ముప్పు ముంగిట భారతీయులు
వాషింగ్టన్: వాతావరణంలో సంభవిస్తున్న మార్పు భారతీయులకు శాపంగా మారనుందని అమెరికా వాతావరణ నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న సముద్రమట్టాలతో దాదాపు 4 కోట్ల మంది భారతీయులకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. 2050 నాటికి ముంబై, కోల్‌కతా వంటి తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కష్టాలు తప్పవని సూచించింది.
పసిఫిక్ తీరప్రాంతాలతోపాటు దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలపై ఈ మార్పు తాలూకు దుష్ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయని గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచంలోని ఏడు దేశాలు ఈ ముప్పును ఎదుర్కొనే అవకాశముందని, అందులో భారత్ మొదటిస్థానంలో ఉందని తెలిపింది. బంగ్లాదేశ్‌లో 2.5 కోట్లు, చైనాలో 2 కోట్లు, ఫిలిప్పైన్స్‌లో 1.5 కోట్ల మందిపై దీని ప్రభావం కనిపిస్తుందని స్పష్టంచేసింది.