తాడికొండ : ప్రపంచ ప్రఖ్యాత రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు చెప్పిన గొప్పలు చిన్నపాటి వర్షానికే వెక్కిరిస్తున్నాయి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి పనికిరాదని, శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్ రావు వంటి నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలను తొక్కిపెట్టిన చంద్రబాబు నారాయణ కమిటీ వేసి తనకు అనుకూలంగా రాజధాని నిర్మించుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా రాజధాని ప్రాంతానికి ఇబ్బందులు తప్పడం లేదు.
కొండవీటి వాగు, కోటేళ్ల వాగు, చీకటి వాగుకు వచ్చే భారీ వరద నీటిని మళ్ళించేందుకు గత ప్రభుత్వ హయాంలో తగిన చర్యలు తీసుకోకపోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సచివాలయం, హైకోర్టును వరద నీరు భారీగా చుట్టుముట్టింది. విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలకు వెళ్లే రహదారులు సైతం పూర్తిగా నీట మునగడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు.
కొండవీటి వాగుకు భారీగా వచ్చిన వరదతో పెదపరిమి, నీరుకొండ, ఐనవోలు, నేలపాడు ప్రాంతాల్లో పొలాలు, రోడ్లు ముంపునకు గురయ్యాయి. కోటేళ్ల వాగుకు బు«ధ, గురువారాలు ఉప్పొంగడంతో సచివాలయ, హైకోర్టు ఉద్యోగులు మంగళగిరి మీదుగా తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ముందుచూపు లేకుండా ముంపు ప్రాంతంలో రాజధాని నిర్మించిన చంద్రబాబు నిర్వాకం ఫలితంగా ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment