
'జన్మభూమి'కి తుపాను సెగ
విశాఖపట్నం: ఏపీలో ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి తుపాను సెగ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమంటూ ఈ కార్యక్రమం చేపట్టారోగానీ ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఈ కార్యక్రమంలో మంత్రులను, అధికారులను జనం నిలదీస్తున్నారు. నిన్న రుణాల మాఫీపై మంత్రులను రైతులు నిలదీస్తే, ఈ రోజు తుఫాను సాయం కోసం బాధితులు అధికారులను నిలదీశారు.
విశాఖపట్నం జిల్లా పూడిమడకలో జన్మభూమి కార్యక్రమం రసాభాసైంది. తమకు తుపాను సాయం అందలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మత్స్యకారులు అధికారులను నిలదీశారు. బాధితులకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మద్దతు పలికారు. టిడిపి నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు.
**