memu saitam
-
దివ్యాంగుల కోసం మేము సైతం
టాలీవుడ్ స్టార్స్‌తో వారం వారం వినూత్న సేవా కార్యక్రమాల ద్వారా నిస్సహాయులను ఆదుకుంటున్న కార్యక్రమం ‘మేము సైతం’. దివ్యాంగులైన 60మంది బాలబాలికలతో జరిపాకలో వీరబాబు, సత్యకళ దంపతులు ఆశ్రమం నడుపుతున్నారు. ఆశ్రమ భవన నిర్మాణానికి అండగా నిలిచేందుకు హీరో సాయిధరమ్ తేజ్ స్వీట్ స్టాల్ నడిపి వినూత్న సేవ చేశారు. దివ్యాంగులను ఆదుకునేందుకు ఆయన చేసిన ఈ కార్యక్రమం ‘మేము సైతం’ లో ఈ రోజు రాత్రి 9:30 గంటలకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది. -
రైతుబజార్లో మూటలు మోసిన రానా
మంచు లక్ష్మీ ప్రసన్న వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న ఓ కార్యక్రమం కోసం టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించి, ఆ విరాళాలను సమాజసేవకు వినియోగించనున్నారు. మేము సైతం పేరుతో రూపొందుతున్న ఈ కార్యక్రమం కోసం టాలీవుడ్ యంగ్ జనరేషన్ తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కేపీహెచ్‌బీ మంజీరామాల్ ఎదురుగా ఉన్న మార్కెట్లో కూరగాయలు అమ్మగా, యంగ్ సెన్సేషన్ అఖిల్ ఖమ్మంలో ఆటో నడిపాడు. తాజాగా టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. రైతుబజార్లో కూరగాయల మూటలు మోస్తూ కూలీ అవతారం ఎత్తాడు రానా. కూరగాయల మూటలు మోస్తూ కొంతదూరం తీసుకెళ్లి అక్కడ వేశాడు. ఇందుకోసం ఖాకీ దుస్తులు ధరించి, మెడలో ఎర్ర తువ్వాలు వేసుకుని అచ్చంగా కూలీలా మారిపోయాడు. తన షో కోసం రానా చేసిన సాయానికి మంచు లక్ష్మీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసింది. Thank u for putting the initiative together!! https://t.co/Co8KFkmRAQ — Rana Daggubati (@RanaDaggubati) February 10, 2016 So humbled @RanaDaggubati you inspire to give more. Thank you for being a part of #memusaitham. Together we can https://t.co/Eh40YGLa3d — Lakshmi Manchu (@LakshmiManchu) February 10, 2016 -
జూనియర్ హీరోయిన్లంటే అంత అలుసా?
కొంతమంది హీరోలు, హీరోయిన్లు మేముసైతం కార్యక్రమాన్ని పట్టించుకోలేదంటూ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఎవరినీ ఆయన నేరుగా పేరుపెట్టి ప్రస్తావించకపోయినా.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్న కొంతమంది చిన్న నటీమణులు భరద్వాజ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏవైనా ప్రైవేటు ఫంక్షన్లకు ఆహ్వానం రాకపోయినా.. పాసులు అడిగి మరీ హాజరవుతారని, ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం మొహం చాటేస్తున్నారని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలకు హీరోయిన్ల నుంచి అంతే రియాక్షన్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చిన అర్చన ...తమ్మారెడ్డి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జూనియర్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది. సీనియర్లు కూడా స్టేజ్ ప్రదర్శన ఇవ్వలేదని, అలాంటిది తమమీదే ఎందుకని నోరు పారేసుకుంటున్నారని వాపోయింది. తెలుగు, నాన్ తెలుగు అమ్మాయిలనే మాటలతో తాము విసిగిపోయామని, తామంతా తెలుగు సినీ పరిశ్రమలో భాగమేనని చెప్పింది. ఈ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అక్కడే ఉన్నానని తెరలిపింది. మేము సైతం కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొన్నానని రీతూ వర్మ తెలిపింది. సీఎం సహాయ నిధికి చెక్కు ఇచ్చినట్లు తెలిపారు. ఈ వివాదంలోకి తన పేరును ఎందుకు లాగారో అర్థం కావటం లేదని ఆమె వాపోయింది. ఈ కార్యక్రమం కోసం తన ఫ్యామిలీ ఫంక్షన్ కూడా మిస్ అయ్యాయని తెలిపింది. తాను నటి శ్రియతో పాటు గోపాల గోపాల సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖలో ఉన్నానని మరోనటి మధుశాలిని చెప్పారు. తాను హైదరాబాద్ వచ్చినప్పుడు మంచు విష్ణు నుంచి ఫోన్ వచ్చిందని. తన కబడ్డీ జట్టులో ఆడాలని కోరినట్లు చెప్పింది. మ్యాచ్ జరిగే వేదిక దగ్గరకు వెళ్లానని, ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనేందుకు వేరే స్టేడియం వరకు వెళ్లానని చెప్పింది. తర్వాత తనను ముఖ్యవేదిక వద్దకు అంత్యాక్షరిలో పాల్గొవాలని ఆహ్వానించారని...వాళ్లు చెప్పినవన్నీ తాను చేశానని మధుశాలిని చెప్పింది. తనకు ఆరోగ్యం బాగోలేకపోయినా 'మేము సైతం' రిహార్సల్ కు హాజరయ్యానని పూనం కౌర్ తెలిపింది. క్రికెట్, కబడ్డీతో పాటు ప్రధాన కార్యక్రమాలకు జట్లు ప్రకటించిన మూడు రోజులు అక్కడే ఉన్నానంది. హూద్ హుద్ బాధితులకు లక్ష విరాళం ఇచ్చినట్లు చెప్పింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేస్తున్నామని, చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపింది. ఇంతకు ముందు జమ్మూకశ్మీర్ బాధితుల సహాయర్థక నిధుల సేకరణలోనూ తన భాగస్వామ్యం ఉందని చెప్పింది. 'ఈ రోజుల్లో' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన రేష్మా... ఓ తెలుగు సినిమా షూటింగ్ నిమిత్తం తమిళనాడులో ఉన్నానని, అసలు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తనను ఎవరూ కోరలేదని తెలిపింది. పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని కూడా ఎవరూ అడగలేదని తెలిపింది. నిర్వాహకులు అడిగి ఉంటే.. తాను చిత్ర నిర్మాతను రిక్వెస్ట్ చేసి ఈవెంట్ లో పాల్గొనేందుకు ప్రయత్నించేదాన్నని తెలిపింది. -
మీ కొమ్మలలోచివురులు మేమై..
-
'అగ్రశేణి నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తా'
-
'అగ్రశేణి నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తా'
హైదరాబాద్: విశాఖపట్నంను అగ్రశేణి నగరంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. హుద్ హుద్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా పరిశ్రమ నిర్వహించిన 'మేముసైతం' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుద్ హుద్ తుపాను కారణంగా నష్టపోయిన విశాఖను పునర్ నిర్మాణం చేస్తామని అన్నారు. భవిష్యత్ లో తుపానులు వచ్చినా ఏమీ చేయనివిధంగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వైజాగ్ ను సుందరమైన నగరంగా తయారుచేస్తాని హామీయిచ్చారు. రెండు ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. తుపానే అసూయపడేంతగా సినిమా పరిశ్రమ స్పందించిందని మెచ్చుకున్నారు. సినిమా పరిశ్రమ సేకరించిన విరాళాలతో ఓ మోడల్ కాలనీ అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. తెలుగు సినిమా పరిశ్రమ సేకరించిన 11 కోట్ల 56 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కును ఈ సందర్భంగా చంద్రబాబుకు సినిమా ప్రముఖులు అందజేశారు. మంత్రులు చింతకాల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సినిమా ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మురళీమోహన్, జయప్రద, సుమలత, కె.రాఘవేంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'మేము సైతం'
-
పాటపాడి అదరగొట్టిన బాలయ్య
హైదరాబాద్: పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో హీరోయిజం ప్రదర్శించడంలో నందమూరి బాలకృష్ణ తనకు తానే సాటి. ఫ్యాక్షన్ అయినా యాక్షన్ అయినా బాలయ్య శైలే వేరు. చాలామంది తెలుగు హీరోలు సరదాగా తమ సినిమాల్లో పాటలు పాడినా.. బాలయ్య ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేయలేదు. బాలకృష్ణ పాటపాడితే ఎలా ఉంటుంది? అదీ స్టూడియాలో కాకుండా నేరుగా స్టేజ్ ష్లో పాడితే..! అభిమానులు ఇప్పటి వరకు చూడని ఈ సన్నివేశం ఆదివారం ఆవిష్కృతమైంది. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమంలో బాలయ్య గాయకుడి అవతారం ఎత్తారు. గాయని కౌసల్యతో కలసి పాటపాడి హుషారెత్తించారు. బాలకృష్ణ ఏమాత్రం బెరుకు లేకుండా ప్రొఫెషనల్ సింగర్‌లా పాట పాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్ర పరిశ్రమ ప్రముఖులు కేకలు, విజిల్స్ వేసి బాలకృష్ణను ఉత్సాహ పరిచారు. -
హుదూద్ సహాయార్థం టాలీవుడ్ 'మేము సైతం'
-
హుదూద్ సహాయార్థం టాలీవుడ్ 'మేము సైతం'
హుదూద్ తుపాను బాధితులను ఆదుకోడానికి 'మేము సైతం' అనే భారీ కార్యక్రమాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ చేపడుతోంది. ఈనెల 29, 30 తేదీలలో ఈ బృహత్ కార్యక్రమం ఉంటుందని టాలీవుడ్ ప్రముఖులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కేవలం ఆ రెండు రోజులకు మాత్రమే పరిమితం కాదని, మారథాన్‌లా సాగుతుందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. 29వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు నటీనటులతో డిన్నర్ కార్యక్రమం ఉంటుందని నాగార్జున చెప్పారు. దానిలోకి కేవలం 250 జంటలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో జంటకు టికెట్ ధరను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. జంటలు అంటే.. భార్యాభర్తలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఎవరైనా ఇద్దరి చొప్పున రావాలని తెలిపారు. ఎవరికీ కాంప్లిమెంటరీ పాస్‌లు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అప్పటికప్పుడే మొదటి టికెట్‌ను అల్లు అరవింద్ కొన్నారు. పలు రకాల కార్యక్రమాలు ఉంటాయని, 500 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వివిధ రకాల కార్యక్రమాలకు వివిధ ధరల్లో టికెట్లు నిర్ణయించారు. ఆటలు, పాటలు, డాన్సులు, వినోద కార్యక్రమాలు అన్నీ ఉంటాయన్నారు. వీటన్నింటికి సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా కూడా పొందొచ్చన్నారు. అలాగే సికింద్రాబాద్ క్లబ్బు, ఫిల్మ్‌నగర్ క్లబ్బు లాంటి చోట్ల కూడా దొరుకుతాయన్నారు. ఇతర వివరాలకు memusaitam.com అనే వెబ్సైట్లో కూడా సంప్రదించవచ్చని వివరించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, సురేష్ బాబు, అల్లు అరవింద్, అశోక్ కుమార్, ఇతర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.