సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తుపాను బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమకు తాగునీరు, ఆహారం, పునరావాసం కల్పించాలంటూ తుపాను బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది.
తుపాను బాధితుల సమస్యలు తక్షణమే తీర్చాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. అధికారులు తీరుని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేత సాయిరాజ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించారు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ కార్యకర్తలు, తుపాను బాధితులు అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేయడంతో ఎమ్మార్వో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment