రైతుబజార్‌లో మూటలు మోసిన రానా | Rana Daggubati At Rythu Bazaar for Memu Saitam | Sakshi
Sakshi News home page

రైతుబజార్‌లో మూటలు మోసిన రానా

Published Wed, Feb 10 2016 12:16 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

రైతుబజార్‌లో మూటలు మోసిన రానా

రైతుబజార్‌లో మూటలు మోసిన రానా

మంచు లక్ష్మీ ప్రసన్న వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న ఓ కార్యక్రమం కోసం టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించి, ఆ విరాళాలను సమాజసేవకు వినియోగించనున్నారు. మేము సైతం పేరుతో రూపొందుతున్న ఈ కార్యక్రమం కోసం టాలీవుడ్ యంగ్ జనరేషన్ తమ వంతు సాయం అందిస్తున్నారు.

ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కేపీహెచ్బీ మంజీరామాల్ ఎదురుగా ఉన్న మార్కెట్లో కూరగాయలు అమ్మగా, యంగ్ సెన్సేషన్ అఖిల్ ఖమ్మంలో ఆటో నడిపాడు. తాజాగా టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా కూడా ఈ లిస్ట్లో చేరిపోయాడు. రైతుబజార్లో కూరగాయల మూటలు మోస్తూ కూలీ అవతారం ఎత్తాడు రానా. కూరగాయల మూటలు మోస్తూ కొంతదూరం తీసుకెళ్లి అక్కడ వేశాడు. ఇందుకోసం ఖాకీ దుస్తులు ధరించి, మెడలో ఎర్ర తువ్వాలు వేసుకుని అచ్చంగా కూలీలా మారిపోయాడు. తన షో కోసం రానా చేసిన సాయానికి మంచు లక్ష్మీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement