
ఇంకా ఫోర్ డేస్ టైమ్ ఉంది. ఎందుకు? అంటే... హీరో అఖిల్ కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్‌కి. రీసెంట్‌గా జరిగిన ప్రెస్‌మీట్‌లో నెక్ట్స్ సినిమాను జనవరి 10లోపు ఎనౌన్స్ చేస్తానని అఖిల్ చెప్పారు. కానీ అఖిల్ కంటే ముందే ఫిల్మ్‌నగర్‌లో ఓ ఎనౌన్స్‌మెంట్ స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. అదేంటంటే.. దర్శకుడు రవిరాజా పినిశెట్టి పెద్ద కుమారుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో అఖిల్ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నారట. అంతేకాదు హీరో రానా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారట.
తమిళంలో ‘యాగవరాయినుమ్ నా కాక్క’ సినిమాను డైరెక్ట్ చేశారు సత్యప్రభాస్. తెలుగులో ‘మలుపు’ టైటిల్‌తో ఈ సినిమా రిలీజైంది. ఇందులో సత్య ప్రభాస్ తమ్ముడు అదేనండి.. రవిరాజా పినిశెట్టి చిన్న కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా నటించారు. ‘మలుపు’ తర్వాత సత్యప్రభాస్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీ అయ్యారట. ఆ కథతోనే అక్కినేని కాంపౌండ్‌ని అప్రోచ్ అయ్యారని సమాచారం. మరి.. అఖిల్ హీరోగా ప్రభాస్ దర్శకత్వంలో రానా నిర్మాతగా సినిమా ఉంటుందా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment