హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. సినీరంగంలో అందించిన సేవలకుగానూ ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించనుంది. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా (జనవరి 25న) కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్ చేసింది.
సినీ ప్రస్థానం
నటుడిగా, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్స్ ఆస్పత్రి చైర్మన్‌గా బాలకృష్ణ సేవలందిస్తున్నారు. ఈయన తాతమ్మ కల(1974) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించారు.
సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఇప్పటి వరకు 109 చిత్రాల్లో నటించారు. చారిత్రక, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. క్యాన్సర్ బారినపడ్డ ఎంతో మందికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్సను అందిస్తున్నారు.
చదవండి: సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment