Titli Cyclone
-
థాంక్యూ సీఎం సార్
సోంపేట/ఇచ్ఛాపురం రూరల్/కంచిలి: తిత్లీనష్ట పరిహారం చెల్లించి ఈ ప్రాంత రైతులను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజక వర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం అమ్మ ఒడి పథకం ప్రారంభానికి శ్రీకాకుళం వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడానికి సుమారు 100 వాహనాల్లో నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బయల్దేరి వెళ్లారు. సోంపేట ఫ్లై ఓవర్ వద్ద నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు చేరుకుని థాంక్యూ సీఏం సార్ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీకాకుళం తరలివెళ్లారు. కార్యక్రమంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణారావు రౌలో, ఇచ్ఛాపురం జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ, చాట్ల తులసీదాసురెడ్డి, కారంగి మోహనరావు, దక్కత నూకయ్యరెడ్డి, లోపింటి దీనబంధురెడ్డి, రాంపత్నీ చిట్టిబాబు, సంతోష్ మండలా, కారంగి త్రినాథ్, నీలాపు జగదీష్, పిట్ట మామయ్య, బుడ్డ కళ్యాణ్, చినపాన ఖోగయ్యలు పాల్గొన్నారు. -
తితిలీ తుఫాన్ బాధిత రైతులకు శుభవార్త
-
తిథిలీ తుఫాన్ బాధిత రైతులకు సీఎం జగన్ శుభవార్త
-
తిత్లీ పరిహారాన్ని గెద్దల్లా తన్నుకుపోయారు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రెండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు. తిత్లీ తుఫాన్ జిల్లాలో విరుచుకుపడింది. మరో కోనసీమగా పిలిచే ఉద్దానంలో విధ్వంసం సృష్టించింది. భీకర గాలుల బీభత్సానికి పచ్చటి ఉద్దానం కకావికలమైంది. కొబ్బరి, జీడి రైతుల జీవితకాలపు కష్టాన్ని క్షణాల్లో ధ్వంసం చేసేసింది. టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల స్వరూపమే మార్చేసింది. తుఫాన్ విధ్వంసంతో రైతు కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. టీడీపీ నేతలకు మా త్రం తుఫాన్ కాసులు కురిపించింది. తిత్లీ తుఫాన్‌తో రైతులు రోడ్డు పాలు కాగా, టీడీపీ నేతలు ధనవంతులయ్యారు. బాధితుల ముసుగులో తుఫాన్ పరిహారమంతా తమ ఖాతాల్లో వేసుకున్నా రు. అండగా నిలవాల్సిన అప్పటి అధికార పార్టీ నేతలు.. రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని గెద్దల్లా తన్నుకుపోయారు. నాడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు దగ్గరుండి అక్రమాల తంతునడిపారు. అనర్హులకు పెద్ద ఎత్తున పరిహారం కట్టబెట్టారు. తుఫాన్లో నష్టపోని వారి ఖాతాలకు లక్షలు జమ చేయించారు. వాస్తవంగా నష్టపోయిన వారికి మొండిచేయి చూపారు. నాడు లెక్క తేల్చిన నష్ట పరిహారం జాబితాలో 60 శాతం వరకు అనర్హులే ఉన్నారని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. కోట్లాది రూపాయలు టీడీపీ నేతల జేబుల్లోకి వేశారు. వాస్తవానికైతే 52,164మంది కొబ్బరి రైతులు, 78,108 మంది జీడి రైతులు తిత్లీ బీభత్సానికి నష్టపోయినట్టుగా పరిహారం జాబితాల్లో చూపించారు. ఎన్నికలకు ముందు దాదాపు రూ.307 కోట్లు వరకు పరిహారం కింద అందించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన అనర్హులకు ఎన్ని కోట్లు వెళ్లాయో అక్రమార్కులకే తెలియాలి. విచిత్రమేమిటంటే ఎన్నికలకు ముందు రోజుల్లో ఒక్క ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే రూ.50 కోట్ల వరకు అనుయాయుల ఖాతాల్లో వేశారు. అప్పట్లో ఇది ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపింది. పరిహారం.. పరిహాసం ♦భూముల్లేని టీడీపీ సానుభూతిపరులకు భూములున్నట్టుగా చూపించారు. తక్కువ భూమి ఉన్న టీడీపీ శ్రేణులకు ఎక్కువ భూమి ఉన్నట్టుగా నమోదు చేయించారు. ♦ పల్లం భూమిని మెట్ట భూమిగా నమోదు చేసి, పంచాయతీకి చెందని వ్యక్తులను స్థానికంగా చూపించి పరిహారం జాబితాలు సిద్ధం చేశారు. ♦ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని డమ్మీగా మార్చేశారు. ♦ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ కుటుంబీకులు, బంధువులను సైతం నష్టపోయినట్టు పరిహారం జాబితాలో చేర్చినట్టుగా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ♦ పి.బంగారమ్మ, డి.వల్లభరావు, బి.సంహిత, డి.గీత తదితర వేలాది పేర్లతో తుఫాన్ పరిహారాన్ని స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ♦ వైఎస్సార్సీపీ సానుభూతి పరులుగా ఉన్న కొంతమంది వాస్తవంగా నష్టపోయినప్పటికీ పరిహారం జాబితాలో వారి పేర్లను చేర్చలేదు. ♦ రాజకీయ కక్షతో పరిహారానికి దూరం చేశారు. కొందరికైతే జాబితాల్లో నష్టపోయినట్టుగా చూపించి కూడా పరిహారం ఇవ్వలేదు. పరిహారం వచ్చేసరికి వారి పేర్లు గల్లంతయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఇదీ పరిస్థితి... అక్రమాల తంతుపై ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. కలెక్టర్ జె.నివాస్ సైతం విచారణకు ఆదేశించారు. గ్రామసభలు పెట్టి వారు అర్హులా?అనర్హులా? తెలుసుకుని పరిహారం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయి అధికారులు అక్కడున్న అనర్హుల గుట్టు రట్టు తేల్చడం లేదు. ఏదో ఒకటి చెప్పి నాన్చుతూనే ఉన్నారు. తూతూమంత్రంగా గ్రామసభలు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు అనర్హులను తమ రికార్డులను మారి్పంచుకున్నారు. వారసత్వంగా వచ్చే భూములను తమ రికార్డుల్లో చేరి్పంచుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రికార్డులు మారిపోయాయి. పెండింగ్‌లో పెంచిన పరిహారం... తిత్లీ బాధితుల నష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో చలించిపోయారు. అధికారంలోకి రాగానే పరిహారం పెంచుతానని ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చాక పరిహారం పెంచారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు రూ.1500 నుంచి రూ.3వేలకు, జీడి తోట హెక్టార్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పరిహారం పెంచడమే కాకుండా నిధులు కూడా విడుదల చేశా రు. ఈ లెక్కన దాదాపు రూ.290కోట్ల వరకు అదనంగా వచ్చినట్టు అయింది. ఇంతవరకు బాగానే ఉన్నా పరిహారం పంపిణీకొచ్చేసరికి చిక్కుముడి నెలకొంది. పాత జాబితా ప్రకారంగా పంపిణీ చేస్తే ఇది కూడా అనర్హుల జాబితాలోకి వెళ్లిపోతుందని ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆగారు. -
ఎత్తులు.. జిత్తులు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తిత్లీ తుఫాన్ సమయంలో గ్రామాలను పంచేసుకుని అప్పనంగా పరిహారం కొట్టేశారు. ఒక గ్రామంలో ఉన్న భూమిని తమదిగా చూపించుకుని, ఇన్ని చెట్లు పడిపోయాయని చెప్పి ప్రజాధనం కాజేశారు. ఏదో ఒక సర్వే నెంబర్‌తో భూమిని చూపించి, నచ్చిన సంఖ్యలో చెట్లు పడిపోయినట్టు నమోదు చేయించుకొని లక్షలాది రూపాయలు మింగేశారు. చెప్పాలంటే నాడు మంత్రిగాఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ మనుషులు, బంధువులు తిత్లీ పరిహారాన్ని దోచేశారు. వారి అడుగు జాడల్లో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా సర్వం స్వాహా చేశారు. కుటుంబసభ్యుల పేరున ఎటువంటి భూములు లేనప్పటికీ నష్టపరిహారాన్ని లక్షల రూపాయల్లో అందుకొన్నారు. ఇవన్నీ అప్పట్లోనే వెలుగు చూశాయి. కాకపోతే, వారి పార్టీ అధికారంలో ఉండటంతో విచారణ జోలికి పోలేదు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రావడం, అక్రమాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు అందడంతో అక్రమాల డొంక కదిలింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిత్లీ తుఫానులో నష్టపోయిన కొబ్బరి, జీడి రైతులకు అదనపు పరిహారాన్ని ప్రకటించిన నేపథ్యంలో అక్రమార్కులు మరిన్ని తప్పులు చేస్తున్నారు. భూముల్లేకపోయినప్పటికీ పరిహారం పొందిన వారికి మ్యుటేషన్లు చేయించి, పట్టాదారు పాసు పస్తకాలను తయారు చేయించారు. కంచిలి, కవిటి మండలాల్లో ఎక్కువగా ఈ రకమైన అక్రమాలు జరిగాయి. వాటిపై కూడా అధికారులు దృష్టి సారించడంతో ఇప్పుడేకంగా పాసు పుస్తకాలు, వన్‌బీలను ట్యాంపరింగ్ చేస్తున్నారు. కవిటి, జగతి, బొరివంక తదితర గ్రామాల్లో ఇలా ఇప్పటికే అధికారులను మభ్యపెట్టారు. కొన్ని అక్రమాలివిగో.... -కవిటి రెవెన్యూ ప్రగడపుట్టుగకు చెందిన బెందాళం సంహిత పేరిట రూ.1,03,500ల పరిహారం నమోదైంది. 435/4 సర్వే నెంబరులో 3.93 ఎకరాల భూమి ఉన్నట్టు జాబితాలో నమోదు చేశారు. వాస్తవానికి రెవెన్యూ రికార్డులలో ఈ భూమి యజమాని బీవీవీ ప్రసాదరావుగా ఉంది. అయితే ఇతనికి వేరేగా పరిహారం చెల్లించేందుకు వీలుగా జాబితాలో నమోదైంది. వాస్తవానికి ఈమె పేరిట రికార్డులలో భూములు లేవు. -కవిటి రెవెన్యూలో డొంకపుట్టుగకు చెందిన మరో ఆసామీ డొంక వల్లభరావు. ఇతనికి తిత్లీ తుఫాన్‌కు సంబంధించి కొబ్బరి నష్టపరిహారం రూ.1,56,000 అందించేందుకు జాబితాలో పేర్కొన్నారు. సర్వే నెంబరు 137/3లో 4.35 ఎకరాల భూమి ఇతని పేరిట ఉన్నట్టుగా పరిహారాల జాబితాలో ఉంది. కానీ వాస్తవానికి ఈ నెంబరులో 0.34 సెంట్లు రికార్డులలో ఉంది. -కవిటి రెవెన్యూలో ఎర్రగోవిందపుట్టుగలో నివసిస్తున్న ఈపరి రమణమూర్తికి తిత్లీ తుఫాన్ నష్టపరిహారాలకు సంబంధించి 91–2 సర్వే నెంబరులో 4.86 ఎకరాల భూమి నష్టపోయిందని జాబితాలో ప్రకటించారు. అయితే ఈ సర్వే నెంబరులో ఇతనికి రెవెన్యూ రికార్డుల ప్రకారం 1.36 ఎకరాలు మాత్రమే ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఇతను కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మంచి స్నేహ సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇలా చెప్పుకుని పోతే తిత్లీ పరిహారం పొందిన వేలాది మంది అనర్హులు ఉన్నారు. వాస్తవానికైతే, 52,164మంది కొబ్బరి రైతులు, 78,108మంది జీడి రైతులు తిత్లీ బీభత్సానికి నష్టపోయినట్టుగా పరిహారం జాబితాల్లో చూపించారు. ఎన్నికలకు ముందు దాదాపు రూ.297 కోట్ల వరకు పరిహారం కింద అందించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన అనర్హులకు ఎన్ని కోట్లు వెళ్లాయో అక్రమార్కులకే తెలియాలి. భూముల్లేని టీడీపీ సానుభూతిపరులకు భూములున్నట్టుగా చూపించి, తక్కువ భూమి ఉన్న టీడీపీ శ్రేణులకు ఎక్కువ భూమి ఉన్నట్టుగా నమోదు చేసి, పల్లం భూమిని మెట్ట భూమిగా నమోదు చేసి, పంచాయతీకి చెందని వ్యక్తులను స్థానికంగా చూపించి అప్పట్లో పరిహారం జాబితాలు తయారు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉన్న కొంతమంది వాస్తవంగా నష్టపోయినప్పటికీ పరిహారం జాబితాలో వారి పేర్లను ఎక్కించలేదు. కొందరి పేర్లు జాబితాల్లో నష్టపోయినట్టుగా చూపించి కూడా పరిహారం ఇవ్వలేదు. పరిహారం వచ్చేసరికి వారి పేర్లు గల్లంతయ్యాయి. విచారణతో అప్రమత్తం.. ప్రస్తుతం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్రలోను, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తిత్లీ తుఫాను బాధితులకు అదనపు సాయం అందించనుండటంతో ఇప్పటి వరకు సాయం పొందిన లబ్ధిదారుల జాబితాను మరోసారి పున:పరిశీలించాల్సిందిగా అధికారులకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ జాబితాల్లో నష్టపోయి లక్షలాది రూపాయలు పొందినట్లు పేర్కొన్న వారి పేర్లు, వారి భూ వివరాలు, నష్టపోయిన చెట్ల సంఖ్యను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి భూమి ఉన్న యజమానితోపాటు బ్యాంకు అకౌంట్లు కల్గిన వారి కుటుంబసభ్యులందరి పేరున సైతం లక్షలాది రూపాయలు నష్టపరిహారాన్ని పొందటం వెలుగు చూసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి, కవిటి మండలాల్లో ఈ పరిస్థితులు చాలా గ్రామాల్లో బయటపడ్డాయి. మండల కేంద్రం కంచిలి రెవెన్యూ పరిధిలో కొబ్బరి తోటలే లేనప్పటికీ కొబ్బరి చెట్లు పడిపోయినట్లు పెద్ద ఎత్తున పరిహారం పొందటం విశేషం. మకరాంపురం గ్రామంలో భూస్వామిగా పేరొందిన నేత బినామీ పేర్లతో ఏకంగా రూ.80 లక్షలు వరకు పరిహారాన్ని పొందినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జాడుపూడి పంచాయతీ పరిధిలో ఏకంగా 110 మంది అనర్హులు తప్పుడు భూ వివరాలతో నష్టపరిహారం పొందినట్లు చెబుతున్నారు. కొక్కిలిపుట్టుగ రెవెన్యూ పరిధిలో ఎటువంటి భూములేని వారు సైతం ఈ సర్వే నంబర్లు వేసుకొని, ఈ గ్రామంలో భూములున్నట్లు పెద్ద ఎత్తున కొబ్బరికి సంబంధించిన నష్ట పరిహారం పొందారు. ఇవన్నీ బయటపడకుండా ఉండేందుకు మ్యుటేషన్ల ద్వారా పట్టాదారులు పాసు పుస్తకాలు తయారు చేయించుకోగా, మరికొందరు ఏకంగా పట్టాదారు పాసు పుస్తకాలనే ట్యాంపరింగ్ చేస్తున్నారు. భూములున్న వారి పాసు పుస్తకాలపై ఫొటోలు, పేర్లు మార్చి జెరాక్స్ తీసి, వాటిని విచారణ బృందాలకు చూపిస్తున్నారు. వీటిని చూసి విచారణ బృందాలు ఓకే అని నిర్ధారించేస్తున్నట్టుగా సమాచారం. ఒరిజనల్ పాసు పుస్తకాలు అడగకుండా, వాటిని పరిశీలించకుండా జెరాక్స్ కాగితాలను చూసి విచారణ మమ అన్పించేస్తున్నారు. విశేషమేమిటంటే పట్టాదారు పుస్తకాల్లో ఉన్న ఫొటోపై అధికారుల సంతకం, స్టాంప్ ఉంటుంది. ట్యాంపరింగ్‌తో సృష్టిస్తున్న జెరాక్స్ పత్రాలతో ఆ సంతకం గాని, స్టాంప్ గాని ఉండకపోవడం గమనార్హం. ఇదంతా ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి ప్లాన్ ప్రకారం జరుగుతున్నది. ఇలాగే విచారణ జరిగితే అక్రమాలు బయటపడే అవకాశం ఉండదు. పకడ్బందీగా తనిఖీలు.. గతంలో ప్రయోజనం పొందిన లబ్ధిదారుల జాబితాను పకడ్బందీగా తనిఖీ చేస్తున్నాం. 1బి రికార్డు లేదా వెబ్‌ల్యాండ్ రికార్డు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదాని జిరాక్సు ప్రతిని తీసుకుని విచారణలో తనిఖీ చేస్తున్నాం. ఈ జిరాక్సు కాపీలో ఉన్న వివరాలను రెవెన్యూ రికార్డులలో ఉన్న వాటితో సరిపోల్చుతాం. ఈ విచారణ నివేదికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అవి వచ్చిన తరువాత వీఆర్ఓలతో మరో విడత తనిఖీలు చేయించి పకడ్బందీ జాబితాను రూపొందిస్తాం. ఎటువంటి అవకతవకలకు తావులేదు. – వి.విజయకుమార్, తహసీల్దార్, కవిటి -
తిత్లీ పరిహారం పెంపు..
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): తిత్లీ.. ఈ మాట వింటేనే ఉద్దానం ఉలిక్కిపడుతుంది. రాకాసి గాలుల బీభత్సానికి పచ్చటి ఉద్దానం రూపురేఖలే మారిపోయాయి. కొబ్బరి, జీడి రైతుల జీవితకాలపు కష్టాన్ని క్షణాల్లో ధ్వంసం చేసే సింది. ఇంతటి కష్టం తర్వాత ఓదార్పులు మొదలయ్యాయి. అనంతరం పరిహారం చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ బాధితులకు అప్పటి ప్రభుత్వం ఇంకా పెద్ద షాక్ ఇచ్చింది. లబ్ధిదారుల జాబితాల్లో అనర్హుల పేర్లు చూసి తిత్లీ బాధితులకు నోట మాట రాలేదు. ఇచ్చిన పరిహారమే తక్కువ అనుకుంటే అనర్హులను చేర్చి అప్పటి చంద్రబాబు సర్కారు మరింత మోసం చేసిందని బాహాటంగానే విమర్శించారు. ఆ సందర్భంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిహారం పెంపుపై హామీ ఇచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1500 పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించింది. అలాగే జీడి పంటకు హెక్టార్‌కి రూ.30వేలు పరిహారం ఇచ్చేందుకు జీఓ కూడా విడుదల చేసింది. ఈ జీవో నష్టపోయిన రైతులకు వర్తింపచేయకుండా కేవలం పసుపు చొక్కాలకే పరిమితం చేసిన సంగతి అందరికి తెలిసినదే. పూర్తిగా నష్టపోయిన రైతులకు ఈ పరిహారం సరిపోదని కనీసం ఒక్కో కొబ్బరి చెట్టుకి కనీసం రూ.3వేలు చెల్లించాలని, జీడి తోట హెక్టార్‌కి రూ.50వేలు ఇవ్వాలని అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆ డిమాండ్‌ను ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదించారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం జీఓ నంబర్ 11ని విడుదల చేసి ఒక్కో కొబ్బరి చెట్టుకి రూ.3వేలుగా, జీడి పంట హెక్టార్‌కి రూ.50వేలుగా నిర్ధారించారు. దీంతో కొబ్బరి, జీడి రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. పెంచిన మొత్తాన్ని పార్టీలకు అతీతంగా నష్టపోయిన రైతులందరినీ అర్హులుగా గుర్తించి ఇవ్వాలన్నదే సీఎం లక్ష్యమని స్థానిక నేతలు చెబుతున్నారు. పరిహారం పెంపు గొప్ప విషయం.. ఉద్దానం రైతుల్ని అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాను పరిహారాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. ఈ పెం పు జీఓ జారీ వల్ల బాధిత కొబ్బరి, జీడి రైతులకు మరికొంత ఉపశమనం లబిస్తుంది. – వజ్జ త్యాగరాజు, రైతు, మకరాంపురం, కంచిలి మండలం సంతోషం.. పరిహారం రూ.1500 నుం చి రూ.3వేలు, హెక్టారు జీడి మామిడికి రూ.30వేలకు బదులు రూ.50వేలు ఇవ్వడం సంతోషకరం. ముఖ్యమంగా ఎలాంటి ఆస్కారం లేక వీధిన పడిన వారు అనేక మంది పరిహారానికి నోచుకోకుండా పోయారు. అలాంటి అభాగ్యులకు సాయం అందించడం సంతోషకరం. – రాపాక చిన్నారావు, పలాస రెట్టించిన పరిహారం ఇవ్వడం సంతోషం.. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి నచ్చినట్లు వ్యవహరించారు. నాయకులు పెద్ద ఎత్తున సొమ్ములను స్వాహా చేసుకున్నారు. ఒక్కో తెలుగుదేశం నాయకుడు కొబ్బరి చెట్లు లేకపోయినా రూ.లక్షల్లో పరిహారం అందుకున్నారు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఇలా పరిహారం ప్రకటనకు జీఓ విడుదల చేయడం సంతోషకరం. – బడగల సుజాత, పలాస–కాశీబుగ్గ పాదయాత్రలో విన్నవించుకున్నాం.. జగన్ పాదయాత్రలో వచ్చినపుడు తిత్లీలో పడిన బాధలను, ఇబ్బందులను, కోల్పోయిన ఆస్తుల వివరాలు వెల్లడించాము. ఆయన స్పందించి ఆదుకుంటామన్నారు. అన్నదే తడువుగా ఏడాది తిరగక ముందే మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు రావడం సం తోషకరం. ఉద్దాన ప్రాంతంలో ఉన్న మేమంతా గర్వపడుతున్నాం. – జినగ లోకేశ్వరి, తిత్లీ బాధితురాలు, జినగలూరు, పలాస మండలం మేలు మరువలేం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల్లోనే తిత్లీ తుఫానుకు నష్టపోయిన రైతుల గురించి కీలక నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. ఇప్పటికే చాలా మంది రైతులకు నష్ట పరిహారం అందలేదు. కొబ్బరి చెట్టుకు రూ.1500లు, జీడి హెక్టారుకు రూ.2500 పెంచి జీఓ విడుదల చేసిన సీఎం మాట నిలబెట్టుకున్న నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. గతంలో చాలా మంది అనర్హులు లబ్ధి పొందారు. ప్రస్తుతం అధికారులు పారదర్శకంగా సర్వే చేపట్టి అర్హులకు న్యాయం చేయాలి. – మేరుగు తిరుపతి రెడ్డి, కొబ్బరి రైతు, బారువ -
తిత్లీ తుపాను బాధితుల సహాయం రెట్టింపు
-
తిత్లీ తుపాను బాధితులకు ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి : తిత్లీ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 30న పలాసలో ఇచ్చిన హామీకి కార్యరూపం ఇస్తూ పరిహారాన్ని భారీగా పెంచారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నష్టం వాటిల్లిన కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచింది. నష్టం వాటిల్లిన జీడిమామిడి చెట్లకు హెక్టారుకు ఇచ్చే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. తాజాగా పెంచిన పరిహారాన్ని అందించడానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. లక్షలాది కొబ్బరి చెట్లు, వేలాది హెక్టార్లలో జీడిమామిడి తోటలు నేల కూలాయి. ఏళ్లుగా పెంచుకున్న తోటలు నాశనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం తిత్లీ తుపాను సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏ మూలకూ సరిపోని విధంగా నేలకూలిన కొబ్బరి చెట్టుకు రూ.1500, పూర్తిగా నష్టం వాటిల్లిన జీడిమామిడి తోటకు ఒక హెక్టారుకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీడీపీ నేతల జోక్యం వల్ల లబ్ధిదారుల జాబితాలో తోటలు నష్టపోయిన రైతుల పేర్లు గల్లంతయ్యాయి. లబ్ధిదారుల జాబితాలో సింహభాగం టీడీపీ నేతలు, కార్యకర్తల పేర్లే కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు విన్నవించుకున్నారు. అధికారంలోకి రాగానే పరిహారం పెంచుతామని, అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని అప్పట్లో వైఎస్ జగన్ పలాస సభలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిత్లీ తుపాను బాధిత రైతులకు పరిహారాన్ని పెంచుతూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
తిత్లీ బాధితులకిచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్
-
‘తిత్లీ’ బాధితులను ఆదుకుంటాం
సాక్షి, అమరావతి: తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. గత ఏడాది సంభవించిన తిత్లీ తుఫాన్ ధాటికి ఉత్తరాంధ్ర జిల్లాలు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై హోంమంత్రి సుచరిత గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. తీత్లీ తుఫాన్ వల్ల భారీ నష్టం జరిగిందని, ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాకు భారీగా నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు. జిల్లాలోని 31 మండలాల్లో భారీ నష్టం సంభవించిందని, 48వేలకుపైగా గృహాలు దెబ్బతిన్నాయని తెలిపారు. తిత్లీ తుఫాన్ బాధితుల పరిహారానికి బడ్జెట్లో కేటాయింపులు చేశామని తెలిపారు. తుఫాన్‌తో దెబ్బతిన్న 18 ఇళ్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటికే తిత్లీ తుఫాన్ బాధితులకు అందజేసిన సాయం వివరాలను తెలిపారు. పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు తిత్లీ తుఫాన్ అంశంపై సభలో మాట్లాడారు. తిత్లీ తుఫాన్ ధాటికి వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయని తెలిపారు. దీంతో ఇళ్లు కోల్పోయి ఎంతోమంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తిత్లీ తుఫాన్ సంభవించిన అనంతరం నాలుగైదు రోజులైనా వాటర్ ట్యాంక్‌లు బాధిత గ్రామాలకు రాలేదని, ఏడు రోజులైనా జనరేటర్లు ప్రభుత్వ యంత్రాంగం పంపించలేదని తెలిపారు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉండగా.. టీడీపీ నేతలు మాత్రం తాము తిత్లీ బాధితులను ఆదుకున్నట్టు విస్తృత ప్రచారం చేసుకున్నారని అప్పలరాజు మండిపడ్డారు. పరిహారం కావాలని అడిగిన బాధితులపై అప్పటి సీఎం చంద్రబాబు కేసులు పెట్టించారని తెలిపారు. తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు పర్యటించి.. సహాయక చర్యలను పర్యవేక్షించారని చెప్పారు. తిత్లీ తుఫాన్ బాధితులను పూర్తిగా ఆదుకోవాలని అప్పలరాజు ప్రభుత్వాన్ని కోరారు. -
గూడు చెదిరింది.. గోడు మిగిలింది
సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన తిత్లీ తుపాను ధాటికి నియోజకవర్గం అతలాకుతలమైంది. వందలాది మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయిలుగా మారారు. ఈ నేపథ్యంలో వారిని పెద్ద మనసుతో ఆదుకొని, అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వం వివక్షత చూపింది. అధికార పార్టీ నాయకులు చెప్పినదే వేదంగా బాధితుల జాబితాను ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం వాటి ఆధారంగా ఇళ్ల కేటాయింపులు చేసింది. ఇందులో ప్రతిపక్ష పార్టీకి చెందిన బాధితుల పేర్లు లేవు సరికదా.. అధికార పార్టీ కరుణించక పోవడంతో నిరాశ్రయులుగా మారిన పేదలను కూడా విస్మరించారు. ఇదిలా ఉండగా... తుపాను అనంతరం సంతబొమ్మాళి మండలానికి వచ్చిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కె.అచ్చెన్నాయుడు బాధితులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ నాయకులు కొన్ని గ్రామాలకు అధికారులను తీసుకు వెళ్లి, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు కేటాయిస్తామని నమ్మ బలికారు. దీంతో నౌపడ, సీతానగరం, మేఘవరం, సూరాడవానిపేట తదితర గ్రామాల్లో పరదాలు వేసుకుని, తల దాచుకుంటున్న ఇళ్లను కూడా కూల్చివేసి నిర్మాణాలను చేపట్టారు. అయితే... నిర్మాణాలు ప్రారంభించి నెలలు కావస్తున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి మరీ పనులు చేపట్టామని, ఇలా అర్ధాంతరంగా వదలేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికార పార్టీ నాయకులు, హౌసింగ్ అధికారులను అడిగినా అదిగో.. ఇదిగో.. అంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. దీంతో చాలామంది బాధితులు ఇప్పటికీ తుపాన్ షెల్టర్, అద్దె ఇళ్లలో, పరాయి పంచన తల దాచుకుంటున్నారు. తమను రోడ్డు పాటు చేసిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామంటూ వారంతా హెచ్చరిస్తున్నారు. కాగా అధికారుల విడుదల చేసిన, వాస్తవ బాధితుల సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. నియోజకవర్గంలో ఇళ్లు కోల్పోయిన తిత్లీ బాధితులు మండలం అధికారులు గుర్తించిన ఇళ్లు సంతబొమ్మాళి 1396 నందిగాం 684 టెక్కలి 40 కోటబొమ్మాళి 9 అద్దె ఇంటిలో ఉన్నాం తిత్లీ తుపాను వల్ల ఇళ్లు మొత్తం ధ్వంసమైంది. తల దాచుకునేందుకు నీడ లేకపోవడంతో ఐదు నెలలుగా అద్దె ఇంటిలో ఉంటున్నాం. ఇళ్ల నిర్మాణంలో భాగంగా పునాదులు వేసి నెలలు గడుస్తున్నా ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. – కర్రె ఈశ్వరమ్మ, తిత్లీ బాధితురాలు, నౌపడ వస్తాయనే చెబుతున్నారు తిత్లీ తుపాను ప్రభావంతో ఉన్న గూడును కోల్పోయాం. బిల్లులు వెంటనే ఇస్తామని చెప్పడంతో ఇంటి నిర్మాణం చేపట్టాం. పునాదులు వేసి నెలలు గడుస్తున్నా బిల్లులు రాలేదు. దీనికోసం అడిగితే వస్తాయనే కాలయాపన చేస్తున్నారు. – ఎల్.ప్రభావతి, బాధితురాలు, హెచ్.ఎన్.పేట -
పంటల బీమాకు జగన్ పూచీ!
అది 2018, అక్టోబర్ 11 రాత్రి.. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడింది. గంటల వ్యవధిలోనే వేలాది మంది రైతులు సర్వస్వాన్నీ కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుండపోత వర్షానికి వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా గార గ్రామానికి చెందిన బడగల నర్సింహమూర్తి ఒకరు. ఆయన తనకున్న రెండెకరాల్లో సాంబమసూరి వరిని సాగు చేస్తున్నాడు. పొట్ట దశలో ఉంది. మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న దశలో వచ్చిన ఈ తుపాను ఆయన్ను మరింత నిరుపేదగా మార్చింది. భారీ నష్టాల పాల్జేసింది. ఇలా ఎందరో.. మరెందరో.. రేయనక.. పగలనక.. కష్టమనక.. అప్పులనక.. ఒళ్లు హూనం చేసుకొని ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోవడంతో రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సాగు భారమై చాలామంది కాడి కింద పడేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఈ పరిస్థితుల్లో స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్ల తర్వాత భారతీయ పార్లమెంటు బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటిస్తే అది గాడిన పడడానికి 22 ఏళ్లు పట్టింది. 1972లో పంటల బీమా పథకం ప్రారంభమైతే ఇప్పటికీ ఆ సంఖ్య 3 కోట్లకు దాటకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనైతే ఈ సంఖ్య 16 లక్షలకు మించలేదు. దేశంలో ఈవేళ సుమారు 12 కోట్లకు పైగా రైతు కుటుంబాలు ఉన్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. బీమాకు ఎందుకింత ప్రాధాన్యత..? ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ గిట్టుబాటు లేక, ఆర్థిక ఇక్కట్లతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దశలో ఈ పథకానికి ప్రాధాన్యం వచ్చింది. రైతులకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన మంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. సాగు చేసిన పంటలకు అనుగుణంగా స్వల్ప మొత్తంలో ప్రీమియం చెల్లిస్తే విపత్తుల కారణంగా పంట నష్టపోయిన సందర్భాల్లో బీమా వర్తిస్తుంది. తిత్లీ, హుద్‌హుద్, ఫైలిన్ వంటి తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే అన్నదాతలకు పంటల బీమా పథకం ఉడతాభక్తిగా తోడ్పడుతుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకునే రైతులకు పంటల బీమాను అనివార్యం చేశారు. ఏ పంటకు రుణం తీసుకుంటున్నారో ఆ పంటకు బ్యాంకులే ప్రీమియంను మినహాయించి ప్రభుత్వం గుర్తించిన బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకోని రైతులు, వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులు సైతం స్వయంగా ఫసల్ బీమా పథకంలో చేరే అవకాశం ఉన్నా, చేరుతున్న వారి సంఖ్య పరిమితమే. కౌలు రైతులు వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖ జారీ చేసిన పంట సాగు ధ్రువపత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను అధికారులకు అందజేసి బీమా చెల్లించవచ్చు. అతివృష్టి, అనావృష్టితో పంటలకు తీవ్ర నష్టం జరిగితే నిబంధనల మేరకు బీమా చెల్లిస్తారు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను తదితర ప్రతికూల వాతావరణం వల్ల జరిగిన పంటనష్టాన్ని పంటకోత ప్రయోగాల యూనిట్ దిగుబడుల అంచనా ప్రకారం చెల్లిస్తారు. పంట కోత తరవాత పొలంలో ఉంచిన పంటకు 14 రోజుల వరకూ అకాల వర్షాలకు, తుపానువల్ల నష్టం వాటిల్లితే వ్యవసాయ క్షేత్రం నుంచి బీమా రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రధాన మంత్రి పంటల బీమా కింద రైతులు ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. అదే ఉద్యానపంటల రైతులతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లిస్తాయి. అయితే, ఈ పథకంపై రైతుల్లో సరిగ్గా అవగాహన లేకపోవడం, బీమా కంపెనీల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కారణంగా ఎక్కువమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. 2016 ఖరీఫ్‌లో రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఆర్.డబ్లు్య.బి.సి.ఐ.ఎస్. కింద 15.09 లక్షల మంది రైతులు మాత్రమే బీమా చేయించుకున్నారు. అంటే, రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నారనుకుంటే కనీసం నాలుగోవంతు కూడా పంటల బీమాను చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను చెల్లించకపోవడం వల్లే రైతులకు సకాలంలో బీమా పరిహారాన్ని చెల్లించలేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నవరత్నాలలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ప్రకటించారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం రైతులకు ఉచిత పంటల బీమా. పంటల బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదని వైఎస్ జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ వాటా కింద ప్రస్తుతం ఖరీఫ్‌లో చెల్లిస్తున్న 2 శాతం, రబీలో చెల్లించే 1.5 శాతం మొత్తాన్నీ రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుంది. బీమా బాధ్యతను తానే తీసుకొని రైతులకు మేలు చేస్తుంది. ఏదయినా విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ వచ్చేలా చేస్తుంది. రైతులను ఆదుకుంటుంది. అలా చేయడం వల్ల అన్నదాతలందరికీ ఆలంబన దొరుకుతుంది. గట్టి మేలు జరుగుతుంది. ఇటీవల ప్రకటించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని దేశ వ్యాప్తంగా ఎంతగా కీర్తిస్తున్నారో వైఎస్ జగన్ ప్రకటించిన ఈ ఉచిత బీమా పథకాన్ని రైతు ప్రముఖులు అంతగా కొనియాడుతున్నారు. – ఎ. అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
అందని పరిహారం..ఆగిన రైతు గుండె!
ప్రభుత్వం తీరుతో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. తిత్లీ తుపాను నష్టపరిహారం అందక రైతు గుండె బద్దలైంది. మందస మండలం అంబుగాం పంచాయతీ లింబుగాం గ్రామానికి చెందిన రైతు బదకల శ్రీనివాసరావు (33) వివిధ పంటలను సాగు చేస్తుండేవాడు. తిత్లీ తుపానుతో పది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే రూపాయి కూడా పరిహారం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం గుండె పోటుతో చనిపోయాడు. కుమార్తె పుట్టిన రోజునే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మందస: తిత్లీ తుపాను సమయంలో అనర్హులకు లక్షలాది రూపాయలను చెల్లించిన ప్రభుత్వం నిజంగా నష్టపోయిన వారిని మాత్రం విస్మరించింది. దీంతో అలాంటి వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అనారోగ్యంతో మంచం పడుతున్నారు. మందస మండలంలోని భేతాళపురంలో ఇప్పటికే ఒకరు చనిపోగా.. గురువారం ఓ రైతు గుండె ఆగిపోవడం చర్చనీయాంశవైంది. గత ఏడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో సంభవించిన తిత్లీ తుపానుతో లింబుగాం గ్రామానికి చెందిన రైతు బదకల శ్రీనివాసరావు (33)కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడు ఎకరాల్లో కొబ్బరి, మరో మూడు ఎకరాల్లో జీడి, మామిడి తోటలు, వరి పంట పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి శ్రీనివాసరావు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. సుమారు 10 ఎకరాల పంట నష్టం జరగడంతో పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం 5 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం మంజూరైనట్టు ఆన్లైన్లో చూపెడుతోంది. కొబ్బరి, జీడి, మామిడి పంటలకు మొత్తం రూ.3.87 లక్షలు మంజూరైనట్టు అధికారులు అతనికి తెలియజేశారు. అయితే ఆ డబ్బులు కూడా రైతు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. గ్రామానికి చెందిన చాలామందికి పరిహారం డబ్బులు వచ్చినప్పటికీ తమకు ఎందుకు రాలేదోనని భార్య గీతాంజలి వద్ద శ్రీనివాసరావు రోజూ బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు సీతయ్య, ఇళ్లమ్మలకు శ్రీనివాసరావు ఒక్కగానొక్క కుమారుడు కాగా, వారసత్వంగా వచ్చిన తోట ఫలసాయంతో కుటుంబాన్నిపోషిస్తున్నాడు. కొంతమంది వ్యాపారుల వద్ద కూడా శ్రీనివాసరావు కొంతమొత్తాన్ని అప్పుగా తెచ్చాడు. అయితే ఇటీవల వీరి నుంచి డబ్బులను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి రావడం, తిత్లీ తుపాను పరిహారం రూపాయి కూడా రాకపోవడంతో మనోవేనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం గుండె ఆగి శ్రీనివాసరావు చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కుమార్తె లాస్య (8), కుమారుడు లోహిత్ (6) ఉన్నారు. కుమార్తె పుట్టిన రోజునే తండ్రికన్నుమూత! కుమార్తె లాస్య 8వ పుట్టినరోజు గురువారమే. ఇదే రోజున తండ్రి మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. భార్య గీతాంజలిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సీదిరి పరామర్శ గుండెపోటుతో చనిపోయిన శ్రీనివాసరావు కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శించి ఓదార్చారు. మృతదేహంపై పూలదండను ఉంచినివాళులు అర్పించారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి డొక్కరి దానయ్య, పార్టీ నాయకులు బదకల జానకిరావు, మద్దిల బాలకృష్ణలు కూడా ఉన్నారు. యాదవకుల సంక్షేమ సంఘం సంతాపం పంట నష్టపరిహారం అందక మరణించిన శ్రీనివాసరావు కుటుంబాన్ని యాదవ కుల సంక్షేమ సంఘం నాయకులు రాపాక చిన్నారావు, మామిడి మాధవరావులు పరామర్శించి తీవ్ర సంతాపం తెలియజేశారు. తిత్లీ తుపాను ప్రభావం ఉద్దానంపై ఎలా ఉంటుందో ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు వివరించామని, అయినా వారిలో స్పందనలేదన్నారు. బాధితులకు నష్టపరిహారం అందకపోతే మరిన్ని ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
సాయం.. మాయం!
తిత్లీ ప్రభావిత ఉద్దానం ప్రాంతం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపానుతో గుండె చెదిరిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం ప్రజలను ఆదుకుని అండగా నిలవాల్సిన అధికార పార్టీ నేతలు ఈ విపత్తును కూడా సొమ్ము చేసుకొనే దుర్మార్గానికి తెర తీశారు. ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు దక్కాల్సిన నష్ట పరిహారాన్ని రాబందుల్లా తన్నుకుపోతున్నారు. ఏకంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి బంధువులతోపాటు టీడీపీ నేతలు, వారి బినామీల పేర్లను పరిహారం జాబితాలో పెద్ద ఎత్తున చేర్చారు. అర్హులైన వారికి మాత్రం మొండిచేయి చూపారు. అర్హుల పేర్లు గల్లంతు తిత్లీ తుపాను అక్టోబర్ 10న శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. కోనసీమను తలపించే పచ్చటి ఉద్దానం కకావికలమైంది. పంటలన్నీ నీట మునిగాయి. కొబ్బరి తోటలు నేలకొరిగాయి. చిన్నాచితకా బడ్డీ కొట్ల నుంచి నివాస గృహాల వరకూ అంతా ధ్వంసమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 4.72 లక్షల మంది నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించారు. ఇందులో నకిలీ పేర్లే ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన అధికా రులు దాదాపు 81,000 మందిని పరిహారం జాబితా నుంచి తొలగించారు. 3.91 లక్షల మంది మాత్రమే అసలైన బాధితులని తేల్చారు. అయితే అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీలు ఒత్తిడితో నిజమైన బాధితులను తొలగించి టీడీపీ సానుభూతిపరులను నష్టపరిహారం జాబితాలో చేర్చారు. లేని తోటలు కూలిపోయాయట! రెంటికోట పీహెచ్సీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, టీడీపీ మండల అధ్యక్షుడు తమ్మినాన గంగారాం అక్రమంగా నష్టపరిహారం పొందాడు. పలాస మండలం రాజగోపాలపురానికి చెందిన గంగారాం అధికారులకు భయపెట్టి తన ఖాతాలోకి సొమ్ము జమ చేసుకున్నాడు. పల్లపు ప్రాంతంలోని భూముల్లో వరి మాత్రమే పండేచోట తుపాను వల్ల కొబ్బరి, జీడి మామిడి చెట్లను కోల్పోయినట్లు రాయించుకోవడం గమనార్హం. రాజగోపాలపురం పరిసరాల్లో రెవెన్యూ రికార్డుల్లో లేని 68/7, 15/2 సర్వే నంబర్లలో తన తండ్రికి జీడి తోటలు ఉన్నట్లు చూపించి కాశీబుగ్గ విశాఖ గ్రామీణ బ్యాంకులో రూ.15,782 పరిహారం పొందాడు. తమ్మినాన గంగారం పేరుమీద ఎస్బీఐలో రూ.75,000, మరో ఖాతాలో గ్రామీణ బ్యాంకులో రూ.5,585 మేరకు పరిహారం ఇచ్చినట్లు నమోదైంది. ప్రభుత్వ భూమినీ వదల్లేదు... పలాస–మందస మండలాల మధ్య ఉన్న ప్రభుత్వ భూములను కూడా టీడీపీ నేతలు బినామీ పేర్లతో పరిహారం కోసం రాయించుకున్నారు. ఇక్కడ 1,100 ఎకరాల్లో మెండు జీడితోటలున్నాయి. ‘మెండితోట’గా పిలిచే ఈ ప్రాంతంలో బినామీ పేర్లతో టీడీపీ నేతలు సాగు చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో అక్రమంగా క్రయ విక్రయాలు సాగిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. తాజాగా ఇందులో 30 ఎకరాలను నష్టపరిహారం జాబితాలో టీడీపీ నేతలు రాయించుకున్నారు. కొబ్బరి చెట్ల లెక్కలు పెరిగాయి... తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లాలో వరి 2.30 లక్షల హెక్టార్లలో దెబ్బ తిన్నట్లు కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. అయితే చివరి అంచనాలు పూర్తయ్యేసరికి దీన్ని 1.59 లక్షల హెక్టార్లుగా నమోదు చేశారు. నిజంగానే నష్టపోయినా కావాలనే కొందరి పేర్లు తొలగించడంతో నష్టపోయిన వరి విస్తీర్ణాన్ని తగ్గించినట్లు భావిస్తున్నారు. ఇక అరటి, కొబ్బరి లాంటి ఉద్యాన పంటలు 43 వేల హెక్టార్లలో దెబ్బ తిన్నట్లు తొలుత పేర్కొనగా ఇప్పుడు దీన్ని 28 వేల హెక్టార్లకు కుదించారు. అయితే కొబ్బరి చెట్ల విషయంలో లెక్కలు పెరిగాయి. తొలుత 3.10 లక్షల కొబ్బరి చెట్లే నేల కూలినట్లు పేర్కొనగా ఇప్పుడు దీన్ని 4,54,303కు పెంచారు. చిచ్చు రేపిన స్వార్థం! ప్రకృతి ప్రకోపానికి తల్లడిల్లిన ఉద్దానం ప్రాంతానికి కష్టకాలంలో అండగా నిలవాల్సిన పాలకులు స్వార్థంతో అన్నదమ్ముల్లా జీవించే ప్రజల మధ్య చిచ్చు రగిలిస్తున్నారు. పరిహారం జాబితాలో పేర్లు లేనివారు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రం యథేచ్ఛగా పందేరం చేయడంపై ఆక్రోశిస్తున్నారు. కట్టుబాట్లకు విలువ ఇచ్చే ఉద్దానంలో అంతా ఒకేమాట, ఒకేబాటగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏకమవుతారు. అలాంటి చోట టీడీపీ నేతల చర్యలతో విబేధాలు తలెత్తుతున్నాయి. పరిహారం విషయంలో తమ పక్కనే ఉన్న పొలం రైతు పట్ల ఒకలా, తమ పట్ల మరోలా వ్యవహరిస్తుంటే తట్టుకోలేక అధికారులను నిలదీస్తున్నారు. కొందరికి అధికంగా పరిహారం ఇస్తున్నారని, మరి కొందరికి అసలు భూమే లేకున్నా జాబితాలో పేర్లు చేర్చడంపై ఘర్షణలకు దిగుతున్నారు. టీడీపీ నేతల బినామీ పేర్లతో పరిహారం పొందిన మెండుతోట ఇదిగో... ఇలా కాజేశారు! - వజ్రపుకొత్తూరులో మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్యకు ఐదు ఎకరాలుంటే 10 ఎకరాల్లో నష్టం వాటిల్లిందంటూ రికార్డుల్లో రాయించుకున్నారు. - గండుపల్లి పోలయ్య, బోటు లేకున్నా నష్టపోయినట్లు రూ.4 లక్షలు పరిహారం రాయించుకుని ఇప్పటికే రూ.లక్ష కాజేశాడు. - టీడీపీ నాయకులు కాశ మాధవరావు, తమ్మినాన రంగారావు, కంబాల దానేసు, పిరియా శివప్రసాద్, మరడ ధుర్యోధన బినామీ పేర్లతోనూ, బంధువుల పేర్లతోనూ పరిహారం కాజేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. - సంతబొమ్మాళిలో టీడీపీ నేత ఒకరు రొయ్యల చెరువులు లేకున్నా పరిహారం జాబితాలో పేరు నమోదు చేయించుకున్నాడు. - బహాడపల్లిలో సారా దుర్వాసులు, అతడి భార్య లక్ష్మికి అసలు భూమే లేకున్నా వారికి రూ.1.15 లక్షల చొప్పున నష్టపరిహారం దక్కింది. - బహాడపల్లికి చెందిన మట్ట నాగమణికి 75 సెంట్లు, మట్ట తులసీదాసుకు 4.50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వారి పేర్లను జాబితాలో చేర్చారు. నిజానికి వీరికి ఎలాంటి భూమి లేదు. ఇదే గ్రామంలో బొడ్డు ఉదయకుమార్, లక్ష్మీనారాయణ, శాంతిప్రియలకు భూములు లేకపోయినా జాబితాలో పేర్లు నమోదు చేశారు. - టెక్కలి మండలం పోలవరం గ్రామానికి సంబంధించి పరిహారం కోసం రూపొందించిన బాధితుల జాబితాలో అన్నెపు పున్నయ్య పేరు ఉంది. వాస్తవానికి అతడి పేరుతో 70 సెంట్ల భూమి మాత్రమే ఉన్నా పరిహారం జాబితాలో మాత్రం 3.04 ఎకరాలలో వరి పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. - పోలవరం గ్రామంలో బి.జయరామ్‌కు ఎకరం పొలం మాత్రమే ఉంది. కానీ పరిహారం జాబితాలో 3.89 ఎకరాల్లో వరి నష్టపోయినట్లు నమోదు చేశారు. - బి.ఆదినారాయణకు 50 సెంట్ల పొలం ఉంది. కానీ పరిహారం జాబితాలో అది 1.55 ఎకరాలకు పెరిగిపోయింది. - బి.గణపతిరావుకు పొలమే లేకున్నా లేదు. కానీ పరిహారం జాబితాలో అతని పేరుతో 1.09 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు నమోదు చేశారు. - బి.నీలకంఠం పేరున 70 సెంట్ల పొలం మాత్రమే ఉన్నా పరిహారం జాబితాలో ఏకంగా 2.35 ఎకరాల్లో వరి పొలం తిత్లీ తుపానుకు దెబ్బ తిన్నట్లు చూపించారు. - డి.హరిప్రసాద్‌కు 70 సెంట్ల భూమి ఉండగా 2.40 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రికార్డుల్లో నమోదైంది. - డి.లక్ష్మీకి అసలు భూమే లేదు. కానీ పరిహారం జాబితాలో ఆమె 3.89 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు నమోదు చేశారు. ఆత్మహత్యలే శరణ్యం.... తిత్లీ తుపాన్‌తో ఉద్దానం ప్రాంతం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ప్రజలు జీవనాధారం కోల్పోయారు. మళ్లీ పంట చేతికి రావాలంటే ఐదు నుంచి పదేళ్లు పడుతుంది. కూలిన చెట్లను తొలగించడానికే వేలాది రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదు. ఒక రైతు ఎన్ని ఎకరాలు నష్టపోయినా పరిహారం మాత్రం 5 ఎకరాలకే ఇస్తామంటున్నారు. ఇక మేం కూడా పత్తిరైతుల్లా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. –మామిడి మాధవరావు (ఉద్దానం రైతాంగ కమిటీ అధ్యక్షుడు) రెవెన్యూ రికార్డులు చూడరా? మందస గ్రామంలో 18 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. నిజానికి అక్కడ ఉన్నవి 14 వేల ఎకరాలే. తర్వాత ఈ విషయాన్ని గుర్తించామంటూ తగ్గిస్తున్నారు. ఇలా పెంచి తగ్గించడం వల్ల రైతుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఏ గ్రామంలో ఎవరికి ఎంత భూమి ఉందనేది రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. వాటిని పరిశీలించి జాబితాలు తయారు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. – డొక్కర దానయ్య (బహాడపల్లి) నచ్చినట్లు ఇస్తున్నారు... ఎకరా పంట నష్టం జరిగిన వారికి మూడెకరాలు కోల్పోయినట్లు పరిహారం ఇచ్చారు. మాకు ఎనిమిది ఎకరాలు దెబ్బతింటే ఐదెకరాలకే ఇస్తామంటున్నారు. ఇంతవరకూ అదికూడా ఇవ్వలేదు. ఇల్లు కూలిపోతే పరిహారం ఇవ్వ లేదు. ఇదేం అన్యాయమని అడిగితే మా గ్రామంలో ఉన్న భూమి కంటే జాబితాలో ఎక్కువగా నమోదైందని, అందువల్ల పరిహారాన్ని సర్దుబాటు చేస్తున్నామని చెబుతున్నారు. అన్ని చోట్లా ఇలాగే జరుగుతోంది. గుడ్డిభద్ర రైతులు దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు. –శేషగిరిరావు (లొహరబంద) ‘కింజరాపు’ అని ఉంటే చాలు..లక్షల్లో లబ్ధి.. తిత్లీ తుపాను బాధితుల జాబితాను ఏకపక్షంగా రూపొందించారు. జన్మభూమి కమిటీలు ఇచ్చిన పేర్లను జాబితాలో చేర్చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటిపేరే ఏకైక అర్హతగా జాబితాలు తయారయ్యాయి. కింజరాపు అని ఉంటే చాలు కళ్లు మూసుకుని వారికసలు భూమి ఉందా? లేదా? అని కూడా చూడకుండా పరిహారానికి అర్హులుగా నిర్ధారిం చేశారు. మంత్రికి స్వయానా వదిన అయిన మహిళ పేరును కూడా రికార్డుల్లో చేర్చారు. ఇలా చిన్నబమ్మిడి, హరిశ్చంద్రపురం, నిమ్మాడ గ్రామాల్లో కింజరాపు అని ఇంటిపేరు ఉన్న దాదాపు 80 మంది రూ.9.72 లక్షల దాకా పరిహారం పొందారు. కుటుంబమంతా రోడ్డున పడ్డాం.. తిత్లీ తుపాను మా ఇళ్లను నేల కూల్చడంతో నలుగురు పిల్లలతో సహా మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కర్రలకు బరకా కట్టి అందులోనే తలదాచుకుంటున్నాం. ఇంత వరకూ ఒక్కరైనా మా దగ్గరకు వచ్చి ఎలా బతుకుతున్నారని చూడలేదు. ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. -
గజ తుఫాన్ బాధితులకు ఆది పినిశెట్టి సాయం
దక్షిణ భారతాన్ని వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. ఇప్పటికీ తిత్లీ తుఫాన్ నుండి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తేరుకోకముందే గజ తుఫాన్ తమిళనాడును జలమయం చేసేసింది. బాదితులను ఆదుకునేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు విరాళాలను ప్రకటించారు. తాజాగా మరో యంగ్ హీరో ముందుకొచ్చాడు. హీరో ఆది పినిశెట్టి గజ తుఫాన్ బాధితులకు తన వంతు తాను సాయం అందించడానికి ముందుకొచ్చాడు. ఆది పినిశెట్టి తన టీమ్ తో కలిసి హెల్ప్ చేయడానికి కాస్త సమస్యగా ఉన్న కొన్ని ఏరియాలను గుర్తించి.. అక్కడికి వెళ్లి సుమారు 5 టన్నుల రిలీఫ్ మెటీరియల్.. ఫుడ్, మెడిసన్, బెడ్ షీట్స్, సోలార్ లైట్స్, దోమ తెరలు అంధించారు. 4 గ్రామాల్లో దాదాపు 520 కుటుంబాలకు, వారి వారి రేషన్ కార్డులని పరిశీలించి చేయూతనందించారు. అంతేకాకుండా...ఈ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని, వారిని ఆదుకోవాలని ఆది పినిశెట్టి కోరారు. -
తిత్లీ తుఫాన్: ఏపీకి కేంద్రం సాయం
సాక్షి, న్యూఢిల్లీ: తిత్లీ తుఫాన్‌తో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకొచ్చింది. తిత్లీ తుఫాన్‌తో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిత్లీ తుఫాన్ సాయం కింద ఏపీకి రూ.539.53 కోట్లు అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇక, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి రూ. 3050 కోట్ల అదనపు సాయాన్ని అందజేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ హైలెవల్ కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. అక్టోబర్ నెలలో సంభవించిన తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. జిల్లాలో తుఫాన్ తీవ్రమైన విధ్వంసాన్ని మిగిల్చింది. జిల్లాలోని అనేక చోట్ల తుఫాన్ ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పెద్దసంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తీత్లి బాధితులు చాలామంది ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. -
మీకో దండం.. మీ పరిహారానికో దండం!
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు రూరల్: వజ్రపుకొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉద్యానవన పంటలపై నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. తిత్లీ తుఫాన్ నష్టపరిహారం అందకపోవడంతో ఎమ్మెల్యే శివాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధిక సంఖ్యలో బాధితులు తరలివచ్చి తమ ఆవేదన వెల్లగక్కారు. ఎమ్మెల్యే సమక్షంలో తమ గోడు వినిపించుకుంటే కొంతైనా న్యాయం జరుగుతుందని ఆశగా వస్తే చివరికి నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా బాధితులు తమ బాధలు చెప్పడంతో ‘మీరు కేకలు వేస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ’ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొందరు బాధితులు అధికారులకు, ఎమ్మెల్యే అల్లుడు వెంకన్న చౌదరి(వీసీ)కి దరఖాస్తులు అందించడానికి ఎగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో వీసీ పక్కన ఉన్న ఎస్సై కె.వి.సురేష్‌ను పిలిచి బాధితులను బయటకు పంపించమని చెప్పడంతో పోలీ సులు వారిని బయటకునెట్టేశారు. దీంతో వృద్ధులు, మహిళలు స్పల్ప అస్వస్థతకు గురై కార్యాల యం బయటకు వచ్చేశారు. మీకో దండం.. మీరిస్తు న్న పరిహారానికో దండం అంటూ శాపనార్థాలు పెట్టారు. గోడు వినే వారే లేరా? బాధితుల గోడు వినని సమావేశం ఎందుకు నిర్వహించారో ఎమ్మెల్యే, అధికారులకే తెలియాలని సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దరఖాస్తులు తీసుకోకుండా, తమ బాధలు వినే వారే కరువయ్యారని పలువురు వాపోయారు. న్యాయం జరుగుతుందనే ఆశతో వస్తే ఎమ్మేల్యే అల్లుడు వెంకన్న చౌదరి పోలీసులను ఆదేశించి బయటకు నెట్టడం భావ్యంగా లేదని దేవునల్తాడ, కొత్తపేట, అమలపాడు, తోటూరు, కంబలరాయుడుపేట తదితర గ్రామాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం అందిస్తాం.. నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, పెరిగిన ఒత్తిడి వల్ల నమోదులో తప్పులు దొర్లాయన్నారు. ఇప్పటికే మండల కేంద్రానికి 29 వేలు దరఖాస్తులు రావడంతో వాటన్నింటినీ పరిశీలించడం సా ధ్యం కాదని, ప్రజలే వాస్తవాలు చెప్పి అధికారుల కు సహకరించాలని కోరారు. అధికారులు కూడా నిజమైన బాధితుల జాబితానే అందించాలని ఆదేశించారు. అనర్హులు ఉంటే వారి నుంచి పరిహారా న్ని రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఉద్యానవన శాఖ ఏడీ చిట్టిబాబు, ఎంపీపీ గొరకల వసంతరావు, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరపల్లి నీలవేణి, తహసీల్దార్ రమణయ్య, ఎంపీడీ ఓ తిరుమలరావు, ఉద్యానవన శాఖాధికారి సునీత తదితరులు పాల్గొన్నారు. -
ఛిద్రమైన దశాబ్దాల ఉద్దానం కల
తిత్లీ తుఫాను బీభత్సం ఒకేఒక్క రాత్రిలో ఉద్దానం ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసింది. ఐదారు దశాబ్దాల వారి కలలను ఛిద్రం చేసింది. 1,91,012 ఎకరాల తోటలు ధ్వంసమయ్యాయి. ఇందులో జీడితోటల శాతమే అధికం. రైతులు ధ్వంసమైన పంటల్ని తలచుకొని భవిష్యత్తుని ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు. మరో పదేళ్ళ పాటు ఏం తిని బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్దానంలో తిత్లీ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అలా జరగకపోతే శతాబ్దాల చరిత్ర కలిగిన ఉద్దానం రూపు రేఖలే మారిపోయే ప్రమాదం ఉంది. ఉద్దానం...ఇది ఒక ఊరు కాదు. ఉద్యమాల ఊపిరి. భారత చరిత్రనే మలుపుతిప్పిన పేరు ఇది. ఎండిన డొక్కలూ, ఎముకల గూళ్ళ లాంటి దేహాలతో దోపిడీపై తిరగబడ్డ ఉద్దానం ప్రాంత ప్రజల నెత్తుటి త్యాగాలు చరిత్ర మరువజాలనిది. నక్సల్బరీకి సమకాలీనంగానూ, నక్సల్బరీ కొనసాగింపుగానూ దోపిడీపె దండెత్తి నెత్తురు చిందించిన శ్రీకాకుళ రైతాంగ పోరాటాలన్నీ ఉద్దానం పచ్చనాకు సాక్షిగా జరిగినవే. తీరప్రాంతంలోని ప్రతి ఇసుకరేణువూ అవే పోరాట కథలను వినిపి స్తుంది. అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది. కానీ మొన్నటి తిత్లీ తుఫాను అక్కడి పేదల మదినిండిన ఉద్దానం జాడలను చెరిపేసింది. కనుచూపు మేరలో పచ్చటి జీడితోటలతో కళకళలాడే ఉద్దానమిప్పుడు ఎండినమో డులతో శ్మశానాన్ని తలపిస్తోంది. అందమైన అక్కుపల్లి, మెట్టూరు, గడూరు మామిడిపల్లి, రాజాం, మర్రిపాడు, బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి, రంగోయి, లాంటి ఎన్నో పల్లెలు తిత్లీ తుఫానుతో తీరని శోకాన్ని మూటగట్టుకుని ఊళ్ళకు ఊళ్ళే వల్లకాడుగా మారిపోయాయి. పచ్చని పొదలు పరచుకున్న ఉద్దానం తిత్లీ తుఫానుతో అతలాకు తలమైంది. మొత్తం 38 మండలాల్లో 50 వేల ఇళ్ళు నేలమట్టమ య్యాయి. 38 వేలకు పైగా పశువులు మరణించాయి. 2,500కు పైగా దుకాణాలు ధ్వంసమయ్యాయి. లక్షలాది ఎకరాల పంటలూ, తోటలూ పెనుతుఫాను తాకిడికి తుడిచిపెట్టుకుపోయాయి. ప్రకృతికే పచ్చతో రణం కట్టినట్టుండే ఉద్దానం అదే ప్రకృతి విలయతాండవంతో మరు భూమిగా మారింది. ఇప్పుడక్కడ మిగిలిందంతా çశ్మశాన నిశ్శబ్దమే. ఐదారు దశాబ్దాల పాటు రెక్కలుముక్కలు చేసుకుని పెంచుకున్న జీడి మామిడీ, పనస, మునగ, కొబ్బరి తోటలు పెనుతుఫాను తాకిడికి తుడి చిపెట్టుకుపోయాయి. చుక్కనీరు దొరకని చోట తమ చెమటనే రక్తంగా «ధారబోసి కాపాడుకున్న తోటలు సర్వనాశనం అయ్యాయి. ఒంటినిండా గుడై్డనా కట్టుకోవడం తెలియని అమాయక జన ఉద్దానమిప్పుడు ఆకలి దప్పులతో అల్లాడిపోయే రోజొచ్చింది. ఉద్దానంలో మూడు రకాల పంట భూములుంటాయి. మెట్టభూ ములు, గుడ్డి(ఇసుక నేలలు), పల్లపు భూములు. మెట్ట భూముల్లో పంటలు పూర్తిగా వర్షాధారమైనవే. ఇక్కడన్నీ ఇసుకనేలలే కాబట్టి జీడి తోటల పెంపకం చాలా ఎక్కువ. ఇది అక్కడి ప్రజలకు ప్రధానమైన వ్యాపార పంట. గ్రామంలోనే తోట ఉందా? తోటలోనే గ్రామం ఉందా అన్నది తేల్చుకోలేని విధంగా పల్లెలన్నీ పచ్చనాకు పందిళ్ళలా ఉంటాయి. ఈ తోటలు దట్టమైన అడవిని మరిపిస్తుంటాయి. ఒక చెట్టు మరుగైతే మనిషి అలికిడిని గుర్తించడం మహాకష్టం. అక్కడి నీటి ఎద్దడిని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కింద పెద్ద అండా లాంటిది పెట్టి అందులో నించోబెట్టి పిల్లలకు స్నానం చేయించేవారు. స్నానం చేసేటప్పుడు అండాలో పడిన నీటితో గిన్నెలు కడుక్కునేవారు. ఈlకరువు ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో పచ్చదనం నింపేందుకు ఆ ప్రాంత ప్రజలు పడ్డ కష్టం అనన్యసామాన్యమైనది. ఎడారిని తలపించే ఇసుక భూములు, ఉప్పునీటిమయమైన సము ద్రతీర పొలాలు. అక్కడి ఇసుకతిన్నెల్లాంటి భూముల్లో సాధారణ పంటలు పండే అవకాశమే లేదు. అందువల్లే అక్కడ జీడి, కొబ్బరి లాంటివి మాత్రమే సేద్యానుకూలంగా ఉంటాయి. అందులో కీలకం జీడిమామిడే. శ్రీకాకుళం ప్రాంతానికి జీడిపంట తొలిసారిగా 1950లో పరిచయం అయ్యింది. ఆ తరువాత 1970 నుంచి జీడితోటల పెంపకం ఊపందుకుంది. అయితే జీడి తోటల పెంపకం దక్షిణ అమెరికాలో ప్రారంభమైంది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు ద్వారా బ్రెజిల్ నుంచి ఈ పంటను భారత దేశానికి తీసుకువచ్చారు. కేరళలోని మలబారు తీర ప్రాంతంలో జీడిమామిడిని తొలిసారిగా సాగుచేశారు. అప్పటి నుంచి ఈ పంట భారతదేశంలోని తీరప్రాంతాలన్నింటికీ విస్తరించింది. 1960– 61లో భారత్‌లో 1,76,000 హెక్టార్లలో పంట సాగుచేయగా, 2006– 07లో 8,54,000 హెక్టార్లలో జీడిమామిడి సాగుచేశారు. కేవలం 40 ఏళ్ళలో సాగులోకి వచ్చిన భూమి 8 రెట్లు పెరిగింది. అదే తరహాలో శ్రీకాకుళం ఉద్దానంలో కూడా జీడిమామిడి సాగు విస్తృతంగా పెరిగింది. 1970 ప్రాంతంలో చాలా తక్కువ మంది రైతులు జీడిమామిడిని సాగుచేసేవారు. అయితే రైతులను దళారీలు, షావుకారులూ, ఊరి పెద్దలు ముప్పేట దోపిడీ చేసేవారు. తిండి దొరకని పరిస్థితుల్లో రైతులు ముందుగా అప్పులు తెచ్చుకునేవారు. ముందుగా అప్పు పేరుతో డబ్బులు ఇచ్చి జీడిపిక్కలను బస్తాల్లో నింపుకుని వెళ్ళేవారు. కొలత ల్లోనూ, తూకాల్లోనూ అంతులేని దోపిడీ ఉండేది. 1960 చివరి దశలో ప్రారంభమైన నక్సలైటు ఉద్యమం షావుకార్ల, మధ్య దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. నక్సలైటు ఉద్యమ చైతన్యంతో దోపిడీదారులను తరిమికొట్టగలిగారు. వారి చైతన్యానికి తగ్గట్టుగా వ్యవసాయపద్ధతు ల్లోనూ నైపుణ్యం పెరిగింది. జీడితోటల పెంపకంలో మెళకువలు నేర్చు కున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 1985 నాటికి 28,000 హెక్టా ర్లలో జీడిమామిడి సాగు అయితే 2001 కల్లా అది 60,000 హెక్టార్లకు పెరిగింది. ఈ రోజు అది లక్షలాది హెక్టార్లకు విస్తరించింది. అయితే తిత్లీ తుఫాను బీభత్సం ఒకేఒక్క రాత్రిలో ఉద్దానం ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసింది. ఐదారు దశాబ్దాల వారి కలలను ఛిద్రం చేసింది. 1,91,012 ఎకరాల తోటలు ధ్వంసమయ్యాయి. ఇందులో జీడితోటల శాతమే అధికం. 1,18,757 మంది రైతుల జీవి తాలు విధ్వంసానికి గురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం జీడితోటల నష్టానికి ఇస్తున్న పరిహారం హెక్టారుకు కేవలం 30,000 రూపాయలు. ఎకరాకు 12,000 రూపాయల్ని నష్టపరిహారంగా చంద్రబాబు ప్రభుత్వం దయతల్చి ఇస్తామని ప్రకటించింది. కొబ్బరి తోటలు, అరటి తోటలకు కూడా ఇదేరకమైన భిక్షాప్రాయమైన నష్టపరిహారాన్ని ఖరారు చేశారు. కొబ్బరి చెట్టుకు ఒక్కింటికి 1,500 రూపాయల నష్టపరిహారం ప్రకటిం చారు. ఒకవైపు రైతులకు ప్రకటించిన నష్ట పరిహారం ఏమాత్రం న్యాయ బద్ధంగా లేదు. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతంలో పోడు చేసుకుంటున్న ఆదివాసీల దగ్గర భూములకు పట్టాలుండవు. దీన్ని సాకుగా తీసుకుని ప్రభుత్వం వారి నష్టపరిహారానికి ఎగనామం పెట్టింది. ప్రభుత్వం పేద లకు ఇచ్చిన అసైన్డ్ భూములలోని పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు కేవలం కంటి తుడుపుగానే వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం అక్క ర్లేదు. ఇటీవల తిత్లీ ప్రభావిత గ్రామాలను చూసినప్పుడు అక్కడి రైతులు చెప్పిన మాటలు వింటుంటే వాస్తవ అంచనాలకు ప్రభుత్వాల ఆలో చనలు ఎంత దూరంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ఒక జీడి తోటలో మొక్కలు నాటిన తరువాత మొదటి ఫలసాయం అందడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం ధ్వంసమైన తోటల స్థాయి చేరడానికి కనీసం 12 సంత్సరాలకు పైగా పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మొక్కలు కొనడానికి కాదుగదా «ధ్వంసమైన చెట్లను తొల గించడానికి కూడా సరిపోదు. మొక్కలు నాటి ఐదేళ్లపాటు ప్రతి మొక్కనీ బతికించుకోవడానికి బొట్టుబొట్టుగా నీటి చుక్కలను పట్టుకొచ్చి ప్రాణప్ర దంగా పెంచడానికి కనీసం ఇద్దరు మనుషులు నిరంతరం కష్టపడాలి. దీనికి ప్రతి కూలీకి ఒక్కొక్కరికి నెలకు పదివేల రూపాయల చొప్పున లెక్కవేస్తే ఏడాదికి 2,40,000 రూపాయలు అవసరమవుతాయి. ఐదేళ్లకు 12 లక్షల రూపాయలు అవుతాయి. ఇంకా ఎరువులు, విత్తనాలు, పురు గుమందుల ఖర్చు అదనం. ఈ లెక్కన కనీసం ఒక ఎకరం జీడితోటలో ఐదేళ్లలో మొదటి ఫలసాయం అందడానికి కనీసం 15 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా 30 వేల రూపా యలిచ్చి మొసలి కన్నీరు కార్చింది. అయితే ప్రస్తుతం జీడితోటల యజమానులుగా ఉన్న రైతులు ఎవ్వరూ అంతటి ఆర్థిక స్థోమత కలిగిన వారు కాదు. అంతా ఒక ఎకరం నుంచి రెండెకరాల లోపున్న చిన్నసన్నకారు రైతులే. ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు అండమాన్ నికోబార్ దీవులకో, దుబాయ్‌కో, బర్మాకో వలసెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ ఇక్కడి జీడిపంటకీ, ఆ కుటుంబాలకీ ఆధారం ఉండదు. రైతులు «ధ్వంసమైన పంటల్ని తల చుకుని భవిష్యత్తుని ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు. మరో పదేళ్ళపాటు ఏం తిని బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతు న్నారు. తిత్లీ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిం చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన డిమాండ్ నూటికి నూరుపాళ్ళూ సరైనది. ప్రభుత్వం గనక ఆ బాధ్యత తీసుకోకపోతే ఉద్దానం రూపు రేఖలే మారిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం సాయం చేయకపోతే వాళ్ళు సొంత డబ్బుతో దాన్ని బాగుచేసుకోలేరు. బాగుచేసుకోకపోతే అనివార్యంగా తాము నమ్ము కున్న భూములన్నింటినీ తెగనమ్ముకోక తప్పని దయనీయ స్థితి. చిన్న సన్న కారు రైతుల కష్టంతో తడిసిన ఆ భూములన్నీ బడాభూస్వాముల, పెట్టు బడి దారుల చేతుల్లోకి పోవడానికి ఎంతో కాలం పట్టదు. ఉద్దానం పచ్చటి పంటపొలాలన్నీ రేపు కార్పొరేట్ల చేతుల్లోకి జారిపోయే ప్రమాదం ఉంది. అయితే జీడిపంట నాశనమవడంతో దానిపై ఆధా రపడిన జీడిపిక్కల పరిశ్రమల్లో రోజుకూలీలుగా పనిచేసే పలాసలోని 30,000 మందికి పైగా ప్రజలకు తిండికూడా దొరకని పరిస్థితి దాపురిం చనుంది. వ్యాపారంపై ఆధారపడి జీవిస్తోన్న మరో పాతిక వేల మంది భవిష్యత్తు అంధకారంగా మారింది. నిత్యజనసంచారంతో సజీవంగా కళకళలాడే ఉద్దానం పల్లెజనం వలసబాటపట్టి కాశీబుగ్గ, పలాస లాంటి పట్టణాలు జీవకళను కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు : మల్లెపల్లి లక్ష్మయ్య lmallepalli@gmail.com -
తిత్లీ బాధితులను ఆదుకుంటాం
శ్రీకాకుళం , వజ్రపుకొత్తూరు రూరల్/ టెక్కలి:తిత్లీ తుపానుతో నష్టపోయిన అందరినీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర హోం శాఖ సహా యమంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ అన్నారు. టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఆయన సోమవారం పర్యటించారు. వజ్రపుకొత్తూరు మండలం చినవంక, డోకులపాడు గ్రామాల్లో పర్యటించిన అయన తుపాను పాడైన కొబ్బరి తోటలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఇంతవరకు నష్టపరిహారం అందలేదని, పూర్తిగా పంటలు, ఇళ్లు నష్టపోయిన తమకు ఎవరూ ఆదుకోలేదని బాధితులు కేంద్రమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కేంద్ర మంత్రి కలిశారు. నష్టపరిహారాన్ని పెంచాలని, సాముహిక వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని, నష్టపోయిన ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందించాలని, వ్యవసాయకూలీ కుటుంబాలకు 5 సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేలు భృతి అందించాలని మత్య్సకారులకు తీర ప్రాం తంలో భూములకు పట్టాలు ఇప్పించాలని మండల వైఎస్సార్ సీపీ మహిళ కన్వీనర్ తామాడ సరస్వతి,జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరపల్లి నీలవేణి, అగ్ని కుల క్షత్రియ జిల్లా ఉపాధ్యక్షుడుయు. ఉదయ్‌కుమార్‌లు వినతిపత్రాలను అందజేశారు. డోకులపాడులో తుపానుతో దెబ్బతిన్న ఇళ్లను మంత్రి పరిశీలించారు. బాధితులు మడ్డు రాజు, మడ్డు యర్రమ్మలతో మాట్లాడి ఎంత పరిహారం అం దిందని అడిగారు. వారు తమకు రూ.10 వేలు మాత్రమే అందిందని బదులు ఇచ్చారు. అలాగే బత్సలవానిపేట గ్రామానికి చెందిన బత్సల దా లమ్మ తమ అవేదనను హిందీలో చెప్పుకుంది. నష్టం కలిగిన వివరాలను అధికారులకు అందిస్తే న్యాయం చేస్తామని మంత్రి హా మీ ఇచ్చారు. అనంతరం విలేకర్లతో కేం ద్రమంత్రి మాట్లాడుతూ నష్టపోయిన తీరును చూశానని, ఉద్దాన ప్రజలకు జరిగిన తీవ్ర నష్టం తనను బాధించిందన్నారు. నష్ట తీవ్రతను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులందరినీ ఆదుకుంటామన్నారు. శారదపురంలో రోడ్డుపైన అధిక సంఖ్యలో రైతులు ఉండటం తో వారితో మాట్లాడి పర్యటనను ముగిం చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాల్, ఎంఎల్సీ మాధ వ్, విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కణితి విశ్వనాథం, బీజేపీ పలాస నియోజకవర్గ ఇన్చార్జి కొర్రాయి బాలకృష్ణయాదవ్, ఇన్చార్జి కలెక్టర్ చక్రధర్‌బాబు ఉన్నారు. బాధితులను ఆదుకోండి: వైఎస్ఆర్సీపీ వినతి టెక్కలి: తుపానుతో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని కనీసం కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలని వైఎ స్సార్సీపీ నాయకులు బగాది హరి, పినకాన వైకుంఠరావు కేంద్ర సహాయ మంత్రి గంగారాం అహిర్‌ను కోరారు. అయోధ్యపురం జంక్షన్ వద్ద కేంద్ర సహాయ మంత్రికి వినతిపత్రం అందజేశారు. తుపానుతో రైతులు, సామాన్య ప్రజలు పూర్తిగా నష్టపోయారని.. వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్షపాతం చూపిం దని కేంద్రం మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని విన్నవించారు. -
వాళ్లను ఒత్తిడి చేయకండి..
అరసవల్లి: ‘ఇరవై మొక్కలు పోతే అరవై మొక్కలని రాయండి. ఒక ఎకరా పంట పోతే ఐదెకరాలుగా నష్టాల్లో రాసేయండని చాలా చోట్ల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇలా అయితే ఎలా? కొ న్ని చోట్ల చెప్పినట్లు నష్ట పరిహారాలివ్వకపోతే అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల వెంటపడుతున్నారు. ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. మీకూ తెలుసూ..(ఎమ్మెల్యే శివాజీ వైపు చూస్తూ) ఇంకా ఇక్కడ చెబితే బాగోదు ఇప్పుడు. తిత్లీ పరిహారాల పంపిణీ విషయంలో ప్రజాప్రతిని«ధులంతా సహకరించాలి. అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దు. అందరూ సహకరిస్తేనే బాధితులందరికీ న్యాయం చేయగలం’ అంటూ కలెక్టర్ కె.ధనంజయరెడ్డి స్పష్టంగా, సంచలనాత్మకంగా మాట్లాడారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికగా శనివారం ఆయన ప్రజా ప్రతినిధులపై ఉన్నది ఉన్నట్లు మాట్లాడేశారు. ఉపాధ్యాయుల డిప్యుటేషన్ల విషయంలో ప్రజాప్రతినిధులెవ్వరూ జోక్యం వద్దంటూ సభాముఖంగా గత జెడ్పీ సమావేశంలో స్పష్టం చేసిన కలెక్టర్ ధనంజయరెడ్డి, ఈసారి తిత్లీ తుఫాన్ పరిహారాల పంపిణీలోనూ అదే వైఖరి కొనసాగించారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరి గిన సర్వసభ్య సమావేశంలో ముందుగా తిత్లీ తు ఫాన్ పరిహారాల్లో అక్రమాలున్నాయంటూ ఆధారాలను నివేదిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వి శ్వాసరాయి కళావతి, కంబాల జోగులుతో పాటు పలువురు వైఎస్సార్సీపీ జెడ్పీటిసీలు, ఎంపీపీలు ధ్వజమెత్తారు. అనంతరం పలాస ఎమ్మెల్యే శివాజీ మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ నష్ట పరిహారాల లెక్కల్లో అధికారులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని, అక్రమాలకు తెగబడుతున్నారంటూ ధ్వజమెత్తారు. దీంతో కలెక్టర్ ధనంజయరెడ్డి ఎమ్మెల్యేకు ధీటుగా బదులిచ్చారు. ఇష్టానుసారంగా పరిహారాలను పంపిణీ చేసిన అధికారులపై కఠిన చర్యలతో పాటు రికవరీ అస్త్రాన్ని ప్రయోగిస్తానని కలెక్టర్ «హెచ్చరించారు. రికార్డు స్థాయిలో కేవలం 25 రోజుల్లోనే నష్ట పరిహారాలను లెక్కించి మొత్తం 3.72 లక్షల రికార్డులను నమోదు చేసి రూ.392 కోట్లు నష్ట పరిహారంగా చెక్కులను పంపిణీ చేశామని, అయితే అక్కడక్కడ పొరపాట్లు ఉన్నాయని, అందుకే మళ్లీ బాధితుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. దీంతో వేల సంఖ్య లో దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అర్హులను అనర్హులను గుర్తించి ఆరువేల రికార్డులు పెండింగ్‌లో ఉంచామని తెలిపారు. జిల్లాలో పశువుల శాలలు కూలిపోయినట్లు 43 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారని, కొన్ని చోట్ల పశువులు చనిపోయినట్లు రాయించారని తెలియజేశారు. అలాగే వ్యవసాయ పంట నష్టం విషయంలో కూడా 10827 నివేదికలను విచారించి ఆమోదించి అప్లోడ్ చేశామని వివరించారు. స్థానిక నాయకులు కూడా ఇలాంటి విషయాల్లో వాస్తవాలకు అనుగుణంగా బాధితుల నష్టాలను రిఫర్ చేయాలని సూచించారు. ‘సెంటు భూమి లేని వాళ్లకి, పశువులు లేని వారికి పరిహారాన్ని ఇచ్చేశారు. మా వాళ్ల్లకు ఎందు కు రాదు.’ అంటూ ప్రోత్సహించవద్దని హితవు పలికారు. ఎక్కడైనా అదనంగా పరిహారాన్ని ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని, అలాగే అదనంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. సర్వేపైనే మాటలన్నీ.. తిత్లీ నష్టం దారుణంగా ప్రభావం చూపిందని, అయితే నష్ట పరిహారాల చెల్లింపుల్లో పలు పొరపాట్లు చోటుచేసుకున్నాయని, దీనిపై అవసరమైతే మరోసారి సర్వే చేయించి, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. తన నియోజకవర్గంలోని సారవకోటలో సర్వే ఆలస్యం కావడంతో 2900 మంది బాధితుల వివరాలు ఆన్లైన్లో లేవని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నందిగాం మండలంలో కల్లాడలో కనీసం భూ మిలేని వారికి, అలాగే పశువుల శాలలు లేనివారికి కూడా ఇష్టానుసారంగా నష్టాలను లెక్కించి పరిహారాలను ఇచ్చేశారని జెడ్పీటీసీ కురమాన బాలకృష్ణ ఆధారాలను చూపిస్తూ ప్రశ్నించారు. పరిహారాల పేరిట అక్రమాలను చేశారని ఆరోపిస్తూ ఆధార పత్రాలను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఆయన వెంటే కంచిలి జెడ్పీటీసీ జామి జయ కూడా స్పందిస్తూ తమ పరిధిలో కూడా పరిహారాల పంపిణీలో బాధితులకు అన్యాయం జరిగిందని, సెంటు లేని వాడికి లక్ష వరకు పరిహారాలను వేసే శారని ఆధారాలను కలెక్టర్‌కు అందజేశారు. వంగర మండలంలో ఎంఎల్ఎస్ పాయింట్ ఎత్తివేయడంతో కూలీలతో డీలర్లకు ఇబ్బందులు ఉన్నాయని, ప్రభుత్వం పునరాలోచించాలని జెడ్పీటీసీ బొత్స వాసుదేవనాయుడు కోరారు. అలాగే బీసీ రుణాల విషయంలో పొరుగు రాష్ట్రాల నుంచి పశువులను తెప్పించి ఇచ్చే విధానంతో ఇబ్బందులున్నాయని వివరించారు. దీనిపై కలెక్టర్ స్పం దిస్తూ తమిళనాడు నుంచే పశువుల కొనుగోలు చేయాలనే నిబంధన ఉందని గుర్తుచేశారు. తిత్లీ నష్టాలను సరిగ్గా లెక్కించలేదని ఇచ్ఛాపు రం జెడ్పీటీసీ అంబటి లింగరాజు సున్నిత అంశాన్ని లేవనెత్తారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ..ఇలాంటి తప్పులను ప్రోత్సహించవద్దని, అ లాంటి ఘటనలపై రికవరీ చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. తిత్లీ నష్టాల్లో బాధితుల ఆధార్ కార్డులు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో సమస్యలు వస్తున్నాయని జెడ్పీటీసీ చంద్రమోహన్ అంశాన్ని లేవనెత్తారు. అలాగే వందలాది మంది రైతులు కొబ్బరి, జీడి తదితర పంటలు నష్టపోయారని, అయితే ఇందులో ఒక్క పంట పేరునే సిస్టమ్ అంగీకరించడంపై కూడా దృష్టి సారించాలని కోరారు. దీన్ని ప్రత్యేకంగా తీసుకుని న్యాయం చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. తన మండలంలో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయితే వీరికి నష్ట పరి హార చెక్కులు ఇచ్చినా, నగదు జమ కాలేదని కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ చిన్న చిన్న సర్దుబాట్లు చేయాలని, అందుకే పలు చెక్కులు పెండింగ్‌లో ఉంచామని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబా బు, జెడ్పీ సీఈఓ బి.నగేష్, డిప్యూటీ సీఈఓ ప్ర భావతి, ఏఓ హేమసుందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ బి.దేవవరప్రసాద్, డీఈలు చలపతిరావు, సాంబ శివరావు, గిరీశ్వరరావు, జిఎన్.ప్రసాద్, ఆర్అం డ్బీ ఎస్ఈ కాంతిమతి, ఈఈ అబ్దుల్ ఖాదిర్, ఎస్ఎస్ఎ పీఓ త్రినాథరావు, ఈఈ ఆర్.సుగుణాకరరావు, మత్స్యశాఖ జెడి కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
మధ్యలోనే మింగేస్తున్న రాజకీయనాయకులు, అధికారులు..
ప్రకృతి విపత్తులు జిల్లాకు కొత్త కాదు.. నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లింపు అంతకన్నా కొత్తకాదు! కానీ టీడీపీ ప్రభుత్వం టెక్నాలజీ పేరుతో ప్రకృతి విపత్తుల పరిహారం చెల్లింపులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించడమే ఇక్కడ కొత్త! రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ ఓ పదాన్ని తెరపైకి తీసుకొచ్చి తెరవెనుక మాత్రం బాధితుల పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు సౌకర్యంగా ఉండాల్సింది బదులు అదే పెద్ద సమస్యగా మారడమే ఇప్పుడొక విచిత్రం! దీని లక్ష్యం కేవలం ఏదొక సాకుతో పరిహారం ఎగవేయడమే! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో గత నెల 10వ తేదీన తిత్లీ తుపాను, తదనంతరం వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదుల వరదలతో దాదాపు 77,690 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. దీనివల్ల 2,07,786 మంది రైతులు నష్టపోయారు. వారికి సుమారు రూ.159.26 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే కొబ్బరి, జీడిమామిడి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు 28,083 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఇందుకుగాను 1,10,739 మంది రైతులకు రూ.263.55 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అలాగే 9,535 పశువులు, పౌల్ట్రీ కోళ్లు 1.50 లక్షలు చనిపోవడంతో పాటు 16 వేల పశువుల శాలలు, పౌల్ట్రీ షెడ్లు కూలిపోయాయి. ఇందుకుగాను 29,800 మంది రైతులకు పరిహారంగా రూ.34.49 కోట్లు చెల్లించాల్సి ఉంది. అన్ని రకాలు కలిపి 47,606 ఇళ్లు నష్టపోయిన బాధితులకు రూ.49.83 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఇదే తరహాలో మత్స్యశాఖకు సంబంధించి రూ. 8.36 కోట్లు, చేనేత జౌళి రంగానికి సంబంధించిన బాధితులకు రూ.9 లక్షలు, అలాగే పరిశ్రమలు దెబ్బతిన్నవారికి, ఇతరత్రా రంగాల్లో జరిగిన నష్టాలకు కలిపి మొత్తం దాదాపు 4.30 లక్షల మంది తిత్లీ బాధితులకు రూ.520 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంది. అయితే శనివారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తిత్లీ తుపాను బాధితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో అవకతవకలు, అక్రమాలు, అవినీతి, చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులంతా గళమెత్తారు. చెప్పిందొకటి... జరిగేదొకటి... తిత్లీ బాధితులకు నష్టపరిహారం మొత్తాలను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు ఈనెల 5వ తేదీన పలాసలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తన చిత్రంతో డమ్మీ చెక్‌లను సైతం పంపిణీ చేశారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా 25 రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ బాధిత రైతులకు మాత్రం ఇప్పటివరకూ ఊరట లభించలేదు. టెక్నాలజీతో తిత్లీ తుఫానును హ్యాండిల్ చేశామని నేతలు చెబుతున్నారు. కానీ అదే సాంకేతిక పరిజ్ఞానంతో బాధిత రైతులను బోల్తా కొట్టిస్తున్నారనడంలో సందేహం లేదు. తుపాను వల్ల ఎలాంటి నష్టం జరిగినా పరిహారం పక్కాగా అందించాల్సింది బదులుగా ఏదో ఒక్క పంటకే పరిహారం, కొంత విస్తీర్ణంగల భూమిలో పంటకే గణన... ఇలా సవాలక్ష కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చారు. దీంతో రైతులు పరిహారం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. ఆర్‌టీజీఎస్‌తోనే మాయాజాలం... ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తరచుగా వల్లిస్తున్న రియల్‌టైమ్ గవర్నన్స్ (ఆర్టీజీఎస్)తోనే పరిహారం మాయాజాలం నడుస్తోంది. వాస్తవానికి నష్టపరిహారం చెల్లింపులు గతంలో నేరుగా చెక్‌ల ద్వారా జరిగేవి. ఆ చెక్‌లను బాధితులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొనేవారు. ఈసారి మాత్రం మొత్తం వ్యవహారం అంతా ఆర్టీజీఎస్కు అప్పగించారు. అదొక ప్రైవేట్ ఏజెన్సీ మాత్రమే. తిత్లీ నష్టపరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రకారం ట్రెజరీ శాఖ ద్వారా నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ ఆ చెల్లింపుల మొత్తాన్ని ట్రెజరీ నుంచి బ్యాంకులకు చేరకుండా ఆర్టీజీఎస్కు అప్పగించారు. తర్వాత ఆర్టీజీఎస్ నుంచి బాధితుల ఖాతాల్లో మాత్రం రకరకాల కొత్త నిబంధనలు, కారణాలను చూపించి జమ చేయట్లేదు. వాస్తవానికి తుఫానుతో నష్టపోయిన పంటలకు, తోటలకు, ఇళ్లకు జియోట్యాగింగ్ చాలావరకూ జరగలేదు. నష్టాల గణన కూడా ఆదరాబాదరాగానే నిర్వహించారు. దీంతో ప్రభుత్వం విడుదల చేశామని చెబుతున్న రూ.520 కోట్ల పరిహారం సొమ్ములో కేవలం ఇప్పటివరకూ రూ.120 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగినట్లు అంచనా. మిగతా సొమ్ము అంతా ఆర్టీజీఎస్ ఖాతాలోనే ఉంది. దీనివల్ల ఆ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. తుఫాను బాధిత రైతులకు మాత్రం పరిహా రం అందలేదనే ఆవేదన మిగులుతోంది. -
తమ్ముళ్ల జేబుల్లోకి ‘తిత్లీ’ సొమ్ము!
నందిగాం మండలం దేవుపురం పంచాయతీ పరిధిలోని సంతోషపురం రెవెన్యూ పరిధిలో కింజరాపు లలితకుమారికి రెవెన్యూ ఖాతా నంబరు 384 ప్రకారం 2.64 ఎకరాల భూమి మాత్రమే ఉంది. అందులో ఎలాంటి చెట్లు కానీ, పంట కానీ లేదు. కానీ తిత్లీ తుపాను దెబ్బతో 4.95 ఎకరాలల్లో వరి పంట నష్టపోయినందుకు రూ.39,600, మరో మూడెకరాల్లో జీడిచెట్లు కూలిపోయినందుకు రూ.36,421 అలాగే మరో 2.5 ఎకరాలలో మామిడి చెట్లు పోయినందుకు రూ.30,351 చొప్పున నష్టపరిహారం చెల్లించేశారు. అంటే సుమారు రెండున్నర ఎకరాల భూమి అదీ ఎలాంటి పంటల్లేకున్నా తొమ్మిదిన్నర ఎకరాలుగా నమోదుచేసి రూ.లక్షకు పైగా ప్రజాధనం జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీరా ఆమె ఎవరో కాదు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడి భార్య కావడం గమనార్హం. కంచిలి మండలంలోని జాడుపూడి గ్రామంలో తిత్లీ తుపానుతో నష్టపోయిన సుమారు 50 మంది రైతులకు పైసా కూడా విదల్చకుండా సెంటు భూమి లేనివారిని సైతం బినామీలుగా పేర్లను నమోదుచేయించి రూ.లక్షల్లో నష్టపరిహారం నొక్కేసిన వ్యవహారం కూడా టీడీపీ నాయకులకే చెల్లింది. బసవ హలియాకు రూ.78 వేలు, బసవ దేవకికి రూ.1,18,500 అలాగే బుడ్డ పురుషోత్తంకు రూ.1.92 లక్షలు, గాలి దూదమ్మకు రూ.76 వేలు, జామి సావిత్రికి రూ.1.51 వేలు, జీరు గంగయ్య రూ.1.72 వేలు ఇలా... చాలామందికి భారీగా నష్టపరిహారం చెల్లింపు జరిగిపోయింది. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: తిత్లీ తుపానుతో అన్ని విధాలా నష్టపోయిన రైతులు, సామాన్యులు నేటికీ నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కానీ టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు బినామీలను సృష్టించి, లేదంటే తక్కువ భూమి ఉన్నా విస్తీర్ణం పెంచేసి ఖజానాకు చిల్లుపెడుతున్నారు. పరిహారం కైంకర్యం చేస్తే అక్రమార్కులెవ్వరైనా కఠిన చర్యలు తీసుకుంటానని పలాస వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించినా తమ్ముళ్లు మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నారు. తిత్లీ తుపాను జిల్లాను కకావికలం చేసి నలభై రోజులు దాటిపోయినా బాధితులు తమకు నేటికీ న్యాయం జరగలేదని వాపోతున్నారు. అసలైన బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని, అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు ఆందోళనలు చేపట్టింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకూ స్పందన కనిపించట్లేదు. తుపానుతో జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం, పరిహారం చెల్లింపుకోసం జాబితాల తయారీ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు జోక్యం చేసుకొని, అధికారులు, ప్రభుత్వ సిబ్బందిపై ఒత్తిళ్లు తీసుకొచ్చి తమ ఇష్టానుసారం నష్టపరిహారం నమోదు చేయించారు. పంట నష్టపోయిన భూవిస్తీర్ణం ఎక్కువగా చూపించడం, ఫలసాయం అధికంగా లెక్కలేయించడం తదితర విషయాల్లో ఎక్కడికక్కడ వారు చక్రం తిప్పారు. చివరకు సెంటు భూమి లేనివారికి సైతం నష్టపరిహారం జాబితాల్లో చోటు కల్పించారంటే పరిస్థితి ఊహించవచ్చు. ఇక బినామీల వ్యవహారం కూడా గుట్టుచప్పుడు గాకుండా టీడీపీ నాయకులు నడిపించారు. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరి జాతకం నెమ్మదిగా వెలుగుచూస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలామంది అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండదండలతో నష్టపరిహారం చాలావరకూ చేజిక్కించుకున్నారు. చెల్లింపులు జరిగిపోయాయ్... జిల్లాలో తిత్లీ తుపాను, వరద ప్రభావంతో వరి పంటకు జరిగిన నష్టంతో 2,13,478 మంది రైతులు నష్టపోయారు. కొబ్బరి, జీడిమామిడి తదితర ఉద్యానవన పంటలు నష్టపోయిన రైతులు 1,18,415 మంది ఉన్నారు. పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలు నష్టపోయినవారు 28,879 మంది ఉన్నారు. మత్స్యశాఖకు సంబంధించి వలలు, బోట్లు, ఇతర సామగ్రి నష్టపోయినవారు 4,715 మంది ఉన్నారు. ఇక ఇళ్లు విషయానికొస్తే పక్కాఇళ్లు, పూరిళ్లు, గుడిసెలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నవారు 44,697 మంది ఉన్నారు. పెట్టీ షాపులు నష్టపోయినవారు 2,512 మంది ఉన్నారు. ఇలా వివిధ అంశాల్లో జిల్లావ్యాప్తంగా తిత్లీ బాధితులు 4,30,925 మంది ఉన్నారు. వారిలో ఇప్పటివరకూ 3,45,949 మందికి నష్టపరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం గణాంకాలు చూపిస్తోంది. ఈ ప్రకారమే ఇంకా 84,976 మందికి ఈ పరిహారం అందలేదు. కానీ పరిహారం అందుకున్నవారిలో చాలామంది సెంటు భూమి లేని బినామీలు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఆన్లైన్’లో కనిపించని సమాచారం... తిత్లీ తుపాను వల్ల జరిగిన నష్టం, చెల్లించిన పరిహారం, లబ్ధిపొందిన బాధితుల పూర్తి వివరాలు ఆన్లైన్లో ఉంచుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారమే తొలి కొద్దిరోజులు మాత్రమే అమలుజరిగింది. అయితే ఎక్కడికక్కడ అవినీతి వెలుగుచూడటంతో ఆ జాబితాలు కీలకంగా మారాయి. గ్రామాల వారీగా ఇచ్చిన ఆ పరిహారం జాబితాలను డౌన్లోడ్ చేసి, అవినీతిని ప్రజలు ఎక్కడికక్కడ బట్టబయలు చేస్తున్నారు. మరోవైపు అక్రమాలపై జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో గ్రామస్థాయి జాబితాలు మాయమవడం గమనార్హం. -
చంద్రబాబు పబ్లిసిటీపై పవన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిత్లీ తుఫాన్ సహాయాన్ని కూడా ప్రచారం కోసం వాడుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా., కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్ రేంజ్లో ఉందని, టీడీపీ ప్రభుత్వ తీరును చూస్తే అతి ప్రచారం కొంప ముంచుతుందనే అబ్రహం లింకన్ కోట్ గుర్తుకు వస్తుందని ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో జనసేన నాయకులెవరు తన పేరిట కానీ పార్టీ పేరిట కానీ కార్తీక మాసం వనభోజనాలు జరపవద్దని విజ్ఞప్తి చేశారు. TDP Govt,help for Titli victims is peanuts,but publicity !! .. the size of an Everest!!! This reminds me of a quote of Abraham Lincoln :” What kills a skunk is the publicity it gives itself”. pic.twitter.com/PJ6HYwz8xk — Pawan Kalyan (@PawanKalyan) November 12, 2018 జనసేన నాయకులందరికీ విన్నపం: కార్తీక మాసం వనభోజనాలు మీరు కావాలంటే వ్యకిగతంగా జరుపుకోండి కానీ,న పేరు మీద కానీ,జనసేన పార్టీ పేరుమీద కానీ జరపద్దని నా మనవి. ఆడపడుచులకు, అక్కచెల్లెళ్లకు,తల్లులకు.. కార్తీకమాసం శుభాకాంక్షలు pic.twitter.com/W0jarXQdhF — Pawan Kalyan (@PawanKalyan) November 12, 2018 -
ఈ కన్నీరు తుడిచేవారెవరు?
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పచ్చదనానికి మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఏ పల్లెలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా పది మందికి అన్నం పెట్టిన రైతన్నలు నేడు ఆర్థిక సాయం కోసం చేతులు చాపాల్సిన దుస్థితి దాపురించింది. మూత్రపిండాల(కిడ్నీ) జబ్బులతో వేలాది కుటుంబాలు చితికిపోయాయి. ఈ దెబ్బకు ఉన్న ఆస్తులు, పొలాలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. పుండుపై కారం చల్లినట్టు తిత్లీ తుపాన్ బాధిత కుటుంబాలను మరింత కుంగదీసింది. ఉద్దానంలోని సోంపేట, కవిటి, కంచిలి, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం తదితర మండలాల్లో కిడ్నీ రోగుల దుస్థితిని ‘సాక్షి’ ప్రత్యక్షంగా పరిశీలించింది. గుండె తరుక్కుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఉద్దానం ప్రాంతంలో 40–45 ఏళ్ల వయసుకే వేలాది మంది మూత్రపిండాల జబ్బుల బారిన పడ్డారు. ఎప్పటికప్పుడు రక్తశుద్ధి(డయాలసిస్) చేయించుకుంటే తప్ప వారు బతికి బట్టకట్టలేని పరిస్థితి. ఉద్దానంలో 7 మండలాలు ఉండగా, సోంపేట, పలాసలో మాత్రమే డయాలసిస్ కేంద్రాలున్నాయి. చాలామంది బాధితులు వారానికి రెండుసార్లు, కొందరు మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది. సోంపేటలో రోజుకు 70 మందికి, పలాసలో 40 మందికి మాత్రమే డయాలసిస్ చేస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో చాలామంది బాధితులు వెయిటింగ్లో ఉన్నారు. లేదంటే విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లాలి. డయాలసిస్ కేంద్రాలకు వెళ్లాలంటే సహాయకుడితో కలిపి రూ.2,000 ఖర్చవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. కిడ్నీ వ్యాధుల వల్ల ఉద్దానంలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. తిత్లీ తుపాన్ పల్ల పంటలు, తోటలన్నీ నాశనమయ్యాయని, రూపాయి కూడా ఆదాయం లేదని, ఇక డయాలసిస్ ఎలా చేయించుకోవాలని కిడ్నీ బాధితులు బోరున విలపిస్తున్నారు. ఉద్దానంలో ఏ కిడ్నీ బాధితుడిని కదిలించినా ఒకటే ఆవేదన. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పెన్షన్ సరిపోవడం లేదని, తక్షణమే పెంచాలని కోరుతున్నారు. డయాలసిస్ కేంద్రాలకు వెళ్లడానికి బస్ పాసులు ఇవ్వాలని వేడుకుంటున్నారు. తిత్లీ తుపాన్ వల్ల దారుణంగా నష్టపోయామని, తమకు ప్రత్యేకంగా నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకరు మృతి చెందితేనే మరొకరికి డయాలసిస్ ఉద్దానంలోని సోంపేట, పలాసతోపాటు టెక్కలి, శ్రీకాకుళంలో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 13 రక్తశుద్ధి యంత్రాలు పనిచేస్తున్నాయి. ఉద్దానంలోని బాధితులంతా సోంపేట, పలాసకే వస్తారు. ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులెవరైనా మృతి చెందితేగానీ మరొకరికి అవకాశం రాదు. ఒక యంత్రం రోజుకు ఒక్కొక్కరికి 4 గంటల చొప్పున మూడు షిఫ్ట్‌లు మాత్రమే రక్తశుద్ధి చేయగలదు. గడిచిన ఏడాదిన్నరలో సోంపేట డయాలసిస్ కేంద్రం పరిధిలో 43 మంది, పలాస కేంద్రం పరిధిలో 15 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. శ్రీకాకుళం, టెక్కలి కేంద్రాలను కూడా కలుపుకుంటే 100 మందికి పైగా మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. డయాలసిస్ చేయడంలో జాప్యం జరిగితే కాళ్లు, చేతులు వాపు వస్తాయి. తీవ్ర ఆయాసం వస్తుంది. రక్తపోటు తీవ్రంగా పెరుగుతుంది. దానివల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా జాప్యం జరగడం వల్ల చాలామంది బాధితులు మృతి చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని డయాలసిస్ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో బాధితులు నానా కష్టాలు పడుతున్నారు. పెన్షన్ డబ్బులు చాలడం లేదు ‘‘నాది ఇచ్ఛాపురం దగ్గర కేఎస్ పురం. డయాలసిస్ కేంద్రానికి రావాలంటే 35 కిలోమీటర్లు. వారానికి రెండుసార్లు డయాలసిస్ చెయ్యాలి. వచ్చిన ప్రతిసారీ రూ.1,000 ఖర్చవుతోంది. ఇక్కడ ఇచ్చే మందులు చాలవు. మందులకే రూ.5,000 అవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.2,500 పెన్షను ఒక్క వారానికి కూడా సరిపోవడం లేదు’’ – లోకనాథం, కిడ్నీ బాధితుడు, కేఎస్ పురం మాకే ఎందుకు ఈ శాపం ‘‘మాకు ఇద్దరు పిల్లలు. నా భర్తకు కిడ్నీ జబ్బు వచ్చింది. మంచానికే పరిమితమయ్యాడు. చికిత్స కోసం డబ్బుల్లేక కొంత పొలం అమ్ముకున్నాం. వారానికి రెండుసార్లు డయాలసిస్ కేంద్రానికి వస్తున్నాం. మాకే దేవుడు ఎందుకు ఈ శాపం పెట్టాడో. సర్కారు సాయం చాలడం లేదు. భర్తకు కిడ్నీ జబ్బు రావడంతో మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది’’ – శోభ, కిడ్నీ బాధితుడు బాలం భార్య, బెజ్జపుట్టుగ గ్రామం మందులు మింగకపోతే చనిపోతా.. ‘‘నేను ఆత్మహత్య చేసుకోనక్కరలేదు. మూడు రోజులు మందులు మింగకపోతే చనిపోతా. కిడ్నీ జబ్బు వచ్చాక నా భార్య కిడ్నీ ఇచ్చింది. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారికి మందులు ఉచితంగా ఇవ్వరట. ఎకరా భూమిలో కొబ్బరి చెట్లన్నీ తిత్లీ తుపాన్ ధాటికి నేలకొరిగాయి. మందులు ఏ రోజైతే ఆపేస్తానో అవే నాకు చివరి రోజులు’’ – లమ్మత శేషగిరి, అతని భార్య సుజాత, పెద్ద శ్రీరాంపురం చనిపోతే మేలేమో అనిపిస్తోంది ‘‘నా భార్య రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటోంది. ఇంట్లో వృద్ధురాలు మా అమ్మ, మా అత్త ఉన్నారు. అనారోగ్యం వల్ల నా భార్య ఏ పనీ చేయలేదు. ఈ ముగ్గురికీ నేనే వండిపెట్టాలి. నా భార్యకు చికిత్స చేయించాలంటే చేతిలో డబ్బుల్లేవు. సర్కారు ఇచ్చే సాయం సరిపోవడం లేదు. ఈ బాధ పడే కంటే చనిపోతే మేలేమో అనిపిస్తోంది’’ – కిడ్నీ జబ్బు బాధితురాలు నాగమణి భర్త పురుషోత్తం, పలాస టౌన్ పెన్షన్ పెంచాలని ప్రతిపాదించాం.. ‘‘కవిటి మండల కేంద్రంలో మరో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్ రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. ఉద్దానం కిడ్నీ బాధితులకు మందుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని లేఖ రాశాం. బస్సు పాసులు ఇవ్వాలని కూడా ప్రతిపాదన పంపిస్తాం’’ – ధనుంజయరెడ్డి, కలెక్టర్, శ్రీకాకుళం జిల్లా -
తెలుగు తమ్ముళ్లకే రొయ్యల కూర!
శ్రీకాకుళం , సంతబొమ్మాళి: వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్న పర్వాలేదు అన్న చందంగా మారింది తిత్లీ తుఫాన్ నష్టపరిహారం జాబితా. భూమి లేని వాడికి పరిహారం, తోటలు లేని వారికి చెట్లు పరిహారం ఇలా ఒకటేమిటి.. ప్రతి విషయంలోనూ అధికార పార్టీ కార్యకర్తలు అందినకాడికి దోచుకున్నారు. చివరకు రొయ్యల చెరువులనూ వదల్లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకున్న కొందరు దేశం నాయకులు సంబంధిత మత్స్యశాఖాధికారులతో మిలాఖత్గా మారి భారీగా నష్ట పరిహారం పొందారు. రొయ్యల చెరువు సాగు చేయనివారు, కొన్ని సంవత్సరాలుగా సాగుకు విరామం ప్రకటించినవారు, మత్స్యశాఖాధికారులతో సన్నిహితంగా ఉండేవారి పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లుతో లక్షల రూపాయల పరిహారం ఆయా జాబితాల్లో నమోదు చేయించేశారు. వాస్తవానికి తిత్లీ తుఫాన్ వల్ల రొయ్యల చెరువులకు గోరంత నష్టం జరిగితే పరిహారం కొండంతగా రావడం వెనుక భారీ దోపిడీకి ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడంతో అంచనాలను పది రెట్లు పెంచుకుని పరిహారాన్ని దోచుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరే వారు..! రొయ్యల చెరువులకు నష్టం వాటిల్లిందంటూ పరిహారం కాజేసిన కొంతమంది అధికార పార్టీ కార్యకర్తల వివరాలను పరిశీలిస్తే.. సంతబొమ్మాళి టీడీపీ మండల అధ్యక్షుడు జీరు భీమారావు (క్రాఫ్ట్ రిజిస్టర్ నంబర్ ఏపీ 11–2018(19373) పేరిట సుమారు 10 లక్షల రూపాయలు పరి హారం ఆన్లైన్లో నమోదైంది. నౌపడ–2 ఎంపీటీసీ సభ్యుడు బచ్చల హరిశ్చంద్రరావు (క్రాఫ్ట్ రిజిస్టర్ నంబర్ ఏపీ 11–2018 (19127) పేరిట సుమారు రూ.8 లక్షల పరిహారం నమోదైంది. హెచ్ఎన్ పేట మాజీ సర్పంచ్ పాల మహాలక్ష్మి మరిది వసంతరావు (క్రాఫ్ట్ రిజిష్టర్ నంబరు ఏపీ 11–2018(19413) రూ.5 లక్షలు, అతని భార్య పాల లక్ష్మి (19415) రూ.5 లక్షలు, నౌపడకు చెందిన పి.రత్నాకరరావు (19439) రూ.20 లక్షలు, పి.విజయలక్ష్మి (19441) రూ. 20 లక్షలు.. ఇలా అధికార పార్టీకు చెందిన నాయకులు చాలా మంది అడ్డదారుల్లో రొయ్యల చెరువులకు నష్టం ఏర్పడిందంటూ పరిహారాన్ని చాప కింద నీరులా కాజేసే ప్రయత్నాలు చేశారు. వీటితో పాటు మత్స్యశాఖాధికారులతో సన్నిహితంగా మెలిగే వారి ఖాతాల్లో కూడా లక్షల రూపాయలు పరిహారం నమోదైనట్లు తెలిసింది. ఈ కోవకు చెందిన సాహుకారి ఎల్లారావు అతని కుటుంబ సభ్యుల పేరుతో రూ.45 లక్షలు, వాడ్రేవు చిరంజీవులు పేరిట రూ.10 లక్షలు నష్ట పరిహారం ఆన్లైన్లో నమోదైంది. ఈ పరిహార నమోదులో మత్స్యశాఖలో పనిచేస్తున్న చిరు ఉద్యోగి హేమం త్ చక్రం తిప్పుతున్నట్లు పలువురు రొయ్యల చెరువుల యజమానులు బహిరంగంగా చెబుతున్నా రు. దీనిపై జిల్లా కలెక్టరు స్పందించి క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి అసలైన బాధితులను గుర్తించాలని పలువురు కోరుతున్నారు. లబ్ధిదా రుని పేరుకు, అతని అందజేసిన నష్టం అంచనాల ఫొటోకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో భారీ దోపిడీకు ముందస్తుగానే రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో అంచనా వేయలేదు.. మత్స్యశాఖాధికారులు క్షేత్ర స్థాయిలో నష్టాన్ని అంచనా వేయలేదు. రొయ్యల చెరువులను గమనించకుండా కార్యాలయాల్లో కూర్చుని తమకు నచ్చిన పేర్లును నమోదు చేసుకున్నారు. రొయ్యల చెరువులు సాగు చేయని వారి పేర్లు కూడా జాబితాల్లో కనిపిస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మత్స్య శాఖలో పనిచేస్తున్న హేమంత్ అనే చిరుద్యోగి చక్రం తిప్పినట్లు అనుమానం కలుగుతోంది. మా గ్రామం సమీపంలో రొయ్యల చెరువు ఏర్పాటు చేసుకుని అన్ని రకాలు అనుమతులు ఉన్నా నష్ట పరిహార జాబితాల్లో నా పేరు చేర్చలేదు. నాలాగే ఎంతో మంది బాధితులు ఉన్నారు. దీనిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రత్యేక ధర్యాప్తు చేసి అసలైన బాధితులను ఆదుకోవాలి.–పి.రవికుమార్‌రెడ్డి, రొయ్యలచెరువు యజమాని,నౌపడ, సంతబొమ్మాళి మండలం. -
ఫుల్ పటాస్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గతనెల 10వ తేదీ రాత్రి తిత్లీ తుపాను జిల్లాతీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. దీని దాటికి దాదాపు పది లక్షల వరకూ కొబ్బరి చెట్లు కూలిపోయాయి. దాదాపు లక్ష ఎకరాల్లో వరి నష్టం జరిగింది. ఫలసాయం చేతికొచ్చే సమయంలో తుపాను విరుచుకుపడటంతో రైతులతో పాటు అన్ని వర్గాలవారు నష్టపోయారు. తుపానుకు కూలిపోయిన కొబ్బరిచెట్లు, జీడిమామిడి చెట్లు ఇంకా ఎండిపోయి అలానే ఉన్నాయి. వాటిని తొలగించే కార్యక్రమం ఇంకా ఊపందుకోలేదు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ చేసుకోవడానికి జిల్లా ప్రజలు ముఖ్యంగా ఉద్దానం ప్రాంతీయులు ఆసక్తి చూపించలేదు. దీంతో బాణసంచా విక్రయదారులు కూడా తొలుత దుకాణాలు ఏర్పాటు చేయడానికే సంశయించారు. కానీ పండుగ మూడురోజులు ఉందనగా ఒకేసారి విక్రయాలు ఊపందుకున్నాయి. కృత్రిమ డిమాండుతో బాదుడు... తుపాను నేపథ్యంలో బాణసంచా కొనేవారే ఉండరని అంతా భావించారు. ధరలు కూడా పెద్దగా ఉండవని కొనుగోలుదారులు ఆశించారు. కానీ ఆదివారం నుంచే విక్రయాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం డివిజన్లో 34, పాలకొండ డివిజన్లో 4 దుకాణాలు ఏర్పాటు చేశారు. తుపాను తీవ్రంగా ఉన్న టెక్కలి డివిజన్లో ఏడు దుకాణాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. మొత్తం 45 దుకాణాల్లో రూ.3 కోట్ల వరకూ బాణసంచా వ్యాపారం జరిగిందని అంచనా. అయితే బాణసంచా సామగ్రి ధరలు మాత్రం సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. చివరకు దీపావళి రోజు సాయంత్రం కూడా ఇవేవీ దిగిరాలేదు. కృత్రిమ డిమాండు సృష్టించి వ్యాపారులే ధరలు పెంచేశారని కొనుగోలుదారులు వాపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం పిల్లల సరదాను కాదనలేకే ఎక్కువ ధరలకైనా బాణసంచా కొనుగోలు చేస్తున్నామని పలువురు వ్యాఖ్యానించడం ధరల పరిస్థితికి అద్దం పడుతోంది. 2016 సంవత్సరంలో దీపావళికి 43 దుకాణాల్లో రూ.2.50 కోట్ల మేర వ్యాపారం జరిగింది. గత ఏడాది 46 దుకాణాలు ఏర్పాటు చేస్తే రూ.2.75 కోట్ల వరకూ చేరింది. ఈసారి మాత్రం 45 దుకాణాల్లో రూ.3 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. మందుబాబుల ఖుషీ... దసరాతో పోల్చితే దీపావళికి మద్యం విక్రయాలు తక్కువే. కానీ ఈసారి తిత్లీ తుపాను దెబ్బతో దసరా పండుగకు కూడా మద్యం దుకాణాలు వెలవెలబోయాయి. కానీ దీపావళికి మాత్రం మందుబాబుల ఖుషీ పెరిగింది. దాదాపు రూ.4 కోట్ల వరకూ వ్యాపారం జరిగినట్లు అంచనా. 2016 దీపావళికి జిల్లాలోని 238 మద్యం దుకాణాల్ల రూ.2.80 కోట్ల వ్యాపారం జరిగింది. అదే గత ఏడాది 3.90 కోట్లకు పెరిగింది. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి మాత్రం మద్యం విక్రయాలు పెరిగాయి. ఊపందుకోని ఎలక్ట్రానిక్స్,ఆటోమోబైల్స్... దీపావళికి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఆటోమోబైల్స్ వ్యాపారం కూడా బాగానే జరగాల్సి ఉంది. తిత్లీ తుపాను ప్రభావంతో ఈ దుకాణాలు వెలవెలబోయాయి. ఫ్రిజ్‌లు, టీవీల ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే ఎక్కువగానే ఉండటంతో కొనుగోలుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అలాగే ద్విచక్ర వాహనాలు, వ్యాన్లు, ఆటోల కొనుగోళ్లు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇక కొత్త మొబైల్స్ వ్యాపారం పరిస్థితి అంతంతే. మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై ఆఫర్లు కూడా ప్రకటించినా ఫలితం లేకపోయింది. ఏదిఏమైనా జిల్లావ్యాపార రంగంపై తిత్లీ తుఫాను ప్రభావం కనిపించింది. -
చంద్రబాబు ఇదిగో ఆధారాలు : పవన్ కల్యాణ్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకొని వాస్తవాలను బయటకు తెలియకుండా చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. తితిలీ తుపానుపై తాను కేంద్రానికి లేఖ రాయలేదని చంద్రబాబు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ మేరకు తాను కేంద్రానికి రాసిన లేఖలను ట్విటర్లో పోస్ట్ చేస్తూ చంద్రబాబు పై ధ్వజమెత్తారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సభలో మాట్లాడుతూ.. తితిలీ తుపాను బాధితులను ఆదుకోవాలని పవన్ కల్యాణ్ ఒక్క లేఖ కూడా కేంద్రానికి రాయలేదని విమర్శించారు. ఉద్ధానం వచ్చి మొసలి కన్నీరు కార్చుతూ.. చాలా అన్యాయం జరిగిందన్న పవన్.. తుపాన్ బాధితుల గురించి కేంద్రానికి ఒక్క లేఖ అయినా రాశారా? విమర్శించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. (దేవుడని మొక్కితే దెయ్యమై కూర్చున్నాడు) చంద్రబాబు విమర్శలపై మంగళవారం పవన్ కల్యాణ్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘ చంద్రబాబు గారు.. ఏపీలోని ఎలాక్ట్రానిక్ మీడియా మొత్తం మీ కంట్రోల్లో ఉంది. కావును జనసేన వార్తలను బయటకు రావు. అందుకే మీరు మమ్మల్ని ప్రజల్లో దూషింస్తున్నారు. నేను తితిలీపై కేంద్రానికి లేఖ రాయలేదని ప్రజలకు చెప్పారుగా.. ఇదితో ఆధారాలు ’ అంటూ ప్రధానమంత్రికి రాసిన లేఖలను ట్విటర్లో పోస్ట్ చేశారు. https://t.co/h2ZndJ9aLI Sri CBN garu, it. And to my notice that yesterday you have said that ‘Pawan Kalyan’ didn’t even write to Centre regarding ‘Titli’ cyclone devastation. Here’s the proof. pic.twitter.com/KFrnx4I0MU — Pawan Kalyan (@PawanKalyan) November 6, 2018 -
తిత్లీతో తక్షణ జీవనాధారం కరువు
అక్టోబర్ 11 వ తేదీన ముంచుకొచ్చిన తిత్లీ తుఫాను ఉద్దానం ప్రజల జీవికను చుట్ట చుట్టి తన విలయపు రెక్కల మీద మోసుకు పోయింది. ఒక మత్స్యకార మహిళ మాటల్లో చెప్పాలంటే ‘‘తుఫాను యిరిగినాక సూత్తే వూరు తామర లాగా పైకి తేలినాది’’. విశాఖనుంచి ఒక బృందంగా కూడి నవంబర్ 1 తేదీన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాం. 160 కిలోమీటర్ల మేర విస్తరించిన తిత్లీ ప్రభావం శ్రీకాకుళం జిల్లా తామరపల్లి నుంచే కనపడసాగింది. పూండి నుంచి ఇద్దువానిపాలెం వరకూ దాదాపు నలభైగ్రామాలని చూశాం. పదిగ్రామాల లోపలికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడాం. తుఫానుకు ఎడాపెడా కూలిపోయిన కొబ్బరి, జీడిమామిడి, పనస చెట్లతోపాటు అనేకచెట్లు ఎండి మోడువారుతున్నాయి. వాటి తొలగింపుకి ప్రభుత్వం సమకూర్చిన కోతమిషన్లు మొదలు నుంచి కొమ్మల్ని వేరుచేసి వెళ్ళిపోతున్నాయి. పదిమంది కలిస్తే తప్ప ఎత్తలేని చెట్టు మొదళ్ళు, కొమ్మలు–లారీల కొద్దీ ఎత్తవలసిన కొబ్బరిబొండాల గుట్టలని ఏం చేయాలో అర్థంకాక అలాగే వదిలేశారు రైతులు. పోయినవి ఏడాదికి ఒకటి రెండుసార్లు వేసుకునే పంటలు కాదు, నాటిన పదేళ్ళకి కాపుకి వచ్చే పంటలు. ఇక అన్నేళ్ల పాటు వేలాది చిన్నకారు రైతుల జీవిక ఎలా గడు స్తుంది అన్నది ఇపుడు సమస్య. ఒకటీ అరా వేర్లు భూమిలోకి అంటుకుని ఉంటే చెట్టు చిగురించే ఆస్కారం ఉంది కనుక కొమ్మలు కొట్టేసి మొదలుని అలాగే ఉంచుతున్నారు కొందరు రైతులు. కానీ మొదలుకూడా తీసేస్తేనే నష్టపరిహారం ఇస్తాం అంటున్నారు అధికారులు. ఉంచాలో తీయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు రైతులు. ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులే ఎక్కువ అండగా నిలబడ్డారని ప్రజలు చెపుతున్నారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లోకి ప్రభుత్వమే కదిలి వెళ్ళాలన్న ఆలోచన మంచిదే. కానీ పటాటోపాల రాజకీయవ్యవస్థలో పెద్దలరాక ఊరికి బరువు తప్ప ఓదార్పు కాదు. స్థానికంగా పని చేయాల్సిన అధికారులు, ఉద్యోగులు, వచ్చీపోయే వారి ప్రొటోకాల్ కోసం పరుగులు తీయడంలో మునిగిపోయారు. సర్వేలు చేసి, ఆన్ లైన్లో పొందుపరిచి నష్టపరిహారం ఇవ్వాలనుకోవడం పక్కా ప్రణాళిక కావచ్చు. కానీ సర్వం కోల్పోయిన వారికి ఎంత తొందరగా సాయం అందితే అంత ఉపశమనం కలుగుతుంది. విపత్తు వచ్చి ఇరవైరోజులు దాటినా వారికి భరోసా కలగకపోవడమే విషాదం. విపత్తువల్ల ప్రజల మానసికస్థితి ఊహించని మార్పులకి లోనవుతుంది. గొల్ల గండి గ్రామానికి వెళ్ళే తోవలో ఒకచోట భార్యాభర్తలిద్దరు చిన్నిచిన్ని ఎండుకొమ్మలు విరిచి పక్కన పెడుతూ కనిపించారు. మిగతావారు కనపడటం లేదేంటని అడిగితే ‘‘ఇదంతా సూసి బరాయించుకోనేక వూరువూరంతా తుండుగుడ్డ కప్పుకోని ఇంట్లోట పడుకుంది’ అని చెప్పిందామె. అంతేకాదు ‘ఇంట్లోట ఎండగా ఉంటే తోటకి వచ్చి సల్లగా కూకునేవాళ్ళం, తోటే ఎండ గొడతంటే ఎందల పడేది’ అని నిట్టూ ర్చింది. ప్రజలకి పునర్నిర్మాణం మీద ఆశ మానసికంగా కూడా కలగాలి. ఇద్డువానిపాలెం పరిస్థితి అత్యంత విషాదకరం. సముద్రతీర గ్రామం కావటాన ఏడెనిమిదేళ్ళ కిందట అక్కడికి దగ్గరలో ఉన్న బోరువంకలో వారికి స్థలం కేటాయించారు. ఈ తుఫానుకి గ్రామం సగం ఊడ్చిపెట్టుకుపోయింది. కానీ ఆన్లైన్లో వారిపేర్లు లేవు. ఎందుకంటే వారికి బోరువంకలో స్థలం కేటాయించారు కనుక అక్కడనే వారి ఇల్లు చూపించాలి. ‘మా ఊరిని దత్తత తీసుకోమని ఎవరికైనా చెప్పండి’ అంటూ పోరాటాలగడ్డ మీద పుట్టిన యువకుడు ‘కర్రి నాగరాజు’ నిస్సహాయతతో అన్నమాటలు అక్కడి పరిస్థితికి అద్దంపడుతున్నాయి. తీరప్రాంతపు ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం నివారణా మార్గాలను అమలుచేయాలి. భూమికోతని ఆపే రావణుడి మీసాలనే నేలతీగెలు, తీరప్రాంతపు తుఫానుగాలుల తీవ్రతని తగ్గించే పొట్టి చెట్లు, మొగలి పొదలు, సరుగుడు చెట్లతో మూడంచెల రక్షణవనాల పెంపకం సంబంధిత శాఖలు నిర్వహించాలి. తుఫాను షెల్టర్లను ప్రజలు ఉపయోగించుకునే భవనాలుగా మార్చాలి. ప్రజల తక్షణ జీవనాధారం కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు ఆహ్వానించి అమలు చేయాలి. (పర్యటించిన బృందం: కృష్ణాబాయి, జెవి రత్నం, నారాయణ వేణు, శశాంక్, రవి, ఈ వ్యాసకర్త) వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘ 88850 16788 సందర్భం కె.ఎన్. మల్లీశ్వరి -
‘టీడీపీ నేతలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న దుష్టపాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలను ఆయన ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. తిత్లీ తుపాన్ బాధితులకు పరిహారం అందజేయడంలో పచ్చ చొక్కా నేతలు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిత్లీ తుపాన్ విధ్వంసంతో కొబ్బరి, జీడి, వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే.. బాధితులకు అందాల్సిన పరిహారాన్ని హైజాక్ చేసిన టీడీపీ నేతలు వారి నోట్లో మన్ను కొట్టారని విమర్శించారు. సెంట్ భూమి లేనివారు సైతం బాధితులమంటూ.. 150 నుంచి 200 కొబ్బరి చెట్లు కోల్పోయినట్టు రాయించుకున్న ఘటనలు కోకొల్లలని తెలిపారు. 0.30 సెంట్లు భూమి ఉంటే 3 ఎకరాలని నమోదు చేసుకుని.. ఎకరానికి 60 కొబ్బరి చెట్లు చోప్పున 3 ఎకరాలకు 180 చెల్లు చూపించి.. 2.70 లక్షల పరిహారం పొందారని అన్నారు. ఈ విధమైన కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు పరిహారాన్ని దోచేశారని మండిపడ్డారు. విద్యోన్నతిలో గందరగోళం.. ఎన్టీఆర్ విద్యోన్నతి కోచింగ్ సెంటర్ల కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని అన్నారు. చాలా మంది అభ్యర్థులకు చాలా దూరంగా కోచింగ్ సెంటర్లను కేటాయించడంపై మండిపడ్డారు. అభ్యర్థులు తమకు దగ్గర్లోని హైదరాబాద్, విజయవాడలలో సెంటర్లు కోరుకుంటే వారికి.. తెలుగు మీడియం సౌకర్యం లేని, ఎక్కడో దూరానా ఉన్న ఢిల్లీలో సెంటర్లు కేటాయించారని విమర్శించారు. శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు పచ్చ చొక్కా నేతలు! తిత్లీ తుపాను విధ్వంసంతో కొబ్బరి, జీడి, వరి రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోయి సాయం కోసం దీనంగా ఎదురుచూస్తుంటే ఎన్యూమరేషన్‌ను హైజాక్ చేసిన పచ్చ చొక్కాలు దానిని కూడా గుటకాయ స్వాహా చేసి రైతుల నోట్లో మన్ను కొట్టారు. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2018 సెంటు భూమి లేని వారు సైతం 150 నుంచి 200 కొబ్బరి చెట్లు కోల్పోయినట్లు రాయించుకున్న ఘటనలు కోకొల్లలు! 0.30 సెంట్లు భూమి ఉంటే 3 ఎకరాలని నమోదు. ఎకరాకి 60 కొబ్బరి చెట్లు చొప్పున 3 ఎకరాలకు 180 చెట్లు. పరిహారం 2.70 లక్షలు. కాకి లెక్కలతో పచ్చ చొక్కాలు పరిహారాన్ని హాంఫట్ చేసిన తీరిది! — Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2018 The allotment of NTR Vidyonnathi coaching centers by the @ncbn administration is done in a ridiculous manner. Many aspirants are allotted far off places like Delhi where there is no Telugu medium facility even though they opted for nearby places like Vijayawada and Hyderabad. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2018 -
వారిది కన్నీరు.. వీరికి పన్నీరు!
బతుకులు పోయి వందలాది మంది ఏడుస్తుంటే.. నేతలు మాత్రం పొగడ్తలు కోరుకున్నారు. గ్రామాల్లో నీటితో పోటీ పడి కన్నీరు కురుస్తుంటే.. నాయకులు మాత్రం దాన్ని పన్నీరుగా మార్చుకున్నారు. తిత్లీ ధాటికి సగం జిల్లా సర్వనాశనమైన వేళ అధికార పార్టీ నాయకులు ప్రచార పర్వానికే పెద్ద పీట వేశారు. దాహమో రామచంద్రా.. అంటూ రోదిస్తున్న ప్రాంతాలకు నీటి కంటే ముందు ఫ్లెక్సీలు వెళ్లాయి. ఇళ్లు కోల్పోయి ఎవరు కరుణిస్తారా అని చేతులు జోడించి బాధితులు నిల్చుని ఉంటే వారి చేతుల్లో నిత్యావసరాలు కాకుండా పార్టీ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. కరెంటు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటే థాంక్యూ.. అని చెప్పాలనే సూచనలు వినిపించాయి. టీడీపీ నాయకుల ప్రచార పిచ్చికి తిత్లీ ఓ మౌన సాక్ష్యమైంది. శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రచారం.. టీడీపీ నాయకుల ప్రధాన ఆయుధం. ఆపత్కాలంలో కూడా నాయకులు ఈ సాధనాన్ని వదల్లేదు. తిత్లీ ధాటికి సిక్కోలు కకావికలమైన వేళ కూడా సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రచారంపైనే దృష్టి పెట్టారని సాక్షాత్తు బాధితులే సెలవిస్తున్నారు. తిత్లీ తుఫాన్లో అధికారికంగా అధికారులు, పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు జన్మభూమి కమిటీ సభ్యులు తమకు తోచిన విధంగా పార్టీ ప్రచారానికి పాల్పడుతున్నారు. తిత్లీలో ప్రజలు బాధ పడుతుంటే రూ.కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న తీరుపై జనం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో తిత్లీ తుఫాన్ సంభవించిన రెండో రోజుకు గ్రామాలకు, మారు మూల పల్లెలకు తాగునీరు అందక ముందే పార్టీ ఫ్లెక్సీలు చేరుకున్నాయంటే ముఖ్యమంత్రి ప్రచార పిచ్చి అర్థం చేసుకోవచ్చు. పలాసతో పాటు 13 మండలాలను తుఫాన్ ప్రభావిత ప్రాంతాలగా గుర్తించినప్పటికీ అత్యధికంగా ఉద్దానం ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దీంతో ముఖ్యమంత్రి పలాసలో పాగా వేసినప్పటికీ ప్రచారానికి పరమావధిగా ప్రాధాన్యత ఇచ్చారు. అటు అధికారులు, ఇటు నాయకులు పలు శాఖలకు చెందిన యంత్రాంగాలతో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ «అధికంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.కోట్ల ఖర్చు ముఖ్యమంత్రి పలాసలో ఉండగానే ఇంకా అనేక గ్రామాలకు విద్యుత్ అందజేయడానికి ముందే ఫ్లెక్సీలు, జెండాలు, ప్లకార్డులు, ఆర్టీసీ బస్సులకు పెయింటింగ్‌లు, కరపత్రాలు, ఒకటేమిటి అనేక రూపాల్లో ప్రచారం మొదలుపెట్టారు. నేటి నుంచి అందించనున్న పరిహారం నేరుగా ఖాతాల్లోకి పడుతున్నప్పటికీ ప్రచారం కోసం రూ.రెండు కోట్ల రూపాయలతో డమ్మీ చెక్కులను విడుదల చేశారు. ఇలా ఏ ఒక్క అవకాశం ఉన్నప్పటికీ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో ఉన్న హోర్డింగ్‌లు లక్షలు ఖరీదు అయినప్పటికీ వాటిపై, ఆర్టీసీ బస్సులపై, చెక్‌లపై ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పరిహారంలో కొబ్బరి చెట్టుకు రూ.1500 ఇస్తున్నప్పటికీ దాన్ని రెట్టింపు చెయ్యమని వారు వేడుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ కార్యక్రమం అయితే అధికారులతో ప్రచారం, కాకుంటే నాయకులతో ప్రచారం చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రకటన సామగ్రి ముఖ్యమంత్రి చేరుకునే ముందే వచ్చేస్తున్నాయి. ప్రచారానికి పెద్ద పీట.. బాధితులు నీరు అందని స్థితిలో ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ నుంచి పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని ప్రచారం చేయడం ఎంతవరకని సబబని అడుగుతున్నాను. అధికారులు మీవెంట ఉన్నపుడు సహాయం ఎలా అందుతుంది. ముఖ్యంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఎవ్వరినీ ఆదుకోలేదు. – చింతాడ మాధవరావు, సున్నాడ -
తిత్లీ బాధితులకు తగిన న్యాయం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాను తిత్లీ తుపాను అతలాకుతలం చేసేసి దాదాపు 23 రోజులు గడిచిపోయింది. పంటలు, పాడి, తోటలు, ఇళ్లు, పాకలు ఇదీ అదీ అని కాదు ఆ బీభత్సానికి ప్రజలు సర్వం కోల్పోయారు. జీవనాధారం కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో జిల్లా అధికార యంత్రాంగంపై బాధ్యతలు రెట్టింపు అవుతాయి. కుటుంబాలకు సైతం దూరమై రేయింబవళ్లు సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నడిపించడానికి అహర్నిశలు కష్టపడుతున్న వారిలో జిల్లా కలెక్టరుగా కె.ధనంజయరెడ్డి ముందున్నారు. తుపాను, వరద బాధిత ప్రాంతాల్లో చేపట్టిన, చేస్తున్న, చేయబోయే పనుల గురించి శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి:తిత్లీ తుపాను, వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులు, ఇతర వర్గాల ప్రజలు సర్వం కోల్పోయారు. వారికి ఉపాధి కూడా కరువైంది. ఈ నేపథ్యంలో మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? కలెక్టరు: తిత్లీ వంటి తుపానైనా, వరదలైనా, లేదంటే కరువైనా రైతులు, కూలీలు పంట నష్టపోవడమే కాదు ఉపాధి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద వంద రోజుల పనిదినాలు ఇప్పటికే కల్పిస్తున్నాం. తిత్లీ తుపాను బాధితులకు తక్షణమే ఉపాధి చూపించే ఉద్దేశంతోనే అదనంగా మరో యాభై పనిదినాలు కల్పిస్తున్నాం. వాస్తవానికి ఈ సీజన్లో శ్రీకాకుళం జిల్లాలో కరువు మండలాలు లేవు. తుపాను వల్ల జిల్లా నష్టపోయింది. ఇది కూడా ప్రకృతి విపత్తే కాబట్టి 25 మండలాల్లో ఈ పనిదినాల పెంపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. సాక్షి: జిల్లాలో ఏయే మండలాలను తిత్లీ తుపాను, వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు? కలెక్టరు: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి, టెక్కలి, జలుమూరు, ఎల్ఎన్ పేట, సరుబుజ్జిలి, నరసన్నపేట, పోలాకి, గార, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, సారవకోట, భామిని, మెళియాపుట్టి, వీరఘట్టం, సీతంపేట, పలాస మండలాలను తిత్లీ తుపాను, భారీవర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం 16వ నంబరు జీవోను విడుదల చేసింది. సాక్షి: తుపానుతో ప్రజలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ ‘ఉపాధి’ సరిపోతుందా? కలెక్టరు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టడానికి తుపాను బాధిత ప్రాంతంలో అనేక పనులు ఉన్నాయి. ఒక్క టెక్కలి రెవెన్యూ డివిజన్‌లోనే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 98.8 కోట్లు విలువగల పనులు జరిగాయి. మెటీరియల్ కాంపోనెంట్ పనులు రూ. 32.82 కోట్లు వరకూ చేశారు. ఈ డివిజన్లో ఎక్కువ మంది నరేగా పనులపై ఆధారపడినవారు ఉన్నారు. 11,194 శ్రమశక్తి (ఎస్ఎస్ఎస్) సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 1,56,904 మంది వేతనదారులు ఉన్నారు. వారిలో ప్రతి రోజూ ఉపాధి పనులకు వెళ్లేవారు 1,10,760 మంది ఉన్నారు. ఇప్పుడు అదనంగా 50 పనిదినాలు వచ్చాయి. ఇప్పటివరకు వంద రోజుల పాటు పనిదినాలు చేయని కుటుంబాలు కూడా వచ్చే ఏడాది మార్చిలోగా 150 పనిదినాలు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. తుపాను వల్ల పాడైపోయిన పొలాలు, గట్లు బాగు చేసుకోవడం వంటి పనులు కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. సాక్షి: తిత్లీ తుపానుతో నేలకొరిగిన చెట్లను తొలగించుకోవడానికి రైతులకు ఏవిధమైన సహాయం అందిస్తారు? కలెక్టరు: కూలిపోయిన అన్ని రకాల చెట్లను తొలగించే బాధ్యత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలు తీసుకుంటున్నాయి. అందుకుకావాల్సిన డీజిల్ ఆధారిత రంపాలను సమకూర్చాం. అలాగే ప్రతి చెట్టును జియోట్యాగింగ్ చేసి తొలగించుకోవడానికి రైతులకు మెటీరియల్ కాంపొనెంట్ కింద జీడిమామిడి చెట్టుకు రూ.300, కొబ్బరి చెట్టుకు రూ.240 చొప్పున చెల్లిస్తాం. ఇప్పటికే 60 వేల చెట్లను తొలగించారు. ఇలా రెండు వేల ఎకరాల్లో తొలగింపు పూర్తయ్యింది. సాక్షి: ఇంకా చాలామంది బాధితులు తమ పేర్లు లేవని, నష్టం నమోదు ప్రక్రియ సరిగా చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏం చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరు: నష్టాల గణన సత్వరమే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయడం వల్ల అక్కడక్కడా తప్పులు దొర్లిన మాట వాస్తవమే. బాధితులు ఎవ్వరైనా సరే ఈ విషయంలో దరఖాస్తు చేయవచ్చు. వాస్తవానికి నష్టాల నమోదు ప్రక్రియ శనివారంతో పూర్తయ్యింది. కానీ రానున్న మూడు నాలుగు రోజుల వరకూ వచ్చే ఫిర్యాదులను, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. నిజమైన బాధితులను గుర్తించి న్యాయం చేస్తాం. రెండో దఫా జాబితాలో వారికి నష్టపరిహారం చెల్లిస్తాం. సాక్షి: బాధితులు కోలుకునేందుకు మీరు చేపట్టనున్న దీర్ఘకాలిక చర్యలు ఏమిటి? కలెక్టరు: సర్వం కోల్పోయిన బాధితులను సాంఘికంగా, ఆర్థికంగా, ప్రాథమిక వసతులపరంగా దీర్ఘకాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ‘తిత్లీ ఉద్ధానం పునరుద్ధరణ కార్యక్రమం’ (టీయూఆర్‌పీ– తూర్పు) చేపట్టనున్నాం. ఇళ్లు మంజూరు, మొక్కల అందజేత, రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా, కావాల్సినవారందరికీ జలసిరి బోర్ల మంజూరు, మూడేళ్ల పాటు మొక్కల నిర్వహణకు నిధులు హెక్టారుకు రూ.40 వేల చొప్పున విడుదల వంటి ప్రతిపాదనలు చేస్తున్నాం. అంతర పంటల వైపు రైతులను ప్రోత్సహించాలనే ఆలోచన ఉంది. అలాగే భవిష్యత్తులో విపత్తులను తప్పించలేం. కానీ తుఫానుల సమయంలో పక్కాఇళ్లు ఉంటే నష్టాన్ని తగ్గించవచ్చు. రేకుల ఇళ్లు, పూరిళ్లు కోల్పోయినవారికి 25వేల పక్కాఇళ్లను ఇవ్వాలని గుర్తించాం. తుపాను బాధితులకు మెరుగైన జీవనోపాధి కల్పించి వారు ఎక్కడికీ వలస పోవాల్సిన పరిస్థితి తలెత్తకుండా చేయాలనేది లక్ష్యం. సాక్షి: పంటనష్టం నమోదులో అవకతవకల నిరోధానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టరు: మా దృష్టికి వచ్చిన అవకతవకలను మండలస్థాయిలోనే గుర్తించి సరిచేస్తున్నాం. కొన్నిచోట్ల తక్కువ విస్తీర్ణంలో నష్టం జరిగితే ఎక్కువగా రాయించడం, భూములు లేకపోయినా ఉందని నమోదు చేయడం వంటి అక్రమాలన్నీ చాలావరకూ నిరోధించగలిగాం. పొరపాట్లను గుర్తించాం. ఇద్దరు ముగ్గురు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నాం. అందుకే ప్రాథమిక జాబితాకు ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. వరి పంటనష్టం 93వేల హెక్టార్ల నుంచి ఇప్పుడు 76 వేల హెక్టార్లకు తగ్గింది. నష్టపోయిన కొబ్బరి చెట్లు సంఖ్య 14 లక్షల నుంచి దాదాపు 10 లక్షలకు తగ్గిపోయింది. ఏదిఏమైనా బాధితులను ఆదుకోవడానికి అధికార యంత్రాంగం ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసింది. అంతా రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎంతో ఒత్తిడి ఉన్నా ప్రజల కోసం కాబట్టి భరించక తప్పదు. సాక్షి: తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? కలెక్టరు: పునరావాస కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాల విషయంలో సాధారణ పరిస్థితి వచ్చింది. ఇక నష్టపరిహారాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. పంటలు, తోటలు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తి నష్టాలకు సంబంధించి గణన జరుగుతోంది. నాలుగు లక్షలకు పైగా బాధితులకు ఈనెల 5వ తేదీ నుంచి పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అవి వారి ఖాతాల్లోనే జమ అవుతోంది. దాదాపు రూ.450 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. -
‘పేర్నాటి’ సేవలు అభినందనీయం
నెల్లూరు(సెంట్రల్): పేర్నాటి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకుడు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని, వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పేర్నాటి చారిటబుల్ ట్రస్టు శ్రీకాకుళం జిల్లాలోని తిత్లీ తుపాను బాధితుల కోసం రూ.70లక్షల విలువైన నిత్యావసర సరుకులు, వంట సామగ్రిని వితరణగా అందజేశారు. ఇందుకు సంబంధించిన వాహనాలను మాగుంటలేఅవుట్‌లోని పేర్నాటి కార్యాలయంలో ఆనం రామనారాణరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తుపాను బాధితుల కోసం శ్యాంప్రసాద్‌రెడ్డి తన ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులను అందజేయడం అభినందనీయమన్నారు. నీలువ నీడ లేని కుటుంబాలకు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఆదరణ దొరికే పరిస్థితి లేదన్నారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా పేదలు, అభాగ్యులు, నిరాశ్రయులైన వారికి తాను ఉన్నానంటూ పేర్నాటి ఆపన్న హస్తం అందిస్తుండడం ఎంతో సంతోషిందగ్గ విషయమన్నారు. బాధితులకు చేయూతనందించాల్సిన టీడీపీ ప్రభుత్వం ప్రచార ఆర్బాటాలతో సరిపెడుతోందన్నారు. ప్రభుత్వం చేయాల్సిన సహాయ కార్యక్రమాలను సైతం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేస్తుందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి తన చారిటబుల్ ట్రస్టు ద్వారా ఇటీవల కేరళ వరద బాధితులకు పెద్ద ఎత్తున సాయం అందించారని గుర్తు చేశారు. పేర్నాటి ట్రస్టు ద్వారా గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైద్యసేవలతో పాటు పేదలకు చేయూతనందిస్తుండడం అభినందించదగ్గ విషయమన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. బాధితులను ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఎల్లప్పుడూ మందుంటాయన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తిత్లీ తుపాను బాధితులకు సాయం చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కిలి, పలాసా ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లిందని, ఆయా ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేస్తామన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరులో వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ పోలుబోయిన రూప్‌కుమార్, హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
సోలార్ దీపాలు సర్దుకున్నారు..!
శ్రీకాకుళం మందస: తిత్లీ తుపానును కొంతమంది తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సాయాన్ని.. పరికరాలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలకు అంతరాయం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అందజేసిన సోలార్ దీపాలను కొంతమంది ఉద్యోగులు పక్కదారి పట్టించారనే విషయం ఇప్పుడు చర్చనీ యాంశమైంది.అక్టోబర్ 10వ తేదీ రాత్రి భయంకరమైన తుపాను జిల్లాపై విరుచుకుపడింది. ప్రజలు సర్వం కోల్పోయారు. ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ వ్యవస్థ నాశనమైంది. అనేక గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. పరిస్థితిని గమనించిన సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ అత్యవసరశాఖగాగుర్తింపు ఉన్న వైద్యశాఖకు సోలార్ విద్యుత్ దీపాలను పంపిణీ చేశారు. విద్యుత్ లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులు, సబ్ సెంటర్లకు, ఆశావర్కర్లకు ల్యాంపులను అందజేశారు. వీటి వెలుతురులో ప్రజలకు సేవలందించాలని ఆదేశించారు. ఒక్కో సబ్ సెంటర్‌కు 10 నుంచి 15 సోలార్ దీపాలు సమకూర్చారు. అయితే వీటిని కొంతమం ది పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఇప్పుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజా సేవకంటే.. స్వసేవకే ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు కొంతమంది సోలార్ దీపాలు ఉచితంగా వచ్చాయనుకుని వారితో పాటు వారి బంధువులకు కూడా పంచేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ల్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. వీటిని ఉచితంగా పంపిణీ చేసినట్టు వైద్యశాఖ ఉద్యోగులు భావించారు. అయితే వీటిని ఉచితంగా సరఫరా చేయలేదని... అత్యవసర సేవల నిమిత్తం పంపించామని ఐటీడీఏ పీవో తాజాగా ఓ ప్రకటన చేశారు. వైద్యశాఖకు అందించిన సోలార్ దీపాలు ఉచితం కా>దని, విద్యుత్ వెలుగులు రాగానే రీకలెక్ట్ చేసుకుంటామని స్పష్టం చేయడంతో దీపాలు పంచుకున్న ఉద్యోగులకు మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది. పంపిణీ సమయంలో సోలార్ ల్యాంపుల బాధ్యత ఎవరు తీసుకున్నారు.. ఎవరి సంతకాలతో బయటకు వెళ్లాయి.. ప్రస్తుతం ఎవరెవరి దగ్గర ఉన్నాయోనని తెలుసుకోవడానికి ఉద్యోగులు కిందామీదా పడుతున్నారు. సోలార్ దీపాల లెక్కతేలకపోతే చర్యలు అత్యవసర పరిస్థితి కావడంతో సోలార్ దీపాలను వైద్యశాఖకు అందించాం. పూర్తిస్థాయిలో విద్యుత్ రాగానే వీటిని తిరిగి తీసుకుంటాం. ఏ ఒక్కటీ విడిచిపెట్టం. ఎవరైన చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే తుపాను సాయంలో జరిగిన సంఘటనల్లో బాధ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. సోలార్ ల్యాంపుల లెక్క సక్రమంగా ఉండాలి. లేకపోతే బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. –లోతేటి శివశంకర్, ప్రాజెక్టు అధికారి, ఐటీడీఏ -
పోలాకి తహసీల్దార్‌కు గుండెపోటు!
పోలాకి/శ్రీకాకుళం పాతబస్టాండ్: తిత్లీ తుపాను ప్రభావిత మండలా ల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు.. పనిఒత్తిడితో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్న అధికారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా పోలాకి మండల తహసీల్దార్ జెన్ని రామారావు శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యా రు. దీంతో వెంటనే అతన్ని శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. దీంతో సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, జేసీ–2 పి.రజనీ కాంతరావు, డీఆర్వో నరేంద్రప్రసాద్, కలెక్టరేట్ ఏవో రమేష్‌బాబులు కిమ్స్‌కు చేరుకొని రామారావును పరామర్శించారు. అతని కుటుంబసభ్యులతో మాట్లాడి అన్ని విధాలా ప్రభుత్వం ద్వారా వైద్య సదుపాయాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం వైద్యులతో మాట్లాడి రామారావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి కుటుంబసభ్యులు విశాఖపట్నానికి రామారావును తరలించారు. ఈయన తుపాను విధుల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి పోలాకిలో మండల ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు. సుమారు 28 రోజులుగా విధుల్లో ఉంటున్న ఆయన అలసటకు గురయ్యారు. విధుల్లో ఒత్తిడి పెరడంతోనే గుండెపోటుకు గురయ్యారని రెÐవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నలుగురు తహసీల్దార్లు అస్వస్థతకు గురికాగా టెక్కలి ఆర్డీవో దఫేదార్ రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారని అసోసియేష¯న్ జిల్లా అధ్యక్షుడు పి. వేణుగోపాలరావు అన్నారు. తుపాను విధుల్లో ఉన్న అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్నామ్యాయ చర్యలపై దృష్టి సారించాలని కోరారు. -
తిత్లీ ఒత్తిళ్లు!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: ఈ ముగ్గురే కాదు ఇప్పు డు జిల్లా అధికార యంత్రాంగం అంతా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పలు రకాలైన ఉద్యోగ బాధ్యతలు చేస్తూ పనిఒత్తిడీ తప్పట్లేదు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. కింది స్థాయి ఉద్యోగి నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకూ, చివరకు తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకాధికారులుగా వచ్చిన ఐఏఎస్ అధికారుల వరకూ అందరూ ఏదోరకంగా పని, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నవారే. అంతేకాదు మూడు వారాలుగా సొంత కార్యాలయాలు, కుటుం బాలకు దూరంగా ఉన్న వారంతా పలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ పరిస్థితి ఒక్కోసారి విషమించి ప్రాణాల మీదకు వస్తోంది. తుపాను తాకిడితో జిల్లాలో 38 మండలాలు దెబ్బతి న్నాయి. వాటిలో ముఖ్యంగా టెక్కలి డివిజన్లోని ఉద్దానం ప్రాంతం మరింతగా కకావికలమైంది. తీరప్రాంత గ్రామాలు, గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతంలోని గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడ సహాయ, పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రభుత్వం జిల్లాలోని వివిధ శాఖల నుంచి సిబ్బంది, అధికారులనే గాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అధికారులను రప్పించింది. అంతేకాదు 38 మంది సివిల్స్ సర్వీసు అధికారులను, 177 మంది డిప్యూటీ కలెక్టరు స్థాయి అధికారులను కూడా తీసుకొచ్చింది. వారంతా గత మూడు వారాలుగా తమకు కేటాయించినప్రాంతాల్లోనే సేవలందిస్తున్నారు. దసరా పండుగ విరామం కూడా లేదు. వచ్చే దీపావళి పండుగకు కూడా ఇంటికి వెళ్తారనీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, 15 మంది మంత్రులు, కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారులు సైతం స్థానికంగా ఉండటంతో మరీ ఒత్తిడి పెరుగుతోంది. దీనికితోడు ఎవరికి ఎప్పుడు కోపం వస్తే సస్పెన్షన్ చేస్తారేమోననే భయం ఎక్కువైంది. ఇదే సమయంలో తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఎక్కడా సరైన సౌకర్యాలు లేకపోవడం, దోమలు సమస్య పెరగడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తడం వంటివన్నీ ఉద్యోగుల్లో చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలోనూ సెలవులు పెట్టుకునే అవకాశం ఇవ్వకపోవడం కూడా వారి సమస్యలను మరింత పెంచుతోంది. అనారోగ్యం వెంట పరుగు... జిల్లాలో ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. సారవకోట మండలంలో ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహించేందుకు వచ్చిన డిప్యూటీ కలెక్టర్ వెంకటేష్ ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు. మరో ప్రత్యేకాధికారి పి.అరుణ్‌బాబు కూడా అనారోగ్యానికి గురై ఐదు రోజులపాటు వైద్య సేవలు తీసుకొన్నారు. మళ్లీ విధులకు హాజరయ్యారు. పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పైడి అజయ్ అస్వస్థతకు గురై పలాస సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎచ్చెర్ల మండలంలోని ఇబ్రహీంబాద్‌కు చెందిన ఆయన గత 20 రోజులుగా పలాస మండలం బ్రాహ్మాణతర్ల గ్రామంలో సహాయకచర్యలలో ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో నలుగురు పంచాయతీ సెక్రటరీలు అనారోగ్యం పాలయ్యారు. విద్యుత్ శాఖకు సంబంధించి పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న సిబ్బంది, ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతున్నారు. పలాసలో ఒక ఏఈకి పాము కాటు వేయడంతో ఆసుపత్రిలో చేరారు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. ఇలాంటి సమస్యలు అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు, సిబ్బందిలోనూ కనిపిస్తున్నాయి. చివరకు ఐఏఎస్ అధికారులు కూడా ఆహారం పడకపోవడం, వాతావరణ పరిస్థితులు తదితర కారణాలతో అనారోగ్యానికి గురవుతున్నారు. సస్పెన్షన్లతో మరింత ఒత్తిడి... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు తొలిసారి పర్యటించిన సందర్భంలో కవిటి ఎంపీడీఓ ఎస్.రామకష్ణ, ఎంఈఓ ధనుంజయ్ మజ్జిలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాను పర్యటనకు వచ్చినప్పుడు స్థానికంగా అందుబాటులో లేరనే కారణంతో వారిపై ఈ చర్య తీసుకున్నారు. సోంపేట మేజర్ పంచాయతీ ఈవో జ్యోతీశ్వర్రెడ్డిని పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో విఫలమయ్యారనే కారణంతో సస్పెండ్ చేశారు. ఇదే మండలంలోని గొల్లగండి పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావు ప్రజలకు సహాయ సహాకారాలు అందించడంలో విఫలం చెందారని సస్పెండ్ చేశారు. నరసన్నపేట పంచాయతీ అధికారి మధుసూదన్‌ను కూడా పారిశుద్ధ్య నిర్వహణ విఫలమయ్యారనే కారణంతోనే సస్పెండ్ చేశారు. మందసలో డెప్యుటేషన్‌పై విధులకు వచ్చిన రణస్థలం మండల పంచాయతీ కార్యదర్శి బేగమ్ కూడా సస్పెండ్ అయ్యారు. భామిని మండల వ్యవసాయాధికారి (ఏఓ) జి.మురళీకృష్ణను పంటల గణాంకాల విషయంలో తేడాలు ఉండటంతో విధుల నుంచి తప్పించారు. ఇంకా విద్యాశాఖలో ఇద్దరు ఎంఈఓలు, ఒక హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ఇలా వేటు పడుతున్న అధికారులు, సిబ్బంది జాబితా ఇంకా ఉంది. టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యం, జన్మభూమి కమిటీల అనధికార పెత్తనం కూడా అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. మాట వినకపోతే ఫిర్యాదులు చేసిమరీ సస్పెండ్ చేయిస్తున్నారు. ఫలితంగా చాలామంది తప్పనిసరి పరిస్థితిలో తప్పులకు కారణమవుతున్నారు. ఇవి వెలుగుచూస్తే దాని ఫలితం అధికారులు, సిబ్బందిపైనే పడుతోంది. ఇదంతా మానసిక ఒత్తిళ్లకు దారితీస్తోంది. ఉద్యానవన శాఖలో 13 జిల్లాల నుంచి హెచ్ఓలను, ఎంపీఈఓలను తుఫాను విధులకు ప్రభుత్వం నియమిస్తే, ఇక్కడి విపత్కర పరిస్థితుల్లో తాము పనిచేయలేమని రెండుమూడు రోజుల్లోనే వెనుదిరగడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. -
శరత్‌బాబు సాయం రూ.2 లక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం సినీనటుడు శరత్‌బాబు రెండు లక్షల రూపాయలను ప్రకటించారు. సంబంధిత చెక్‌ను జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని ఆయన బంగ్లాలో గురువారం కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శరత్‌బాబు మాట్లాడుతూ తన సొంత జిల్లా శ్రీకాకుళంలో తుపాను బీభత్సంతో వాటిల్లిన నష్టాన్ని చూసి చాలా బాధపడ్డానన్నారు. కలెక్టర్ ధనంజయరెడ్డి మాట్లాడుతూ తుపానుతో ఉద్దానం ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయావన్నారు. జిల్లా వాసిగా శరత్‌బాబు స్పందించడం సంతోషకరమంటూ ఆయన్ని అభినందించారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా వ్యవసాయరంగంలో మరింత అభివృద్ధి చెందాలని, అందుకు అధికారులు, మీడియా సహకారం అందించాలని కోరారు. -
తిత్లీ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
-
తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోవాలి
-
తిత్లీ బాధితులందరికీ న్యాయం చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను, అనంతరం వచ్చిన వంశధార వరదలతో నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందించడంతోపాటు శాశ్వత పునరావాసం కల్పిం చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు కలెక్టర్ కె.ధనంజయరెడ్డిని కోరారు. పార్టీకి చెందిన పలువురు నాయకులతో కలిసి మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ని ఆయన చాంబర్లో కలిశారు. బాధితుల పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, శాశ్వత పరిష్కారాలపై మాట్లాడారు. ఉద్దానం ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన సామాజిక వర్గాలైన అగ్నికుల క్షత్రియ, కండ్ర, జాలరి, కేవేటి, బెంతులు, సొండి, దమ్మలి, బెంతు ఒరియాలు, పొందరి, నగర కులాల వారు పూర్తిగా నిరాశ్రయులై దుర్భర జీవి తాన్ని గడుపుతున్నారని... వీరిని తక్షణమే ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సహకారం లేదు జిల్లాను తుపాన్లు తరచూ తాకుతున్నాయని.. దీంతో భారీ నష్టం వాటిల్లుతున్నాప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. జిల్లాను సైక్లోన్ జోన్‌గా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేస్తే గానీ శాశ్వత పరిష్కారం లభించదన్నారు. సముద్రతీరం ఇసుకతో నిండి ఉంటుండడంతో ఏమాత్రం గాలి వీచినా విద్యుత్ స్తంభాలు పడిపోయి భారీగా నష్టం వాటిల్లుతోందని ధర్మాన అన్నారు. శాశ్వత పరిష్కారం దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతానికి భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిహారం అందజేయాలన్నారు. ఉద్దానం ప్రాంతంలో ప్రధాన పంట కొబ్బరి అని.. తరతరాల నుంచి ఈ పంటపైనే ప్రజలు ఆధార పడి జీవిస్తున్నారన్నారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అయినా ఇంత వరకూ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందన్నారు. పడిపోయిన కొబ్బరిచెట్లను ప్రభుత్వమే తొలగించాలని, కొబ్బరి వ్యవసాయానికి సరిపడేటట్లు భూమిని చదును చేసి తుపాన్లను తట్టుకునే సామర్యం గల పొట్టిరకం, అధిక దిగుబడినిచ్చే తక్కువ కాలంలో పంట వచ్చే కొబ్బరిచెట్లు నాటి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. 'వరి పంట నాశనం’ ♦ తుపానుతో జిల్లాలో ప్రధాన పంట అయిన వరికి తీవ్ర నష్టం వాటిల్లిందని ధర్మాన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తుపానుతో రెండు లక్షల ఎకరాలు, అనంతరం వచ్చిన వరదలతో మరో లక్ష ఎకరాల్లో పంటలు మునిగిపోవడంతో, తరువాత తెగుళ్లు సోకి ఉన్న పంట పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ప్రతి రైతుకూ అందేటట్లు చేయాలన్నారు. గతంలో తీసుకున్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేసి మరలా వ్యవసాయం చేసుకునేందుకు కొత్త రుణాలు అందివ్వాలని కోరారు. డ్వాక్రా మహిళలకు కూడా తుపానుతో నష్టం వాట్లల్లిందని.. వారికి కూడా రుణాలు మాఫీ చేసి కొత్తగా రుణాలు అందించాలని, రానున్న నాలుగు సంవత్సరాల వరకూ ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. రోడ్లను బాగుచేయాలి తుపాను కారణంగా గ్రామీణ రోడ్లతోపాటు ప్రధాన మార్గాలు, డ్రైనేజీలు పూర్తిగా నాశనమైన నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రోడ్లను మరమ్మతుచేయించి ప్రజలకు అంబాటులోకి తేవాలని ప్రసా దరావు కోరారు. అలాగే తీరప్రాంతంలోని మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని.. వారికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరారు. అలాగే వలలు, బోట్లు, ఐస్ బాక్స్‌లు సరఫరా చేయాలన్నారు. వేలాది ఇళ్లు నేలమట్టం తుపానుతో సుమారు 50 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయయని కలెక్టర్‌కు ధర్మాన వివరించారు. గడచిన నాలుగున్నరేళ్లలో పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని.. నష్టం భారీగా వాటిల్లిందన్నారు. బాధితులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. గతంలో వచ్చిన హుద్‌హుద్ తుపాను బాధితులతోపాటు.. తాజాగా వచ్చిన తిత్లీ తుపాను బాధితులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. గిరిజనులకు వాటిల్లిన నష్టాన్ని పూరించాలి: ఎమ్మెల్యే కళావతి సీతంపేట ఐటీడీఏ పరిధిలోగల ఎస్టీలకు తుపానుతో భారీ నష్టం వాటిల్లిందని.. వారిని ఆదుకోని నష్టాన్ని పూరించాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కలెక్టర్ ధనంజయరెడ్డికి విజ్ఞప్తి చేవారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టా లేదన్న కారణంతో బాధితులుగా గుర్తించకపోవడం తగదన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ప్రభుత్వ నిబంధనల మేరకే పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు పంటలను నష్టపోయారు. విద్య, వైద్య ఖర్చులను భరించాలి: పిరియా విజయ ♦ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పిరియా విజయ మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు వైద్యం, విద్యకు అయ్యే ఖర్చులను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే భరించాలని కలెక్టర్‌ను కోరారు. తుపాను బాధిత ప్రాంతాల్లో విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు మెస్ చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం భరించడంతోపాటు రానున్న నాలుగేళ్లకు దీనిని వర్తింపజేయాలని కలెక్టర్‌ను కోరారు. దొంగలను తయారు చేసిన్ సర్కార్ ♦ కలెక్టర్‌ని కలిసిన అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గడచిన నాలుగున్నరేళ్లలో ప్రజాధనం ఏవిధంగా వచ్చినా దోపిడీ చేసే దొంగలను సర్కార్ తయారు చేసిందని వ్యాఖ్యానించారు. తుపాను నష్టపరిహారం విషయంలో కూడా ఆ దొంగల స్వైరవిహారం చేసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ప్రజలు ఉండాలన్నారు. నష్టపరిహారం జాబితాలో అనర్హులను చేర్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులను జడిపించి, బెదిరించి వారిచే తప్పుడు రికార్డులు చేయించే పనిలో టీడీపీ నాయకులు ఉన్నారని వీటిని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ♦ కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కష్ణదాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్, నాయకులు అంబటి శ్రీనివాసరావు, మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, మార్పు ధర్మారావు, పీస శ్రీహరి, గొండు రఘురాం, టి కామేశ్వరి, డాక్టర్ పైడి మహేశ్వరరావు, ఎంవీ స్వరూప్, సాధు వైకుంఠం, పొన్నాడ రుషి, కోరాడ రమేష్, హనుమంతు కిరణ్‌కుమార్, మార్పు మన్మథరావు, ప.పద్మలోచనరావు పాల్గొన్నారు. -
కేంద్ర హోంమంత్రి దృష్టికి ఆపరేషన్ గరుడ..
సాక్షి, న్యూఢిల్లీ : ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది ఎవరో నిగ్గు తేల్చాలని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఏపీ బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడంతో రాష్ట్రంలో దుమారం రేగుతోంది. అయితే ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సినీ నటుడు శివాజీ గతంలో ఆపరేషన్ గరుడ గురించి మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినవిధంగానే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరగడంతో ఈ ఆపరేషన్ గరుడ పేరుతో జరుగుతున్న కుట్రపై దర్యాప్తు జరపాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ గరుడపై విచారణ జరపాలని, తిత్లీ తుపానుతో నష్టపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రిని బీజేపీ నేతలు కోరారు. అనంతరం ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ అనేది టీడీపీ సృష్టేనని, దీనిపై నిజానిజాలు వెలికితీయాలని రెండు నెలల కిందటే ఫిర్యాదు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని విమర్శించారు. వైఎస్ జగన్‌పై దాడి జరుగుతుందని రెండు నెలల కిందటే చెప్పిన వ్యక్తిని సాక్షిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. నటుడు శివాజీని భద్రత బలగాలు అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. సీఎంపైనే దాడి జరుగుతుందని రెండు రోజుల కిందటే చెప్పినా.. ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. చార్జిషీట్లో శివాజీ పేరు లేకుండాచేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని మండిపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుపడిన టీడీపీకి ధర్మపోరాట దీక్ష చేసే హక్కులేదని ఎద్దేవా చేశారు. తిత్లీ సహాయక చర్యలను ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని పేర్కొన్నారు. చంద్రబాబులో ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనే తలంపే కనబడుతోందని ఆరోపించారు. -
‘తిత్లీ’ బాధితులను ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తిత్లీ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ రాసిన లేఖను మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేశారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించలేదని లేఖలో జగన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని వివరించారు. వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయని.. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, రహదారులు కొట్టుకుపోయాయని.. తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితుల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరాన్ని వెనుకబడిన జిల్లాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పుడు తిత్లీ తుపాను వల్ల ఆ రెండు జిల్లాల్లో కోలుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. బాధితులను ఆదుకునేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నేతలతో రెండు కమిటీలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3,435 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలు పంపినా.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నష్టం ఇంకా భారీగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కుదేలైన బాధితులను ఆదుకునేందుకు వేగంగా స్పందించి.. అవసరమైన సహకారం అందించాలని కేంద్రానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
గిరిజనంపై తిత్లీ గాయం
తిత్లీ తుపాను గిరిజన గూడలను ధ్వంసం చేసింది. జీవనాధారమైన చెట్లను కూల్చేసింది. నిరాశ్రయులుగా మిగిల్చింది. తిండి గింజలు తడిసి ముద్దయ్యాయి. తాగేందుకు నీరు దొరకడం లేదు. కట్టుకునేందుకు బట్టలేదు. తలదాచుకునేందుకు గూడు లేదు. కొండదిగుదామంటే దారిపొడవునా నేలకొరిగిన చెట్లే. 18 రోజులుగా వారు పడుతున్న వేదన వర్ణణాతీతం. వారి బతుకులు హృదయవిదారకరం. కురుపాం మండలంలోని జరడ పంచాయతీకి వెళ్లిన ‘సాక్షి’ బృందానికి గిరిజనులు గోడు వినిపించారు. కన్నీళ్లతో కష్టాలను వివరించారు. విజయనగరం, కురుపాం/గుమ్మలక్ష్మీపురం: తిత్లీ తుపాను కురుపాం మండలంలోని జరడ పంచాయతీ పరిధి లోని వందల సంఖ్యలో ఇళ్లను నేలమట్టం చేసిం ది. గిరిపుత్రుల జీవనాధారమైన జీడి, చింత చెట్లను కూల్చేసింది. చిరుధాన్యాల పంటలను నాశనం చేసింది. తిండిగింజలను తడిపేసి అన్నానికి దూరం చేసింది. నిరాశ్రయులను చేసి దిక్కులేని పక్షులుగా మిగిల్చింది. ఈ నెల 11న వచ్చిన తిత్లీ తుపానుకు జరడ పంచాయతీ పరిధిలోని జరడ, నెమలిమానుగూడ, పొడిదం, కొత్తగూడ,గెడ్డగూడ, ఈతమానుగూడ, పట్టాయి గెడ్డ, చింతమానుగూడ, జంపరకోట గ్రామాల్లో మొత్తం 142 ఇళ్లకు నష్టం వాటిల్లింది. వాటిలో 79 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 63 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో వారంతా ఇప్పటికే జరడ గ్రామంలో మూత పడి ఉన్న గిరి జన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రంతో పాటు జరడ పంచా యతీ భవనాల్లో తలదాచుకుంటున్నారు. ఒక్కో గదిలో మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి. నరకయాతన... తిత్లీ తుపాను ప్రభావంతో సర్వం కోల్పోయిన గిరిజనం సమీపంలో ఉన్నభవనాల గదుల్లో తలదాచుకుంటూ ఏ రోజు కారోజు అటవీ ప్రాం తాలకు వెళ్లి తమ ఆహారాన్ని వండుకునేందుకు కర్రలు, తాగునీటిని సేకరించుకుంటున్నారు. పూర్తిగా నేలమట్టమైన ఇళ్లను చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. మొండిగోడలను తొలగించి కొత్తగా పాకలు/శాలలను నిర్మించుకునే పనుల్లో నిమగ్నమవుతున్నారు. శాశ్వత ఇళ్లు నిర్మించాలని వినతి.. తుపాను అనంతరం జరడ పంచాయతీ పరిధి లోని బాధితులను పరామర్శించిన జిల్లా అధికారులు ఒక్కో ఇళ్లు కోల్పోయిన బాధితునికి రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం అందిచారు. అలా గే, ఒక్కో బాధిత కుటుంబానికి ఒక్కో టార్పలీన్, 25 కేజీల చొప్పున బియ్యం వంటి నిత్యావసర సరుకులు అందజేస్తూ, త్వరలోనే శాశ్వత ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, నేటివరకు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఎన్నిరోజులు ఈ భవనాల్లో తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉందని బాధితులంతా వాపోతున్నారు. అసలే చలికాలం ప్రారంభమవుతుండడంతో ఏజెన్సీలో చలితీవ్రత అధికంగా ఉంటోందని, ఇల్లు లేకపోవడం వల్ల పిల్లాపాపలతో తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తోందంటున్నారు. తమ జీవనాధారమైన చింత, జీడి, చిరుధాన్యాల పంటలపై అధికారులు చిత్తశుద్ధితో సర్వే చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు తమ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని పంచాయతీ ప్రజలు వాపోతున్నారు. ధాన్యం తడిసిపోయాయి.. తిల్లీ తుపానుకు మా ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇంట్లో నిల్వ ఉంచిన 15 బస్తాల తిండి గింజలు(ధాన్యం) తడిసిముద్దాయ్యాయి. వాటిని తీసి చూస్తే ధాన్యం గింజలన్నీ మొలకెత్తి ఉన్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాం. చేసేది లేక మొలకెత్తిన ధాన్యం గింజలనే ఎండబెట్టి, శుభ్రం చేసి మిళ్లాడించి వచ్చిన బియ్యాన్నే ఆహారంగా తీసుకుంటున్నాం.– మండంగి చంద్రకళ, బాధితురాలు, జరడ ఎన్నడూ చూడలేదు నేను ఈ గ్రామంలోనే పుట్టి, ఈ గ్రామంలోనే మనుమాడాను. గత 80 ఏళ్లలో ఇంతటి తుపాను ఎన్నడూ చూడలేదు. ఇంత తీవ్రస్థాయిలో గాలులు మా గ్రామంలో ఎప్పుడూ వీయలేదు. మా గ్రామంలో ఇంత నష్టం జరగడం ఇదే మొదటిసారి. చాలా భయపడిపోయాను.– ఊయక లక్ష్మి, వృద్ధురాలు, జరడ -
తిత్లీ తుఫాన్‌తో నష్టపోయాం
సీతంపేట: తిత్లీ తుఫాన్ ప్రభావంతో బాగా నష్టపోయామని పలువురు గిరిజనులు పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీతంపేట మండలంలోని వజ్జాయిగూడ, పాతవజ్జాయిగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పూరిళ్లు, రేకిళ్లు ఎగిరిపోయాయని, జీడి,మామిడి, అరటి తదితర పంటలకు నష్టం వాటిల్లిందని, రహదారి లేక అనేక అవస్థలు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. గిరిజనోత్పత్తులను మార్కెట్‌కు తీసుకువెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదని, కొద్దిరోజుల కిందట ప్రిన్సిపల్ సెక్రటరీ తమ గ్రామాన్ని సందర్శించి రహదారి నిర్మిస్తామని చెప్పినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ కారణంగా నష్టపోయిన గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వే గడువును పెంచాలన్నారు. బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం పాతలోవగూడ గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్.లక్ష్మి, మండల వైఎస్సార్సీపీ మహిళా కన్వీనర్ ఆరిక కళావతి, పీసా చట్టం ఉపాధ్యక్షుడు నిమ్మక సోమయ్య, పార్టీ నేతలు గణేష్, చంద్రశేఖర్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వైపరీత్యాలను రాజకీయలబ్ధికి వాడొద్దు
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవద్దని, తుఫాను సంభవించినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటించి స్థానిక అధికార యంత్రాగాన్ని ఇబ్బందులకు గురి చేయొద్దని ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీలు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం అన్నారు. జన చైతన్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ 2005లో ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టాన్ని కేంద్రం రూపొందించి అమలులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడేళ్లుగా రూ.1,250 కోట్లను ప్రకృతి విపత్తుల నివారణ కోసం కేంద్రం ఇచ్చిందనీ, అయినా, తిత్లీతుఫాను విషయంలో కేంద్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం పంపిన బృందం నివేదిక అందగానే వెంటనే నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. కాగా, తుఫాను సందర్భంగా కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ నిధులను పెద్దెత్తున ప్రచార కార్యక్రమాలకు వెచ్చించడం విచారకరమన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం మాట్లాడుతూ సీఎం ఒకరోజు జిల్లాలో పర్యటిస్తే రూ.25 లక్షల ఖర్చువస్తుందని, తుఫాను వచ్చిన ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తే ప్రజాధనం వృ«థా కావడమే కాకుండా పోలీసులు, అధికార యంత్రాంగం సీఎం చుట్టూ తిరుగుతారే కానీ, వరదబాధితులకు ఏం సాయం చేస్తారని ప్రశ్నించారు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళంలో సంభవించిన తిత్లీ తుఫాను గ్రామాలు విద్యుత్ లేకుండా చీకట్లో జీవిస్తున్నాయని పేర్కొన్నారు. తిత్లీ తుఫాను ప్రభావం నుండి ఒడిశా వారంలో కోలుకుంటే హైటెక్ సీఎం గా చెప్పుకునే చంద్రబాబు పూర్తిగా విఫలమై ఆ లోపా న్ని కేంద్రంపై రుద్దేందుకు చూస్తున్నారన్నారు. -
నష్టపరిహారం అందించడంలో అవకతవకలు
సాక్షి, శ్రీకాకుళం : తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపరిహారం అందించడంలో అవకతవకలు జరుగుతున్నాయని బాధితులు గొల్లుమంటున్నారు. బాధితుల జాబితాను తయారు చేసేందుకు వచ్చిన పరిశీలన బృందం అర్హుల జాబితాలో తప్పులు ఉండటంతో గ్రామస్థులు అధికారులను నిలదీస్తున్నారు. సమగ్ర సర్వే లేకుండా హడావుడిగా జాబితాలు రూపొందించడం వల్ల బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. పదిహేను రోజులైనా 85 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్దరణ కాలేదని ప్రజలు వాపోతున్నారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరా ఇవ్వకపోవడంతో పలాసలో జీడిపరిశ్రమల కార్మికులు ఆందోళన చేపట్టారు. తుపానుకు నేలకూలిన చెట్లను కూడా తొలగించలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. -
తిత్లీ నష్టం అపారం
శ్రీకాకుళం, కవిటి: తిత్లీ తుఫాన్ కారణంగా కవిటి పరిసర ప్రాంత ఏడు మండలాల పరిధిలో అపార నష్టం వాటిల్లిందని, వీటి నివేదికను కేరళలోని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు అధ్యక్షునికి అందిస్తానని జాతీయ కొబ్బరి బోర్డు సభ్యుడు, సెంట్రల్ ప్లాంటేషన్ రీసెర్చ్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చౌడప్ప వెల్లడించారు. తిత్లీ తుఫాన్ ప్రభావిత ఏడు మండలాల్లో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు సభ్యుల బృందం బుధవారం పర్యటించింది. ఈ సందర్భంగా కవిటి చిక్కాఫ్ కార్యాలయంలో బుధవారం రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిత్లీ తుఫాన్ బీభత్సానికి కొబ్బరి పంట సర్వనాశనమైందని తెలిపారు. ఈ విషయమై త్వరలో భువనేశ్వర్‌లో నిర్వహించనున్న జాతీయ కొబ్బరి బోర్డు పాలకమండలి సమావేశంలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. కేశర్గూడ ఐకార్ పరిశోధనా స్థానం సౌజన్యంతో ఉద్దానం ప్రాంతంలో కొత్త మొక్కల పంపిణీ, కొబ్బరితోటల పెంపకానికి డిమానిస్ట్రేషన్తో కూడిన విధానంలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ రైతులు ఈస్ట్‌కోస్ట్ టాల్ వెరైటీ మొక్కలు సాగు చేస్తున్నారని, దీనికి ప్రత్నామ్నాయంగా సంకరజాతి పొట్టి రకాల మొక్కలు, వెస్ట్‌కోస్ట్ టాల్ వెరైటీ మొక్కల పెంపకంతో కూడా మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు. ఆ రకాల పెంపకానికి ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేసి, కొత్త తోటల అభివృద్ధికి సీడీబీ తరపున కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లపాటు ఎటువంటి ఫలసాయం లేక ఆదాయం రాక ఆర్థికంగా అస్తవ్యస్తమైన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఔషధ మొక్కల పెంపకం, కోకో, దాల్చిన చెక్క, అల్లోవెరా, తదితర పంటల సాగు చేసేందుకు అవకాశాలపై మరోమారు ఈ ప్రాంతంలో పర్యటిస్తామని తెలిపారు. ప్రధానంగా కొత్త తోటల అభివృద్ధికి సాధ్యమైనంత వరకు జాతీయ కొబ్బరి బోర్డు నుంచి శతశాతం సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పర్యటనలో డాక్టర్ సుబ్రమణ్యన్, డాక్టర్ వీ నిరాల్, డాక్టర్ జోసెఫ్రాజ్కుమార్, డాక్టర్ కేపీ చంద్రన్, హార్టీకల్చర్ ఏడీహెచ్ కే చిట్టిబాబు, ఉద్యానశాఖ అధికారి సీహెచ్ శంకర్‌దాస్, చిక్కాఫ్ రైతు సంఘం నేతలు ఆరంగి శివాజీ, బల్లెడ కృష్ణారావు, బొర్ర వెంకటరమణ, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘పెద్దాపురం నుంచే పోటీ చేస్తా’
సాక్షి, అమరావతి: తిట్లీ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెలాఖరు కల్లా సాధారణ పరిస్థితులు తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్ వల్ల పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని, రూ. 4,372 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. తిట్లీ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. అక్టోబర్ 26 నుంచి 30 వరకు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరోసారి పర్యటించి నష్టపరిహారం అందజేస్తారని చినరాజప్ప పేర్కొన్నారు. తుపాన్ బాధితులకు సాయంగా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గవర్నర్ నరసింహన్‌ను కలిస్తే ఆయన ఏమి చేస్తారని ప్రశ్నించారు. తను వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. -
హుదూద్ కన్నా తీవ్రమైనది
శ్రీకాకుళం: జిల్లాలోని 18 మండలాల్లో తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ ఏజెంట్ల, బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. విలేకరులతో ముప్పాళ్ల మాట్లాడుతూ..గతంలో వచ్చిన హుదూద్ తుపాను కన్నా తిత్లీ తుపాను తీవ్రమైన తుపానుగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం తుపాను బాధిత ప్రాంతంపై కన్నెత్తి కూడా చూడకపోవడం చాలా హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. బాధితులకు పూర్తిగా సహాయకచర్యలు చేయకుండానే తెలుగు దేశం ప్రభుత్వం అందరినీ ఆదుకున్నామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. తుపాను బాధితుల ప్రాంతాల్లో ఉపాధి హామీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.300 వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవచ్చవాలులా ఉన్న తుపాను బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. పదేళ్ల ప్యాకేజీని ప్రభుత్వం వారం రోజుల్లోనే ప్రకటించాలని కోరారు. సత్వరమే తుపాను బాధితులను ఆదుకోవాలని, అవసరమైతే అన్ని సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలకు ఏ విషయంపైన ఐనా దీక్షలు చేసే అధికారం ఉంటుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. -
తిత్లీతో గురుకులాల్లో రూ.2.81 కోట్లు నష్టం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 బాలయోగి గురుకుల పాఠశాల్లో తిత్లీ తుఫాన్ వల్ల సుమారు రూ.2.81 కోట్ల నష్టం వాటిల్లిందని గురుకుల పాఠశాలల సమన్వయకర్త వై.యశోదలక్ష్మి కలెక్టర్ ధనంజయరెడ్డికి వివరించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆమె కలిసి గురుకులాల నష్టాల స్థితిగతులను తెలియజేశారు. 10 గురుకుల పాఠశాలల రక్షణ గోడలు పాడయ్యాయని చెప్పారు. చెట్లు పడిపోవడంతో గోడలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. చాలాచోట్ల విద్యుత్ సదుపాయం కూడా లేదన్నారు. కంచిలి, మందస గురుకులాలకు మంగళవారం నాటికీ విద్యుత్ పునరుద్ధరణ కాలేదన్నారు. అనంతరం కలెక్టర్ స్పందిస్తూ పాడైన రక్షణ గోడలు వెంటనే నిర్మించాలని సంబంధింత ఇంజినీరింగ్ సిబ్బందికి ఫోన్లో ఆదేశించారు. విద్యుత్ సరఫరాను తక్షణం పునరుద్ధరించాలని సూచించారు. -
చంద్రబాబు సమర్పించు.. తిత్లీ సినిమా!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావ అధికారులనే విస్మయ పరుస్తోంది. ఇదే ప్రచార యావతో గోదావరి పుష్కర కార్యక్రమాల నిర్వహణను సినిమా తరహాలో చిత్రీకరణకు పూనుకుని తొక్కిసలాటకు కారణమయ్యారని, 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ఎక్కడికక్కడ వీడియోల్లో చిత్రీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖల వద్ద వీడియో కెమెరాలు ఉంటే సరేనని.. లేనిపక్షంలో తక్షణమే వీడియో గ్రాఫర్లను నియమించుకోవాలని సూచించింది. బాధితులకు భోజనం అందించడం, మంచినీటి సరఫరాతో పాటు పడిపోయిన చెట్లు తొలగించడం, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు తుపాను బాధితులతో కలసి ఉన్న ఫొటోలతో కూడిన వీడియోలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వీడియోలన్నింటితో డాక్యుమెంటరీని రూపొందించి సినిమా థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా ప్రచారం పొందాలనేది ముఖ్యమంత్రి యోచన అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక పక్క బాధితులను ఆదుకోవడానికి విరివిగా విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిస్తూ మరోపక్క ప్రజా ధనాన్ని ఇలా ప్రభుత్వ ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హుద్‌హుద్ తుపాను సమయంలో కూడా ప్రచారం కోసం రూ.36.63 లక్షల రూపాయలను వ్యయం చేశారని, సహాయక చర్యలతో ప్రచార ప్రకటనలను జారీ చేశారని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
సిక్కోలును ప్రత్యేక దృష్టితో చూడాలి
సాక్షి, అమరావతి: తిత్లీ తుపాను విధ్వంసం దృష్ట్యా సిక్కోలులో ఉన్న పరిస్థితులను ప్రత్యేక దృష్టితో చూడాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత ప్రజలకు అందాల్సిన సహాయం, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయన అందజేశారు. తుపాను కలిగించిన నష్టం నుంచి శ్రీకాకుళం జిల్లా కోలుకోవాలంటే 15 ఏళ్లకు పైనే పడుతుందని ఆయన తెలిపారు. కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంత వాసులను ఆదుకోవాలని కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను వీడియో ద్వారా పవన్ గవర్నర్‌కు చూపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు వంద శాతం రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దానం ప్రాంతంలో నష్టం కలిగినా ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడం లేదన్నారు. తిత్లీ తుపాను విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అక్కడ 10 రోజులుగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం దీన్ని ప్రచారంగా వాడుకుంటోందని పవన్‌కల్యాణ్ విమర్శించారు. వారి బాధలు బయట ప్రపంచానికి తెలియకపోవడంవల్లే బాధితులు స్థానిక ప్రజా ప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వడంలేదని చెప్పారు. ఈ విషయాలన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి కాగా, హైకోర్టు ఆదేశాలను గౌరవించి పంచాయితీ ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల అధికారాలను నిలబెట్టేలా హైకోర్టు ఆదేశాలు జారీచేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల్లో నిలబడే ధైర్యంలేకే జీఓ నెంబర్ 90ను తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. -
కరెంట్ కోసం రోడ్డెక్కిన తుపాను బాధితులు
-
తుపాన్ బాధితులను కేంద్రం ఆదుకోవాలి: పవన్
సాక్షి, హైదరాబాద్ : తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తుపాను బాధితులను కేంద్ర ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిత్లీ తుపాను ముందు పరిస్థితిని, తర్వాత పరిస్థితిని ఆడియో రూపంలో గవర్నర్‌కు అందించామన్నారు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం సరిపోవడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బృందం తక్షణమే రాష్ట్రంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని, ఏ మూలకు వెళ్లినా సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని పవన్ తెలిపారు. కిలో మీటర్ల దూరం కాలి నడకన తిరిగి పరిస్థితిని అంచనా వేశామన్నారు. తమ నివేదికను గవర్నర్‌కు అందజేశామని, దానిని కేంద్రానికి పంపుతామని గవర్నర్ చెప్పారన్నారు. మత్య్సకారులను ప్రత్యేక సాయం చేయాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పవన్ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ దాటవేశారు. శవాలపై పేలాలు ఏరుకుంటారా? -
నిధులు ఇవ్వకుండా దాతల సాయం కోరుతారా..?
-
కదం తొక్కిన గిరిపుత్రులు
శ్రీకాకుళం, సీతంపేట: తుపాను ప్రభావిత ప్రాంతాలుగా గిరిజ న గ్రామాలను గుర్తించాలని డిమాండ్ చేస్తూ జనం రోడ్డెక్కారు. సీతంపేట ఐటీడీఏ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, గిరిజన సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సీతంపేట నుంచి ఐటీడీఏ వరకు తొలుత ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరం ఎదుట నిరసన తెలియజేశారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో పాటు గిరిజన సంఘాల నాయకులు అక్కడ బైఠాయిం చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంటనష్టం అంచనా వేయడంలో వైఫల్యం చెందారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో సర్వే ఎందుకు చేయలేదంటూ ప్రత్యేకాధికారి చిన్నరాముడు, తహసీల్దార్ అమల, పరిపాలనాధికారి ఆనందరావులను నిలదీశారు. పీహెచ్‌వో సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అంతా అరవకుండా ఉంటే సమాధానం చెబుతానని పరుషంగా అనడంతో మా గోడు వినిపిస్తుంటే అరుస్తున్నారంటావా అంటూ ఎమ్మెల్యే కళావతితో పాటు గిరిజనసంఘం నాయకులు బి.అప్పారావు, పి.కుమార్, సాంబయ్య, తిరుపతిరావు ఒక్కసారిగా ఆగ్రహం చెందారు. ఒకానొక సందర్భంలో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పీహెచ్వోపై అట్రాసిటీ కేసు పెట్టాలంటూ నినాదాలు చేశారు. గిరిజనులంటే అంతచులకనా అంటూ ఆగ్రహించారు. చివరకు పీహెచ్‌వో క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సర్వేకు గడువు పెంచాలి.... ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ పంటనష్టం సర్వేకు పక్షం రోజులు గడువుపెంచి పూర్తిస్థాయిలో సర్వే చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజనులు పండిస్తున్న అన్నిరకాల పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉసిరి, కంది, చింత, పైనాపిల్ తదితర పంటలన్నింటికీ పరిహారం ఇవ్వాలన్నారు. కీసరజోడు, చిన్నబగ్గ, పూతికవలస, కొండాడ, కడగండి తదితర పంచాయతీల పరిధిలో తుపాను కారణంగా భారీగా నష్టం వాటిల్లినా అసలు సర్వే జరగలేదన్నారు. ప్రత్యేకాధికారిని సర్వే కోసం నియమించలేదన్నారు. ఇక్కడ ఐటీడీఏ పీవోను మందస వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మరో అధికారిని సీతంపేటకు నియమించాల్సి ఉన్నా పదిరోజుల తర్వాత నియమించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వీఆర్వోలు ఇష్టానుసారంగా సర్వే చేస్తున్నారన్నారు. గ్రామాలకు వెళ్లి గిరిజనులు లేరని వచ్చేస్తున్నారన్నారు. నాగులుగూడకు ఇప్పటి వరకు మంచినీరు లేదన్నారు. కొండపోడు పట్టాలు ఇచ్చి ఆ భూముల్లో పంటలు నాశనమైతే ఎటువంటి పరిహారం ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొండచీపురు, ఉసిరి వంటివాటిని ఎందుకు గుర్తించలేదన్నారు. పడిపోయిన ఇళ్లు, పాకలు ఏవీ పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. వీటిని కూడా లెక్కిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు జరగలేదన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాలను తుపాను ప్రభావిత ప్రాంతంగా గుర్తించి నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలని గిరిజన సంఘం నాయకులు బి.అప్పారావు,పి.కుమార్, సాంబయ్యలు డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా లేదని వెంటనే పునరుద్ధరించాలన్నారు. జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా ఈ ప్రాంతాన్ని ఇంతవరకు సందర్శించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. సీతంపేట మండలానికి కేటాయించిన ప్రత్యేకాధికారి సరిగా విధులు నిర్వహించడం లేదని ఆరోపించారు. వాటిల్లిన నష్టంపై సమగ్రసర్వే చేయాలన్నారు. తుపాను జరిగిన వెంటనే నివేదిక ఇస్తే ఇంతవరకు పట్టించుకోలేదెందుకంటూ ఐటీడీఏ పరిపాలనాధికారిపై ఆగ్రహం చెందారు. సరిగా సమాధానం చెప్పే అధికారులే లేరంటూ.. ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాబయోగి, అఖిలభారత రైతు కూలీసంఘం జిల్లా నాయకుడు బైరీ కూర్మారావు, ఎంపీపీ ఎస్.లక్ష్మి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ జి.సుమిత్రరావు, మహిళా కల్వీనర్ ఎ.కళావతి, మాజీ సర్పంచ్‌లు ఎస్.రాము, గోపాలు, చెంచయ్య, సాయికుమార్,బి. పకీర్, పార్టీ నేతలు కె.నర్రయ్య, ఎన్.అబ్బాస్,ఎస్.రమేష్, వి.చలపతి, రాజ్‌కుమార్, చంద్రశేఖరరావు,ఎం.ఫల్గుణరావు, గిరిజన సంఘం నాయకులు గంగాధర్, శ్రీరాములు, ఎం.తిరుపతిరావు పాల్గొన్నారు. -
వారంలోనే కోలుకున్న ఒడిశా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సిక్కోలు జిల్లాను కకావికలం చేసిన తిత్లీ విలయం పొరుగునే ఉన్న ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మొ త్తం 17 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. వీటిలో గజపతి, గంజాం, రాయగడ జిల్లాలు బా గా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళంలో తొమ్మిది మం ది చనిపోగా, ఒడిశాలో 61 మంది మృత్యువాత పడ్డారు. 57 వేల ఇళ్ళు కూలిపోగా, ఎక్కడికక్కడ రహదారులు కోతకు గురయ్యాయి. తాగు నీటి సరఫరా వ్యవస్థ, విద్యుత్, వ్యవసాయ రం గాలు దెబ్బతిన్నాయి. ఇంతటి పెను నష్టం సంభవించినా ఒడిశా కేవలం వారంలోపే కోలుకుంది. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి రెండురోజుల కిందటే ప్రకటిం చారు. ముందు జాగ్రత్తతో తప్పిన తిత్లీ ముప్పు తుపాను సమాచారంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాలుగురోజులు ముం దుగానే ప్రత్యేక బృందాలను ఆయా జిల్లాలకు పంపారు. 3 లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలో వేర్వే రు చోట్ల ఏర్పాటు చేసిన 1,112 ఆశ్రయ కేం ద్రాల్లో వీరికి ఆశ్రయం కల్పించారు. బియ్యం, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులను సిద్ధం చేశారు. ‘ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపివేశాం. పవర్ కట్ చేయకపోతే మంటలు రేగే ప్రమాదం ఉండటంతో అన్ని చోట్లా సరఫరా నిలిపివేయాలని స్పష్టంగా ఆదేశాలిచ్చాం. దీంతో ఆ రంగంలో పెనునష్టం తప్పింది. అదేవిధంగా లక్షలాదిమందిని ముం దుగానే తరలించడంతో పాటు వారికి భోజన వసతి, వైద్య సౌకర్యాలను కల్పించాం. మంచినీటి సరఫరాకు ప్రత్యేక ట్యాంకర్లు ముందుగానే ఏర్పాటు చేశాం..’అని గంజాం జిల్లా కలెక్టర్ ప్రేమ్‌చంద్ చౌదరి సాక్షి ప్రతినిధికి తెలిపారు. రూ.750 కోట్లతో తక్షణ సహాయచర్యలు తుపాను దరిమిలా వెంటనే రాష్ట్ర విపత్తు స్పం దన నిధి నుంచి ఒడిశా ప్రభుత్వం రూ.750 కో ట్లు విడుదల చేసింది. ఆ నిధులతో సహాయ, పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. గంజాం, గణపతి, రాయగడ జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లన్నీ పునరుద్ధరించినట్టు ఆ రాష్ట్ర సీఎస్ వెల్ల డించారు. బాగా దెబ్బతిన్న గంజాం జిల్లాలోని సురడా–దరింగబడి మార్గం కూడా పునరుద్ధరించారు. 650 గ్రామీణ ప్రాంతాల్లో 570 గ్రామాలకు తాగు నీటి సరఫరా పునరుద్ధరణ పూర్తి కాగా గ్రామీణ ప్రాం తాల్లో గొట్టపు బావుల మరమ్మతు, పునరుద్ధరణ కూడా పూర్తయింది. గజపతి జిల్లా మినహా మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. పంటనష్టానికి గురైన బాధిత రైతాంగానికి రూ.270 కోట్లకు పైబడి పెట్టుబడి సబ్సిడీ ముం జూరు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సీఎస్ తెలిపారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఒక్కసారి మా త్రమే రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని గంజాం జిల్లా కలెక్టర్ తెలిపారు. ‘సీఎంతో పాటు సీఎస్ ఆదిత్యప్రసాద్, ఉన్నతాధికారులు రాజధాని భువనేశ్వర్ నుంచే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ఆ మేరకు సూచనలిస్తూ సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూశారు’అని చెప్పారు. సీఎం హడావుడి లేదు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఒక్కసారి మాత్రమే రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని గంజాం జిల్లా కలెక్టర్ తెలిపారు. మరోసారి గంజాం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ‘సీఎంతో పాటు సీఎస్ ఆదిత్యప్రసాద్, ఉన్నతాధికారులు రాజధాని భువనేశ్వర్ నుంచే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ఆ మేరకు సూచనలిస్తూ సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూశారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు వరద ప్రాంతాల్లో పర్యటించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు..’ అని చెప్పారు. కాగా రాష్ట్రానికి రూ.2,765 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసి ప్రధానమంత్రికి పట్నాయక్ లేఖ రాశారు. రూ.750 కోట్లు రాష్ట్ర విపత్తు నిధి నుంచి ఖర్చు చేస్తున్నామని మిగిలిన రూ.2,015 కోట్లు జాతీయ విపత్తు నిధి నుంచి విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సిక్కోలులో తొలగని చిక్కులు తుపాను సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం అడుగులు ఇప్పటికీ తడబడుతూనే ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలోని 18 మండలాల్లో తిత్లీ ప్రభావానికి అన్ని రంగాలూ కుదేలవ్వగా.. ఇప్పటికీ ఏ ఒక్క రంగం కూడా పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. జిల్లా వ్యాప్తంగా 38 మండలాల్లోని 4,319 గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం వాటిల్లగా ఆదివారం నాటికి కూడా 1,492 గ్రామాల్లో పునరుద్ధరణ కాలేదని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ గ్రామాలే అంధకారంలో ఉన్నాయని సమాచారం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి చూస్తుంటే పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరగాలంటే కనీసం మరో రెండు వారాలైనా పడుతుందని ఈపీడీసీఎల్ వర్గాలే లోపాయికారీగా అంగీకరిస్తుండటం గమనార్హం. -
పబ్లిసిటీ చేయడంలో చంద్రబాబు దిట్ట
-
మన్యం.. దైన్యం
సీతంపేట: తిత్లీ ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. నాయకులు, అధికారుల హడావుడంతా ఆ గ్రామాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అదే స్థాయిలో నష్టపోయిన మన్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. మైదాన ప్రాంతాల మాదిరిగానే సీతంపేట మన్యంలో భారీ నష్టం సంభవించింది. సుమారు 1500 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిలో ఐదు వందల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇళ్లు, పంటలు, వివిధ రకాల ఆస్తినష్టం సంభవించి గిరిజనులు నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు విద్యుత్ పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ ఆపత్కాలంలో సాయపడాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. కనీసం రేషన్ బియ్యం కూడా పంపిణీ చేయడం లేదని వాపోతున్నారు. 3 వేల ఎకరాల్లో జీడి తోటలు నాశనమయ్యాయి. మిశ్రమ తోటల పెంపకంలో భాగంగా పసుపును అంతర పంటగా వేయగా దానికి కూడా నష్టం వాటిల్లింది. అలాగే మామిడి, బొప్పాయి వంటి పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. 500 ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో ఫైనాపిల్, 300 ఎకరాల్లో అరటి, 200 ఎకరాల్లో కొండచీపర్లు, 200 ఎకరాల్లో కందికి నష్టం వాటిల్లింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సాయం అందాలంటే ఎకరాకు కనీసం 70 మొక్కలు ఉండి వీటిలో 35కుపైగా మొక్కలకు నష్టం వాటిల్లాలి. అది కూడా వేళ్లతో సహా పడిపోతేనే పరిహారం ఇస్తారు. 35 లోపు మొక్కలు పడిపోతే ఎలాంటి పరిహారం రాదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపును అంతర పంటగా సాగుచేస్తున్నందున దానికి కూడా పరిహారం రాదని చెప్పారని వాపోతున్నారు. కొండచీపుర్లకు కూడా పరిహారం అనుమానమేనని అంటున్నారు. తుపాన్ తర్వాత గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరిగిన దాఖలాలు లేవు. సీతంపేట ఏజెన్సీలో 450 గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో 400లకు పైగా గ్రామాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. అలాగే గ్రామాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. నెట్వర్క్ ఎక్కడా లేదు. అత్యవసర సమయాల్లో 108కి ఫోన్ చేయాలంటే కాల్ కలవక ఇబ్బందులు తప్పడం లేదు. గిరిజన ప్రాంతాల పట్ల వివక్ష..గిరిజన ప్రాంతాల పట్ల ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ఇక్కడ ఎక్కువ నష్టం జరిగితే ఒక్క ఉన్నతాధికారి కూడా వచ్చి చూసిన పాపాన పోలేదు. ఎలాంటి సౌకర్యాల కల్పనా లేదు. విద్యుత్ లేక గిరిజనులు అల్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. - విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే తుపాన్ ప్రభావిత మండలంగా సీతంపేటను గుర్తించాలి. అనేక గ్రామాల్లో గిరిజన సంఘం బృందం పర్యటించి 70 శాతం మంది గిరిజనులు నష్టపోయినట్లు గుర్తించింది. ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణం. గిరిజన మంత్రి నక్కా ఆనందబాబు ఇటీవల రోడ్‌షో మాదిరిగా వచ్చివెళ్లారు. ఆయన పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదు. సర్వే నిర్వహించి గిరిజనులకు పరిహారం అందివ్వాలి. – పి.సాంబయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి జీడితోటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. మా గ్రామంలో సర్వే కూడా జరగలేదు. దీంతో అనేక అవస్థలు పడుతున్నాం. – బి.తోటయ్య, చిన్నబగ్గ -
తిత్లీతో సర్వం కోల్పోయాం
శ్రీకాకుళం, సోంపేట: కొడుకు పోయినా చెట్టు ఉందని ఆశగా బతికేవాళ్లమని, ఇప్పుడు తిత్లీ ధాటికి సర్వం కోల్పోయామని తుఫాన్ బాధితులు వైఎస్సార్సీపీ నాయకుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం సోంపేట మండలంలోని తాళభద్ర, సిరిమామిడి, మామిడిపల్లి, టి.శాసనాం, గొల్లవూరు, ఉప్పలాం, రుషికుడ్డ, ఇస్కలపాలేం, గొల్లగండి పంచాయతీల్లో తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా తాళభద్ర పంచాయతీలో పలువురు వృద్ధులు మాట్లాడుతూ.. తమ కుమారులు కిడ్నీ వ్యాధులతో మరణించినా చెట్లు ఉన్నాయనే ధైర్యంతో బతికామని, ఇప్పుడు ఆ ఆశలన్నీ చచ్చిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిమామిడి పంచాయతీలో పలువురు మహిళలు మాట్లాడుతూ ఇళ్లన్నీ పాడైపోయాయని, అంగన్వాడీల వద్ద భోజనం చేస్తూ, పక్కవారింటిలో తలదాచుకుంటున్నామని బోరుమన్నారు. గొల్లవూరు గ్రామంలో ఉద్దానం అభివృద్ధి వేదిక ప్రతినిధులు మోపిదేవితో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదని, పరిహారం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మత్స్యకారులకు కూడా నష్టపరిహారం సరిపోదని మత్స్యకార నాయకులు సూరాడ పాపారావు, బట్టి మాధవరావు తదితరులు తెలిపారు. ఉప్పలాం, ఇస్కలపాలేం, గొల్లగండి పంచాయతీల్లో పాడైన బోట్లు, వలలను చూపించి వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం బాధితుల సమస్యలను సాంతం విన్న మోపిదేవి, దువ్వాడ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం బాధితులకు అందిస్తున్న నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదని తెలిపారు. ఈ పరిహారాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇరవై ఏళ్ల వరకు ఇక్కడి రైతులకు ఆదాయం లభించదని తెలిపారు. ప్రభుత్వం వీరికి అంతర పంటలు వేసుకునే విధంగా ఆర్థిక సాయం చేయాలని సూచించారు. మరో పదిహేను రోజుల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జిల్లాకు చేరుకుంటుందని, ఆయన తిత్లీ బాధితుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటారని బాధితులకు ధైర్యం చెప్పారు. వారితో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్.దాసు, ఉద్దానం ఫౌండేషన్ కన్వీనర్ పిరియా విజయ, మండల కమిటీ అధ్యక్షుడు తడక జోగారావు, కడియాల ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డురాజారావు, మాజీ ఎంపీపీ పి.ఎం.తిలక్, పార్టీ నాయకులు ప్రధాన రాజేంద్ర, జుత్తు నీలకంఠం, ఉగ్రçపల్లితిరుపతిరావు, పాతిన రామమూర్తి,కర్రి కామేశ్వరరావు, గోకర్ల దర్మారావు, గూడ తాతారావు, దుర్యోధన తదితరులు పాల్గొన్నారు. ప్రచార ఆర్భాటానికే బాబు ఆరాటం అరసవల్లి: రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ.. కేవలం ఆర్భాటాలు, ప్రచారాలకే ప్రాధాన్యమిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ముఖ్య నేత మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ఆదివారం అరసవల్లి ఆదిత్యున్ని దర్శించుకున్న అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో తిత్లీ తుఫాన్ బీభత్సంతో ప్రజలు అల్లాడుతుంటే.. ఆ పరిస్థితులను కూడా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రచారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకోవడం మానేసి, ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ ..ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూనే కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు. నష్ట పరిహారాల చెల్లింపులోనూ రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. అవసరానికి మించి నిధులను దుబారా చేయడంలో బాబు సిద్ధహస్తుడని విమర్శించారు. గతంలో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్ సమయంలోనే ఇది రుజువైందని, మళ్లీ ఇప్పుడు తిత్లీలో కూడా కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
ప్రచారం కొండంత..సాయం గోరంత
-
దత్తత తీసుకుంటున్నా
‘తిత్లీ’ తుఫాను బాధితులకు సినీ ఇండస్ట్రీ సాయంగా నిలుస్తోంది. పలువురు హీరోలు తమ వంతు సహాయం చేస్తున్నారు. తాజాగా హీరో రామ్ చరణ్ వరద బాధిత గ్రామాల్లో ఒకదాన్ని దత్తత తీసుకుంటానని ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ‘‘శ్రీకాకుళం, విజయనగరంలోని వరద బాధిత ప్రదేశాలను బాబాయ్ పవన్‌కల్యాణ్ సందర్శించారు. ఒక బాధిత గ్రామాన్ని దత్తత తీసుకోమని నాకు చెప్పారు. ఒకరికి సహాయం చేసి, చిన్న మార్పు తీసుకురాగలిగే స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాబాయ్ ఇలాంటి ఆలోచనతో రావడం సంతోషంగా అనిపించింది. ఈ దిశగా మా టీమ్‌తో చర్చలు జరుపుతున్నాను. ఏ గ్రామాన్ని దత్తత తీసుకుని సహాయం చేయబోతున్నామో మా టీమ్ సర్వే జరిపి, త్వరలోనే మీ అందరికీ తెలియజేస్తాం’’ అన్నారు. -
తిత్లీ బాధిత గ్రామాన్ని దత్తత తీసుకోనున్న చెర్రీ
ఏపీలో తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. తుపాను ప్రభావంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పెద్ద మొత్తంలో సంభవించింది. తిత్లీ తుపాను బాధితులకు సహాయంగా ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు ఆపద సమయంలో తమ వంతు సహాయాన్ని అందిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. అయితే తాజాగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఈ విపత్తు పై స్పందించారు. తుపాను బాధిత ప్రాంతాల్లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తానని తెలిపాడు. ఇప్పటికే తిత్లీ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ సెలబ్రెటీలు అల్లు అర్జున్ 25 లక్షలు, ఎన్టీఆర్ 15లక్షలు, విజయ్ దేవరకొండ 5లక్షలు, నందమూరి కళ్యాణ్ రామ్ 5లక్షలు, వరుణ్ తేజ్ 5లక్షలు, కొరటాల శివ 3లక్షలు, అనిల్ రావిపూడి లక్ష, సంపూర్ణేష్ బాబు యాభై వేలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
బాధితులకు భరోసా..
-
‘తిత్లీ’ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
సాక్షి అమరావతి : తిత్లీ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం కార్యాలయం ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. తిత్లీ తుపాను నష్టం రూ.3,435 కోట్ల అని, తాత్కాలిక సహాయంగా రూ. 1,200 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. గతంలో రాసిన లేఖకు పీఎంవో నుంచి స్పందన లేకపోవడంతో ఆవేదనతో మరో లేఖ రాస్తున్నట్టు చంద్రబాబు తన రెండో లేఖలో ప్రస్తావించారు. కనీసం కేంద్ర బృందం కూడా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదని సీఎం పేర్కొన్నారు. తుపాను నష్టంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రికి విజ్ఞాపన పత్రం ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. తక్షణ సహాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. 2.25 లక్షల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని.. వీరికి సహాయ పునరావాసం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బృందాన్ని పంపి తుపాను నష్టాన్ని అంచనా వేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. -
తుపాను బాధితులను జగన్ కలుస్తారు
సాక్షి, విజయనగరం: శ్రీకాకుళం జిల్లాలోని తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పది పదిహేను రోజుల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బాధితులను స్వయంగా కలుస్తారని చెప్పారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రెండు కమిటీలు రూపొందించిన నివేదికలను వైఎస్ జగన్‌కు అందించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ధర్మాన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ... తుపాను నష్టం గురించి అన్ని వివరాలను జగన్ తెలుసుకున్నారని తెలిపారు. తుపాను కారణంగా రూ. 3,464 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారని, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలకు కరెంట్, నీరు అందించాలని కోరారు. పార్టీలకు అతీతంగా బాధితులకు సహాయం అందించాలని, ఎవరికైనా అన్యాయం చేయాలని చూస్తే వైఎస్సార్ సీపీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. టీడీపీ నేతల చేతివాటం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. మీరు ఇవ్వకపోతే మేమిస్తాం: భూమన తుపాను బాధితులకు యుద్ధప్రాతిపదికన పరిహారం అందించాలని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులందరినీ కలిసి నష్టం అంచనాలు వేస్తున్నామని తెలిపారు. సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ఆరు నెలల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే మొత్తం నష్టం రూ. 3,464 కోట్లు విడుదల చేస్తుందని చెప్పారు. చంద్రబాబు మాటల ముఖ్యమంత్రి తప్పా చేతల సీఎం కాదని విమర్శించారు. -
తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు
-
తిత్లీ తుఫాన్.. వైఎస్సార్ సీపీ నివేదికలు సిద్దం
-
తిత్లీ తుఫాను బాధితులకు బన్నీ సాయం
శ్రీకాకుళంలో భీభత్సం సృష్టించిన తిత్లీ తుఫాను బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, కొరటాల శివ, అనిల్ రావిపూడి, కాజల్, లాంటి స్టార్ తమవంతు సాయాన్ని ప్రకటించారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాధితుల సహాయర్థం 25 లక్షలు అందజేస్తున్నట్టుగా ప్రకటించారు. గతంలో హుదూద్ తుఫాను, చెన్నై వరదలు, కేరళ వరదల సమయంలో కూడా పెద్ద మనసుతో స్పందించిన బన్నీ మరోసారి తన అదే విధంగా స్పందించారు. గతంలో, వైజాగ్ లో వచ్చిన హుద్ హుద్ విపత్తుకి 20 లక్షలు ఇవ్వటమే కాకుండా ఉత్తఖండ్ కి 10 లక్షలు ఇచ్చారు.. ఇటీవల సంభవించిన చెన్నై తుఫాను బాధితులకు అండగా నిలిచి 25 లక్షలు సహాయం చేసారు. ఈ మధ్యే కేరళ వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వటమే కాకుండా వారిలో మనోధైర్యం నింపారు. ఇక ఇప్పుడు తిత్లి తుఫాన్ శ్రీకాకులం ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే అల్లు అర్జున్ కి మొదటి నుండి ప్రత్యేకమైన అభిమానం ఉంది. వారిని ఆదుకునేందుకు అల్లు అర్జున్ 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి తన ఔదార్యం చాటుకున్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని... అభిమానులంతా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా అల్లు అర్జున్ పిలుపిచ్చారు. I am saddened by the news and it's heart wrenching to see the damage done by the Cyclone. I pledge 25 lacs to the victims of the Titli Cyclone, let us all do our bit to help our people in these times of distress. #TitliCycloneVictims — Allu Arjun (@alluarjun) 20 October 2018 చదవండి : ఎన్టీఆర్ 15, విజయ్ దేవరకొండ 5 తుఫాన్ బాధితులకు షకలక శంకర్ సాయం బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం -
తిత్లీ తుఫాన్.. వైఎస్సార్ సీపీ నివేదికలు సిద్దం
సాక్షి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను పెను విధ్వంసం సృష్టించింన విషయం తెలిసిందే. తిత్లీ తుఫాన్ దెబ్బకి చేతికి అందే పంట నీట ముంచింది.. కడుపు నింపే కొబ్బరితోట కూకటి వేళ్లతో పెకిలించింది. ఇళ్లను కూలగొట్టింది. కొన్ని గ్రామాలు పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. తుఫాన్ మరుసటి రోజు జిల్లాలో నదులు ఉగ్రరూపం దాల్చాయి. అయితే ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. (తుపాను బాధితులను జగన్ ఆదుకుంటారు) అంతే కాకుండా తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్.. పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో రెండు కమిటీలను నియమించారు. భూమన కరుణాకర రెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డి శాంతి, పార్టీ జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు రఘురామ్ తదితరులు ఈ కమిటీలలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలు బాధిత ప్రాంతాలలో పర్యటించి నష్టాన్ని అంచనావేసి ఓ నివేదిక రూపొందించింది. ఈ రోజు (శనివారం) సాయంత్రం ఆ పార్టీ అధ్యక్షుడికి రెండు కమిటీలు నివేదికలను అందజేయనుంది. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో తుఫాన్ నష్టం గురుంచి వివరించనున్నారు. (‘తిత్లీ’ బాధితులకు అండగా ఉంటాం) -
పంట దూరమై.. బతుకు భారమై
ఒక ప్రాణం బలైపోయింది. తిత్లీ మిగిల్చిన విషాదాన్ని పెంచుతూ ఓ అభాగ్యురాలు ఊపిరి ఆపుకుంది. తుఫాన్ ధాటికి ధ్వంసమైపోయిన జీడి పంటను చూసి బతుకుపై ఆశలు వదులుకుంది. నాశనమైపోయిన ఆ తోటను చూసి ఆ గుండె తట్టుకోలేకపోయింది. రాకాసి గాలుల ధాటికి నిలువెల్లా చీలిపోయిన చెట్లను చూసి, దిగుబడి ఇక ఉండదనే నిజం తెలిసి సైని నారాయణమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. వజ్రపుకొత్తూరు రూరల్: తిత్లీ మిగిల్చిన విషాదం ప్రాణాలు తోడేస్తోంది. నాశనమైన తోటలు చూడలేక ఉద్దానం బిడ్డలు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో జీడి రైతు సైని నారాయణమ్మ(49) జీడి పంటను పోగొట్టుకుని తట్టుకోలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. కళ్ల ముందే తిత్లీ తుఫాన్ ప్రభావంతో పంట నాశనం కావడంతో దీన్ని జీర్జించుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. తరతరాలుగా తమ సాగులో ఉన్న 2.50 ఎకరాల జీడి పంట తుఫాన్ సృష్టించిన బీభత్సానికి పూర్తిగా పడిపోయింది. పంట సాగు చేసేందుకు చేసిన అప్పులు తీర్చలేక, కళ్ల ముందే మోడు బారిన చెట్లను చూడలేక బతుకు భయంతో ఆమె చనిపోయినట్లు వారు తెలిపారు. పంటను చూడలేక.. ప్రస్తుతం గ్రామాల్లో జరిగిన పంట నష్టాన్ని అధికారులు నమోదు చేస్తుండటంతో మృతురాలి పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ స్వగ్రామానికి రెండు రోజుల కిందటే వచ్చారు. శుక్రవారం ఉదయం తల్లితో కలిసి తోటను చూడడానికి వెళ్లారు. అయితే కనుచూపు మేరకు ఎండిన మోడులు కనిపించడంతో ఆమె భరించలేక ఇంటికి వెళ్లిపోయారు. కుమారుడు తోట చూసి కొద్ది సేపటికి ఇంటికి చేరారు. అప్పటికే ఆమె ఇంటి దూలానికి ఉరి వేసుకుని ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. చుట్టుపక్కల వారి సాయంతో ఆమెను కిందకు దించారు. బతుకంతా కష్టమే.. నారాయణమ్మ కుటుంబానికి జీడితోటే ఆధారం. ఆమె భర్త ఆనందరావు ఏడేళ్ల కిందట చనిపోయారు. దీంతో ఇక్కడ అంతగా ఆదాయం లేక నారాయణమ్మ ఇద్దరు కుమారులు విజయవాడలో ప్రైవేట్ కంపెనీలో పనులు చేసుకుంటున్నా రు. దీంతో మృతురాలు చినవంకలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడు తుఫాన్ ధాటికి పంట పోవడంతో అప్పులు తీర్చలేనేమోనని ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పండగ పూట విషాదం దసరా పండగ నాడు ఆనందంగా గడపాల్చిన చినవంకలో ఆమె మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. తుఫాన్ తాకిడితో సర్వం కోల్పోయిన వారు తమకు తోచిన మేరకు పంటను జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా ఈ వార్త తెలియడంతో అంతా విషాదంలోకి వెళ్లిపోయారు. మృతిరాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్ సీఐ తాతారావు, స్థానిక ఎస్సై కె.వి సురేష్‌లు సంఘటన స్థలానికి చేరుకోని మృతి జరిగిన తీరును పరిశీలించారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. బతుకుతెరువు లేదని బాధపడింది రెండురోజుల క్రితం ఊరు వచ్చాను. అమ్మ నాతో ఆడిన చివరి మాటలు అయ్యా మన జీడి తోట పూర్తిగా పోయింది. మన కు ఇక బతుకుతెరువు లేదు అని బాధపడింది. శుక్రవారం ఇద్దరం కలిసి తోటకి వెళ్లాం. అమ్మ ముందుగానే తిరి గి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది సేపు అయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంతలో అమ్మ చనిపోయి కనిపించింది. గతంలో తం డ్రి.. ఇప్పు తల్లి కూడా మాకు దూరమైంది. సైని దీలిఫ్‌కుమార్, మృతురాలి కుమారుడు -
బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
శ్రీకాకుళం అర్బన్: తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. తుపాను ధాటికి ఉద్దానం ప్రాంత ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయని, వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను ఉద్దానంపై తీవ్రంగా ప్రభావం చూపిందన్నారు. తుపానుతో శ్రీకాకుళం జిల్లా సర్వనాశనమైతే బయట ప్రపంచానికి తెలియకపోవడం దారుణమన్నారు. సీఎం, మంత్రులు, అధికారుల పర్యటనల వల్ల బాధితులకు ఒరిగింది శూన్యమన్నారు. ఎక్కడో కేరళలో తుపాను సంభవిస్తే అక్కడి బాధితులను ఆదుకునేందుకు కోట్ల రూపాయలు సాయం చేశారని, మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళంలో తుపాను సంభవిస్తే ప్రజలను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సాయం కోరతానన్నారు. హుద్‌హుద్ తుపానుకు ఏ విధంగా కేంద్రం సాయం ప్రకటించిందో తిత్లీ తుపానుకు కూడా అదేవిధంగా సాయం ప్రకటించాలని కోరారు. తుపాను బాధితులకు రూ.25 లక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలో చేరారు. చదలవాడకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చదలవాడ లాంటివారి చేరికతో పార్టీ మరింత బలపడుతుందన్నారు. ఈ సందర్భంగా తుపాను బాధితులకు రూ.25 లక్షలు సాయం ప్రకటించారు. -
తుపాను మిగిల్చిన వేదన తనువు చాలించిన మహిళ
వజ్రపుకొత్తూరు రూరల్/టెక్కలి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను మిగిల్చిన నష్టాన్ని భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తమకు జీవనాధారమైన జీడి పంట కళ్ల ముందే నాశనం కావడంతో తట్టుకోలేకపోయింది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఉరి వేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించింది. హృదయ విదారకమైన ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో చోటు చేసుకుంది. సైని నారాయణమ్మ(49) భర్త అనందరావు ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. వారు పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం విజయవాడకు వలస వెళ్లారు. తుపాన్ వల్ల పాడైపోయిన పంట నష్టాన్ని అధికారులు నమోదు చేస్తుండడంతో నారాయణమ్మ పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ స్వగ్రామానికి వచ్చాడు. ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న రెండున్నర ఎకరాల జీడితోటను చూసేందుకు నారాయణమ్మ, దిలీప్‌కుమార్ కలిసి శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లారు. అక్కడ తిత్లీ తుపాన్ ధాటికి విరిగి పడిపోయిన చెట్లను చూసి నారాయణమ్మ తీవ్ర ఆవేదనకు గురైంది. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ విలపించింది. కొడుకును తోట వద్దే వదిలేసి ఇంటికి చేరుకుంది. ఇంటి చూరుకు తాడుతో ఉరివేసుకుంది. ఈ ఘటనపై వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపిరి ఆగిన ఉద్దానం ఉద్దానం... ఉత్తరాంధ్ర కోనసీమ. ఇది ఒకప్పటి మాట. ప్రకృతి పగబట్టింది. తిత్లీ తుపాన్ ఉద్దానంను కబళించింది. పచ్చటి చేలు, తోటలతో అరారుతున్న ప్రాంతాన్ని మరుభూమిగా మార్చేసింది. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి డివిజన్లోని 11 మండలాలు, పాలకొండ డివిజన్లోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాలను తిత్లీ తుపాన్ దారుణంగా దెబ్బతీసింది. జీడితోటలు గంటల వ్యవధిలో నేలకూలాయి. తిత్లీ తుపాన్ వచ్చి పోయి 10 రోజులు గడిచినా ఉద్దానం ప్రాంతంలో పరిస్థితి ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉంది. ఉద్దానం ప్రాంతంలో దాదాపు 84 వేల ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి. తుపాన్ ధాటికి ఇందులో దాదాపు 74 వేల ఎకరాల్లో తోటలు ధ్వంసమయ్యాయి. కాపు కొచ్చిన జీడితోటలు నేలకూలడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. జీడిపప్పు పరిశ్రమపై ఆధారపడిన 19,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి బజారున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తిత్లీ తుపానుతో జీడి పరిశ్రమకు రూ.450 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పలాస ప్రాంతంలో 220 వరకు జీడి పరిశ్రమలు ఉండగా, వీటిలో 183 పరిశ్రమలు నేలమట్టం అయ్యాయి. ఉద్దానం ప్రాంతానికి మళ్లీ పూర్వవైభవం రావాలంటే కనీసం దశాబ్ద కాలం పడుతుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. బోరుమంటున్న జీడి రైతులు 30, 40 సెంట్లు మొదలు 5, 10 ఎకరాల వరకు ఉన్న జీడిరైతుల గోస చెప్పనలవి కాకుండా ఉంది. ఉద్దానం ప్రాంతంలో ఏ రైతును కదిపినా గుండెల్ని పిండేసే కథలే. ఈ ప్రాంతానికి తుపాన్లు, అల్పపీడనాలు కొత్త కాకపోయినా ఇప్పుడు జరిగినంత విధ్వంసం గత 60, 70 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని వాపోతున్నారు. తమ తోటల్లో తామే కూలీలుగా మారాల్సి వస్తుందని ఊహించలేదని బావురుమంటున్నారు. ఇప్పుడు కూలిపోయిన చెట్లను తీసివేయాలంటే ఎకరానికి రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు సాయం కూలిపోయిన చెట్లను తీసివేయడానికి కూడా సరిపోదు. తిరిగి తోటలు వేస్తే మరో ఐదేళ్ల వరకు పంట చేతికి రాదు, ఎలాంటి ఆదాయం ఉండదు. అప్పటిదాకా తామెలా బతకాలని రైతులు ఆవేదనతో కుమిలిపోతున్నారు. పండుగ నాడూ పస్తులే గత సంవత్సరం దసరా పండుగ సందర్భంగా కోలాహలంగా కనిపించిన ఉద్దానం ప్రాంతం ఈసారి వెలవెలబోయింది. పండగ పూటా పస్తులే మిగిలాయి. పోయ్యిలో పిల్లి లేస్తే ఒట్టు. పండక్కి కనిపించే కోలాటాలు లేవు, కర్రసాములు లేవు, చెక్కభజనలు లేవు. అమ్మవారికి పూజలు లేవు. అరక సామాగ్రికి పూజలు లేవు. పశువుల అలంకరణ లేదు. సొంత వాహనాలకు పసుపు కుంకుమలు లేవు. కూలిపోయిన ఇళ్లు, గాలికెగిరిపోయిన ఇంటి పైకప్పులు, మొండి గోడల మధ్య తుపాన్ బాధితులు దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారు. స్వచ్ఛంద సంస్థలు వాహనాల్లో తీసుకొచ్చి పెట్టే తిండి కోసం, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు వండి పెట్టే భోజనం కోసం బాధితులు బారులు తీరుతుండడం చూపరులను కలచి వేస్తోంది. మీ కాళ్లు పట్టుకుంటా.. మంచినీళ్లు ఇవ్వండి తులశమ్మ అనే మహిళ ఆమనపాడు వద్ద జీడితోటల్లో నివాసం ఉంటోంది. ఐదారు కుటుంబాలు తోటల మధ్యనే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయి. తిత్లీ తుపాన్ దెబ్బకు తోటలు నామరూపాల్లేకుండా పోయాయి, ఇళ్లు నేలమట్టమయ్యాయి. పిల్లాజెల్లలతో రోడ్డు మీదున్న ఓ ఇంట్లో తలదాచుకుంటున్న తులశమ్మ అక్కడ ఏదైనా వాహనం కనిపిస్తే ఆపండి ఆపండి అంటూ అడ్డం తగులుతోంది. అయ్యా మీ కాళ్లు పట్టుకుంటా, మంచినీళ్లుంటే ఇవ్వండయ్యా అంటూ వేడుకుంటోంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. -
ఆ గ్రామాల్లో ఎక్కడా తాగునీరు కూడా అందడం లేదు
-
శ్రీకాకుళం జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతంలో అగ్నిప్రమాదం
-
నిలదీస్తే ప్రజల పైనే కేసులు పెడతారా?
-
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా?
సాక్షి, శ్రీకాకుళం: టిట్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ సీనియర్‌నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఎక్కడాకూడా కనబడటంలేదనీ, సాయం చేయమని అడిగితే ప్రజలపై అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాధితులకు ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు నాయుడు వైఫ్యల్యాన్ని ఎండగట్టారు. నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా? అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉంటే తుపానుపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి అచ్చెన్నాయుడు తనకు ఇష్టమెచ్చినట్టు మాట్లాడుతున్నారని.. బాధితులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తుపాను నష్టంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని తమ్మినేని ప్రశ్నించారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు నీవు ముఖ్యమంత్రివా.. రౌడీవా? బాధితులను నోర్ముయ్ అంటావా నీళ్లు ,పాలు ,ఆహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులతోకేసులు పెట్టిస్తావా? తుపాను ప్రాంతంలో నీవు చెప్పిది ప్రజలు వినాలని రుసరుసలాడటం కాదు ప్రజలు చెప్పిన బాధలను వినడం చేయ్ తుపానులో ప్రజలను ఎలా ఆదుకోవాలో ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ ను చూసి తెలుసుకో తుపాను సహాయకబృందాలను నియమించి చక్కగా పరిస్దితిని ఎదుర్కొన్నారు ఆయన నీలాగా తుపానును కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేయలేదు అంతానువ్వే చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తావా నీవు ఇక్కడే ఉంటే ఐఏఎస్ లంతా నీ చుట్టు ఉండి బాబు..బాబు..అంటూ భజనకే సరిపోతుంది వారం దాటినా ఎన్యుమరేషన్ కూడా చేయలేకపోయారు..నష్టం అంచనాలు తీసుకోలేదు. చంద్రబాబు నీవు, నీ మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోండి. బాధితులు చెట్టుకు 5 వేల అడుగుతుంటే 1500 ఇస్తానంటావా? చెట్టు తొలగించేందుకే వేయిరూపాయలవుతుంది ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సింది పోయి తుపాను భాదితులను అవమానిస్తావా? చంద్రబాబు పద్దతి మార్చుకుని హుందాగా వ్యవహరించు పోలీసులు టిడిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. సాయం అఢిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తావా? శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ..ఎంతమందిపై కేసులు పెడతావ్ కేసులను ఎదుర్కొనే సత్తా శ్రీకాకుళం వాసులకు ఉంది ప్రజలు కష్టాలలో ఉంటే నిలదీస్తారు...అంతమాత్రానా కేసులు పెడతారా...చంద్రబాబు అసహనం వీడండి. శ్రీకాకుళం వాసులకు వార్నింగ్ లు ఇస్తారా...బెదిరిస్తారా....అరెస్ట్ లు చేయ్ ,చూస్తాం... మేము పోరాడే సమయం ఆసన్నమైంది. ప్రత్యేక పరిస్దితులు నెలకొన్నాయ్.సహాయం అందిస్తారనే ఆశించాం. చంద్రబాబునీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా 23 మండలాలు ఎఫెక్ట్ అయితే 18 మండలాలు అని ప్రకటిస్తారా. ఇలాంటి సమయంలో పక్షపాతం చూపడం ఏంటి నీ నిర్వాహకం వల్ల నారాయణమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యకు కారకులైన మీపై ఏ కేసు నమోదు చేయాలి అచ్చెన్నాయుడు వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు తుపాను బాదితుల దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడతావ్ అచ్చెన్నాయుడూ.అక్కడ ఓట్లు అడుగుతావా. -
కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు..
-
కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు..
భువనేశ్వర్: ఒడిశాలోని గజపతి జిల్లా లక్ష్మీపుర్ గ్రామంలో గురువారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. టిట్లీ తుపాన్ కారణంగా మరణించిన కూతురి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించే క్రమంలో ఓ తండ్రి ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కి.మీలు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీపుర్ గ్రామానికి చెందిన ముకుంద్ 7 ఏళ్ల కూతురు బబిత అక్టోబర్ 11 వ తేదీన తిత్లీ తుపాన్ కారణంగా సంభవించిన వరదల్లో తప్పిపోయింది. కాగా, సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బుధవారం మహేంద్ర గిరి వద్ద కొండచరియల కింద బబిత మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గురువారం ముకుంద్‌కు చేరవేశారు. అలాగే కూతురి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తేనే.. ప్రభుత్వం నుంచి అందించే పరిహారం అందుతుందని అతనికి తెలిపారు. అలాగే బబిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా.. మృతదేహాన్ని కైన్పూర్ ఆస్పత్రికి తీసుకురావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. కూతురి మృతదేహాన్ని వాహనంలో ఆస్పత్రికి తరలించడానికి డబ్బులు లేని ముకుంద్.. మృతదేహాన్ని ఓ సంచిలో ఉంచి దానిని భుజం వేసుకుని నడుచుకుంటూ వెళ్లాడు. దారి పోడువున చాలా మంది అతన్ని చూస్తూ ఉన్నప్పటికీ.. ఎవరు అతనికి సహాయపడలేదు. ఇలా అతను 8 కి.మీలు ప్రయాణించిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి ఆటో ఏర్పాటు చేసి కైన్పూర్ ఆస్పత్రికి వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీనిపై ముకుంద్ మాట్లాడుతూ.. తన కూతురి మృతదేహాన్ని వాహనంలో తరలించడానికి డబ్బులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తుపాన్ కారణంగా గ్రామానికి వచ్చే దారి దెబ్బతినడంతో.. తానే భుజంపై మోసుకుంటూ వచ్చానని అన్నారు. బబిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడానికి సరైన ఏర్పాట్లు చేయని ప్రభుత్వ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా, ఈ విషయం తెలుసుకున్న గజపతి జిల్లా కలెక్టర్ అనుపమ్ షా మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తుపాన్ కారణంగా కూతురిని కొల్పోయిన ముకుంద్‌కు గురువారం సాయంత్రం 10 లక్షల రూపాయల చెక్ అందజేశారు. -
తుపాను బాధితుల ఆందోళనలు ఉధృతం
-
వైఎస్సార్సీపీ నేత సాయిరాజ్‌పై కేసు
సాక్షి, సోంపేట: తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిరియా సాయిరాజ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సోంపేట ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ బుధవారం తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా సోంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, ఆత్మాహత్యాయత్నం చేసుకున్నందుకు గాను సాయిరాజ్‌పై 309, 341, 353 సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. సాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతపై కేసులు పెట్టడం దారుణమని తుపాన్ బాధితులు మండిపడుతున్నారు. సాయిరాజ్‌పై కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.