాయి. ఇదే కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 76,006 యూనిట్లు ప్రారంభం కాగా.. 71,963 గృహాలు విక్రయం అయ్యాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా క్యూ1 నివేదిక తెలిపింది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రభుత్వ పన్ను రాయితీలు విక్రయాల వృద్ధికి కారణమని పేర్కొంది. హైదరాబాద్‌లో 2021 క్యూ1లో 9,349 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2020 క్యూ4లో ఇవి 7,170, క్యూ3లో 1,234, క్యూ2లో 1,420 యూనిట్లుగా ఉన్నాయి. 2020 క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 నాటికి 211 శాతం లాంచింగ్స్‌లో వృద్ధి నమోదయింది. అదేవిధంగా విక్రయాల గణాంకాలు చూ స్తే.. నగరంలో 2021 క్యూ1లో 6,909 గృహాలు విక్రయమయ్యాయి. 2020 క్యూ4లో ఇవి 3,651, క్యూ3లో 1,609, క్యూ2లో 974 యూనిట్లుగా ఉన్నాయి. 2020 క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 నాటికి సేల్స్‌లో 81 శాతం వృద్ధిని సాధించింది. లాంచింగ్స్, సేల్స్‌లో ముంబై టాప్.. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది క్యూ1లో 76,006 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే ఇది 38 శాతం వృద్ధి. గతేడాది క్యూ4లో లాంచింగ్స్ 55,033, క్యూ3లో 31,106, క్యూ2లో 5,584 యూనిట్లుగా ఉన్నాయి. సేల్స్ చూస్తే.. 2021 క్యూ1లో 71,963 యూనిట్లు కాగా.. క్రితం ఏడాది క్యూ1తో పోలిస్తే 44 శాతం ఎక్కువ. 2020 క్యూ4లో 61,593 యూనిట్లు, క్యూ3లో 33,403, క్యూ2లో 9,632 ఇళ్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది క్యూ1లో గృహాల ప్రారంభం, విక్రయాలలో ముంబై, పుణే నగరాలు టాప్ స్థానంలో నిలిచాయి. ముంబైలో 31,515 యూనిట్లు లాంచింగ్ కాగా.. పుణేలో 18,042 యూనిట్లయ్యాయి. బెంగళూరులో 7,467, చెన్నైలో 2,981, అహ్మదాబాద్‌లో 3,977, ఎన్సీఆర్లో 1,626, కోల్‌కతాలో 1,439 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. -
79 శాతం ద్విచక్రవాహనదారులు, పాదచారులే..
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల్లో పేదల బతుకులు చితికిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదాల్లో ఎక్కువగా పేదలే వీటి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇలా మరణిస్తున్న వారిలో తగిన జీవనభృతి, ఉపాధి ఆదాయం వంటివి లేనివారే అధికంగా ఉంటున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు కలిపి 79 శాతం మంది ఉంటున్నారని ఇటీవల జరిపిన విస్తృత పరిశీలనల్లో వెల్లడైంది. వివిధ అంశాలపై సర్వే డేటా క్రోడీకరణ దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 54 ఆసుపత్రుల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు, ఈ ప్రమాదాల్లో మరణించిన వారి స్థితిగతులు, ఇతర అంశాలపై సేకరించిన సమాచారంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీఆర్ఐపీపీ ఐఐటీ (ఢిల్లీ) ఆధ్వర్యంలోని బృందంతో పాటు, డీఐఎంటీఎస్ వేర్వేరు రూపాల్లో పోలీస్స్టేషన్ల నుంచి ఎఫ్ఐఆర్లు, ఇతరత్రా సేకరించిన సమాచారాన్ని ఒకచోట చేర్చి రోడ్డు ప్రమాదాల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా పడే భారం, ప్రభావాన్ని పరిశీలించారు. వివిధ అంశాలకు సంబంధించి సేకరించిన సమాచారం, డేటాను క్రోడీకరించి రోడ్డు ప్రమాదాల వల్ల సామాజిక–ఆర్థిక పరంగా పడే భారం, ఖర్చులపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రిత్వశాఖకు నివేదికను అందజేసినట్టు సమాచారం. అయితే ఈ నివేదికను ఇంకా కేంద్రం బహిర్గతపరచలేదు. ఎఫ్ఐఆర్ల విశ్లేషణ పోలీస్స్టేషన్ల నుంచి సేకరించిన ఎఫ్ఐఆర్లను విశ్లేషించినపుడు దాదాపు 79 శాతం రోడ్డు ప్రమాద మృతులు ద్విచక్ర వాహనదారులు (40 శాతం), పాదచారులు (39 శాతం) ఉన్నట్టుగా తేలింది. తరచుగా ప్రమాదాల బారిన పడుతున్న వారి జాబితాలో టూవీలర్‌పై ప్రయాణించే వారు, పాదచారులు ఉండటంతో ఇవి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రస్తుతం దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది. రోడ్డుపై ప్రయాణించే వారి భద్రత, పరిరక్షణకు కఠినంగా నిబంధనల అమలు, తగిన మౌలిక సదుపాయాల కల్పన, ఏవైనా ప్రమాదాలు జరిగినపుడు వెంటనే వైద్య, ఆరోగ్యపరంగా ఆదుకునేలా వివిధ రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలు ► రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో 34శాతం పేదలు ఎలాంటి ఆదాయం లేనివారే ► 28 శాతం మంది మృతులు నెలకు రూ.10–20 వేల మధ్యలో సంపాదిస్తున్నవారు ► చనిపోయిన వారిలో 3 శాతం మంది మాత్రమే నెలకు రూ.50 వేలకు పైగా ఆదాయం ఉన్నవారు ► మృతుల్లో 67 శాతం మంది 18 నుంచి 45 ఏళ్ల మధ్యలోని వారు (కుటుంబ పోషకులు, సంపాదనాపరులు) ► ప్రమాదాల్లో మృతిచెందిన ద్విచక్ర వాహనదారులు 40 శాతం, పాదచారులు 39 శాతం, కార్లు, ట్యాక్సీలు, ఎస్‌యూవీల్లోని వారు 8.8 శాతం ► ప్రమాదాలు సంభవించిన 7 శాతం కేసుల్లో అక్కడికక్కడే మరణాలకు కారణమవుతుండగా, 66 శాతం తీవ్ర గాయాల పాలవుతున్నారు ► రోడ్డు ప్రమాదాలకు గురయ్యాక ఆసుపత్రుల్లో చేర్చిన మృతుల్లో 59 శాతం మంది టూవీలర్ నడిపేవారు, 15.5 శాతం పాదచారులు -
హైదరాబాద్ సీసీ‘ఠీవీ’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రతీ వెయ్యి మంది పౌరులకు 29.99 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (సీసీటీవీ) సర్వైలెన్స్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రాజధాని టాప్‌ప్లేస్‌లో నిలవగా, ప్రపంచంలో 16వ స్థానం పొందింది. ఈ జాబితాలో ›ప్రపంచ వ్యాప్తంగా టాప్–50 నగరాల్లో చెన్నైకు 21, దేశ రాజధాని ఢిల్లీకి 33వ ర్యాంక్ లభించాయి. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన వీపీఎన్, యాంటీ వైరస్, యాప్స్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ ‘కంపారిటెక్’ ప్రపంచంలోని అధిక జనాభా ఉన్న 150 ప్రధాన నగరా ల్లోని సీసీటీవీల సంఖ్యను సేకరించింది. ప్రభుత్వాల నివేదికలు, పోలీస్ వెబ్సైట్లు, పత్రికల్లో వచ్చిన కథనాలు, రిపోర్ట్లు, ఇతర రూపాల్లో డేటాను సేకరించి, సమాచారాన్ని క్రోడీకరించింది. పోలీస్, ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఉపయోగి స్తున్న సీసీటీవీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పరిశీలన జరిపినట్టు వార్షిక నివేదికలో ఈ సంస్థ పేర్కొంది. చైనాలోనే అత్యధికం ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీ కెమెరాల సర్వైలెన్స్ చైనాలోనే ఉన్నట్టు ఈ సంస్థ విశ్లేషించింది. ప్రధానంగా మొదటి 20 నగరాల్లో.. ప్రతీ వెయ్యిమందికి ఎన్ని సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్న విషయంలో లండన్ మూడో స్థానంలో, భారత్‌లోని తెలంగాణ రాష్ట్రం 16వ స్థానంలో నిలవగా మిగతా నగరాలన్నీ కూడా చైనాలోనివే కావడం దీనినే స్పష్టంచేస్తోంది. ఐహెచ్ ఎస్ మార్కిట్ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచం లోని మొత్తం 77 కోట్ల సర్వైలెన్స్ కెమెరాల్లో 41.58 కోట్లు (54 శాతం) చైనాలో ఉన్నాయి. 2021కల్లా ప్రపంచంలోని సీసీటీవీలు వంద కోట్లకు చేరుకుంటుండగాఅందులో 54 కోట్లు చైనాలోనే ఉంటాయని ఐహెచ్ఎస్ అంచనా వేస్తోంది. అనేక సౌలభ్యాలు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో సీసీటీవీలను నేరాల నివారణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, క్రమబద్ధీకరణ, మనుషులు పనిచేయడానికి వీలుకాని పరిస్థితుల్లో పారిశ్రామిక కార్యకలాపాల నిర్వహణ వంటి వాటికి నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో పాటు మెరుగైన ఫీచర్లతో కెమెరాలు కూడా చౌకగానే అందుబాటులో లభిస్తున్నాయి. సీసీటీవీలతో నిఘా, పర్యవేక్షణ వల్ల పౌరులకు రక్షణ, భద్రతతో పాటు మరింత సమర్థవంతంగా సేవలందించే వీలు ఏర్పడింది. అయితే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కుకు సీసీటీవీల నిఘా వల్ల భంగం వాటిల్లుతుందనే వారూ ఉన్నారు. ఏదేమైనా ప్రపంచవ్యాపంగా వీటి వినియోగం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. పరిశీలన ఇలా.. 150 నగరాల్లోని జనాభా, సీసీటీవీల సంఖ్య, ప్రతి వెయ్యి మందికి ఎన్ని కెమెరాలు అందుబాటులో ఉన్నాయి?, క్రైమ్‌రేట్ వంటి వాటిపై ‘కంపారిటెక్’ దృష్టిపెట్టింది. అయితే సీసీటీవీ కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉన్నంత మాత్రాన నేరాల తగ్గుదలతో పాటు పౌరుల భద్రత, రక్షణ బాగా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదని పరిశోధకులు పేర్కొన్నారు. -
ఉస్మానియాలో రిపోర్టుల తారుమారు!
బషీరాబాద్: అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఓ యువకుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చిం దని వైద్యులు చెప్పడంతో కుప్పకూలిపోయా డు. అనుమానం వచ్చి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌గా తెలిం ది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన మేఘనాథ్ గౌడ్ విద్యావాలంటీర్. ఈ నెల 3న అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అతడికి వైద్యులు కరోనా పరీక్ష చేయగా.. ఈ నెల 7న రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. దీంతో బాధితుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రిపోర్టులో ఫోన్ నంబర్, ఇంటి పేరు తప్పు గా ఉండటంతో అనుమానం వచ్చి నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా కరోనా నెగెటివ్‌గా తేలింది. అతడికి కరోనా లేదని, నిమోనియా తో బాధపడుతున్నారని అక్కడి వైద్యులు తెలి పారు. ఇదే విషయమై ఉస్మానియా వైద్యులను కుటుంబసభ్యులు నిలదీయగా పొరపాటున తారుమారయ్యాయని చెప్పి చేతులు దులుపుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన తమ్ముడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, సమయానికి చికిత్స అందక ఆరోగ్యం క్షీణించిందని, ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామని, రూ.11 లక్షలు ఖర్చయిందని, ఇంకా రూ.15 లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. దాతలు తమను ఆదుకోవాలని కోరారు. -
24 గంటల్లో కరోనా పరీక్షల నివేదికలు
కరోనా పరీక్షల రిపోర్టుల కోసం ఇన్నాళ్లూ వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఫలితం త్వరితగతిన రోగి చెంతకు చేరి సాంత్వన చేకూరుస్తోంది. విశాఖలో కొత్తగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కాకినాడలోని పరీక్ష కేంద్రంపై ఒత్తిడి తగ్గడంతో ఈ వెసులుబాటు వచ్చింది. సాక్షి, రాజమహేంద్రవరం: కరోనా మహమ్మారిని 24 గంటల్లో పసిగట్టేస్తారు. ఇంతవరకూ కాకినాడ సామాన్య ప్రభుత్వాస్పత్రిలో వందల శాంపిళ్లు వచ్చిపడుతున్నా నివేదికలు రావడానికి రోజులు తరబడి పట్టేది. కనీసంగా ఒక నివేదిక కోసం నాలుగైదు రోజులు నిరీక్షించే పరిస్థితి. మన జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి శాంపిళ్లు కాకినాడ లే»ొరేటరీకే వచ్చేవి. నాలుగు జిల్లాల నుంచి వచ్చే శాంపిళ్లలో అనుమానం ఉంటే ఒకటికి, రెండుసార్లు అవసరమైతే మూడు పర్యాయాలు పరీక్షలు చేసి నిర్థారించుకున్నాకనే ఫలితాన్ని ప్రకటించే వారు. రోజువారీగా నాలుగు జిల్లాల నుంచి 500 పైబడే శాంపిళ్లు కాకినాడ జీజీహెచ్‌కు పరీక్షల కోసం వచ్చేవి. దీనివల్ల జరిగే జాప్యాన్ని నివారించి పరీక్షలు, నివేదికలు వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని విశాఖపట్నంలో ప్రత్యేకంగా లేబొరేటరీ ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కాకినాడకు కరోనా శాంపిల్స్ సోమవారం నుంచి పంపడం ఆపేశారు. ఫలితంగా కాకినాడలో ప్రయోగశాల ఈ జిల్లా వరకే పరిమితం కావడంతో ఇక్కడి నివేదికలు ఒక్క రోజులోనే చేతికివచ్చే సానుకూలత ఏర్పడింది. రెడ్‌జోన్లపై నిరంతర నిఘా ఓ పక్క శాంపిల్స్ పరీక్షలను వేగవంతంచేస్తూ.. మరోపక్క ఆ మహమ్మారిని బయట ప్రాంతాల నుంచి అడుగుపెట్టకుండా జిల్లాలో దారులన్నీ మూసేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిని రెడ్ జోన్లుగా ప్రకటించారు. కత్తిపూడిలో పాజిటివ్‌గా నమోదైన ఒక ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం మరో ఐదుగురికి వ్యాధి సోకడంతో రెడ్ జోన్లపై జిల్లా యంత్రాంగం నిరంతర నిఘాలో పెట్టింది. రెడ్‌జోన్ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకూ ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా పేర్కొని కంటోన్మెంట్‌గా డిక్లేర్ చేశారు. అటువంటి ప్రాంతాలన్నింటినీ జిల్లా యంత్రాంగం పూర్తి అజమాయిషిలో పెట్టుకుని ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తోంది. జిల్లాలో ఉన్న ఎనిమిది రెడ్జోన్ల పరిధిలో ఉన్న 32,194 కుటుంబాలపై ప్రత్యేక నిఘా ఉంచాయి. ఈ జోన్ల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ప్రతి రోజు నిశితంగా పరిశీలించి జిల్లా యంత్రాంగానికి నివేదిక సమర్పించేలా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా సమాచారాన్ని సేకరించి కోవిడ్ జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్–2 రాజకుమారి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తున్నారు. దీనివల్ల రెడ్జోన్లలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నారు. ఈ ఎనిమిది జోన్లలో ప్రతి రోజు ర్యాండమ్‌గా 40 శాంపిళ్లు సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎనిమిది బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవేకాకుండా రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి 80, పెద్దాపురం, పిఠాపురం, కత్తిపూడి, కొత్తపేట రెడ్జోన్ల నుంచి 30 వంతున మొత్తంగా ప్రతి రోజు 200 నమూనాలు ప్రత్యేక ఐసోలేటెడ్ అంబులెన్స్‌లో విజయవాడకు పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనరేట్ నుంచి జిల్లాకు ఆదేశాలు వచ్చాయి. వీటితో సంబంధం లేకుండా కాకినాడ కరోనా లేబరేటరీలో ప్రతి రోజూ 170 శాంపిళ్లు పరీక్షించనున్నారు. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి 25 వంతున, జిల్లాలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, వలంటీర్లు, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రిఫర్ చేసే కేసుల్లో 120తో కలిపి మొత్తం 170 శాంపిళ్లు రోజూ పరీక్షించి నివేదికలు రూపొందించాలనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇక్కడకు శాంపిల్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో పరీక్షలు ఎక్కువ చేయడం కంటే నివేదికలు త్వరగా రావడానికి మార్గం సుగమం కానుంది. సోమవారం ఒక్క రోజే 141 శాంపిల్స్ సేకరించారు. జిల్లాలో మొత్తంగా 1638 శాంపిళ్లు సేకరించగా 1309 నివేదికలు రాగా, మరో 329 నివేదికలు రావాల్సి ఉంది. 3,442 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ‘ఇక వేగవంతంగా నివేదికలు’ కరోనా పరీక్షలు, నివేదికలు త్వరగా బయటకు రానున్నాయి. కేవలం 24 గంటల్లోనే నివేదికలు అందజేసే వెసలుబాటు కూడా మన జిల్లాకు లభించింది. ఇంతవరకూ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా కాకినాడ లే»ొరేటరీకి శాంపిళ్లు వస్తుండేవి. ఈ కారణంగా మన జిల్లాలో వచ్చే శాంపిళ్లు పరీక్షలు జరిపి నివేదికలు బయటకు రావడానికి రోజులు పట్టేది. ఇక ముందు ఆ పరిస్థితి లేదు. కాకినాడ జీజీహెచ్‌లో జిల్లాలో సేకరించే శాంపిళ్లు మాత్రమే ఇక్కడ పరీక్షించనుండటంతో నివేదికలు వెంటవెంటనే వచ్చేస్తాయి. డి.రాజకుమారి, జేసీ–2. కోవిడ్–19 నోడల్ అధికారి -
కార్పొరేట్ ట్యాక్స్‌ను హేతుబద్ధీకరించాలి
న్యూఢిల్లీ: వివిధ కార్పొరేట్ ట్యాక్స్ రేట్లన్నింటినీ ఎటువంటి మినహాయింపులు లేకుండా 15 శాతం స్థాయికి హేతుబద్ధీకరించాలని కేంద్రాన్ని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కోరింది. 2023 ఏప్రిల్ నాటికల్లా దీన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా రాబోయే బడ్జెట్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయాలని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో చూసినప్పుడు ఇంకా ఆశించిన స్థాయిలో తగ్గుదల లేదని తెలిపారు. తయారీ, సేవా రంగాల పన్ను రేట్లలో అసమానతలు నెలకొనడమే ఇందుకు కారణమని వివరించారు. తగ్గుతున్న శాతాలు... 1991–92లో 45 శాతంగా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ రేటు క్రమంగా తగ్గి ప్రస్తుతం 22 శాతానికి చేరింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ స్థాయికి తగ్గించింది. అయితే, కంపెనీలు దీన్ని వినియోగించుకోవాలంటే పన్ను మినహాయింపులు, ఇతరత్రా ప్రోత్సాహకాలను వదులుకోవాల్సి ఉంటుంది. 2023 మార్చి 31లోగా ఉత్పత్తి ప్రారంభించే తయారీ సంస్థలు, 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటైన సంస్థలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే ఉంటుంది. సర్‌చార్జీ, సెస్సు దీనికి అదనం. పలు దేశాలకు దీటుగా పోటీపడేందుకు దేశీ సంస్థలకు .. తాజా రేట్ల కోత తోడ్పడనుంది. క్రమేపీ పెట్టుబడుల వ్యయాన్ని తగ్గించుకునేందుకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఊతమిచ్చేందుకు తక్కువ స్థాయి కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు దోహదపడనున్నాయి. కార్పొరేట్ ట్యాక్స్ రేటును కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి, కొన్ని కొత్త తయారీ సంస్థలకు 25 శాతం నుంచి 15 శాతానికి కేంద్రం సెప్టెంబర్‌లో తగ్గించింది. -
వరదొస్తే మునుగుడే!
-
ఆర్టీసీ ఎండీ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
-
ఆరోగ్య వివరాలు తారుమారు
అనంతపురం న్యూసిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో కొందరు వైద్యుల నిర్లక్ష్యంతో ఆరోగ్య వివరాలు తారుమారవుతున్నాయి. ఆస్పత్రిలో ఇటీవల ఓ బాలింతకు రక్తమార్పిడి జరిగి ప్రాణం కోల్పోయిన విషయం విదితమే. దీని ద్వారా ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లను సస్పెండ్ చేసినా ఇంకా చాలామంది వైద్యుల్లో మార్పు రావడం లేదు. చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవాక్కు... చిన్న పిల్లల వార్డులో ధర్మవరానికి చెందిన మూడేళ్ల పాప మనస్వి డెంగీ అనుమానిత కేసుగా ఈ నెల 9న అడ్మిట్ అయ్యింది. ఆస్పత్రిలో వైద్యులు ఈ నెల 11న చిన్నారికి ప్లేట్‌లెట్స్‌తో పాటు డెంగీ పరీక్షకు రెఫర్ చేశారు. కానీ హౌస్సర్జన్లు మౌనిక అనే పేషెంట్ ఆరోగ్య నివేదికను ఏకంగా మనస్వి కేస్ షీట్లో నమోదు చేశారు. కేస్ షీట్లో మనస్వికి సీఆర్పీ పాజిటివ్ అని నమోదు చేశారు. దీనిపై పాప తండ్రి రాము కేస్ షీటును నిశితంగా పరిశీలించారు. పాప డెంగీ సమస్యతో బాధపడుతుంటే సీఆర్పీ ఎందుకు వస్తుందని ఆరా తీశాడు. దిద్దుబాటు చర్యలు వాస్తవంగా ఇదే వార్డులో ఉన్న మౌనిక అనే చిన్నారికి చెందిన సీఆర్పీ రిపోర్టును మనస్వి కేస్ షీట్లో రాశారు. అప్పటికప్పుడు తేరుకున్న వైద్యులు మనస్వి కేస్ షీట్‌లోని రిపోర్టును కొట్టేశారు. పాప తల్లిదండ్రులు ఆరా తీయకపోతే సీఆర్పీ కిందే మందులిచ్చే పరిస్థితి ఉండేది. ఆస్పత్రిలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై ఆస్పత్రి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
జ్వరమొచ్చిందని వెళ్తే..
వైద్యుల కమీషన్ల కక్కుర్తి.. డయోగ్నోసిస్ సెంటర్ల తప్పుడు రిపోర్టులు రోగులనుఅప్పులపాలు చేయడంతో పాటు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కుమార్తెకు జ్వరంగా ఉందని వైద్యుడి వద్దకు తీసుకెళ్లిన ఓ తండ్రికి తణుకులో చేదు అనుభవం ఎదురైంది. కమీషన్ కోసం వైద్యుడు ఎడాపెడా వైద్య పరీక్షలు రాయగా.. ల్యాబ్ నిర్వాహకులు తప్పుడు రిపోర్టు ఇచ్చారు. దీనిపై బాధితుడు డీఎంహెచ్ఓను ఆశ్రయించాడు. పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: తణుకు పట్టణంలో ప్రైవేట్ వైద్యం మరోసారి వివాదాస్పదమైంది. కమీషన్ల కోసం ఓ వైద్యుడు వివిధ రకాల పరీక్షలు రాయగా డయాగ్నోసిస్ నిర్వాహకులు తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. ఆ రిపోర్టులను ఆసరాగా వైద్యుడు మరిన్ని పరీక్షలు చేయించాలంటూ చాంతాడంత జాబితా రాసిచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తణుకులో నివాసముంటున్న పీవీఎస్ రాధాకృష్ణ 19 సంవత్సరాల తన కుమార్తెకు జ్వరం వచ్చి తగ్గడం లేదనే ఉద్దేశంతో పట్టణంలో పాత పోస్టాఫీస్ సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి గతనెల 16న తీసుకువెళ్లారు. వెంటనే వైద్యుడు వైద్యపరీక్షలు రాసి ఇచ్చారు. రాధాకృష్ణ తన కుమార్తెను పట్టణంలోని ప్రముఖ డయాగ్నోసిస్ సెంటర్లో వైద్యపరీక్షల్లో భాగంగా రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షలకు రూ.1,720 బిల్లు కట్టారు. రిపోర్టుల్లో హిమోగ్లోబిన్ 9 గ్రాములు, రక్తంలోని వైట్ సెల్స్ కౌంట్ 47,000 ఉన్నట్లుగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ రిపోర్టులు చూసిన వైద్యుడు వెంటనే చాంతాడంత ట్రీట్మెంట్ రాయడంతో పాటు ఎమర్జన్సీగా ఆసుపత్రిలో జాయిన్ చేయాలని, స్కానింగ్ తదితర పరీక్షలు చేయాలని హడావుడి చేశాడు. దీంతో కంగారుపడిన సదరు తండ్రి మిత్రుడి సూచనల మేరకు మరొక వైద్యుడిని ఆశ్రయించారు. అదే ల్యాబ్‌లో మళ్లీ పరీక్షలు రిపోర్టుల్లో తేడా వచ్చిన పరీక్షలను మళ్లీ అదే డయోగ్నోసిస్ సెంటర్‌కు వైద్య పరీక్షలకు పంపించారు. 20 గంటల వ్యవధిలో రెండోసారి చేయించిన పరీక్షల్లో రిపోర్టు నార్మల్‌గా చూపించగా హిమోగ్లోబిన్ 10.9 గ్రాములు రాగా వైట్‌సెల్స్ కౌంట్ 10,700లుగా రిపోర్టు ఇచ్చారు. దీంతో రెండో వైద్యుడు జ్వరానికి మందుబిళ్ల వేసుకుంటే సరిపోతుందని ఏ విధమైన చికిత్స అవసరంలేదని తేల్చారు. డీఎంహెచ్ఓకు ఫిర్యాదు ముందు వైద్యుడు రాసిన విధంగా చికిత్స చేయించుకుంటే డబ్బు మాట పక్కనపెట్టినా తన కుమార్తెకు అవసరం లేని వైద్యం చేయడం వల్ల ఏ అనర్థం వచ్చేదోనని బెంబేలెత్తిపోయారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడిని, డయోగ్నోసిస్ సెంటర్ ప్రతినిధులను ప్రశ్నించినా పట్టించుకోపోగా నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో గత నెల 18న డీఎంహెచ్ఓ, ఏలూరు వారికి తణుకుకు చెందిన వైద్యుడు, డయోగ్నోసిస్ సెంటర్‌పై ఫిర్యాదు చేశారు. తపాలా ద్వారా రిజిస్టర్ పోస్టు చేసిన తన ఫిర్యాదు వైద్యాధికారికి అందినప్పటికీ ఇంతవరకు ఎటువంటి విచారణ చేయలేదని బాధితుడు రామకృష్ణ ఆరోపిస్తున్నారు. రిపోర్టుల్లో అంత తేడానా? జ్వరంగా ఉందని తీసుకువెళ్లిన నా కుమార్తె నాడి పరీక్షించలేదు. కనీసం స్టెత్‌తో కూడా పరీక్ష చేయకుండా ఒకేసారి ఏకంగా రూ.1,720 విలువైన రక్తపరీక్షలు చేయించారు. పరీక్షల్లో కమీషన్లు తప్ప ముందుగా రోగి స్థితి తెలుసుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఒకే డయాగ్నోసిస్ సెంటర్లో 20 గంటల్లో రిపోర్టులు ఎందుకు తేడా వస్తాయి? ఆసుపత్రి, డయోగ్నోసిస్ సెంటర్ రెండింటిపై ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు విచారణ చేపట్టకపోవడం దారుణం.– పీవీఎస్ రాధాకృష్ణ, తణుకు విచారణకు ఆదేశించాం తణుకులో ఒక ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు, ఒక డయోగ్నోసిస్ సెంటర్‌పై వచ్చిన ఫిర్యాదుపై ఒక మెడికల్ ఆఫీసర్‌ను విచారణ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చాను. విచారణలో తప్పులు ధ్రువీకరణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి,డీఎంహెచ్ఓ, ఏలూరు -
తిత్లీ తుఫాన్.. వైఎస్సార్ సీపీ నివేదికలు సిద్దం
-
తిత్లీ తుఫాన్.. వైఎస్సార్ సీపీ నివేదికలు సిద్దం
సాక్షి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను పెను విధ్వంసం సృష్టించింన విషయం తెలిసిందే. తిత్లీ తుఫాన్ దెబ్బకి చేతికి అందే పంట నీట ముంచింది.. కడుపు నింపే కొబ్బరితోట కూకటి వేళ్లతో పెకిలించింది. ఇళ్లను కూలగొట్టింది. కొన్ని గ్రామాలు పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. తుఫాన్ మరుసటి రోజు జిల్లాలో నదులు ఉగ్రరూపం దాల్చాయి. అయితే ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. (తుపాను బాధితులను జగన్ ఆదుకుంటారు) అంతే కాకుండా తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్.. పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో రెండు కమిటీలను నియమించారు. భూమన కరుణాకర రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు రఘురామ్ తదితరులు ఈ కమిటీలలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలు బాధిత ప్రాంతాలలో పర్యటించి నష్టాన్ని అంచనావేసి ఓ నివేదిక రూపొందించింది. ఈ రోజు (శనివారం) సాయంత్రం ఆ పార్టీ అధ్యక్షుడికి రెండు కమిటీలు నివేదికలను అందజేయనుంది. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో తుఫాన్ నష్టం గురుంచి వివరించనున్నారు. (‘తిత్లీ’ బాధితులకు అండగా ఉంటాం) -
పిల్లలకే కాదు మీకూ కంట్రోల్ అవసరమే
ఓ వైపు ప్రపంచమే ఒక కుగ్రామం అయ్యింది. దేశాల మధ్య సరిహద్దులు దూరమవుతున్నాయి. మరో వైపు ఇంట్లోని మనుషులే వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అంతులేని దూరం పెరుగుతుంది. ఈ రెండింటికి కారణం ఒక్కటే అదే స్మార్ట్‌ఫోన్. మొదట అవసరంగా వచ్చి నేడు వ్యసనంగా మారింది. 2జీ, 3జీ అంటూ ‘జీ’లు పెరుగుతున్న కొద్ది అనుబంధాలు దూరమవుతున్నాయి. పిల్లల మీద స్మార్ట్ఫోన్ల ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్లు గతంలో చాలా నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. పిల్లలను స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఎలా ఉంచాలి, పిల్లలు ఫోన్ వినియోగించే సమయాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటూ చాలా సలహాలే ఇచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో మాత్రం మరోక ఆశ్చర్యకరమైన అంశం తెలిసింది. అది ఏంటంటే స్మార్ట్ ఫోన్ వినియోగం విషయంలో కంట్రోల్ చేయాల్సింది పిల్లలను మాత్రమే కాదు తల్లిదండ్రులను కూడా అనే విషయం వెల్లడైంది. స్మార్ట్ ఫోన్ ద్యాసలో పడి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టించుకోవడం లేదంట. ఓ 32 మంది తల్లులతో పాటు వారి రెండేళ్ల వయసు ఉన్న పిల్లల మీద జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధనలో ముందు కొందరు తల్లులను వారి పిల్లలకు రెండు కొత్త పదాలను నెర్పించమనే టాస్క్ ఇచ్చారు. వారు పిల్లలకు ఆ పదాలు చెప్పే సమయంలో వారి ఫోన్ మోగేలా చేశారు. దాంతో వారు పదాలు చెప్పడం ఆపి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత చెప్పినా కూడా పిల్లలు నేర్చుకోవడానికి అంత ఆసక్తి కనపించలేదని తెలిసింది. ఇదే టాస్క్‌ను మిగిలిన తల్లులకు ఇచ్చి మధ్యలో ఎలాంటి అంతరాయం కల్గించలేదు. దాంతో వారు పిల్లలకు నేర్పాల్సిన కొత్త పదాలను చక్కగా నేర్పించారు. పిల్లలు కూడా ఈ తల్లులు చేప్పే పాఠాలను శ్రద్ధగా విన్నట్లు సర్వేలో తెలింది. ఈ సర్వే నిర్వహించడానికి ప్రధాన కారణం...నేటి కాలం పిల్లలకు భాషా మీద పట్టు ఏ మాత్రం ఉండటం లేదంట. స్మార్ట్ఫోన్లలో ‘ప్రీ డిఫైన్డ్ టెక్స్ట్’ అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు పరిశోధకులు. ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల భాషా ప్రావీణ్యం పెరగడమే కాక బంధాలు బలపడే అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ 2 -5 ఏళ్ల పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే వారిలో మానసిక, శారీరక వికాసం అధికంగా ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి కూర్చుని మాట్లాడటం...ఆడటం వంటివి చేయడం వల్ల పిల్లల మానసికంగా బలంగా తయారవుతారంటున్నాయి నివేదికలు. -
కొత్త పంచాయతీలు 4,122
సాక్షి, హైదరాబాద్ : మెరుగైన గ్రామ పరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామ పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల నుంచి 4,122 కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలు ఉన్నాయి. జిల్లాల కలెక్టర్లు మండలాల వారీగా కొత్త గ్రామ పంచాయతీల ప్రతిపాదనలను మ్యాపులతో సహా రూపొందించి పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదికలు సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ప్రతిపాదనలు కూడా అమల్లోకి వస్తే.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,806కు చేరనుంది. ఇక కొత్త పంచాయతీల ఏర్పాటుతో పాటు గ్రామ పరిపాలనలో పలు విధి విధానాలు, మార్గదర్శకాలతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో అత్యధికంగా.. రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతామన్న హామీ మేరకు ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ప్రధాన పంచాయతీలకు దూరంగా, నిర్ణీత సంఖ్యకు మించి జనాభా ఉన్న శివారు గ్రామాలు, పల్లెలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించి.. వాటి ప్రకారం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు 4,122 కొత్త గ్రామ పంచాయతీలకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో అత్యధికంగా నల్లగొండలో 309, మహబూబ్‌నగర్‌లో 265, కొత్తగూడెంలో 258, మహబూబాబాద్‌లో 253, వికారాబాద్‌లో 221, ఆదిలాబాద్‌లో 209 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా 110కుపైగా తండాలు గ్రామ పంచాయతీలుగా మారనున్నాయి. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో తండాలు పంచాయతీలుగా మారనున్నాయి. ఇక ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జూలై 31తో పూర్తవుతోంది. దానికి రెండు నెలల ముందే ఎన్నికల ప్రక్రియ మొదలు కావాల్సి ఉంటుంది. ఆ లోగా కొత్త పంచాయతీల ఏర్పాటు పూర్తి చేసి వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్థానిక ప్రయోజనాల ప్రాతిపదికనే కొత్త పంచాయతీల ఏర్పాటుపై ప్రభుత్వ తుది నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కార్యదర్శులపై భారం రాష్ట్రంలో ప్రస్తుతమున్న 8,684 గ్రామ పంచాయతీలను పాలనా సౌలభ్యం కోసం 5,500 క్లస్టర్లుగా నిర్వహిస్తున్నారు. కొత్త పంచాయతీలకు అనుగుణంగా వీటిని కూడా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గ్రామ కార్యదర్శుల సంఖ్య తక్కువగా ఉండడంతో క్లస్టర్‌తోపాటు కొన్ని గ్రామాల బాధ్యతలను కూడా వారికి అప్పగించారు. తాజాగా కొత్త పంచాయతీలు ఏర్పాటు కానుండడంతో.. మూడు నాలుగు గ్రామాలకు ఒకే కార్యదర్శి ఉండే పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పంచాయతీలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో కార్యదర్శులను నియమిస్తేనే పాలనా సౌలభ్యం ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా కొత్త పంచాయతీలతో కలిపి 4,560 మంది వరకు కార్యదర్శులు అవసరమని కలెక్టర్లు తేల్చారు. ప్రస్తుతమున్న గ్రామ పంచాయతీలు - 8,684 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు - 4,122 పంచాయతీలుగా మార్చే తండాల - 2,243 పంచాయతీలుగా మారే ఆవాసాలు - 1,879 ప్రతిపాదనలు అమలైతే రాష్ట్రంలో మొత్తం పంచాయతీలు - 12,806 -
సాగు సంక్షోభం, నిరుద్యోగం కీలకం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై సమగ్ర విశ్లేషణతో కూడిన 2 నివేదికలు ప్రధాని మోదీకి చేరాయి. వీటిలో ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నివేదిక కాగా.. మరోటి ప్రత్యేక నిపుణుల కమిటీ నివేదిక. పార్టీ వర్గాల సమాచారం మేరకు... వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం గుజరాత్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయని బీజేపీ నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపకుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య విభజన ఓటింగ్ సరళిపై ప్రభావం చూపినట్లు ప్రత్యేక కమిటీ పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోరు జరిగే రాష్ట్రాలకు సంబంధించి ఈ బృందం కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నిరాశజనక ప్రదర్శన... మోదీపై వ్యతిరేక ఓటు లేక ప్రధాని నాయకత్వంపై రెఫరెండానికి సంకేతం కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
కొటక్ నికర లాభం జంప్..అంచనాలు మిస్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది తొలి క్వార్టర్ ఫలితాలు ప్రకటించింది. ఇయర్ ఆన్ ఇయర్ 23 శాతం నికర లాభాలను ప్రకటించినప్పటికీ ఎనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది. గురువారం వెల్లడించిన మొదటి జూన్ త్రైమాసిక పలితాల్లో స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 912.73 కోట్లను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 742 కోట్లను ఆర్జించింది. అయితే రూ.975 గా ఎనలిస్టులు అంచనావేశారు. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17శాతం ఎగిసి రూ. 2246 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.59 శాతం నుంచి 2.58 శాతానికి, నికర ఎన్పీఏలు 1.26 శాతం నుంచి 1.25 శాతానికి నామమాత్రంగా బలహీనపడ్డాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కొటక్ నికర లాభం 26 శాతం పెరిగి రూ. 1347 కోట్లయ్యింది. ఎన్ఐఐ సైతం 37 శాతం జంప్‌చేసి రూ. 3525 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) మాత్రం 4.6 శాతం నుంచి 4.4 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ఈ త్రైమాసికానికి బ్యాంక్ సీఏఎస్‌ల 43.9 శాతం పెరిగింది. ఈ క్వార్టర్ చివరికి బ్యాంకు మొత్తం ఆస్తుల విలువ రూ. 2,26,385 కోట్లుగా ఉన్నాయి. ఈ ఫలితాలతో కొటక్ మహీంద్ర బ్యాంక్ షేరు 1.7 శాతం లాభాలతో ట్రేడ్ అవుతోంది. -
వోడాఫోన్‌కు జియో దెబ్బ
ముంబై: రిలయన్స్ జియో ఉచిత సేవల సెగ భారత్ రెండో అతిపెద్ద టెలికాం వోడాఫోన్ ఇండియాను భారీగానే తాకింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వోడీఫోన్ లాభాలు భారీగా క్షీణించాయి. 10.2 శాతం క్షీణతతో రూ. 11,784 కోట్ల ఆపరేటింగ్ లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం 0.6 శాతం క్షీణించి 43,095 కోట్లకు పడిపోయింది స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన ఎబిటా లాభం రూ.13,115కోట్లుగా నమోదుచేసింది. దేశంలోని అతిపెద్ద టెలికాం మేజర్ ఐడియా సెల్యులార్ తో విలీనం కానున్న ఈ సంస్థ గత ఏడాది ఇదే కాలంలో రూ .13,115 కోట్ల లాభాలను ఆర్జించింది. బలమైన పోటీ వాతావరణంలో స్థిరమైన వృద్ధిని సాధించామని వోడాఫోన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ సూద్ ప్రకటించారు. వినియోగదారుల సంఖ్య 209 మిలియన్లకు పెరిగిందన్నారు. డిసెంబర్ 2016 నాటికి కంపెనీ రెవెన్యూ మార్కెట్ వాటాలో 0.7 శాతం వాటా 22.7 శాతానికి చేరింది. ఇది ఒక వినియోగదారునికి సగటు ఆదాయంరూ. 158 గా వోడాఫోన్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో నివేదించింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 8,311 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. మార్చి 31 నాటికి కంపెన్ డెట్ రూ .60,200 కోట్లుగా ఉంది రిలయన్స్ జీయో ఎంట్రీతో దేశీయ టెలికాం మేజర్లు ఆదాయాలను నష్టపోతున్నాయి. జియో నుంచి తమ ఖాతాదారులను రక్షించుకునేందుకు అష్టకష్టాలుపడుతున్న సంగతి తెలిసిందే. -
మాల్యా వాటాలను హీనెకెన్ కొనేస్తోందా?
న్యూఢిల్లీ: లిక్కర్‌కింగ్, రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. బీరు తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమెటెడ్ లో విజయ్ మాల్యాకుచెందిన మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు డచ్ బ్రూవర్ హైనెకెన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. యునైటెడ్ బ్రూవరీస్లో విజయ్ మాల్య వాటాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనతొ రుణదాతలతో హీన్కెన్ సంప్రదించినట్టు సమాచారం. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మాల్యానుంచి రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు విశ్వ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇది కీలక పరిణామమని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. హీనెకెన్ నిర్ణయం చాలా ముఖ్యమైనది, ఇది బ్యాంకులపై ఒత్తిడిని రేకెత్తిస్తుందని వ్యాఖ్యానించింది. హీనెకెన్, విజయ్ మాల్యా యూబిఎల్ కంపెనీలో ఉమ్మడి యజమానులుగా ఉన్నారు. మాల్యాకు 30శాతం వాటా వుండగా, హెన్‌కెన్ 43.4 శాతం వాటాకలిగి ఉంది. దీంతో మార్కెట్లో యూబీఎల్ షేర్లకు డిమాండ్ పుట్టింది. దాదాపు 6.23 శాతానికిపైగా లాభపడ్డాయి. మరోవైపు ఈ వార్తలతో స్టాక్ ఎక్సేంజ్ లు హెన్‌కెన్ సంస్థను వివరణ కోరింది. కాగా గత ఏడాది మార్చిలో ఇండియా నుంచి పారిపోయని మాల్యాను గత నెల ఏప్రిల్ 18న లండన్ లో స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు అటు ఆయన్ను భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా భారత ఈడీ, సీఐడి అధికారులు ప్రత్యేక బృందం ఇప్పటికే లండన్ చేరుకుంది. అక్కడి న్యాయవాదులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. -
ట్రంప్ ఇంకా అప్డేట్ కాలేదట!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించి వైట్‌హౌస్‌కు వెళ్లినప్పటికీ, ఇంకా దాని టెక్నాలజీ పద్ధతులకు అప్డేట్ కాలేదట. ట్విట్టర్‌పై పోస్టు చేయడానికి ప్రెసిడెంట్ ఇంకా తన పాత ఆండ్రాయిడ్ డివైజ్‌నే వాడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం గతవారం చివర్లో వాషింగ్టన్కు వెళ్లిన ట్రంప్, అప్పటినుంచి ట్విట్టర్‌పై పోస్టు చేయడానికి ఎలాంటి భద్రత లేని తన ఆండ్రాయిడ్ ఫోన్ నే వాడుతున్నారని తెలిపింది. ఎలాంటి భద్రతలేని డివైజ్‌ను ట్రంప్ వాడటం, అటు ఆయనకు, ఇటు దేశానికి అంతమంచింది కాదని, సెక్యురిటీ సమస్యలు వస్తాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాత ఫోన్ పక్కనపడేసి, కొత్త ఐఫోన్ వాడనున్నారని అమెరికా నిఘా విభాగం తెలిపిన సంగతి తెలిసిందే. పాత నంబర్ ఉన్నా, ఫోన్ ఉన్నా ఏదో రకంగా హ్యాకింగ్ చేసి సైబర్ నేరగాళ్లు సమాచారం చోరీ చేస్తారని నిఘా విభాగం చెప్పింది. కానీ ట్రంప్ ఇంకా తన ట్విట్టర్ పోస్టులకు పాత ఆండ్రాయిడ్ ఫోన్‌నే వాడుతున్నారని తెలిసింది. కనీసం ట్రంప్ జాతి భద్రతను, విదేశీ నేరగాళ్లను దృష్టిలో పెట్టుకుని సెక్యుర్ డివైజ్‌ను వాడాలని డెమొక్రాటిక్కు చెందిన ఓ సెనెటర్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో మాడిఫైడ్ బ్లాక్ బెర్రీ ఫోన్ వాడారు. ఆ తర్వాత ఐఫోన్ సర్వీసును ఆయనకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ట్రంప్ కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలని సెనెటర్ సూచించారు. -
అదరగొట్టిన టీసీఎస్
ముంబై: ఐటీ మేజర్ టీసీఎస్ క్యూ 3 ఆర్థిక ఫలితాల్లో అంచనాలను అధిగమించింది. నికరలాభాల్లో 2.9 శాతం జంప్ చేసి మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. దేశీయ అతి పెద్ద ఐటీ సంస్థ గురువారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో నికర లాభం రూ 6,778 కోట్లుగా నమోదు చేసింది. ఆదాయం 1.5 శాతం పెరిగి రూ. 29,735 కోట్లుగా నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రూ. 6,432 కోట్ల లాభాన్ని నమోదు చేయనుందని విశ్లేషకులు ఊహించారు. ఒక పక్క మిస్త్రీ- టాటా బోర్డ్ వార్, మరో పక్క హెచ్ 1 వీసాలపై నెలకొన్న ఆందోళన వాతావరణం నేపథ్యంలో టీసీఎస్ ఫలితాలు ఆకర్షణీయంగా నిలిచాయి. డాలర్ ఆదాయం 4,387మిలియన్ డాలర్లుగా నిలిచిందని కంపెనీ తెలిపింది. స్థిరమైన కరెన్సీ పరంగా, కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం సీక్వెన్షియల్ గ్రోత్ తో 26.01 శాతంగా నమోదైంది. ఎబిటా మార్జిన్ 26.22 శాతం పెరిగి రూ.7733కోట్లను సాధించింది. అలాగే ఈ త్రైమాసికంలో 18.362 ఉద్యోగులు చేరినట్టు, ఈ క్వార్టర్ చివరినాటికి మొత్తం ఉద్యోగులు 3,78,497 వద్ద నిలిచిందని టీసీఎస్ బీఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ 6,586 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రెండవ త్రైమాసికంలో రూ 29.280 కోట్ల ఆదాయాన్ని వెల్లడిచే యగా , ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఈ మూడవ త్రైమాసికంలో రెవెన్యూ 1.55 శాతం పెరిగింది. దీంతోపాటు ప్రతి షేర్‌కి రూ.6.50 డివిడెండ్ ను కూడా ప్రకటించింది. కాగా అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక కావడం దేశీయ ఐటీ రంగానికి చేటు తప్పదనే అంచనాల నేపథ్యంలో టీసీఎస్ మెరుగైన ఫలితాలను వెల్లడించింది. దీంతో ఐటీ రంగంపై భరోసా పెరిగిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఇంకా రాని ప్రగతి నివేదికలు
రాత పుస్తకాలలోనే నమోదు చేస్తున్న ఉపాధ్యాయులు.. లక్ష్మణచాంద : పాఠశాలల అభివృద్దికి ,విద్యార్థుల ప్రగతి కోసం ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలుకు నోచుకోవడంలేదు.ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు సమస్యలతో సహవాసం చేయాల్సిన అవసరం ఏర్పడింది. చివరకు పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన ప్రగతి కూడా సరఫరా చేయడం లేదంటే పాఠశాలల నిర్వాహణపై ప్రభుత్వానికి ఎంతటి చిత్తశుద్ది ఉందో అర్థమవుతుంది. పాఠశాలలు ప్రాంభమై ఆరు నెలలైన పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలల కాలం గడిచిపోరుుంది. విద్యార్థుల సామార్థ్యలను, హాజరు శాతం నమోదుకు ప్రాథమిక స్థారుు లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరతగతి వరకు, ప్రాథమికోన్నత స్థారుులో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అందిచాల్సిన అవసరం ఉంది.సమగ్ర ప్రగతి నివేదికలు నేటికి పా ఠశాలలకు అందలేదు. దీనితో విద్యార్థుల సా మార్థ్యలు తల్లిదండ్రులకు తెలియడం లేదు. రాత పుస్తకాలలోనే ప్రగతి నివేదికలు ఇప్పటి వరకు సరపరా కాకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థల యొక్క గణాంకాలను రాత పుస్తకాలలోనే నమోదు చేస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇది జిల్లాలోని నిర్మల్ ,ముథోల్ ,ఖానాపూర్ నియోజక వర్గాల పరిదిలో మొత్తం 19 మండలాలు ఉన్నారుు.ఆయా మండలాలలో ప్రాథమిక పాఠశాలలు 497 ,ప్రాథమికోన్నత పాఠశాలలు 90 ,ఉన్నత పాఠశాలలు 104 ,ఆశ్రమ పాఠశాలలు 17 ,ఒక ఎరుుడెడ్ పాఠశాల ,ప్రభుత్వ పట్టణ పాఠశాలలు 40 ,కేజిబీవి పాఠశాలలు 13 ,సాంఘిక సంక్షమ గురుకుల పాఠశాలలు 4 ,బాలికల గురుకుల పాఠశాల 01 ,గిరిజన పాఠశాలలు 44 ,మిని గురుకులం 01, మొత్తం 812 పాఠశాలలు ఉన్నారుు. జిల్లాలోని అన్ని పాఠశాలలో కలిపి ఒక లక్ష నాలుగు వందల మంది విద్యార్థులు విధ్యను అభ్యసిస్తున్నారు. వీరికి జూలై ,ఆగస్ట్ మాసంలో నిర్మాణాత్మక మదింపు -1(ఎఫ్ఏ 1),సెప్టెంబర్ ,అక్టోబర్ మాసంలో నిర్మాణాత్మక మదింపు 2(ఎఫ్ఏ 2),పరీక్షలు పూర్తి అయ్యారుు.అంతేకాకుండా అక్టోబర్ 27 నుండి నవంబర్ సంగ్రహాణాత్మక మూల్యాంకనం 1,పరీక్షలు పూర్తి అయ్యారుు.దీనితో విద్యార్థుల ప్రమాణాల ఆదారంగా గ్రేడ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఎప్పటికప్పుడు విద్యార్థులు ప్రగతి విలువలు తెలిస్తే తల్లిదండ్రులకు సైతం తమ పిల్లల నైపుణ్యాన్ని అంచనావేయవచ్చు. విద్యార్థుల ఆరోగ్యం నివేదికలు నిరతంతర సమగ్ర మూల్యాంక రిజిస్టర్లు అందలేదు. వీటిలో విద్యార్థుల ఆరోగ్య సమాచారం, నిర్మాణాత్మక మదింపు, సంగ్రహనాత్మక మదింపు, సహపాఠ్య కార్యక్రమాల వివరాలు ఉంటారుు. రిజిస్టర్లు సత్వరం అందిస్తే ఇద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల అభివృద్దికి అన్ని రాకల కట్టుబడి వుంటుందని ప్రఝభుత్వం చెప్పె మాటాలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయని అవి కార్యరూపం దాల్చడం లేదని జిల్లా పీడీఎస్‌యూ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇకనైన ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యార్థులకు ఇవ్వల్సిన ప్రగతి నివేదికలు త్వరగా అందేలా చూడాలని కోరుతున్నారు. శేఖర్ ,పీడిఎస్యూ , నాయకులు ప్రభుత్వానికి నివేదికలు అందించాం విద్యార్థులకు వారి సమగ్ర ప్రగతిని తెలియచేసే నివేదికలకు సంబందించిన ప్రగతి నివేదికలు ఇప్పటి వరకు రాలేదు. దీంతో ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు అందించాము. ప్రగతి నివేదికలు రాకపోవడంతో విద్యార్థులకు సంబందించిన సమగ్ర సమాచారంను రాత సుస్తకాలలోనే నమోదు చేరుుస్తున్నాం. ప్రగతి నివేదికలు రాగానే వాటిలో నమోదుచేసి వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు అందచేస్తాం. ఏంఈవో, మాజిద్ -
బడ్జెట్ ముహుర్తం ఆ రోజే!
కేంద్ర బడ్జెట్ ముహుర్తం దాదాపు ఖరారైనట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. పాత సంప్రదాయానికి భిన్నంగా ఈసారి నెల రోజుల ముందే కేందం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఏడాది(2017-18) నిర్వహించబోయే ఈ బడ్జెట్ సమావేశాలూ జనవరిలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీల అనంతరం వచ్చే ఏడాది నిర్వహించబోయే ఈ సమావేశ తేదీలను ప్రభుత్వం ఖరారుచేసినట్టు సమాచారం. ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16వరకు జరుగనున్నాయి. ఈ సారి బడ్జెట్లో మరో విశేషమేమిటంటే ప్రత్యేక రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్లో కలిపి తీసుకురావడమే. 92ఏళ్ల నాటి నుంచి వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ సాంస్కృతికి చరమగీతం పాడిన కేంద్రప్రభుత్వం, ఈ బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో కలపడానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. రెండు బడ్జెట్లను ప్రభుత్వం కలిపి ప్రవేశపెడుతున్నందున్న, డివిడెంట్ రూపంలో చెల్లించే రూ.9,700 కోట్ల రూపాయలను భారత రైల్వే ఖజానా పొదుపు చేసుకోనుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ మొత్తం విలువ ఈసారి రూ. 20,32,650 కోట్లగా ఉండనుందని తెలుస్తోంది. ప్రతిసారి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక సర్వేను, సాధారణ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతూ వస్తోంది. బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక అంశమైనందున దానిని ఎప్పుడైనా పార్లమెంట్లో ప్రవేశపెట్టుకోవచ్చని ఓ వైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టతనిచ్చింది. దీంతో ఫిబ్రవరి1నే దేశ ప్రజల ముందుకు బడ్జెట్ లెక్కలు రాబోతున్నాయి. -
సమయమిదే.. స్పందించాలి మరి!
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌ను అత్యంత దారుణంగా కాటేసిన కరువు రక్కసి రబీ సీజన్‌నూ వెంటాడుతోంది. జులై తర్వాత ఒక్కరోజు కూడా సరైన వర్షం కురవకపోవడంతో ‘అనంత’ అతలాకుతలమైంది. పంట తొలగింపు ఖర్చులు కూడా దక్కే పరిస్థితి కనిపించకపోవడంతో కొన్ని చోట్ల వేరుశనగను పశువులు, గొర్రెలకు వదిలేశారు. సాగుకే కాదు.. తాగునీటికీ కటకట మొదలైంది. చలికాలంలోనే తాగునీరు లభించడం కష్టంగా మారింది. అననుకూల వర్షాలు, సుదీర్ఘ వర్షపాత విరామాల (డ్రైస్పెల్స్) కారణంగా ఈ ఖరీఫ్‌లో 6.09 లక్షల హెక్టార్లలో వేరుశనగ దెబ్బతినింది. 1.50 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు కూడా 90 శాతం వరకు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ వర్షాలు లేకపోవడంతో 1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన రబీ పంటల విత్తనమే ఆగిపోయింది. ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుతం తరుణంలో కరువు పరిశీలనార్థం కేంద్ర బృందాలను జిల్లాకు తీసుకురాగలిగితే దుర్భిక్ష పరిస్థితుల తీవ్రత వారికి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లకూ సంబంధించి అన్ని పంటల పరిస్థితి, రైతుల స్థితిగతులు వారిని చలింపజేస్తాయనడంలో సందేహం లేదు. తద్వారా జిల్లాకు మేలు కలిగే అవకాశాలూ ఉంటాయి. అలాకాకుండా పంటలన్నీ తొలగించిన తర్వాత, ఎక్కడా పంటలు లేని సమయంలో కరువు బృందాలు పర్యటిస్తే ఒనగూరే ప్రయోజనాలేవీ ఉండవని రైతుసంఘాల నాయకులు చెబుతున్నారు. కరువు నివేదికలు బుట్టదాఖలు జిల్లాకు వచ్చి వెళుతున్న కేంద్ర బృందాలు చేసిన సిఫారసులు కూడా అమలు కావడం లేదు. వారికి ఇచ్చిన కరువు నివేదికలు బుట్టదాఖలవుతూనే ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలోని 18 మంది నిపుణులతో కూడిన ‘హైపవర్ టెక్నికల్ కమిటీ’ 2012 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రెండు దఫాలుగా జిల్లాలో పర్యటించింది. ఆ కమిటీ చేసిన సిఫారసుల అమలు కోసం రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ‘ప్రాజెక్టు అనంత’ కూడా అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోయింది. 2013 ఏప్రిల్ 18న భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రాష్ట్ర జనరల్ మేనేజర్ కళ్యాణ చక్రవర్తి నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. తక్షణసాయంగా రూ.1,065 కోట్లు కావాలని జిల్లా అధికారులు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. 2013 డిసెంబర్లో కేంద్రానికి చెందిన కమిషన్ ఫర్ సెంట్రల్ క్రాప్స్ అండ్ ప్రైసెస్ కమిషనర్ అశోక్‌గులాటే బృందం పర్యటించింది. 2014 ఏప్రిల్ 22, 23 తేదీల్లో ‘ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం’ పేరుతో మరోసారి కేంద్ర బృందం జిల్లాకు వచ్చింది. తక్షణం రూ.1,147.50 కోట్లు అవసరమని జిల్లా అధికారులు నివేదిక అందజేశారు. 2015 ఏప్రిల్ 1న కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ షకీల్‌అహ్మద్ నేతృత్వంలో మరో బృందం పర్యటించగా జిల్లా తరపున రూ.1,404 కోట్లు తక్షణసాయం కావాలని కోరారు. కానీ ఏ ఒక్కసారీ రూపాయి కూడా మంజూరు చేయలేదు. కేంద్ర కరువు, విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్ర సింగ్, కేంద్ర హార్టికల్చర్ డైరెక్టర్ అతుల్పాట్నేలతో కూడిన మరో బృందం కూడా కరువును పరిశీలించి వెళ్లింది. ఫలితం మాత్రం శూన్యం. -
నివేదికలు సిద్ధం చేయండి
పంట నష్టం అంచనాలు సత్వరమే రూపొందించాలి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తం కావాలి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం హన్మకొండ : జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జరిగిన పంట నష్టంపై అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వర్షాలతో జరిగిన పంట నష్టాలను పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కడియం మాట్లాడుతూ.. వర్షాలు, వరుదలతో నష్టపోయిన పంటల వివరాలపై అంచనాలు రూపొందించాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. పంట నష్టం నివేదికల్లో ఎక్కడైనా అక్రమాలు జరిగితే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలన్నారు. అవి నిరూపణ అయితే త్రీమెన్ కమిటీ సభ్యులపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు నిబంధనల మేరకే ట్రాక్టర్లు ఇస్తున్నామని, గ్రూపులకే ఇవ్వాలనేది ఎక్కడా లేదని అన్నారు. అయితే గ్రూపులకు ఇస్తే చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నందున, అలాంటి వారికి ఇస్తే బాగుంటుందని సూచించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం రాయితీపై అందిస్తోందని, అవి అర్హులకే అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎంపిక చేసిన రైతుల జాబితాలు మండల కార్యాలయాల్లోని నోటీసు బోర్డుపై పెట్టాలని సూచించారు. జిల్లాలో 5550 చెరువులుండగా 3663 చెరువులు పూర్తిగా, 1400 చెరువులు 70 శాతం పైగా నిండాయని వివరించారు. 450 చెరువుల్లో 50 శాతం కంటే తక్కువ నీరు చేరిందన్నారు. దీంతో రబీలో సాగు విస్తీర్ణం పెరుగనుందని, ఈ మేరకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో రబీలో కోటి ఎకరాలు సాగు కావచ్చన్నారు. శ్రీరాంసాగర్, ఎల్ఎండీ రిజర్వాయర్లు నిండాయని, పాకాల, లక్నవరంలో నీరు పూర్తి స్థాయిలో ఉందని, రామప్ప చెరువులోకి దేవాదుల ద్వారా గోదావరి నీటిని పంపింగ్ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో గతంలో కంటే ఆస్పత్రుల పరిస్థితి మెరుగుపడిందన్నారు. భారీ వర్షాలు కురిసిన క్రమంలో అంటు వ్యా«ధులు ప్రబలే ప్రమాదం ఉందని, వైద్యులు అందుబాటులో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా ఎజెన్సీలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. డాక్టర్ల కొరత లేకుండా కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను అదేశించారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 4.41 కోట్ల మొక్కలు నాటామన్నారు. రాష్ట్రంలో వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. 4 కోట్ల లక్ష్యం కాగా లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలో వరుసగా రెండవసారి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. పీహెచ్సీలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
విభజనపై నివేదికలు ఇవ్వాలి
సర్దుబాటు విషయంలో సహకరించాలి కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు సంబంధించి ఉద్యోగుల పంపిణీ, కార్యాలయాల గుర్తింపు, పని తక్కువగా ఉన్న, ఒకే విధమైన శాఖల విలీనంపై జిల్లా అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాల విభజనపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈlసందర్భంగా ఆమె మా ట్లాడుతూ రాష్ట్ర ప్రగతి, ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వ శాఖల విభజన చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంటుందనే విషయంపై పూర్తిస్థాయిలో ఆలోచించి నివేదిక ఇవ్వాలన్నారు. విభజనలో ఉద్యోగుల సీనియారిటీ, ఉద్యోగాలు నష్టపోవడం ఉండదన్నారు. ఉద్యోగాల సర్దుబాటు విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతి శాఖలో ఒక ఉన్నతాధికారి, ఒక మండలాధికారి ఉండే విధంగా నివేదికను రూపొందించాలన్నారు. ప్రతి శాఖలోని మొత్తం ఫైళ్లను జాబితాగా రూపొందించి వాటిని స్కా న్, జిరాక్స్ చేసి కొత్త జిల్లాలకు ఇవ్వాలన్నారు. మౌలిక సదుపాయాలు, వాహనాల ఇబ్బంది లేకుండా జిల్లాలకు కేటాయించాలని సూచించారు. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు గుర్తించాలని.. ఈ విషయంలో సంబంధిత రెవెన్యూ అధికారిని సంప్రదిం చాలని సూచించారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటు విషయంలో పూర్తి బాధ్యతలు ఆయా శాఖల అధికారులపైనే ఉందన్నారు. సమా వేశంలో జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, డీఆర్వో శోభ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ నివేదికలు పంపాలి
ఇప్పటివరకు 2.24కోట్ల మొక్కలు హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఇప్పటివరకు 2.24 కోట్లమొక్కలు నాటడం పూర్తయిందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో హరితహారంపై శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలాల వారీగా మొక్కల సంరక్షణ కోసం తీసుకున్న సూక్ష్మప్రణాళికలు పంపించాలని అన్నారు. ఇప్పటివరకు పంపించని వారు వెంటనే పంపాలని అన్నారు. నీటిసదుపాయం, రక్షణ చర్యలకోసం కావాల్సిన నిధులకోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షణ బాధ్యతలు సంబంధిత శాఖలే తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం నర్సరీల్లో ఉన్న మొక్కలు సరిపోక పోతే పండ్ల, పూల మొక్కలు తెప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, పీవో అమయ్‌కుమార్, డీఎఫ్‌వో శ్రీనివాస్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ నివేదికలు పంపాలి
ఇప్పటివరకు 2.24కోట్ల మొక్కలు హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఇప్పటివరకు 2.24 కోట్లమొక్కలు నాటడం పూర్తయిందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో హరితహారంపై శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలాల వారీగా మొక్కల సంరక్షణ కోసం తీసుకున్న సూక్ష్మప్రణాళికలు పంపించాలని అన్నారు. ఇప్పటివరకు పంపించని వారు వెంటనే పంపాలని అన్నారు. నీటిసదుపాయం, రక్షణ చర్యలకోసం కావాల్సిన నిధులకోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షణ బాధ్యతలు సంబంధిత శాఖలే తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం నర్సరీల్లో ఉన్న మొక్కలు సరిపోక పోతే పండ్ల, పూల మొక్కలు తెప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, పీవో అమయ్‌కుమార్, డీఎఫ్‌వో శ్రీనివాస్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అంతా అబద్ధం
♦ స్థానికంగా ఉంటున్నట్లు నివేదికలు ♦ స్థానికంగా ఉండని ఇన్చార్జి ఎంఈవోలు ♦ జిల్లా, నియోజకవర్గ కేంద్రాలే అసలు నివాసం ♦ ఎంఈవోల పర్యవేక్షణ అంతా ప్రయాణంలోనే.. ♦ విద్య, ఆదాయ శాఖ అధికారులకు తప్పుడు నివేదికలు ♦ మెరుగైన విద్యకు ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వారు జిల్లా విద్యాశాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టె రథసారధులు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, బాల కార్మికులను బడిలో చేర్పించడం వంటి విధులతో పర్యవేక్షణ చేయాల్సిన సమయూన్ని ప్రయాణంలో గడిపేస్తున్నారు. రోజు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండటంతో విధులకు సకాలంలో రాలేని పరిస్థితి. మరో వైపు వీరంతా డిప్యూటేషన్‌పై పనిచేస్తుండటంతో ఏ పోస్టుకు న్యాయం చేయడం లేదు. మరోవైపు వీరంతా మండల కేంద్రంలోనే నివాసం ఉంటున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆదాయశాఖ పన్ను శాఖాధికారులకు నివేదికలు మాత్రం పంపుతున్నారు. ఇదంతా ఒక పెద్ద అబద్దం అని తెలిసినా డివిజన్, జిల్లా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మండల స్థాయిలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతున్నది. ఇదే అదనుగా కొందరు ఉపాధ్యాయులు డుమ్మాలు కొడుతున్నారు. స్థానికంగా ఉండని ఇన్చార్జి మండల విద్యాశాఖాధికారులు జిల్లాలో 36 మండలాల్లో గల విద్యాశాఖాధికారుల్లో గాంధారి మండల విద్యాశాఖాధికారి మాత్రమే శాశ్వత పోస్టును కలిగి ఉన్నారు. మిగతా 35 మండలాల విద్యాశాఖాధికారులు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. జిల్లాలో చాలా మంది విద్యాశాఖాధికారులు నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో ఉంటూ ప్రతినిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సమయమంతా ప్రయాణంలోనే గడిపేస్తూ విద్యావ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతలను ఏలుతున్నారు. అటు సొంత పాఠశాలల్లో విధులకు ఎగనామం పెడుతూ.. ఇటు మండల విద్యావ్యవస్థ బాధ్యతలను సక్రమంగా నిర్వహించక విద్యావ్యవస్థను దిగజారే స్థాయికి తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మండల విద్యాశాఖాధికారులు మారుమూల మండల కేంద్రాల్లోని గ్రామాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు బడులకు డుమ్మాలు కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీంగల్, సిరికొండ, జుక్కల్, గాంధారి, మద్నూరు, బిచ్కుంద మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. కామారెడ్డి విద్యా డివిజన్లోని కొన్ని మండలాల్లో కూడా ఉపాధ్యాయులు, రియల్ ఎస్టేట్, ఎల్ఐసీ వంటి స్థిరాస్తి వ్యాపారాలు చేసుకుంటూ బడులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి, విద్యాశాఖ కార్యదర్శి వరకు ఫిర్యాదులు కూడా వెళ్లినా వారిలో మార్పులేదు. తప్పుడు సమాచారం ఇస్తున్న ఎంఈవోలు మండల విద్యాశాఖాధికారులు తమ అసలు నివాసం యొక్క చిరునామా గూర్చి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆదాయం పన్ను శాఖ అధికారులకు ఇచ్చే నివేదికల్లో అసలు నివాసం మండల అభివృద్ధి కార్యాలయాల సమీపంలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. అంతా అబద్దం అని తెలిసిన కూడా జిల్లా ఉన్నతాధికారులు సంఘాల యొక్క ప్రతినిధులు ఒత్తిడి వల్ల ఏమి చేయలేక మిన్నకుండి పోతున్నారు. ఫిబ్రవరిలో సమర్పించిన ఇన్‌కంటాక్స్ పత్రాలలో అందరు ఎంఈవోలు తమ నివాసాలు మండల కేంద్రంలోనే పేర్కొనడం నిజంగా గమనార్హం. కాగా మండల విద్యాశాఖాధికారులు స్థానికంగా ఉండకపోవడం సమయమంతా ప్రయాణంలో గడపడం వల్ల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. నిరంతర పర్యవేక్షణ ఉండకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందడం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం తగ్గుతున్నది. మారుమూల గిరిజన ప్రాంతాలలో బడులు కూడా సరిగా తెరుచుకోవడం లేదు. అలాగే తమ పాఠశాలల్లో వీరు బోధించాల్సిన సబ్జెక్టులలో విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. -
ముప్పు ముంగిట భారతీయులు
వాషింగ్టన్: వాతావరణంలో సంభవిస్తున్న మార్పు భారతీయులకు శాపంగా మారనుందని అమెరికా వాతావరణ నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న సముద్రమట్టాలతో దాదాపు 4 కోట్ల మంది భారతీయులకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. 2050 నాటికి ముంబై, కోల్‌కతా వంటి తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కష్టాలు తప్పవని సూచించింది. పసిఫిక్ తీరప్రాంతాలతోపాటు దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలపై ఈ మార్పు తాలూకు దుష్ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయని గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలోని ఏడు దేశాలు ఈ ముప్పును ఎదుర్కొనే అవకాశముందని, అందులో భారత్ మొదటిస్థానంలో ఉందని తెలిపింది. బంగ్లాదేశ్‌లో 2.5 కోట్లు, చైనాలో 2 కోట్లు, ఫిలిప్పైన్స్‌లో 1.5 కోట్ల మందిపై దీని ప్రభావం కనిపిస్తుందని స్పష్టంచేసింది. -
పేలుళ్లతో అణు ప్లాంట్ తరలింపు
బ్రస్సెల్స్ లో వరుస పేలుళ్లు మారణహోమం సృష్టించిన నేపథ్యంలో రెండు అణువిద్యుత్ ప్లాంట్ లను తరలించినట్టు తెలుస్తోంది. బెల్జియంలోని తిహాంగే, డోయల్ ప్లాంట్లను తరలించారు. అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తరలింపు గల పూర్తి కారణాలు తెలియరాలేదు. ఈ విషయాన్నిఫ్రెంచ్ బహుళజాతి విద్యుత్ వినియోగ కంపెనీ ఇన్జై ఒక ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సేవలందిస్తున్న ఈ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. రక్షణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొంతమంది ముఖ్య సిబ్బంది పర్యవేక్షణలో ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. బ్రసెల్స్ లో మంగళవారం ఉదయించిన ఈ పేలుళ్లలో కనీసం 34 మంది మరణించగా 170 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. -
రాష్ట్రంలో దుర్భిక్షం!
కరువు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది * రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కేంద్ర బృందం * నివేదికలు సరిగా ఇవ్వలేకపోయారు * క్షేత్రస్థాయిలో మేం గుర్తించిన చాలా అంశాలు వాటిల్లో లేవు * కొత్త మార్గదర్శకాలు ఇస్తామని, అనుబంధ నివేదికలు పంపాలని సూచన సాక్షి, హైదరాబాద్: తాము ఊహించిన దానికంటే తెలంగాణలో కరువు తీవ్రత మరింత ఎక్కువగా ఉందని కేంద్ర కరువు పరిశీలన బృందం ధ్రువీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికలు ఆ తీవ్రతను ప్రతిబింబించడం లేదని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో తాము గుర్తించిన చాలా అంశాలు నివేదికలో లేవని, ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లినా ఈ అంశాన్ని ప్రస్తావించనే లేదని పేర్కొంది. ఇలాంటి అన్ని వివరాలతో వారం రోజుల్లోగా అనుబంధ నివేదికలు పంపించాలని సూచించింది. క్షేత్ర స్థాయిలో కరువు పరిస్థితుల పరిశీలనకు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్పల్‌కుమార్‌సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర అధికారుల బృందం ఈ నెల 7, 8 తేదీల్లో నాలుగు జిల్లాల్లో పర్యటించింది. పంట నష్టాన్ని, అడుగంటిన జలాశయాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. బృందంలోని అధికారులు పలుచోట్ల రైతులతో మాట్లాడి కరువు పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర బృందం మంగళవారం రాత్రి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయింది. ఈ సమావేశం సందర్భంగా కేంద్ర బృందం తమ పర్యటనలో గుర్తించిన అంశాలను పేర్కొనడంతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసింది. ‘‘రాష్ట్రంలో కరువు తీవ్రత ఎక్కువగా ఉంది. నివేదికలు సరిగా ఇవ్వలేకపోయారు. క్షేత్రస్థాయిలో మేం తెలుసుకున్న చాలా విషయాలు నివేదికల్లో లేవు. వివిధ జిల్లాల్లో ఉద్యాన పంటలు వేసిన రైతులు భారీగా నష్టపోయారు. మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లినప్పుడు బత్తాయి రైతులు తమకు వాటిల్లిన నష్టంపై గోడు వెళ్లబోసుకున్నారు. వీటిని సైతం జోడించి అనుబంధ నివేదికలు పంపించండి..’’ అని సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తదుపరి నివేదికలో ఉండాల్సిన అంశాలు, కరువు నిబంధనల ప్రకారం ఏమేం సమాచారం పొందుపరచాలో వివరించే మార్గదర్శకాలను పంపిస్తామని కేంద్ర బృందం పేర్కొన్నట్లు తెలిపాయి. మరో నివేదికపై కసరత్తు రాష్ట్రంలో 231 మండలాల్లో కరువు పరిస్థితులున్నట్లుగా ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదికను పంపిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర బృందం సూచన నేపథ్యంలో ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మరో నివేదికను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది. తగిన సమాచారం అందించాలని ఉద్యాన శాఖను కోరింది. ఆ వివరాలతోపాటు కరువు దుర్భిక్ష పరిస్థితుల తీవ్రతను ప్రతిబింబించేలా సమగ్ర నివేదికను తయారుచేసి వచ్చే వారంలో కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు, కరువు మండలాల్లోని రైతులను, ప్రజలను ఆదుకునేందుకు రూ. 2,514 కోట్లు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందటి నివేదికలో కేంద్రాన్ని కోరింది. తాజా మార్పులు చేర్పులతో కేంద్రం నుంచి కోరే ఆర్థిక సాయం మరింత పెరిగే అవకాశముం టుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
మైనింగ్ మోత
అనకాపల్లి: విలువైన భూగర్భ నిక్షేపాలున్న అనకాపల్లి మండలంలో చట్టాలు అక్రమార్కుల చుట్టాలవుతున్నాయి. నివేదికలు బుట్ట దాఖలవుతున్నాయి. దర్యాప్తులు తూ తూ మంత్రంగా కొనసాగుతున్నాయి. నిక్షేపాలున్న గ్రామా లు ఇంకా మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్లాడుతున్నా గ్రామ సంపదను కొల్లగొట్టి క్వారీ మాఫియా కోట్లాది రూపాయలు వెనకేసుకుంటోం ది. నిబంధనలు తూ చా అమలు చేయాల్సిన అధికారులు, ప్రజాసమస్యలను ఎలుగెత్తి చూపాల్సిన ప్రజాప్రతినిధులు క్వారీ మాఫియా ఇస్తున్న మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వెరసి క్వారీ భూతానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామీణులు క్వారీ పేలుళ్లకు వణికిపోతూ కాలం గడిపేస్తున్నారు. అనకాపల్లి మండలంలోని మార్టూరు గ్రామానికి ఆనుకొని ఉన్న క్వారీల ఆగడాలివి. తూతూ మంత్రంగా లోకాయుక్త దర్యాప్తు అనకాపల్లి మండలం సర్వే నంబర్ 1లో వందలాది ఎకరాల్లో విలువైన భూగర్భ నిక్షేపాలున్నాయి. బ్లాక్‌స్టోన్, రఫ్స్టోన్తో కలగలిపిన గ్రావెల్ ఉన్న కొండలు మార్టూరుకు ఇప్పుడు శాపంగా మారాయి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న విధ్వంసకాండను నిరసిస్తూ స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా అవి ఎక్కడో ఒక దగ్గర బుట్ట దాఖలవుతున్నాయి. ప్రస్తుతం మార్టూరు సర్వేనంబర్ -1లోని క్వారీలపై లోకాయుక్తాకు వెళ్లిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతోంది. నిశితంగా పరిశీలిస్తే ఈ దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతోంది. మార్టూరుకు చెందిన స్థానికుడొకరు 2014లో క్వారీల విధ్వంసంపై లోకాయుక్తాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంబంధిత క్వారీల అనుమతులు, విస్తీర్ణం, ఇతరత్రా అనుమతులపై దర్యాప్తు సాగుతుండగా క్వారీల యజమానుల అడ్రస్సే కానరాకుండాపోయింది. సర్వేనంబర్ 1లో 67 క్వారీలున్నాయని భూగర్భ గనుల శాఖ ద్వారా బయటకు రాగా వీటిలో ఏడుగురు క్వారీ యజమానులకు మాత్రమే రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేయగలిగింది. మిగిలిన క్వారీల యజ మానుల చిరునామాలు రెవెన్యూ యం త్రాంగానికి తెలియకుండా పోయింది. వాస్తవానికి ఎన్వోసీ ప్రక్రియతోపాటు రెవెన్యూ హద్దులు, పేలుళ్లకు వాడే నిషిద్ధ వస్తువులపై నిఘాను రెవెన్యూ యంత్రాంగమే పర్యవేక్షించాలి. క్వారీ యజమానుల చిరునామాలే రెవెన్యూ యంత్రాంగానికి తెలియకపోతే ఇక దర్యాప్తు ఎలా సాగుతుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇలా మార్టూరు పరిధిలోని క్వారీలపై వచ్చే అనేక ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయి. బ్యూరో ఆఫ్ మైనింగ్ నివేదిక ఏమైనట్టు? మార్టూరు సర్వేనంబర్ 1 పరిధిలోని క్వారీల్లో తవ్వకాల కోసం తరచూ వినియోగించే పేలుళ్ల వలన సమీపంలోని బొజ్జన్నకొండ చారిత్రక సాక్ష్యాలకు నష్టం కలుగుతుందని బ్యూరో ఆఫ్ మైనింగ్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పక్కతోవ పట్టించి బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్ల లోపు ఎటువంటి పేలుళ్లు లేవని, ఈ కారణంగా బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్లకుపైబడి దూరంలో మార్టూరు క్వారీలున్నాయని అధికార యంత్రాంగం నివేదిక ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇలా పురావస్తుశాఖ , రెవెన్యూ శాఖ, భూగర్భ గనులశాఖ, పర్యావరణ శాఖలు వారు క్షేత్రస్థాయిలో చేయాల్సి అధ్యయనం తప్పిదాల వలన మార్టూరు విధ్వంసకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి క్వారీ వాహనాల దూకుడు వలన మృత్యువాత పడ్డారు. పరిస్థితి విషమిస్తుందని గమనించిన స్థానికులు క్వారీలపై దర్యాప్తు జరపాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. తాజాగా లోకాయుక్తా ఫిర్యాదుకు సంబంధించిన నివేదికలోని దర్యాప్తు తూతూ మంత్రంగా సాగడం చూస్తే మార్టూరు క్వారీలపై కార్పొరేట్ స్థాయి శక్తులు ప్రభావితం చూపుతున్నాయని ఇట్టే అర్థమవుతుంది. అదే విధంగా మార్టూరుకు ఆనుకొని తుమ్మపాల రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఒక స్టోన్ క్రషర్‌పై కూడా అధికార పార్టీ నేతలే స్వయంగా ఫిర్యాదు చేయడం ఇక్కడి క్వారీ, స్టోన్ క్రషర్ స్థితిగతులను తేటతెల్లం చేస్తున్నాయి. -
ముస్లిం రిజర్వేషన్లపై తలోమాట
జాతీయ బీసీ కమిషన్ ఎదుట అనుకూల, వ్యతిరేక వాదనలు నిర్ణయం వెల్లడించని కమిషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ-ఈ జాబితాలోని దోబీ ముస్లిం, ఫకీర్, ఫకీర్ సాయెబ్, బుడబుడ్కి, లబ్బి, లబ్బాయి, ఖురేషీ, షేక్, ముస్లిం కటిక తదితర 14 ముస్లిం బృందాలు, వర్గాలను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ కులాల జాబితాలో చేర్చే అంశంపై శుక్రవారం జాతీయ బీసీ కమిషన్ ఎదుట అనుకూల, వ్యతిరేక వర్గాలు వాదనలు వినిపించాయి. రాష్ట్రంలోని బీసీ కులాలపేర్లు, అచ్చుతప్పులు, సవ రణలు తదితర అంశాలపై హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని హాలులో జరిగిన జాతీయ బీసీ కమిషన్ ప్రజావినతుల సేకరణ (పబ్లిక్ హియరింగ్)లో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చ సాగింది. కేంద్ర జాబితాలో ఈ కులాలను చేర్చేందుకు ఇప్పటికే అందిన వివరాలు, నివేదికలు, వివిధ సంఘాల వినతులపై కమిషన్ సర్వే చేపట్టాలని అనుకూల వర్గం కోరగా, సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నం దున తీర్పు వెలువడే దాకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోవద్దని వ్యతిరేక వర్గం వాదించింది. ఇరువర్గాల వాదనలను విన్న కమిషన్ తన నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాంగ్రెస్ పార్టీపక్షాన, వ్యక్తిగతంగా ఆయా కులాల పక్షాన శాసనమండలిలో విపక్షనేత మహ్మద్ అలీ షబ్బీర్‌తోపాటు ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ప్రసాద్ కుమార్ తమ వాదనలను వినిపించారు. ఇదే అంశంపై విడిగా ఎంఐఎం పక్షాన ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేరిట రాసిన వినతిపత్రాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీలు సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ, అమీనుల్ హసన్జాఫ్రి బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్యకు సమర్పించారు. ఈ 14 కులాలను రాష్ట్ర ప్రభుత్వం బీసీ-ఈలో చేర్చలేదని, ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తీర్పు వచ్చేవరకు దీనిపై నిర్ణయం తీసుకోవద్దని వివిధ బీసీ సంఘాలు, న్యాయవాది కొండల్రావు, బీసీ యునెటైడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య ప్రతివాదనలు వినిపించారు. తెలంగాణలో లేని కులాల తొలగింపు తెలంగాణ రాష్ట్రంలో లేని, ఏపీలోని ఆయా ప్రాంతాలకు పరిమితమైన ఆయా కులాలను బీసీ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి డా.టి.రాధ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలంటే తగిన అధికారపత్రాలు సమర్పిస్తే, పరిశీలిస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. కాగా, మూడు రోజులపాటు జరిగిన పబ్లిక్ హియరింగ్ శుక్రవారంతో ముగిసింది. దేశవ్యాప్త సర్వే జరగాలి: జస్టిస్ ఈశ్వరయ్య రాష్ట్రంలో నిర్వహించిన సకుటుంబ సర్వే తరహాలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాల కోసం సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య సూచించారు. 1931 తర్వాత దేశంలో కులాలవారీ వివరాలు అందుబాటులో లేవన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది మోస్ట్ బాక్వర్డ్క్లాస్ (ఎంబీసీ)కు చెందినవారున్నారన్నారు. ముస్లిం లకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ముస్లింలను మోసం చేశాయని ఆయన ఆరోపించారు. సామాజిక, విద్యాపరంగా వెనుకబాటు కారణంగా రాజ్యాంగంలోని 15 (4) ప్రకారం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అనుభవించిన తర్వాత అభివృద్ధి చెందిన కులాలు ఈ జాబితాలోంచి తమను తొలగించాలని ఎక్కడా చెప్పడం లేదన్నారు. ఏపీలోనే గత రెండేళ్లలో 30 కులాలను చేర్చారని చెప్పారు. కృష్ణన్ కమిషన్‌కు చట్టబద్ధత లేకపోయినా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. శెట్టిబలిజల్నీ గౌడ్లుగా గుర్తించాలి గౌడ కులాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పిలుస్తున్నారని, ఈ కులాలన్నింటినీ గౌడ్లుగా గుర్తించాలని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యకు విజ్ఞప్తి చేశారు. ఏపీలోని శెట్టిబలిజలను గౌడ్లుగా గుర్తించాలని కోరారు. రజకులను ఎస్సీలుగా గుర్తించాలి రజకులు, చాకలి కులాలను ఎస్సీలలో కలపాలని తెలంగాణ రజక సంఘాల జేఏసీ.. బీసీ జాబితా నుంచి తొలగించిన బండార కులాన్ని మళ్లీ చేర్చాలని తెలంగాణ బండార కులస్తులు కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడికి స్వైన్‌ప్లూ నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులకు స్వైన్‌ఫ్లూ భయం పట్టుకుంది. కమిషన్ చైర్మన్ ఈశ్వరయ్య సహా సభ్యులు ఎస్కె కర్వెంతన్, డాక్టర్ షకీల్ ఉల్‌జమాన్ అన్సారీ, ఎస్కె సైనీ, మెంబర్ సెక్రట్రరీ ఏకే మంగోత్రలతో కూడిన బృందం ఈ నెల 7న హైదరాబాద్ చేరుకుంది. మూడు రోజుల నుంచి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సభ్యుల్లో ఒకరైన ఎస్కే సైనీ ఉన్నట్టుండి శుక్రవారం ఉదయం తీవ్ర జ్వరం, దగ్గు, తుమ్ములు, తలనొప్పితో బాధపడుతుండటంతో అనుమానం వచ్చి ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారించి ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత కమిషన్ చైర్మన్ ఈశ్వరయ్య సహా మిగిలిన సభ్యులంతా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపారు. శనివారం మధ్యాహ్నానికి రిపోర్టు వచ్చే అవకాశం ఉందని ఉస్మానియా ఆస్పత్రి స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్వర్‌రావు తెలిపారు. కాగా స్వైన్‌ఫ్లూ భయం తో కమిషన్ చైర్మన్ సహా సభ్యులంతా ముక్కుకు మాస్కులు ధరించి పబ్లిక్ హియరింగ్‌కు హాజరు కావడం కొసమెరుపు. -
నెలాఖరుకు అంచనాలన్నీ పూర్తిచేయండి
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం కేంద్ర సాయం కోసం నివేదికలు పంపండి అనుమతులు పొందిన చెరువులకు వెంటనే టెండర్లు పిలవండి సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ కార్యక్రమం కింద ఈ ఏడాది చేపట్టే చెరువుల అంచనాలన్నీ ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి చేరిన అంచనాలకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా అనుమతులు వచ్చినా టెండర్లు పిలవడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించిన మంత్రి.. అనుమతులు పొందిన వాటికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ పనుల పురోగతిపై శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకోవడానికి 5 రోజుల్లో ముందుకు రాకపోతే నిబంధనల మేరకు టెండర్లను రద్దు చేసి రెండవ కాల్‌కు వెళ్లాలని సూచించారు. అగ్రిమెంట్‌కు రాని కాంట్రాక్టర్‌పై చర్యలకు ఉపక్రమించాలని, మూడేళ్లు వారి బిజినెస్‌ను సస్పెండ్ చేయాలని సూచించారు. ఈ నెల 15 నుంచి వ్యవసాయాధికారులు రుణమాఫీ పత్రాల పంపకం చేపట్టిన దృష్ట్యా నీటి పారుదల ఇంజనీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మిషన్ కాకతీయ లక్ష్యాలను వివరించాలని, ముఖ్యంగా పూడికను పొలాల్లో వేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. ట్రాక్టర్లు, జేసీబీల లభ్యత లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. కేంద్ర ఆర్థిక సాయానికి పంపాల్సిన సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తి చేసి పంపాలని ఆదేశించారు. చెరువుల దత్తతకు, విరాళం ప్రకటించేందుకు ముందుకొచ్చిన వారిని వ్యక్తిగతంగా లేక ఈమెయిల్ ద్వారా సంప్రదించి వారికి తగు సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, నారాయణరెడ్డి, సీఈలు రామకృష్ణారావు, రమేశ్, ఎస్పీడీ మల్సూర్ పాల్గొన్నారు. చెరువుల పురోగతి ఇలా.. మొత్తం చెరువులు : 46,447 ఈ ఏడాది చేపట్టనున్నవి : 9,662 సర్వే పూర్తయినవి : 7,212 అంచనాలు పూర్తయినవి : 5,635 పరిపాలనా అనుమతులు లభించినవి : 2,569 టెండర్లు పిలిచినవి : 1,143 -
అభివృద్ధి నివేదికలు రెడీ
నేడు ప్రీ బడ్జెట్ సదస్సు సీఎం ముందుకు కీలక ప్రతిపాదనలు మచిలీపట్నం : నవ్యాంధ్రప్రదేశ్‌లో జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలను బుధవారం విజయవాడ నగరంలో జరగనున్న ప్రీ బడ్జెట్ రాష్ట్రస్థాయి సదస్సులో ప్రస్తావించేందుకు అధికారులు, మంత్రులు నివేదికలు సిద్ధం చేశారు. ఇన్చార్జ్ కలెక్టర్ జె.మురళి, ట్రైనీ కలెక్టర్ సృజన నేతృత్వంలో ఈ నివేదికలను తయారుచేశారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి వివిధ అం శాలు ఈ సదస్సులో చర్చించేందుకు మంత్రులు సిద్ధమైనట్లు సమాచారం. మచి లీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రూ.760 కోట్లతో టెండర్లు పిలిచింది. వివిధ కారణాలతో నిలిచిపోయాయి. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ మధుకాన్ పనులు సకాలంలో ప్రారంభించకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది. భూ సేకరణ 80శాతానికి పైగా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను రూ. 150 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలని మూడేళ్లుగా ప్రతిపాదన చేస్తూనే ఉన్నారు. బెల్ కంపెనీ విస్తరణపై బుధవారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రి కొల్లు రవీంద్ర ‘సాక్షి’కి చెప్పారు. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 370 కిలోమీటర్ల మేర కోస్తా జాతీయ రహదారి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. గతంలోనే ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పనులు జరగడం లేదు. ఈ రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. కృష్ణా యూనివర్సిటీకి నూతన భవనాలను సమకూర్చేందుకు రూ.77 కోట్ల నిధులు అవసరమవుతాయని నిర్ణయించారు. మొదటి విడతగా రూ. 7కోట్ల నిధులు విడుదలయ్యాయి. యూనివర్సిటీ అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒప్పించేందుకు మంత్రులు సంసిద్ధులవుతున్నట్లు సమాచారం. కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్రా జాతీయ కళాశాలను అభివృద్ధి చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సమాచారం. మంగినపూడి బీచ్ అభివృద్ధికి సంబంధించిన వివరాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు నివేదికలను అధికారులు సిద్ధం చేశారు. బందరు పోర్టు పనులను అధికారం చేపట్టిన ఆరు నెలల్లో ప్రారంభిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పోర్టు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభింపజేయాలని మంత్రులు, అధి కారులు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రైతు సాధికార సంస్థకు నిధుల కేటాయింపు, రుణమాఫీ, గన్నవరం ఎయిర్‌పోర్టుపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రి అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకువచ్చేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. తుళ్లూరులో రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించిన అనంతరం విజయవాడలో ట్రాఫిక్ సమస్య అధికమైంది. బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలను నివరించేందుకు నివేదికలు రూపొందించారు. డెల్టా ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకు కాలువల ఆధునికీకరణ పైనా నివేదికలు తయారు చేశారు.అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కూచిపూడి గ్రామాన్ని, నాట్య మండలిని రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసే అంశంపైనా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. కృష్ణానదిలో ఉన్న భవానీ ఐల్యాండ్ అభివృద్ధి చేసే అంశంపైనా ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిసింది. -
సాగర్ రబీ లెక్కలు తేలేది నేడే!
తమతమ అవసరాలతో నివేదికలు సిద్ధం చేసుకున్న తెలంగాణ, ఏపీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రబీ సాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ నుంచి విడుదల చేసే నీటిపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాలు తమ అవసరాల చిట్టాను కృష్ణా బోర్డుకు సమర్పించాయి. ముందుగా ఇరు రాష్ట్రాలు చర్చించుకొని అవగాహనకు రావాలని, తర్వాతే సమావేశం ఏర్పాటు చేస్తామంటూ బోర్డు సూచించిన నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల ఈఎన్సీలు మంగళవారం సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు నాగార్జున సాగర్‌లో నీటిని కుడి, ఎడమ కాల్వల కింద సాగు అవసరాలకు అనుగుణంగా విడుదల చేసేవారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో.. సాగర్‌లో ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలు పంచుకోనున్నాయి. ఈమేరకు రబీ అవసరాల లెక్కలతో ఇరు రాష్ట్రాలూ సిద్ధమయ్యాయి. నాగార్జున సాగర్‌లో ఉన్న నీటి నిల్వను రెండు రాష్ట్రాల డిమాండ్లకు అనుగుణంగా కేటాయించడానికి ఏమాత్రం సరిపోదు. సాగర్ జలాలపై ఆధారపడి మొత్తంగా 22 లక్షల ఎకరాల సాగు ఆధారపడి ఉండగా అందులో.. కుడి కాల్వ కింద 11 లక్షలు, ఎడమ కాల్వ కింద మరో 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా డెల్టా కింద గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 15 లక్షల ఎకరాలు ఆధారపడి ఉంది. ఇందులో గుంటూరు 6.69లక్షల ఎకరాలు, ప్రకాశంలో4.49 లక్షల ఎకరాలు, కృష్ణాలో 3.75 లక్షల ఎకరాల సాగు ఆధారపడి ఉంది. ఇక తెలంగాణలో నల్లగొండ జిల్లా పరిధి లో కెనాల్ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్ నీటికి కుడి కాల్వకు 132 టీఎంసీలు, ఎడమ కాల్వకు 132 టీఎంసీల కేటాయింపులుండగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎడమ కాల్వ కింద 96 టీఎంసీలు, కుడి కాల్వ కింద 99 టీఎంసీల నీటి వినియోగం జరిగిపోయింది. రెండు కాల్వల కింద రబీ అవసరాలకు మిగిలిన 77 టీఎంసీల నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 255.1 టీఎంసీల మేర నీరు ఉన్నప్పటికీ కనీస నీటిమట్టం 510 అడుగులకు లెక్కిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 124 టీఎంసీలు మాత్రమే. ఇందులో కృష్ణా డెల్టా అవసరాలకు అందించే నీరు, తాగు నీటి అవసరాలైన ఏఎంఆర్పీ 5 టీఎంసీలు, సాగర్ కింద 8 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు 11 టీఎంసీల మేర నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు వేసవిలో మరో 7 నుంచి 8 టీఎంసీల మేర ఆవిరి నష్టాలు ఉంటాయి. ఇవన్నీ పోనూ.. సాగర్‌లో మిగిలేది 100 టీఎంసీలే. వచ్చే ఏడాది ఖరీఫ్ ప్రారంభ అవసరాల కోసం ఈ నీటినిల్వ నుంచే 95 టీఎంసీలను కచ్చితంగా నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పోగా.. రబీకి మిగిలేది 5-6 టీఎంసీలే. గతేడాది రబీ అవసరాలకు 88 టీఎంసీల నీటిని వాడుకోగా, ప్రస్తుతం సాగర్‌లో ఉన్న 124 టీఎంసీలను ఎలా పంచుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
హుద్‌హుద్ సాయంలో కోత
పొంతనలేని నివేదికలే కారణం ప్రధాని ప్రకటించిన సాయం తెచ్చుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం 1,000 కోట్లు ఇస్తామన్న మోదీ 680 కోట్ల రూపాయలు సరిపోతాయంటున్న కేంద్ర శాఖలు సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను నష్టానికి తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 1,000 కోట్లను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. తుపాను నష్టంపై రాష్ట్ర యంత్రాంగం పొంతనలేని నివేదికలు పంపడమే దీనికి కారణం. రాష్ట్రం పంపిన నివేదికలు వాస్తవానికి దగ్గరగా లేవని కేంద్రం కూడా వాటిని విశ్వసించడంలేదు. తొలుత రూ. 14,000 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ తరువాత రూ. 21,908 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపింది. అందులో తక్షణ సాయంగా రూ. 9,500 కోట్లు ఇవ్వాలని కూడా కోరింది. ఈ నివేదికలన్నింటినీ పరిశీలించిన కేంద్ర ఆర్థిక, హోంశాఖ అధికారులు.. నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచి చూపిందనే అభిప్రాయానికి వచ్చారు. మొత్తం రూ.680 కోట్లు సాయంగా ఇస్తే సరిపోతుందని ఆ రెండు శాఖలు అంచనాకు వచ్చాయి. కాగా, హుద్‌హుద్ తుపానులో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకే నష్టం వాటిల్లినట్లు గతంలోనే వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల సాయంలో తొలి విడతగా కేవలం రూ. 400 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసింది. దీంతో రాష్ట్ర అధికారులు షాక్ తిన్నారు. ఆందోళనతో ఢిల్లీ బయల్దేరుతున్నారు. ఈ నెల 15న రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ సుకుమార ఢిల్లీ వెళ్లి హుద్‌హుద్ నష్టంపై కేంద్ర అధికారులతో చర్చించనున్నారు. -
పేదల గూడుపై నీలినీడలు!
పూర్తయినవి తప్ప మిగిలిన ఇళ్లపై సమగ్ర సర్వే మంజూరు చేసిన అధికారులే అనర్హులుగా తేల్చే చర్యలు మండలాల ఏఈలకు టార్గెట్లు ఫిక్స్ చేసిన అధికారులు బి.కొత్తకోట: అర్హులైన పేదలంటూ ఇళ్లు మంజూరు చేసిన అధికారులే వారిని అనర్హులుగా తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. కష్టపడి ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయని ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య ను తగ్గించే దిశగా మరోసారి సమగ్ర సర్వేకు ఆదేశించింది. మండల స్థాయి లో సర్వే పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఈఈ, డీఈఈ, ఏఈలకు ఆదేశాలందాయి. నాలుగు అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ అనధికారి కంగా ఇందిర ఆవాజ్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లపై నివేదికలు ఇవ్వాలని కోరారు. దీన్నిబట్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ పథకానికి నిధులు వచ్చే పరిస్థితి కనిపిం చడం లేదు. ఆర్సీ తప్ప మిగిలినవన్నీ.. వైఎస్ హయాంలో జిల్లాలో ఇందిరమ్మ-1లో 1,00,803, ఇందిరమ్మ-2లో 1,26,933, ఇందిరమ్మ-3లో 95,737, 2004-05, 2005-06లో స్పిల్ ఓవర్‌కింద 7,632 గృహాలను మంజూరు చేశారు. మొత్తం 3,31,105 గృహాలు మంజూరయ్యా యి. ఆయన మరణానంతరం జీవో 171తో 19,999, జీవో 33తో 31,269, జీవో 44తో 10,528 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో గడిచిన మార్చి నాటికి అధికారిక లెక్కల ప్రకారం 2,95,134 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రస్తుతం పునాదుల స్థాయిలోని 31,900, గోడల స్థాయిలోని 2,830, రూఫ్ లెవల్లోని 13,170 ఇళ్లపై సర్వే చేయనున్నారు. గత నెలలో భూ మట్టానికి వేసిన పునాదులు, పునాదుల స్థాయిలో నిలిచిపోయిన ఇళ్లను మాత్రమే పరిశీలించాలని అధికారులు సూచించారు. వీటిలోనే 11,550 గృహాలను డిజైబుల్డ్లో ఉంచారు. ఇప్పటికే 15,600 గృహాల రద్దుకు అధికారుల వద్ద నివేదికలున్నాయి. ప్రస్తుత ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఐఏవైపై ప్రత్యేక నివేదిక.. ఇందిరమ్మ ఇళ్లపై సర్వే నిర్వహించే అధికారులు ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఐఏవై పథకం కింద నిర్మించి న వాటిపైనా విచారించి లబ్ధిదారులను గుర్తించనున్నారు. జిల్లా వ్యాప్తం గా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, నిధుల కోసం కేంద్రానికి విన్నవించనున్నట్టు తెలుస్తోంది. ఆ నిధులతోనైనా ఐఏవై నిర్మాణాలు పూర్తి చేయిం చే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. -
కృష్ణకు అటూ ఇటూ..!
రాజధాని నగరానికి భూసేకరణపై సీఎం నిర్దేశం? ► కృష్ణా - గుంటూరు రెండు జిల్లాలను సంతృప్తి పరుద్దాం ► కృష్ణా నదిని ఆనుకుని 2 జిల్లాలు కలిసేలా భూ సమీకరణకు సర్వే చేయండి ► కృష్ణా తీరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఏర్పాటుకు స్థలం చూడండి ► కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో భేటీలో సీఎం చంద్రబాబు ఆదేశాలు ► అమరావతి, అచ్చంపేట, కంచికచర్ల, కొండపల్లిలో రాజధాని అంటూ ప్రచారం ► అచ్చంపేట పరిసరాల్లో 3,000 ఎకరాలు, గుడిమెట్ల, చందర్లపాడు ప్రాంతాల్లో మరో 3,000 ఎకరాల దాకా ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నాయన్న నివేదికలు విజయవాడ బ్యూరో ‘రాష్ట్ర రాజధాని విషయంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నాయకులు, వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. మనకు అండగా నిలిచిన ఈ రెండు జిల్లాలను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాలను ఆనుకుని కృష్ణా నదికి రెండు వైపులా రాజధాని నిర్మించేలా ఆలోచన చేద్దాం. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న భూములపై మరోసారి సమగ్ర సర్వే చేయించి వీలైనంత త్వరలో నివేదికలు అందించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా మంత్రులు, రెండు జిల్లాల కలెక్టర్లతో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మంగళవారం సీఎంను కలసి రెండు జిల్లాల్లో ప్రభుత్వ, అటవీ భూముల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణానదికి ఇరువైపులా భూసేకరణ కోసం సర్వే నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. సీఎం సంకేతాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని అమరావతి, అచ్చంపేట, మంగళగిరి, కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల దిశగా రాష్ట్ర రాజధాని నిర్మాణం సాగే అవకాశముందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (నిడ్) ఏర్పాటు కోసం కృష్ణా నదీ తీరం వెంటే 50 నుంచి 60 ఎకరాల భూమి ఒకే చోట ఉండే స్థలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు రఘునందనరావు, కాంతిలాల్ దండేలను ఆదేశించినట్లు తెలియవచ్చింది. ఆ ప్రాంతం అనువైనదేనన్న నివేదికలు... ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచి చెప్తున్న విధంగా కృష్ణా - గుంటూరు జిల్లాల మధ్యలోనే రాజధాని ఏర్పాటు చేయడానికి అమరావతి, అచ్చంపేట ప్రాంతాలు అనువైనవిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా నది మీదుగా రెండు కిలోమీటర్ల దూరం హైలెవెల్ బ్రిడ్జి నిర్మిస్తే గుంటూరు - కృష్ణా జిల్లాలను కలిపేయవచ్చని ప్రభుత్వం భావి స్తున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రభుత్వ, అటవీ భూముల వివరాలు, నీటి లభ్యత, 9వ జాతీయ రహదారికి అనుసంధాన దూరం, గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గం వివరాల గురించి గుంటూరు, కృష్ణా జిల్లాల అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంది. అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో 3,000 ఎకరాలకు పైగా, కృష్ణా జిల్లాలోని గుడిమెట్ల, చందర్లపాడు ప్రాంతాల్లో మరో 3,000 ఎకరాల దాకా ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు చెప్తున్నారు. ఈ ప్రాంతానికి పులిచింతల ప్రాజెక్టు నుంచి గానీ, కృష్ణా నది నుంచి గానీ నీటిని సులువుగా తీసుకురావచ్చని.. రైతుల నుంచి భూములు సేకరించాల్సి వచ్చినా తక్కువ ధరకు లేదా 60 : 40 ప్రాతిపదికన సులువుగా భూ సేకరణ చేయొచ్చని అధికార వర్గాలు నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అచ్చంపేట నుంచి గన్నవరం విమానాశ్రయం 95 కిలోమీటర్లు, నందిగామ 30 కి.మీ, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, మంగళగిరి, అమరావతి, నరసారావుపేట పట్టణాలు 50 కి.మీ. దూరంలోనే ఉంటాయని వివరించారని సమాచారం. -
వేగం పుంజుకున్నవిభజన లెక్కలు
జిల్లా ట్రెజరీ శాఖ ముమ్మర కసరత్తు ఉద్యోగుల వివరాల సేకరణలో నిమగ్నం ఈ నెల 24తో ఉమ్మడి ఆర్థిక వ్యవస్థకు మంగళం అవిభాజ్య రాష్ట్రంలో ఇదే చివరి వేతనం అన్ని శాఖల ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు నిధుల వినియోగానికీ చివరి చాన్స్ వచ్చే నెల నుంచి తెలంగాణ బడ్జెట్లో కేటాయింపు హన్మకొండ, న్యూస్‌లైన్: అవిభాజ్య ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల లెక్కల పుస్తకాలకు కాలం చెల్లనుంది. వచ్చే నెల నుంచి కొత్త రాష్ట్ర బడ్జెట్ అమల్లోకి రానుందని... మే 24 తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేర్వే రని... ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు సంబంధించిన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌దారులు పింఛన్లపై నివేదికలివ్వాలని గవర్నర్ నరసింహన్ ఇటీవల జిల్లా గణాంక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విభజన లెక్కల ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లో వచ్చిన నిధులు, ఖర్చు, మిగులు నిధులపై నివేదికలు తయారు చేస్తున్నారు. వీటిని ఈనెల 21వ తేదీ లోపు గవర్నర్‌కు సమర్పించనున్నారు. జిల్లాలో మొత్తం 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 22వేల మంది పింఛన్‌దారులున్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాల కింద రూ. 52 కోట్లు.. పెన్షన్‌దారులకు రూ. 35 కోట్లు చెల్లిస్తున్నట్లు జిల్లా గణాంక శాఖ అధికారులు నివేదికల్లో పొందుపరిచారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన నిధులతోపాటు వాటి ఖర్చు వివరాలను పొందుపరిచినట్లు సమాచారం. 24న చివరి సంతకం ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ చెల్లింపులకు ఈ నెల 24వ తేదీతో తెరపడనుంది. ఇప్పటివరకు చెల్లిస్తున్న వేతనాల రిజస్టర్లు, పే స్లిప్పులన్నీ మారి... నిర్ధేశిత తేదీ తర్వాత అన్ని శాఖల్లో తెలంగాణ రాష్ట్రం పేరుతో పేమెంట్ విధానం అమల్లోకి రానుంది. అపాయింట్మెంట్ డే జూన్ 2న నుంచి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు తీసుకోనుండడంతో ఈనెల 24న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు తీసుకునే వేతనం ఆంధ్రప్రదేశ్‌లో చివరి వేతనంగా చరిత్రకెక్కనుంది. ఈ రోజున ఉద్యోగులు, పెన్షనర్లు పెట్టే సంతకం ఉమ్మడి రాష్ట్రంలో చివరిది కానుంది. ఉద్యోగుల జాబితా తయారు లెక్కలతోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల జాబితా కూడా సిద్ధమవుతోంది. డివిజన్ల వారీగా స్థానిక, స్థానికేతర ఉద్యోగుల జాబితా తయారీలో అధికారులు కుస్తీ పడుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ విధుల్లో చేరారనే ధ్రువీకరణ పత్రాలు, సర్వీసు పుస్తకాలన్నీ సమర్పించాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖల్లో సుమారు 110 మంది అంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులున్నట్లు ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఖర్చు కాకపోతే అంతేనా ? వచ్చే నెల నుంచి ఇక్కడి ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్రంలో సర్దుబాటు చేయడంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఉమ్మడి బడ్జెట్లో కేటాయించిన నిధులను ఈనెల 24 వరకు వినియోగించుకోవచ్చని, ఇప్పటివరకు వెచ్చించకుండా ఉన్న నిధులను మాత్రం ఆయా శాఖల ఖాతాల్లో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినియోగం కాని నిధులు వెనక్కి పోయే అవకాశముంది. ఈ లెక్కన జిల్లాలో చాలా మేరకు నిధులు ఖాతాల్లో ఉన్నాయి. కార్పొరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీలకు ఇటీవలే దాదాపు రూ. 12 కోట్ల అభివృద్ధి నిధులిచ్చారు. అంతేకాకుండా... గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 15 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో దాదాపు 30 శాతం కూడా ఖర్చు కాలేదు. వీటిని వెనక్కి తీసుకుని... మళ్లీ ఇస్తారా... అనేది సందిగ్ధంలో పడింది. అయితే వెనక్కి తీసుకునే నిధులను మళ్లీ ఆయా శాఖలకు కొత్త రాష్ట్రంలో మంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.