సాక్షి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను పెను విధ్వంసం సృష్టించింన విషయం తెలిసిందే. తిత్లీ తుఫాన్ దెబ్బకి చేతికి అందే పంట నీట ముంచింది.. కడుపు నింపే కొబ్బరితోట కూకటి వేళ్లతో పెకిలించింది. ఇళ్లను కూలగొట్టింది. కొన్ని గ్రామాలు పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. తుఫాన్ మరుసటి రోజు జిల్లాలో నదులు ఉగ్రరూపం దాల్చాయి. అయితే ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. (తుపాను బాధితులను జగన్ ఆదుకుంటారు)
అంతే కాకుండా తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్.. పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో రెండు కమిటీలను నియమించారు. భూమన కరుణాకర రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు రఘురామ్ తదితరులు ఈ కమిటీలలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలు బాధిత ప్రాంతాలలో పర్యటించి నష్టాన్ని అంచనావేసి ఓ నివేదిక రూపొందించింది. ఈ రోజు (శనివారం) సాయంత్రం ఆ పార్టీ అధ్యక్షుడికి రెండు కమిటీలు నివేదికలను అందజేయనుంది. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో తుఫాన్ నష్టం గురుంచి వివరించనున్నారు. (‘తిత్లీ’ బాధితులకు అండగా ఉంటాం)
Comments
Please login to add a commentAdd a comment