cyclone victims
-
AP: ఇటు ప్రకటన.. అటు సాయం..
సాక్షి, అమరావతి: తుపాను బాధితులకు నిత్యావసరాల సరుకులతోపాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రతి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ శుక్రవారం సాయంత్రం జీవో ఆర్టీ నెంబర్ 67 జారీ చేసింది. ఇప్పటివరకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2,500 చొప్పున అందిస్తూ వస్తున్నారు. తాజాగా పునరావాస కేంద్రాలకు రాని బాధిత కుటుంబాలకు సైతం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మాదిరిగానే ఈ ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్లకు సూచించారు. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 వేల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయగా మిగిలిన కుటుంబాలకు కూడా అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. 2,068 గ్రామాలపై ప్రభావం మిచాంగ్ తుపాను 15 జిల్లాల పరిధిలో 240 మండలాల్లోని 2,068 గ్రామాలపై ప్రభావం చూపినట్లు తేలింది. ఆయా గ్రామాల్లో బాధితుల కోసం 494 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 31,628 మందికి ఆశ్రయం కల్పించారు. 1,32,569 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. 3.71 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేశారు. తక్షణ వైద్యం కోసం 355 శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందించారు. మరోవైపు నిత్యావసరాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, లీటర్ వంట నూనె అందించారు. ఇప్పటివరకు 1,02,844 కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత 16 మండలాల్లో రెండో రోజు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 22 వైద్య శిబిరాలు నిర్వహించి 1,500 మందికి వైద్యసేవలు అందించారు. జ్వర పీడితులను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. పొలాల్లో ముంపు నీటిని తొలగించేందుకు 1,080 మంది ఉపాధి కూలీలను వ్యవసాయ సహాయక చర్యలకు వినియోగించారు. వరద నీటితో యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. తడిచిన ధాన్యం కొనుగోలు తడిచిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం 6,252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనిలో చాలా వరకు తేమ ఉన్న ధాన్యం కావడం గమనార్హం. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్, సివిల్ సప్లయిస్ జిల్లా అధికారి సుధాసాగర్లు ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారు. మేజర్ డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులను వేగవంతం చేశారు. -
తుపాను బాధితులపై సర్కార్ వేధింపులు
సాక్షి, శ్రీకాకుళం : తుపాను ధాటికి సర్వం కోల్పొయి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను చంద్రబాబు సర్కార్ వేధింపులకు గురిచేస్తోంది. సీఎం పర్యటనలో తమకు సాయం అందలేదని చెప్పినందుకు కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. కొత్తూరు మండలం చినవంకలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా సీఎంకు తమ గోడును విన్నవించుకున్నారు. తమకు నీళ్లు, ఆహారం అందడంలేదని సీఎంకు సమాధానం చెప్పారు. దీంతో అధికారులు వారిని ఇబ్బందులకు గురుచేస్తున్నారు. సాయం అందలేదని చెప్పినందుకు అధికారులు తమన వేధిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పరిహారంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వమని కోరినందుకు ముగ్గురు బాధితులపై అక్రమ కేసులు పెట్టి రాత్రంతా జైల్లో పెట్టి వేధించారన్నారు. సహాయం అందడంలేదని చెబితే బెదిరిస్తున్నారని తుపాను బాధితులు వాపోతున్నారు. -
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్-సర్కార్ వేధింపులు
-
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డెక్కిన తుపాను బాధితులు
-
సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని సోంపేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తుపాను బాధితుల పట్ల అధికారులు నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమకు తాగునీరు, ఆహారం, పునరావాసం కల్పించాలంటూ తుపాను బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనకు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. తుపాను బాధితుల సమస్యలు తక్షణమే తీర్చాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అధికారులు తీరుని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేత సాయిరాజ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించారు. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ కార్యకర్తలు, తుపాను బాధితులు అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేయడంతో ఎమ్మార్వో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
ఆకలితీర్చే వారి కోసం ఎదురుచూపు!
సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాను విలయం సృష్టించి 5రోజులు అవుతున్నా! ప్రభుత్వం మాత్రం సరిగా పట్టించుకోవటం లేదు. మంచినీరు, ఆహారం కోసం తుఫాను బాధితులు ఆహాకారాలు చేస్తున్నారు. సహాయక బృందాలు సైతం బాధిత ప్రాంతాలకు చేరుకోకపోవటం గమనార్హం. పాతపట్నం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లోని గ్రామాల ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సమీక్షించినా పనులు అరకొరగానే జరుగుతున్నాయి. ఆదివారం ప్రభుత్వ అధికారుల పనితీరును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు సంబంధిత అధికారలు విద్యుత్ పునరుద్దరణ పనులు వేగవంతం చేశారు. దాదాపు 300గ్రామాలకు అధికారుల బృందాలు ఇంకా చేరుకోలేదు. ఇళ్లుకూలిపోయి నిరాశ్రయులు అయిన వారికి పునరావాసం కల్పించటంలో అధికారులు విఫలమయ్యారు. నాలుగు రోజులు గడిచినా! వందల కొద్ది నిరుపేద కుటుంబాలకు ఇప్పటివరకు అన్నం మెతుకు కూడా దొరకలేదు. -
బాధిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన
కేకే.నగర్: డీఎంకే కోశాధికారి ఎం.కె.స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నేరుగా వెళ్లి వర్దా తుపాన్ ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. తుపాన్ బాధిత ప్రాంతాలను యుద్ధప్రాదిపదికన సరిచేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు. కారులో వెళ్లలేని ప్రాంతాలను బైకుపై వెళ్లి బాధితులకు సహాయకాలు అందజేశారు. వర్దా కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా కొళత్తూరు ప్రాంతంలోని ప్రజలకు ముందస్తు చర్యగా రోగ నిరోధక మందులు, నివారణ సహాయకాలను అందించారు. ఇంకనూ వర్షపునీరు నిల్వతో అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రభుత్వం, కార్పొరేషన్, సంబంధిత విభాగ అధికారులు వెంటనే బాధిత ప్రాంతాలకు వెళ్లి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, తాగునీరు, పాలు వంటి అత్యవసర వస్తువులను కొరత లేకుండా అందజేయడంపై సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. -
శ్రీకాకుళంలో ఉద్రిక్తత
శ్రీకాకుళం: శ్రీకాకుళం రూరల్ మండలం కుందుగానిపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుద్‌హుద్ బాధితుల కోసం నిర్మించ తలపెట్టిన ఇళ్ల కోసం ఎంచుకున్న భూమి విషయంలో నెలకొన్న సందిగ్ధతే ఈ ఉద్రిక్తతకు కారణంగా తెలుస్తోంది. జీడి మామిడి తోటలు ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా.. అందరికి ఆమోదయోగ్యమైన ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గ్రామస్థులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల కిందట గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన అధికారులకు గ్రామస్తులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు. తాజాగా.. శుక్రవారం ఉదయం అధికారులు మరోమారు గ్రామానికి వస్తున్నారనే విషయం తెలుసుకొని ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం తమ పంట భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని.. గ్రామానికి చెందిన కొందరు రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బందితో సహా ఆ ప్రాంతానికి బయలు దేరారు. -
'మేము సైతం'
-
పాటపాడి అదరగొట్టిన బాలయ్య
హైదరాబాద్: పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో హీరోయిజం ప్రదర్శించడంలో నందమూరి బాలకృష్ణ తనకు తానే సాటి. ఫ్యాక్షన్ అయినా యాక్షన్ అయినా బాలయ్య శైలే వేరు. చాలామంది తెలుగు హీరోలు సరదాగా తమ సినిమాల్లో పాటలు పాడినా.. బాలయ్య ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేయలేదు. బాలకృష్ణ పాటపాడితే ఎలా ఉంటుంది? అదీ స్టూడియాలో కాకుండా నేరుగా స్టేజ్ ష్లో పాడితే..! అభిమానులు ఇప్పటి వరకు చూడని ఈ సన్నివేశం ఆదివారం ఆవిష్కృతమైంది. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమంలో బాలయ్య గాయకుడి అవతారం ఎత్తారు. గాయని కౌసల్యతో కలసి పాటపాడి హుషారెత్తించారు. బాలకృష్ణ ఏమాత్రం బెరుకు లేకుండా ప్రొఫెషనల్ సింగర్‌లా పాట పాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్ర పరిశ్రమ ప్రముఖులు కేకలు, విజిల్స్ వేసి బాలకృష్ణను ఉత్సాహ పరిచారు. -
హుదూద్ సహాయార్థం టాలీవుడ్ 'మేము సైతం'
-
హుదూద్ సహాయార్థం టాలీవుడ్ 'మేము సైతం'
హుదూద్ తుపాను బాధితులను ఆదుకోడానికి 'మేము సైతం' అనే భారీ కార్యక్రమాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ చేపడుతోంది. ఈనెల 29, 30 తేదీలలో ఈ బృహత్ కార్యక్రమం ఉంటుందని టాలీవుడ్ ప్రముఖులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కేవలం ఆ రెండు రోజులకు మాత్రమే పరిమితం కాదని, మారథాన్‌లా సాగుతుందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. 29వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు నటీనటులతో డిన్నర్ కార్యక్రమం ఉంటుందని నాగార్జున చెప్పారు. దానిలోకి కేవలం 250 జంటలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో జంటకు టికెట్ ధరను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. జంటలు అంటే.. భార్యాభర్తలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఎవరైనా ఇద్దరి చొప్పున రావాలని తెలిపారు. ఎవరికీ కాంప్లిమెంటరీ పాస్‌లు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అప్పటికప్పుడే మొదటి టికెట్‌ను అల్లు అరవింద్ కొన్నారు. పలు రకాల కార్యక్రమాలు ఉంటాయని, 500 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వివిధ రకాల కార్యక్రమాలకు వివిధ ధరల్లో టికెట్లు నిర్ణయించారు. ఆటలు, పాటలు, డాన్సులు, వినోద కార్యక్రమాలు అన్నీ ఉంటాయన్నారు. వీటన్నింటికి సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా కూడా పొందొచ్చన్నారు. అలాగే సికింద్రాబాద్ క్లబ్బు, ఫిల్మ్‌నగర్ క్లబ్బు లాంటి చోట్ల కూడా దొరుకుతాయన్నారు. ఇతర వివరాలకు memusaitam.com అనే వెబ్సైట్లో కూడా సంప్రదించవచ్చని వివరించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, సురేష్ బాబు, అల్లు అరవింద్, అశోక్ కుమార్, ఇతర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. -
తుపాను బాధితులకు రూ.50 లక్షల విరాళం
పీఎన్‌కాలనీ : రవీం ద్రభారతీ విద్యాసంస్థల చైర్మన్ ఎం.ఎస్.మణి హుదూద్ తుపాను ఆదుకునేం దుకు విరాళంగా రూ. 50 లక్షల చెక్కును శనివారం సీఎం చంద్రబాబును క్యాం ప్ కార్యాలయంలో కలిసి అందజేశారు. హూదుద్ వల్ల విశాఖపట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రకృతి ప్రకోపానికి గురైన బాధితులను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించినట్టు ఆయన ఆదివారం తెలిపారు. -
'బాధితులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాం'
పూసపాటిరేగ (విజయనగరం) : తుపాను బాధితులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. సోమవారం మండలంలోని తిప్పలవలస గ్రామంలో 600 మంది తుపాను బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు సహకారంతో ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, చీర, జాకెట్లను పంపిణీ చేశారు. బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు తరఫున సహకారం అందిస్తున్న వైఎస్సార్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్‌బాబు, చిత్రంలో ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తిప్పలవలసలో పర్యటించి తుపాను బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు సహాయం అందించామన్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాఫెడ్ డెరైక్టర్ కేవీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ నష్టపోయిన బాధితులందరిని ఆదుకుని వారు స్థిమితపడే వరకూ అండగా నిలవాన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి పి. సురేష్‌బాబు, పార్టీ నాయకులు పతివాడ అప్పలనాయుడు, డీసీసీబీ డెరైక్టరు బర్రి చిన అప్పన్న, మహంతి లక్ష్మణరావు, మలుకుర్తి శ్రీనివాసరావు, గుజ్జు సురేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'జన్మభూమి'కి తుపాను సెగ
-
'జన్మభూమి'కి తుపాను సెగ
విశాఖపట్నం: ఏపీలో ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి తుపాను సెగ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమంటూ ఈ కార్యక్రమం చేపట్టారోగానీ ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఈ కార్యక్రమంలో మంత్రులను, అధికారులను జనం నిలదీస్తున్నారు. నిన్న రుణాల మాఫీపై మంత్రులను రైతులు నిలదీస్తే, ఈ రోజు తుఫాను సాయం కోసం బాధితులు అధికారులను నిలదీశారు. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో జన్మభూమి కార్యక్రమం రసాభాసైంది. తమకు తుపాను సాయం అందలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మత్స్యకారులు అధికారులను నిలదీశారు. బాధితులకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మద్దతు పలికారు. టిడిపి నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ** -
అందరికీ ఉచిత బియ్యం
ఆర్డీఓ సూర్యారావు నర్సీపట్నం టౌన్ : తుఫాన్ బాధితులు అందరికీ ఉచిత బియ్యం అందజేస్తామని ఆర్డీఓ కె.సూర్యారావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుపు, గులాబీ కార్డుల లబ్ధిదారులు అందరికీ బియ్యాన్ని అందించాలని డీలర్లను ఆదేశించామన్నారు. 10 కిలోల బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, కారం, నూనె పలు రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేస్తామని చెప్పారు. గులాబీ కార్డులకు నిత్యావసర సరకులు అపమని చెప్పలేదన్నారు. డీలర్ల నుంచి గులాబి కార్డుల లబ్ధిదారుల జాబితా రావడంలో జాప్యం జరిగిందన్నారు. ప్రత్యక్ష నష్టం చవిచూడనప్పటికీ పది రోజులుగా విద్యుత్, మంచినీటి సరఫరా కాక అందరినీ బాధితులుగానే ప్రభుత్వం గుర్తించదని తెలిపారు. ప్రతి గ్రామానికి ప్రస్తుతం తమ తగ్గర ఉన్న తెల్లకార్డుల జాబితా ప్రకారం సరకులు నేరుగా పంపామన్నారు. మండలంలోని గోడౌన్లు వద్ద దించకుండా నేరుగా తహశీల్దార్ల కార్యాలయాలకు చేరవేశామన్నారు. డీలర్లు ఇచ్చిన ఇండెంట్ మేరకు చౌకధరల దుకాణాల వద్దకు పంపామని చెప్పారు. సరకులు తక్కువగా ఇచ్చినా అన్ని రకాలు ఇవ్వకపోయినా లబ్ధిదారులు తమ హక్కుగా భావించి అడిగి తీసుకోవాలన్నారు. మంగళవారంతో పంచదార కూడా అందుబాటులోకి రావడంతో అన్ని సరకులు ఇవ్వాలని ధికారులను ఆదేశించినట్టు ఆర్డీఓ తెలిపారు. -
రూ.4.50 కోట్ల విలువైన సరుకుల పంపిణీ
ఏలూరు : తుపాను బాధిత జిల్లాలకు జిల్లా నుంచి ఇప్పటివరకు రూ.4 కోట్ల 50 లక్షల విలువైన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు పంపించినట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. ఏలూరు కలెక్టర్ ఛాంబరులో జిల్లా రెవెన్యూ అధికారితో సహాయ కార్యక్రమాలపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార పదార్థాలు కాకుండా 8 టన్నుల కూరగాయలు, 75 వేల కొవ్వొత్తులు జిల్లా నుంచి పంపించామన్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుపాను బాధితులకు ప్రభుత్వం చేపట్టిన సహాయక పునరావాస కార్యక్రమంలో వెయ్యి మంది అధికారులు, సిబ్బంది వెళ్లి బాధితులకు సేవలు అందించినట్టు చెప్పారు. జిల్లా నుంచి జేసీ, జెడ్పీ సీఈవో, డీఎస్వోలను ఆయా జిల్లాలకు పంపించి వాటిని పర్యవేక్షించి, బాధితులకు సక్రమంగా నిత్యావసరాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. నేడు జిల్లాకు అధికారులు, సిబ్బంది ఉత్తరాంధ్రలో దాదాపుగా 10 రోజులు పునరావాస కార్యక్రమాల్లో ముందుండి ప్రజలకు సహాయం చేసిన అధికారుల బృందం బుధవారం జిల్లాకు చేరుకోనుందని కలెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజలు తుపాను బాధిత ప్రజలకు సహాయం అందించటంలో ముందంజలో ఉండి జిల్లా యంత్రాంగానికి ఎంతగానో సహకరించాలని కలెక్టర్ తెలిపారు. -
సాయంలోనూ రాజకీయాలా
తాడేపల్లిగూడెం : తుపాను బాధితులకు సాయం చేయడంలోనూ రాజకీయాలు చేస్తారా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉండే ప్రాంతాల్లో మాత్రమే సాయం చేయాలా.. ఇదేం న్యాయం.. అంటూ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం సాయం అందించేవాడు బాధితుడు ఔనా.. కాదా అనేది మాత్రమే ప్రామాణికం కావాలి కానీ అతడు టీడీపీనా, బీజేపీయా అనే కోణంలో చూడడం దారుణమంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక గుణ్ణం ఫంక్షన్ హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వైఖరిపై మంత్రి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో హుదూద్ తుపాను బాధితులకు సాయం అందించే విషయంలో గూడెం ప్రాంతంలో సేకరించిన వస్తువులు, ఇతర సామాగ్రి టీడీపీ నాయకులున్న చోట మాత్రమే పంచాలని, అక్కడికే పంపాలని బాపిరాజు చెప్పినట్టుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది సరైనా పద్ధతా అని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలు చేసే వారికి మునిసిపల్ వైస్ చైర్మన్ లాంటి వ్యక్తులు మద్దతివ్వవచ్చా అని నిలదీశారు. తాను భీమిలి నియోజకవర్గానికి ఇన్చార్జిగా పనిచేశానని, అక్కడ ఎమ్మెల్యే టీడీపీకి చెందినవారని, అలాగని, బీజేపీకి చెందిన తాను సహాయం అందించ లేదా అని మాణిక్యాలరావు ప్రశ్నించారు. మనం సాయం అందించేవాడు నిజమైన బాధితుడా, అతనికి సహాయం సక్రమంగా అందుతుందా అనే కోణంలో మాత్రమే ఆలోచిస్తామన్నారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీను తుపాను వచ్చిన రోజు సాయంత్రం 15 వేల ఆహారపు పొట్లాలను ఇక్కడి నుంచి తీసుకురాగా, అక్కడ పంచామన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడిన వెంటనే సింహాచలం దేవస్థానం నుంచి ఆహార పొట్లాలను తుపాను ప్రభావిత ప్రాంతంలో సిద్ధంగా ఉంచామన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేసుకోవాలి గాని, సహాయ కార్యక్రమాల సమయంలో కాదని మంత్రి విమర్శించారు. ఎన్నికల సమయంలో తాను ఇంటిలో ఉండి రాజకీయాలు చేశానని, ఇలాంటివి తనకు కొత్తేమీ కాదన్నారు. టీడీపీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని మంత్రి సూచించారు. -
పచ్చపాతం
తుపాను బాధితులను ఆదుకోవడంలోనూ అధికార పార్టీ నేతలు పక్షపాతం చూపిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు విడుదల చేసిన సాయం పంపిణీలోనూ బు(వ)రద రాజకీయం చేస్తున్నారు. ప్రకృతి విలయానికి విలవిల్లాడిపోతున్న బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలోనూ మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నారు. బాధితుల కోసం విడుదల చేసిన సరకులనూ తమకు అనుకూలమైన వారికే పంపిణీ చేస్తూ విమర్శలకు తావిస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో హుదూద్ తుపాను ప్రళయం సృష్టిం చింది. దాని ధాటికి తీర ప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లగా.. చాలా వరకు ప్రజలు గూడు కోల్పోయి.. రెక్కలు తెగిన పక్షుల్లా మారారు. జిల్లాలో విజయనగరం డివిజన్లో తుపాను కారణంగా నష్టపోయినవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారికి తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిత్యావసరాలు సరఫరా చేశారు. వాటిని క్షేత్ర స్థాయిలో పంపిణీ చేయటంలో అధికార పార్టీ నాయకులు బు(వ)రద రాజకీయానికి పాల్పడ్డారు. భారీగా వచ్చిన సరకులు తుపాను తక్షణ సాయం కింద జిల్లాకు 2,01,984 ఆహార పొట్లాలు, 10 లక్షల 12 వేల 680 మంచి నీటి ప్యాకెట్లు, 2,01,612 పాల ప్యాకెట్లు, 507.65 టన్నుల బియ్యం, 75.05 కిలో లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో సరకులు జిల్లాకు వచ్చినా పూర్తిస్థాయిలో బాధితులకు అందలేదన్నది ప్రధాన వాదన. వచ్చిన సరకులన్నీ అధికార పార్టీకి చెందిన నేతల చేతుల్లో పెట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వారు తమ వెంట తిరిగిన నాయకులు చే తుల మీదుగా వీటిని పంపిణీ చేయటం తీవ్ర ఆరోపణలకు తావిస్తోంది. వాస్తవానికి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు అందించాల్సి ఉండగా.. మిగిలిన రాజకీయ పార్టీల గుర్తు, మద్దతుతో గెలిచినవారికి ఈ అవకాశం కల్పించలేదు. ఆయా ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలే వాటిని పంచిపెట్టారు. ఉదాహరణకు పూసపాటిరేగ మండలం తిప్పలవలస, పోరాం, కొత్తూరు, కిలుగుపేట, మద్దూరు గ్రామాల్లో ఇప్పటివరకు కనీసం మంచినీటి ప్యాకెట్ కూడా పంపిణీ చేయలేదంటూ ఆ ప్రాంత వాసి రాసుపల్లి ఎర్రమ్మ.. తుపాను బాధిత ప్రాంతాలవారిని పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో గెలిచిన భోగాపురం మండలం రెడ్డికంచేరులోనూ పరిస్థితి ఇదే తరహాలో ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో చంటి పిల్లలకు పాలందక, వృద్ధులకు టీ కూడా కాచి ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ గెలిచిన స్థానాల్లోనూ... విజయనగరం పట్టణంలోని తమ పార్టీకి దక్కని కౌన్సిల్ స్థానాల్లోనూ టీడీపీ నాయకులే తక్షణ సాయాన్ని పంచిపెట్టడం గమనార్హం. అందులోనూ తమకు ఓట్లు వేసినవారికే పంపిణీ చేసి మిగిలిన సరకులను నాయకుల ఇళ్లలో వినియోగించుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సైతం ఆ పార్టీ నాయకులు, కౌన్సిలర్లపై అసంతృప్తి వ్య క్తం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ వారి తీరులో మార్పు రాకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాకు మంచి నీటి ప్యాకెట్లతో వచ్చిన కంటైనర్‌ను గాజులరేగ వద్ద నిలిపి అధికార పార్టీ నాయకులు వారి ఇళ్లకు, బంధువుల ఇళ్లకు పంపిణీ చేసుకున్నారన్న పుకార్లు పట్టణంలో షికార్లు చేస్తున్నాయి. దీంతో అనేకమంది బాధితులు ఇప్పటికీ ఇబ్బందుల నడుమే కాలం వెళ్లదీస్తున్నారు. మండిపడుతున్న బాధితులు తుపాను కారణంగా సర్వం కోల్పోయినవారికి తక్షణ సాయం అందించటంలో ప్రజాప్రతినిధులు రాజకీయ చేయగా.. అధికార యంత్రాంగం తమకేమీపట్టనట్టు వ్యవహరించటంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి రాజకీయాలను ముడిపెట్టడమంత దుర్మార్గం మరొకటి లేదని మండిపడుతున్నారు. తుపాను బీభత్సం సృష్టించి 12 రోజులు గడుస్తున్నా సాయం అందకపోవటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడటం సమంజసం కాదని పేర్కొంటున్నారు. -
నేటి వైఎస్ జగన్ పర్యటన రద్దు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని తుపాను బాధితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులపాటు పరామర్శించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల బుధవారం నాటి పర్యటన రద్దయింది. ఈ విషయూన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. బాధితుల్ని పరామర్శించేందుకు జగన్ సోమవారం రాత్రి శ్రీకాకుళం చేరుకున్న విషయం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వివిధ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఖరారు చేశారు. అయితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలలో మందుగుండు సామగ్రి కంపెనీలో పేలుడు సంభవించి 18 మంది మృంతి చెందిన విషయూన్ని జీర్ణించుకోలేకపోయారు. అక్కడి నేతల ద్వారా మరింత సమాచారం అందుకున్న జగన్ మంగళవారం రాత్రి పర్యటనను కుదించుకుని కాకినాడ బయల్దేరారు. దీంతో రెండో రోజైన బుధవారం పర్యటన రద్దయిందని ధర్మాన పేర్కొన్నారు. నాగుల చవితి తరువాత మరోమారు జగన్ జిల్లాకు రానున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు శ్రీకాకుళం అర్భన్: తుపాను, వరదలతో నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జిల్లా పర్యటనను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కృతజ్ఞతలు తెలిపారు. -
తుపాన్ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
పరిహారం.. ఫలహారం!
సాక్షి, ప్రతినిధి, శ్రీకాకుళం, రిమ్స్‌క్యాంపస్: ఈ ఫోటోలో వ్యక్తిని చూశారా.. వృద్ధురాలికి సాయమందిస్తున్న ఇతన్ని చూసి ఏ రెవెన్యూ అధికారో, మున్సిపల్ అధికారో అను కుంటే పొరపాటే. అలాగని ఉదారంగా తన సొంత ఖర్చు తో సాయం చేస్తున్నారనుకుంటే అంతకంటే తప్పులో కాలేసినట్లే.. ఇంతకీ ఈయనగారెవరు?.. ఈయన చేస్తున్నదేమిటంటే.. శ్రీకాకుళం మున్సిపాలిటీ 33వ వార్డు టీడీపీ ఇన్చార్జి అయిన ఈయన పేరు కరగాన భాస్కరరావు. ప్రభుత్వం తుపాన్ బాధితుల కోసం పంపించిన సరుకులను ఈయన ఇంటి వద్దే.. ఈయన చెప్పిన వారికే పంపిణీ చేస్తున్నారు. అది కూడా పూర్తిస్థాయిలో బాధితులందరికీ అందుతోందా అంటే.. లేదని ఆ వార్డు ప్రజలే స్పష్టం చేస్తున్నారు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ సాయం పంపిణీ తీరు ఇలాగే ఉంది. టీడీపీ నేతలు, కార్యకర్తల కనుసన్నల్లోనే అంతా జరగుతోంది. బాధితుల్లోనూ పార్టీ భేదం చూస్తున్నారు. అర్హులు కాకపోయినా అధికార పార్టీ కార్యకర్తలు సాయాన్ని భోంచేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు సరుకులను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ ఆధ్వర్యంలోనే.. హూదూద్ తుపాను బాధితులకు ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం సహాయ చర్యలు చేపడుతోంది. బాధితులకు భోజన పొట్లాలతోపాటు బియ్యం, పప్పులు, ఉప్పు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. పట్టణాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది, సర్పంచ్ల ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పక్కదారి పట్టిస్తూ బాధితులకు మొండి చెయ్యి చూపిస్తున్నారు. పేరుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్నా అంతా టీడీపీ వారి కనుసన్నల్లోనే సాగుతోంది. ఇందులోనూ రాజకీయం జరుగుతోంది. జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు మున్సిపల్ వార్డుల్లో సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ కార్యకర్తలను నియమించిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చాయి. అయినా ఇప్పుడు వారికే తుపాను, వరద బాధితులకు అందిస్తున్న సహాయాన్ని పంపిణీ చేసే బాధ్యత కట్టబెట్టడం విస్మయం కలిగిస్తోంది. సరుకుల సరఫరా అంతంత మాత్రమే... బియ్యం, పప్పు, వాటర్, పాల ప్యాకెట్ల సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. వార్డులకు, గ్రామాలకు వచ్చిన సరుకులను టీడీపీ నేతల ఇళ్లకు చేర్చి, వారి ఇష్టం వచ్చినట్లు పంపిణీ చేస్తున్నారు. అది కూడా అసలైన బాధితులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. టీడీపీ సానుభూతిపరులకే ఎక్కవగా అందుతోంది. ముఖ్యంగా మహిళా పొదుపు సంఘాల సానుభూతి పొందాలన్న ఉద్దేశంతో బాధితులు కాకపోయినప్పటికీ వారికే సరుకులు అందజేస్తున్నారు. నాగావళి వరదతో జలదిగ్బంధంలో చిక్కుకున్న తమకు ఏమాత్రం సాయం అందలేదని శ్రీకాకుళం పట్టణంలోని తురాయి చెట్టు వీధి బాధితులు ఆవేదన చెందుతున్నారు.33వ వార్డు అయ్యప్ప కాలనీ వాసులదీ ఇదే అనుభవం. శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతీపేట, తుమ్మావీధి, హడ్కోకాలనీ, అయ్యప్పకాలనీ తదితర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, డ్వాక్రా సంఘాలు తమ వారికే సరుకులు పంపిణీ చేస్తున్నారు. కంపోస్ట్ కాలనీలో లక్ష్మీ రాజ్యం అనే కార్యకర్త తనకు నచ్చిన వారికే సరుకులు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయాలకు వచ్చిన సరుకులను పలువురు టీడీపీ నాయకులు తమ వెంట తీసుకుపోయి తమ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తూ హంగామా చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో పాల ప్యాకెట్లు బాధితుల కోసం అధికారులు సరఫరా చేయాల్సిన పాల ప్యాకెట్లలో సగానికి పైగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. బాధితులకు అందించాల్సిన పాల ప్యాకెట్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు లెక్కకు మించి ఇచ్చేస్తుండగా వారు ఆ ప్యాకెట్లను టీ దుకాణాలు, హోటళ్లకు ప్యాకెట్ రూ.15 చొప్పున అమ్ముతున్నారు. అలాగే వాటర్ ప్యాకెట్ బస్తాలను కూడా బయటకు తరలించి రూ.50 రేటుకు అమ్ముకుంటున్నారు. కొన్ని చోట్ల 25 కేజీల బియ్యానికి బదులు పది కేజీలే ఇస్తున్నారు, స్వచ్చంద సంస్థలు అందజేసిన సరుకులు కూడా నాయకులు చెప్పిన చోటకే వెళ్తున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసినా అధికార పార్టీ కార్యకర్తలైనందున ఏమీ అనలేక మౌనం వహిస్తున్నారు. కమిటీలు సూచించిన వారికేనా? బాధితులందరినీ ఒకేలా చూడాలి. అందరికీ పరిహారం అందాలి. కానీ చాలా చోట్ల ఇలా జరగడం లేదు. తుపాను నేపథ్యంలో పనికి వెళ్లనివారికి సాయం కింద ప్రభుత్వం రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. మత్స్యకార గ్రామాల్లో ఇప్పటికీ అర్హులను గుర్తించలేకపోయారు. వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ప్రాంతాల నుంచి వస్తున్న సరుకుల్ని సకాలంలో పంపిణీ చేయాలి. కానీ నేతలు సూచించినవారికే సరుకులు అందించాలని భావించడంతో అవి కుళ్లిపోతున్నాయి. ఎవరి ద్వారా ఎంత సరుకొస్తోంది అన్న విషయంలో కూడా స్పష్టత కరువైంది. మూడు నాలుగు రోజుల నుంచి సరుకులు పంపిణీ చేస్తున్నామని నేతలు చెబుతున్నా పూర్తిస్థాయిలో బాధితులకు మాత్రం అందడం లేదు. ఇదేంటని నేతల్ని ప్రశ్నిస్తున్నా ‘మాకొచ్చిన సరుకుల్లో ఎవరు ముందొస్తే వారికిచ్చేస్తున్నాం, పూర్తిస్థాయిలో రాకపోవడంతో అక్కడక్కడ ఇలా జరుగుతోంద’ని చెప్పుకొస్తున్నారు. -
తుపాను బాధితులకు అండగా ఉంటాం
ఏలూరు (టూటౌన్) : హుదూద్ తుపాను బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఆయన స్పందించి జిల్లా నుంచి రూ.5 లక్షల విలువైన నిత్యావసర వస్తువులను విశాఖపట్టణానికి పంపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విశాఖ వెళ్లి సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. శుక్ర, శనివారాల్లో విశాఖలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వెయ్యి కుటుంబాలకు సరిపడా బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, మంచినూనె, చింతపండుతో పాటు ఒక్కో దుప్పటి చొప్పున అందచేశారు. పార్టీ తరఫున ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆళ్ల నాని బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపారు. విశాఖ జిల్లాలో తీవ్రంగా నష్టం జరిగిన మధురవాడ గ్రామంతో పాటు కొండపైనున్న ప్రజలను కలిసి వారిని ఓదార్చారు. అంతేకాకుండా వేంబో కాలని, వీఎం పాలెం, చాకలిగడ్డ కాలనీ, స్వాతంత్ర నగర్, రిక్షా కాలని, ధర్మపురి కాలని, పులకవాని గ్రామం, చంద్రంపాలెం, శివశక్తినగర్, టైలస్ కాలనీ, దోబికాలనీ, బాపూజీ నగర్, వికలాంగుల కాలనీ, టీవీఆర్ కాలనీ వాసులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆళ్ల నానితో పాటు విశాఖపట్నం వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి సీతారాం, ఏలూరు నియోజకవర్గ నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఎన్.సుధీర్‌బాబు, మంచెం మైబాబు, సుంకర చంద్రశేఖర్, కంచన రామకృష్ణ, కర్రి శ్రీనివాస్, వేగి ప్రసాద్, బోడా కిరణ్, కలవకొల్లు సాంబశివరావు, మజ్జి కాంతారావు, మున్నల జాన్‌గురునాథ్, మాకినేని వెంకటేశ్వరరావు, బుద్దాల రాము, కోమర్తి మధు, మంగం ఆది తదితర నాయకులు, కార్యకర్తలు ఆయనతో పాటు పాల్గొన్నారు. మరిన్ని విరాళాలు సేకరిస్తాం జిల్లా కార్యకర్తలు, నాయకులను సమన్వయపరిచి ప్రజల సహకారంతో రోడ్లపైకి వచ్చి జోలె పట్టి బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆళ్ల నాని తెలిపారు. విశాఖపట్నంలో ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని దగ్గరుండి గమనించిన నాని పెద్ద ఎత్తున జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా కార్యకర్తలు, నాయకులతో చర్చిస్తున్నట్టు చెప్పారు. -
రండి బాబూ రండి... చార్జింగ్ పెడతాం!
రిమ్స్‌క్యాంపస్: ‘‘రండి బాబు రండి... మీ ఇళ్లలోని ఇన్వర్టర్ బ్యాటరీలు, సెల్ఫోన్లకు చార్జింగ్ పెడతాం... బ్యాటరీకి రూ.500, సెల్‌ఫోన్‌కు రూ.20, చార్జింగ్ లైటుకు రూ.30. వెళ్లిపోతే అవకాశం మళ్లీరాదు. రండి బాబు రండి’’ ఇదంతా ఏంటీ అనుకుంటున్నారా. చార్జింగ్ పెడతామంటూ ఆటోపై జనరేటర్ పెట్టుకుని వీధుల్లో తిరుగుతున్నారు. హుదూద్ తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిచిపోయిన సంగతి తెలిసిందే. సెల్ఫోన్లకు కూడ చార్జింగ్ లేని దుస్ధితి ఏర్పడింది. ప్రజలంతా సెల్‌ఫోన్ చార్జింగ్, ఇన్వర్టర్ బ్యాటరీల చార్జింగ్ కోసం పలు దుకాణాల్లో ఉన్న జనరేటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీన్ని గుర్తించిన కొంతమంది జనరేటర్‌నే ఆటోపై పెట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు. ఇన్వర్టర్ బ్యాటరీల్లో చిన్నవాటికి(90 ఏహెచ్, 100 ఏహెచ్) చార్జింగ్ పెట్టేందుకు రూ.300, పెద్దవి(120 ఏహెచ్, 150 ఏహెచ్, టాల్ ట్యూబులర్ బ్యాటరీలకు) చార్జింగ్ పెట్టేందుకు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. సెల్ ఫోన్ చార్జింగ్కు రూ.20 తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆటోలపై ఉల్లిపాయలు, మామిడి కాయలు, కూరగాయాలు అమ్మటాన్ని చూసిన ప్రజలు ఇప్పుడు ఈ వైనాన్ని చూశారు.