రిమ్స్‌క్యాంపస్: ‘‘రండి బాబు రండి... మీ ఇళ్లలోని ఇన్వర్టర్ బ్యాటరీలు, సెల్‌ఫోన్లకు చార్జింగ్ పెడతాం... బ్యాటరీకి రూ.500, సెల్‌ఫోన్‌కు రూ.20, చార్జింగ్ లైటుకు రూ.30. వెళ్లిపోతే అవకాశం మళ్లీరాదు. రండి బాబు రండి’’ ఇదంతా ఏంటీ అనుకుంటున్నారా. చార్జింగ్ పెడతామంటూ ఆటోపై జనరేటర్ పెట్టుకుని వీధుల్లో తిరుగుతున్నారు. హుదూద్ తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిచిపోయిన సంగతి తెలిసిందే. సెల్‌ఫోన్లకు కూడ చార్జింగ్ లేని దుస్ధితి ఏర్పడింది. ప్రజలంతా సెల్‌ఫోన్ చార్జింగ్, ఇన్వర్టర్ బ్యాటరీల చార్జింగ్ కోసం పలు దుకాణాల్లో ఉన్న జనరేటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీన్ని గుర్తించిన కొంతమంది జనరేటర్‌నే ఆటోపై పెట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు. ఇన్వర్టర్ బ్యాటరీల్లో చిన్నవాటికి(90 ఏహెచ్, 100 ఏహెచ్) చార్జింగ్ పెట్టేందుకు రూ.300, పెద్దవి(120 ఏహెచ్, 150 ఏహెచ్, టాల్ ట్యూబులర్ బ్యాటరీలకు) చార్జింగ్ పెట్టేందుకు రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. సెల్ ఫోన్ చార్జింగ్‌కు రూ.20 తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఆటోలపై ఉల్లిపాయలు, మామిడి కాయలు, కూరగాయాలు అమ్మటాన్ని చూసిన ప్రజలు ఇప్పుడు ఈ వైనాన్ని చూశారు.
రండి బాబూ రండి... చార్జింగ్ పెడతాం!
Published Thu, Oct 16 2014 1:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement