అదరగొట్టిన టీసీఎస్
ముంబై: ఐటీ మేజర్ టీసీఎస్ క్యూ 3 ఆర్థిక ఫలితాల్లో అంచనాలను అధిగమించింది. నికరలాభాల్లో 2.9 శాతం జంప్ చేసి మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. దేశీయ అతి పెద్ద ఐటీ సంస్థ గురువారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో నికర లాభం రూ 6,778 కోట్లుగా నమోదు చేసింది. ఆదాయం 1.5 శాతం పెరిగి రూ. 29,735 కోట్లుగా నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రూ. 6,432 కోట్ల లాభాన్ని నమోదు చేయనుందని విశ్లేషకులు ఊహించారు. ఒక పక్క మిస్త్రీ- టాటా బోర్డ్ వార్, మరో పక్క హెచ్ 1 వీసాలపై నెలకొన్న ఆందోళన వాతావరణం నేపథ్యంలో టీసీఎస్ ఫలితాలు ఆకర్షణీయంగా నిలిచాయి.
డాలర్ ఆదాయం 4,387మిలియన్ డాలర్లుగా నిలిచిందని కంపెనీ తెలిపింది. స్థిరమైన కరెన్సీ పరంగా, కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం సీక్వెన్షియల్ గ్రోత్ తో 26.01 శాతంగా నమోదైంది. ఎబిటా మార్జిన్ 26.22 శాతం పెరిగి రూ.7733కోట్లను సాధించింది. అలాగే ఈ త్రైమాసికంలో 18.362 ఉద్యోగులు చేరినట్టు, ఈ క్వార్టర్ చివరినాటికి మొత్తం ఉద్యోగులు 3,78,497 వద్ద నిలిచిందని టీసీఎస్ బీఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ 6,586 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రెండవ త్రైమాసికంలో రూ 29.280 కోట్ల ఆదాయాన్ని వెల్లడిచే యగా , ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఈ మూడవ త్రైమాసికంలో రెవెన్యూ 1.55 శాతం పెరిగింది. దీంతోపాటు ప్రతి షేర్‌కి రూ.6.50 డివిడెండ్ ను కూడా ప్రకటించింది.
కాగా అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక కావడం దేశీయ ఐటీ రంగానికి చేటు తప్పదనే అంచనాల నేపథ్యంలో టీసీఎస్ మెరుగైన ఫలితాలను వెల్లడించింది. దీంతో ఐటీ రంగంపై భరోసా పెరిగిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.