Janmabhumi program
-
'జన్మభూమి'ని బహిష్కరించిన గ్రామస్తులు
డీ. హీరేహళ్ (అనంతరం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని ఒక గ్రామస్తులు బహిష్కరించారు. ఈ సంఘటన శనివారం అనంతపురం జిల్లా డీ. హీరేహళ్ మండలం మలపనగుడి గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. మలపనగుడి గ్రామంలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మా సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు వచ్చి జన్మభూమి అంటే ఎలా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. -
'బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..భయపడేది లేదు'
నెల్లూరు/ప్రకాశం : ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం శీలంవారిపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామంలో పనులేమీ జరగలేదని సీఎంకు గ్రామస్తులు ఫిర్యాదుచేశారు. అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. కేసులు పెడతామంటూ కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. అయినా భయపడేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు చేపట్టిన జన్మభూమి సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈదురుగాలులు వీచడంతో కార్యక్రమానికి ఏర్పాటుచేసిన టెంట్లు కూలిపోయాయి. దీంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. సీఎం చంద్రబాబు కాన్వాయ్ అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జ్ చిత్రీకరించిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియా నుంచి పోలీసులు కెమెరాలు లాక్కుని విజువల్స్ తొలగించారు. -
'జన్మభూమి'కి తుపాను సెగ
-
'జన్మభూమి'కి తుపాను సెగ
విశాఖపట్నం: ఏపీలో ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి తుపాను సెగ తగిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమంటూ ఈ కార్యక్రమం చేపట్టారోగానీ ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఈ కార్యక్రమంలో మంత్రులను, అధికారులను జనం నిలదీస్తున్నారు. నిన్న రుణాల మాఫీపై మంత్రులను రైతులు నిలదీస్తే, ఈ రోజు తుఫాను సాయం కోసం బాధితులు అధికారులను నిలదీశారు. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో జన్మభూమి కార్యక్రమం రసాభాసైంది. తమకు తుపాను సాయం అందలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మత్స్యకారులు అధికారులను నిలదీశారు. బాధితులకు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మద్దతు పలికారు. టిడిపి నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. **