పాటపాడి అదరగొట్టిన బాలయ్య | Balakrishna sings at Memu Saitam programme | Sakshi
Sakshi News home page

పాటపాడి అదరగొట్టిన బాలయ్య

Published Sun, Nov 30 2014 12:43 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

పాటపాడి అదరగొట్టిన బాలయ్య - Sakshi

పాటపాడి అదరగొట్టిన బాలయ్య

హైదరాబాద్: పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో హీరోయిజం ప్రదర్శించడంలో నందమూరి బాలకృష్ణ తనకు తానే సాటి. ఫ్యాక్షన్ అయినా యాక్షన్ అయినా బాలయ్య శైలే వేరు. చాలామంది తెలుగు హీరోలు సరదాగా తమ సినిమాల్లో పాటలు పాడినా.. బాలయ్య ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేయలేదు. బాలకృష్ణ పాటపాడితే ఎలా ఉంటుంది? అదీ స్టూడియాలో కాకుండా నేరుగా స్టేజ్ ష్లో పాడితే..! అభిమానులు ఇప్పటి వరకు చూడని ఈ సన్నివేశం ఆదివారం ఆవిష్కృతమైంది.

హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమంలో బాలయ్య గాయకుడి అవతారం ఎత్తారు. గాయని కౌసల్యతో కలసి  పాటపాడి హుషారెత్తించారు. బాలకృష్ణ ఏమాత్రం బెరుకు లేకుండా ప్రొఫెషనల్ సింగర్లా పాట పాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్ర పరిశ్రమ ప్రముఖులు కేకలు, విజిల్స్ వేసి బాలకృష్ణను ఉత్సాహ పరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement